తరలిరాద తనే వసంతం...

తరలిరాద తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం...
గగనాలదాక అల సాగకుంటే,
మేఘాల రాగం ఇల చేరుకోదా ||తరలిరాద||

చరణం 1

వెన్నెల దీపం కొందరిదా..
అడవిని సైతం వెలుగు కదా ||వెన్నెల్ల||
ఎల్లలు లేని చల్లన్ని గాలి..
అందరి కోసం బంధువు కాగా...
ప్రతీ మదిని లేపే ప్రభాతరాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏదీ సొంతం కోసం కాదను సందేశం..
పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం...
ఇది తెలియని మనుగడ కధ
దిశలెరుగని గమనము కద....

చరణం 2

బ్రతుకున లేని శృతి కలదా..
ఎద సడిలోనే లయ లేదా ||బ్రతుకున||
ఏ కల కైనా.. ఏ కళ కైనా..
జీవిత రంగం వేదిక కాదా..
ప్రజాధనం కాని కళా విలాసం
ఏ ప్రయోజనం లేని వృధా వికాసం..
కూసే కోయిల పోతే కాలం ఆగిందా...
మారే ఏరై పారే మరో పదం రాదా..
మురళికి గల స్వరమను కళ
పెదవిని విడి పలకదు కద... ||తరలిరాద||

వేణువై వచ్చాను భువనానికి...

వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి ||2||
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం ||వేణువై||
మాతృదేవో భవా పితృదేవో భవా ఆచార్య దేవో భవా

చరణం 1

ఏడుకొండలకైన అండ తానొక్కటే
ఏడుజన్మల తీపి యీ బంధమే.. ||2||
నీ కంటిలో నలక లో వెలుగునే కనక
నేను నేననుకుంటె ఎద చీకటే హరీ.. హరీ...
రాయినై వున్నాను యీ నాటికీ..
రాము పాదము రాక ఏ నాటికీ.. ||వేణువై||

చరణం 2

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో.. ||2||
ఆ నింగిలో కలిసి ఆ శూన్యబంధాలు
పుట్టిల్లు చేరె మట్టి ప్రాణాలు ||హరి||
రెప్పనై వున్నాను నీ కంటికీ
పాపనై వస్తాను మీ ఇంటికీ ||వేణువై||

నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా...

నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా..
నువ్వేనా.. నువ్వులా ఉన్న ఎవరోనా..
కోపంలో నిప్పుల కొండలా.. రూపంలో చుక్కల దండలా..
నవ్వులో చిలకమ్మలా.. చిన్నారుల చేతికి బొమ్మలా..
ఇంతకీ నువ్ ఒకడివా వందవా… ఎంతకీ నువ్ ఎవరికీ అందవా..
కొత్తగా loveలో పడుతుంటే.. కొద్దిగా ఇదిలా ఉంటుందే..
ముందుగా మనసుకి తెలిసుంటే.. ముందుకే నెడుతూ ఉంటుందే..
తప్పుకోవాలనుకుంటూనే.. తప్పుకోలేననుకుంటుందే..
నొప్పిలో తీపి కలుస్తుందే.. రెప్పలో రేపు మరుస్తుందే.. ||నిన్నేనా||

చరణం 1

తడవక నడిపే గొడుగనుకోనా.. అడుగుల సడిలో పిడుగైనా..
మగతనిపించే.. మగతనమున్నా.. మునివనిపించే.. బిగువేనా..
ముళ్ళలా నీ కళ్ళిలా నను గిల్లిపోతున్నవా..
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా..
నాకేమవుతావొ.. చెప్పవ ఇపుడయినా..
చెప్పమని అడిగేం లాభంలే..
ఎప్పుడో పొందిన answerలే ఉత్తినే వేసే questionలే..
ఊరికే తీసే ఆరాలే.. నిద్ర చెడగొట్టే నేరాలే..
కుదురుగా ఉంచని తొందరలే… దరిమిలా అంతా నీ వల్లే,
అంటు నిలదీసే నిందల్లే… ||నిన్నేనా||

చరణం 2

బిత్తరపోయే బెదురొదిలించూ.. కొత్తగ తెగువే కలిగించు
కత్తెర పదునై బిడియం తెంచు.. అత్తరు సుడివై నను ముంచు..
చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ..
చెమట పుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ..
అని అడగాలన్నా.. అడిగేయ్ లేకున్నా…
||చెప్పమని|| ||నిన్నేనా||

జన్మమెత్తితిరా... అనుభవించితిరా...

జన్మమెత్తితిరా... అనుభవించితిరా ||2||
బ్రతుకు సమరంలో పండిపోయితిరా ||2||

అనుపల్లవి

మంచి తెలిసి మానవుడుగ మారినానురా... ||జన్మ||

చరణం 1

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా ||స్వార్థమను||
దైవశక్తి మృగత్వమునె సంహరించెరా ||2||
సమరభూమి నా హృదయం శాంతి పొందెరా ||జన్మ||

చరణం 2

క్రోధలోభ మోహములే పడగలెత్తెరా
బుసలుకొట్టి గుండెలోన విషముగ్రక్కెరా ||క్రోధలోభ||
ధర్మజ్యోతి తల్లివోలె ఆదరించెరా ||2||
నా మనసే దివ్య మందిరముగ మారిపోయెరా ||జన్మ||

చరణం 3

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా ||మట్టియందె||
ప్రతిగుండెలో గుడిగంటలు ప్రతిధ్వనించురా ||2||
ఆ దివ్య స్వరం న్యాయపథం చూపగగలుగురా ||జన్మ||

వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు...

వెన్నెల రోజు.. ఇది వెన్నెల రోజు..
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు.. ||2||

అనుపల్లవి

పెద్దలంత పిల్లలుగా మారే రోజు.. ||2||
పల్లేదో.. పట్టణమేదో.. తెలియని రోజు.. ||2||
దీపావళి రోజు.. దీపావళి రోజు.. ||వెన్నెల రోజు||

చరణం 1

చంటిపాప నవ్వులకు.. పువ్వులు విరిసే రోజు.. ||2||
మింటనున్న తారకలు.. ఇంటింట వెలిగే..
దీపావళి రోజు.. దీపావళి రోజు..
వెన్న్నెల రోజు.. ఇది వెన్నెల రోజు..

చరణం 2

జీవితం క్షణికమని.. చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వల్లే బతకాలని.. తారాజువ్వ చెబుతుంది..
నిప్పుతోటి చెలగాటం.. ముప్పుతెచ్చిపెడుతుందని ||2||
తానందుకు సాక్ష్యమని.. టపాకాయ చెబుతుంది..
||వెన్న్నెల రోజు|| ||దీపావళి రోజు|| ||2||

అదిగో నవలోకం వెలసే మనకోసం...

ఆ... ఆ... ఆ...
అదిగో నవలోకం వెలసే మనకోసం
అహాహాహా ఆహా ఆహహా ఓ హోహోహో ||అదిగో||

చరణం 1

నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై ||నీలి||
దూరదూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం ||దూరదూర||
ఎచట సుఖముందో ఎచట సుధ గలదో
అచటే మనముందామా... ||అదిగో||

చరణం 2

పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెఱకువంటి వేలుపు ||పారిజాత||
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు ||ఫలించె||
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచటే మనముందామా... ||అదిగో||

అందమె ఆనందం...

అందమె ఆనందం అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం ||2||

చరణం 1

పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం ||2||
ఒడిలో చెలి మోహనరాగం ||2||
జీవితమే మధురానురాగం ||2|| ||అందమె||

చరణం 2

పడిలేచే కడలితరంగం ఓ...
పడిలేచే కడలితరంగం
వడిలో జడసిన సారంగం ||2||
సుడిగాలిలో ఓ...
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం ||2|| ||అందమె||
ఓ... ఓ... ఓ...

జోరుగా హుషారుగా షికారు పోదమా...

జోరుగా హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయతీయగా... ||జోరుగా||

చరణం 1

ఓ... బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే
చాల ప్రేమ పాఠములను చదువుకుంటినే... ఓ... ||బాల||
మరువనంటినే మరువనంటినే... ఓ... ||జోరుగా||

చరణం 2

నీ వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే... ఓ... ||వన్నె||
కలసిరాగదే కలసిరాగదే... ఓ... ||జోరుగా||

చరణం 3

నా... కలలలోన చెలియ నిన్నెపిలిచినాడనే
కనులు తెరిచి ఎదుట నిన్నెకాంచినాడనే... ఓ... ||కలల||
వరించినాడనే వరించినాడనే... ఓ... ||జోరుగా||

ఇది తొలిరాత్రి... కదలని రాత్రి...

ఇది తొలిరాత్రి కదలని రాత్రి ||2||
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథలరాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే ||2|| ||ఇది||

చరణం 1

ఆ......
వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
మల్లెల్లమ్మ పరదాలు మూయమన్నది ||2||
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది
దీపమేమో విరగబడి నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవి
ప్రేయసి రావే... ఊర్వశి రావే.. ||2||

చరణం 2

వెన్నెలంతా అడవిపాలు కానున్నది
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది ||2||
అనురాగం గాలిలో దీపమైనది
మమకారం మనసునే కాల్చుతున్నది
నీ చివరి పిలుపు కొరకు ఈ చావు రాని బ్రతుకు
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది
ఆ...... ప్రేయసి రావే... ఊర్వశి రావే.. ||2||

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో...

శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో
అది నీకు పంపుతున్నా అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా
బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూలు జల్లి వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో ||శుభలేఖ||

చరణం 1

చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో
మాయదారి చూపుకీ
మల్లెమబ్బులాడెనేమో బాల నీలవేణికీ
మెచ్చీ మెచ్చీ చూడసాగె గుచ్చే కన్నులూ
అంతేలే... కధంతేలే... అదంతేలే... ||శుభలేఖ||

చరణం 2

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవిరాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచివున్నా వేణు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలూ
ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలూ
అంతేలే... కథంతేలే... అదంతేలే... ||శుభలేఖ||

ఒక కొమ్మకు పూచిన పువ్వులం...

ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే
ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే
చెల్లెమ్మా... నీవేను నా ప్రాణము
ఓ చెల్లెమ్మా... నీతోటిదే లోకము ||ఒక కొమ్మకు||
అన్నయ్యా... నీవేను నా ప్రాణము
ఓ అన్నయ్యా... నీతోటిదే లోకము

చరణం 1

మా చెల్లి నవ్వు సిరిమల్లె పువ్వు
పలికించె నాలో రాగాల వీణ
మా అన్న చూపు మేఘాల మెరుపు
కురిపించె నాలో పన్నీటి వాన
ఇది కరగని చెరగని కలగా ఎద నిలిచెనులే కలకాలం
చిరునవ్వుల వెన్నెల సిరిగా చిగురించునులే చిరకాలం
ఈ బంధం సాగేను ఏనాటికీ ఆ దైవం దీవించు ముమ్మాటికీ

చరణం 2

మా ఇంటి పంట చిన్నారి చెల్లి మాకంటి పాప బంగారు తల్లి
ఈ చోట ఉన్నా ఏచోట ఉన్నా ఎదలోన నిన్నే కొలిచేను అన్నా
మమకారం మనకే సొంతం విడరానిది ఈ అనుబంధం
ఈ అన్నకు నేనే చెల్లి కావాలి మళ్ళీ మళ్ళీ...
||ఈ బంధం|| ||ఒక కొమ్మకు||

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా...

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితను పాడగా ||రాయి||
పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా

చరణం 1

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా ||అడవి||
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్ల రామభద్రుని వేలిగురుతులు మోయనా ||రాయి||

చరణం 2

కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు
గడ్డిపోచను శరముచేసే ఘనత రాముడు చూపగా ||కాకి||
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా
మద మత్సరమ్ములు రేపగా ||పడవ|| ||రాయి||

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు...

చుక్కల్లో చంద్రుడీ చిన్నోడు
చూపుల్లో సూర్యుడీ సోగ్గాడు
ముద్దొస్తూ వున్నదీ అమ్మాయి
మోగించెయ్ మంటవా సన్నాయి
సింగంలా దూకరా మగధీరుడా
దమ్మెంతో చూపరా అరివీరుడా
మాటల్తో చంపకే ఓ బాలికా వస్తాలే కాసుకో నీ ఓపిక
హలో హైసలకిడి బావ నను సోకులకిడి కోవ
వద్దనక ముద్దులతో మురిపించవా
హలో పిట్టనడుము పిల్లో నీ వాలు చూపువల్లో
నేను మరి తేలికగా పడిపోనల్లా ||చుక్కల్లో||

చరణం 1

పాల పొంగు పాప తెగరువ్వకే నువ్వు
నీలి కళ్ళ చేప వలవెయ్యకే నువ్వు
గాలిలాగ వచ్చి నను తాకితే నువ్వు
మాయదారి మోహం ఒణికించదా నన్ను
ఇద్దరి కధ ఇవ్వాళే తెంచెయ్యకు
విచ్చల విడి దుకాణం పెట్టెయ్యకు
అద్దిరి మన యవ్వారం పెంచెయ్యకు
అద్దిరిపడి గుడారం దించెయ్యకు ||హలో|| ||చుక్కల్లో||

చరణం 2

టిప్పుటాపు బావ మొహమాటమేలేదు
అప్టు డేటు గుంటే డౌటన్నదే రాదు
రాలుగాయి పిల్లా చెలగాటమే వద్దు
కాలు జారకుండా మన కుందిలే హద్దు
కష్టమనకు ఓ రయ్యో ఈ పూటకు
ఇష్టసఖిని ఇలాగే జోకొట్టకు
కూతపెరిగె నివాళే ఈ పిట్టకు
తోడుపెరుగు నివాలి నా పెట్టకు
ఇలా చూడు టక్కరి దొంగ చెల ఈడు పిట్టకు బెంగ
చీరలకి సిగ్గులకి సెలవే ఇక
హల్లో హంసనడక పిల్లో సిరి మల్లెల చిరుజల్లో
ఇప్పుడిక తప్పదిక తొలివేడుక ||ఇలా|| ||చుక్కల్లో||

ఆనతి నీయరా హరా...

ఆనతి నీయరా హరా ఆ.. ||ఆనతి||
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా
సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా ||సన్నుతి||

చరణం

నీ ఆన లేనిదే గ్రహింప జాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై ||2||
కదులునుగా సదా సదాశివ ||ఆనతి||
ని నీ స ని ప నీ ప మ గ స గ
ఆనతి నీయరా అచలనాధ అర్చింతును రా ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని సని సగ
సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని
ఆనతి నీయరా జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము చేతురా
ఆనతి నీయరా సానిప గమపనిపమ గమగ పప పప
మపని పప పప గగమ గస సస నిసగ
సస సస సగ గస గప పమ పస నిస గసని
సగ సగ సని సగ సగ పగ గగ గగ సని సగ గ గసగ
గ పద గస గ మ స ని పమగ గ
ఆనతి నీయరా ...

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా...

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా ||2||
రెప్పవెయ్యనే లేదు ఎందుచేత.. ఎందుచేత
పదహారు కళలనీ.. పదిలంగా వుంచనీ.. ||2||
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత ||జాలిగా||

చరణం 1

కాటుక కంటినీరు పెదవుల నంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా ||2||
నీ కుంకుమకెపుడూ పొద్దుగుంకదమ్మా ||జాలిగ||

చరణం 2

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి
పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా ||2||
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపొయేవే కధలన్నీ ||జాలిగ||

పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా...

పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా
ఎవ్వరేమనుకున్నా జానే బీదో యార్
నింగి పడిపోతున్నా నేల విడిపోతున్నా
నీరు నిప్పవుతున్నా జానే బీదో యార్
ప్యార్ కియా తో డర్నా క్యా

చరణం 1

విధినైనా ఎదిరిస్తుంది ఎదలో నుండి ఈ ప్రేమ
వద్దనా మనసిస్తుందీ వరమౌతుందీ ఈ ప్రేమ
చరితల్లో గెలిచింది ప్రేమే కదా
జగమంతా నిలిచింది ప్రేమే కదా
ఎన్ని హద్దులున్నా ఒడిపోదు ప్రేమ
ఎల్లలెన్ని ఉన్న తలవంచునా ||ప్యార్||

చరణం 2

కలనైనా కలకాలేదు కలిసిందంటే ఈ ప్రేమ
క్షణమైనా ఎడబాటైనా ముడివేశాక ఈ ప్రేమ
ఆరారు కాలాల అందం కదా
ఏడేడు జన్మాల బంధం కదా
ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళబాట
ప్రేమ తోడు ఉంటే గెలుపే కదా ||ప్యార్||

చిత్రం... ఆయ్ భళారే విచిత్రం...

చిత్రం... ఆయ్ భళారే విచిత్రం
చిత్రం.. అయ్యారే విచిత్రం
ఈ రాచనగరుకు రారాజును రప్పించుట విచిత్రం
పిలువకనే ప్రియ విభునే విచ్చేయుటే విచిత్రం ||చిత్రం||

చరణం 1

రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో ||2||
సదమదము మామదిలో మదనుడు సందడి సేయుట
చిత్రం.. ఆయ్ భళారే విచిత్రం

చరణం 2

ఎంతటి మహరాజైన ఆ ఆ ఆ...
ఎంతటి మహరాజైన ఎపుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని
చిత్రం.. ఆయ్ భళారే విచిత్రం

చరణం 3

బింబాధర మధురిమలు..
బిగి కౌగిలి ఘుమఘుమఘుమలు..
ఆ.. ఆఆఆ.. ||బింబాధర||
ఇన్నాళ్ళుగ మాయురే మేమెరుగక పోవుటే
చిత్రం.. ఆయ్ భళారే విచిత్రం

చరణం 4

ఆఆఆ... వలపెరుగని వాడననీ...
వలపెరుగని వాడనని పలికిన ఈ రసికమణీ
తొలిసారే ఇన్ని కళలు కురిపించుట
అవ్వ... నమ్మలేని చిత్రం అయ్యారే విచిత్రం
ఆయ్.. భళారే విచిత్రం అయ్యారే విచిత్రం ||3||

చిత్రం: దానవీరశూరకర్ణ (1977)
రచన: డా|| సి. నారాయణరెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: ఎస్. పి. బాలు, పి. సుశీల

ఓ బాటసారి ఇది జీవిత రహదారి...

ఓ బాటసారి ఇది జీవిత రహదారి ||2||
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకసారి సొంతం కాదు ఇది
ఓ బాటసారి ఇది జీవిత రహదారి

చరణం 1

ఎవరు ఎవరికి తోడవుతారో
ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో
మనసే చాలని ఉంటారో
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ ||2||

చరణం 2

కడుపు తీపికి రుజువేముంది
అంతకు మించిన నిజమేముంది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును
భూమి మోస్తుందా
ఇప్పుడు తప్పును తెలుసుకునీ
జరిగేదేమిటనీ క్షమించేదెవ్వరినీ...

చరణం 3

తెంచుకుంటివి అనుబంధాన్ని
పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరు ఉంటారని
అనుకోలేని పసివాణ్ణి
బలవంతాన తెచ్చుకునీ
తల్లివి కాగలవా తనయుడు కాగలడా

చరణం 4

అడ్డదారిలో వచ్చావమ్మా
అనుకోకుండా కలిశావమ్మా
నెత్తురు పంచి ఇచ్చావు
నిప్పును నువ్వే మింగావు
ఆడదాని ఐశ్వర్యమేమిటో
ఇప్పుడు తెలిసింది
కధ ముగిసేపోయింది ||2||
ఓ బాటసారి ఇది నీ జీవిత రహదారి

భరత వేదముగ నిరత నాట్యముగ...

శంభో శంకర.. హర హర మహాదేవ హర హర మహాదేవ
తథింతదిమి థింధిమి పరుల తాండవకేళీ థర్పరా
గౌరీమంజుల సింజినీ జతుల లాస్యవినోదవ శంకరా
భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశా
నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా
శ్యామసుందరా సైలమందిరా మొరవిని బదులిడరా
నగజా మనోజ జగదీశ్వరా మాలేందు శేఖరా.. శంకరా ||భరత వేదముగ||
హర హర మహాదేవ.. హర హర మహాదేవ
ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా..

చరణం 1

అంతకాంత నీ సతి.. అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది
ఆ.. ఆ.. ఆ.. ఆ. ఆ.. ఆ.. ఆ.. ఆ.. భవుని భువుకి తరలించేలా
తరలి విధిని తలపించేలా రసతరంగిణీ లీల
యతిని నృత్య రథుని చేయగలిగే ఈ.. వేళ ||భరత వేదముగ||
జంగమసావర గంగాచ్చిత సిరా మ్రుద మందుథ కర పుర హరా !
రక్థశుభంకర భవనాశంకర స్వర హర దక్ష థ్వర హరా !!
పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వరా !
ఆశుదోష అధ నాశవినాశన జయగిరీశ బృహదీశ్వరా!!

చరణం 2

వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగ..
యోగివేశ నీ మనసున కలగద రాగలేశమైనా..
హే మహేశ నీ భైదపదాహుతి దైత్య సోషనము జరుపంగా..
భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోనా..
నమక చమకముల నాదాన... యమక గమకముల యొగానా..
పలుకుతున్న ప్రాణాన.. ప్రణవనాధ.. ప్రధమనాధ శృతి విననా ఈశా...

బోయవాని వేటుకు...

బోయవాని వేటుకు గాయపడిన కోయిల ||2||
గుండెకోత కోసినా చేసినావు ఊయల ||బోయవాని||

చరణం 1

తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది
ఆడతోడు ఉంటానని మూడుముళ్ళు వేయమంది
రాయికన్న రాయిచేత రాగాలు పలికించి
రాక్షసుణ్ణి మనిషిచేసి తన దైవం అన్నది
ఏనాటిదో ఈ బంధం ||బోయవాని||

చరణం 2

చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టనీ
కరునచిందు కనులకు కాటుకైన దిద్దనీ
మెట్టినింటి లక్ష్మికీ మెట్టె నన్ను తొడగనీ
కాబోయే తల్లికీ గాజులైన వేయనీ
ఇల్లాలికేదేలే సీమంతం ||బోయవాని||

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై...

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలు ||ఊహల||

చరణం 1

ఆహా... ఆహా ఒహోహో... ఆహా... ||2||
చిటపట చినుకులతో తొలకరి వణుకులతో ||2||
చలించినది ఫలించినది చెలీ తొలి సోయగమూ ||ఊహల||

చరణం 2

ఓహో... ఆహా... లలలా... ఆహా
హో... ఆహా... ఒహోహో... ఆహా
ముసిరిన మురిపములో కొసరిన పరువములో ||2||
తపించినది తరించినది ప్రియా తొలి ప్రాయమిది ||ఊహల||

అల్లి బిల్లి కలలా రావే...

అల్లి బిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే
మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే
వీచే ఎదలో వెలుగై రావే
అల్లి బిల్లి కలలా రానా ఆహా...
అల్లుకున్న కధలా రానా ఆహా...
మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకై రానా
వీచే ఎదలో వెలుగై రానా ||అల్లి||

చరణం 1

సోగకళ్ల విరిసే సొగసే గోగుపూలు కురిసే
రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలపే
రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే
నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే
ఏల బిగువా ఏలుకొనవా ప్రేమకధ వినవా ||అల్లి||

చరణం 2

జావళీలు పాడే జాణ జాబిలమ్మ తానై
గుండె నిండిపోయే చానా
వెండిమబ్బు తానై సంగతేదో తెలిపే
తలపే సంగతులు పలికే
దూరమింక చెరిపే వలపే దోర నవ్వు చినుకై
మేనికులుకే తేనె చినుకై పూలజల్లు కురిసే ||అల్లి||

గున్నమామిడి కొమ్మమీద...

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ||2||
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది.. ||గున్నమామిడి||
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చరణం 1

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపినది ||2||
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల ||గున్నమామిడి||

చరణం 2

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ||2||
రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి ||గున్నమామిడి||
||గున్నమామిడి|| ||2||

అందం శరణం గచ్చామి...

అందం శరణం గచ్చామి
అధరం శరణం గచ్చామి
ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ
అతి మధురం అనురాగం
ఒదిగే వయ్యారం
ప్రణయం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సింధూర వేళ నీ శృంగారలీల
సుఖ శిఖరం శుభయోగం
అది నా సంగీతం

చరణం 1

ఎంతకు తీరని ఎదలో ఆశలేమో
అడగరానిదై చెప్పరానిదై
పెదవుల అంటింతనై
మాటతో తీరని మదిలో దాహమే
చిలిపి ముద్దుకై చినుకు తేనెకై
కసికసి కవ్వింతలై
నీ నవ్వు నాలో నాట్యాలు చేసే
కౌగిట్లో సోకమ్మ వాకిట్లో
తెరిచే గుప్పిళ్లలోన ||ప్రణయం ||

చరణం 2

చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా
వలపు గాలికే వాడుతున్నది
విసరకు పూబాణమే
చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా
చలికి రేగిన ఒడికి చేరిన
చెరిసగ మీ ప్రాణమే
నీ ఊపిరి నాలో పూలారబోసి
అందాలో నా ప్రేమ గంధాలో
ముసిరే ముంగిళ్లలోన
అందం శరణం గచ్చామి
హృదయం శరణం గచ్చామి
ఈ సాయంత్ర వేళ నీ ఏకాంతసేవ
సుఖ శిఖరం శుభయోగం
అది నా సంగీతం

ధీర ధీర ధీర మనసాగలేదురా...

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రాదు నిద్దురా
నియమాలు వీడి రాణివాసమేలుకోర
ఏకవీర ధీర ||ధీర ధీర||

చరణం 1

సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా
అధిపతినై అది కాస్తా దోచేదా
పోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇటు ప్రాయమైన ప్రాణమైన
అందుకోరా ఇంద్రపుత్ర ||ధీర ధీర||

చరణం 2

శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడగా
మగసిరితో అందమే అంటుకడితే అంతేగా
అణువణువూ స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెఱసాలలోన ఖైదుకాని కాంక్ష ఉందిగా
శతజన్మలైన ఆగిపోని
అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా
గుండెలో నగారా ఇక మోగుతోందిరా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా
ప్రియపూజలేవో చేసుకోన
చేతులార సేదదీర ||ధీర ధీర||