Showing posts with label * అద్నాన్ సమీ. Show all posts
Showing posts with label * అద్నాన్ సమీ. Show all posts

ఏ జిల్లా ఓ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా

పల్లవి

ఏ జిల్లా ఓ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ||2||
ఏ జిల్లా ఏ జిల్లా ఓంగోల, వోరుగల్లా ||ఏ జిల్లా||
23 జిల్లాలోన ఏదో ఒకటి నీది అయినా
24 నీ నడుము కొలత అయితే చాలులే
25 నిమిషాలలోనే కవ్విస్తాను నయముమయినా
26 ముద్దులుని పెట్టి తకిట తకిట తకిట ||ఏ జిల్లా||

చరణం 1

ఏయ్ నువ్వాట్టా జల్సాపూర్ జంక్షన్‌లో కొచ్చేస్తే
నేనిట్టా సిగ్గాపూర్ సిగ్నల్నె దాటేస్తా
నువ్వట్టా మనసాపూర్ సెంటర్‌లో మాటేస్తే
నేనిట్టా నరసాపూర్ సంతల్లో వాటేస్తా
అమ్మేస్తాను కోకాకులంలో రాజస్థాని రాజమండ్రి
ఊరిస్తాను ఊపేశ్వరంలో ఉడికిస్తానులే
మురిపిస్తాను ముగ్గాపురంలో చేరుస్తాను సోకులాడ
సాగించాలి హింసాచలంలో తకిట తకిట తా ||ఏ జిల్లా||

చరణం 2

ఓ నీలోని అందం చందం అదిరే భాదవుతుంటే
నాలోని ఆత్రం మొత్తం ఉదరై బాదయిపోయె
నువ్వట్టా కన్నెకొట్టి కీళ్ళూరు రమ్మంటే నేనిట్టా మూటేకట్టి వొళ్ళూరు రాసేస్తా
చంపాపేట సరిహద్దుదాటి పెదవులపాడు చేరుకుంటా
ఆపై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే
పగలైనగాని రాత్రైనగాని నిదురానగరు వెళ్ళనంటా
పక్కలపల్లి పొలిమేరలోనే తకిట తకిట తా ||ఏ జిల్లా||
ఆ జిల్లా ఆజిల్లా పిల్లోడ నాది ఆ జిల్లా నాజళ్లో నువ్వెట్టేయే మరుమల్లె పూల జళ్ళ

భూగోళమంతా సంచిలోన

పల్లవి

[అతడు] భూగోళమంతా సంచిలోన భోగోళమంతా సంచిలోన నాప్రేమనంతా
నింపుకొచ్చా అంగట్లో పూలన్ని పిల్లా మొత్తంగా పాడుకోచ్చా ఏయ్ నా
గుప్పెడంతా గుండెపైనా నీ చిట్టిపేరే రాసుకోచ్చా నీసోకు క్షేమంకే గుళ్ళో
ఆకుపూజ చేసుకోచ్చు
[ఆమె] బాపురే నాకోసం ఇంత లేనిపోని ఖర్చా ప్రేమలో ఈ పాఠం
ఏడనేర్చినావో నువ్వు చెప్పుకాస్తా
[అతడు] స్కూల్‌కెళ్ళి చదవలేదు ||2|| ఒన్.టు.త్రి.
[ఆమె] పలక పెట్ట దిద్దలేదు ఎ.బి.సి. ప్రేమ నేర్చినాడు అంట
నన్ను చూసి ||భూగోళమంతా||

చరణం 1

[అతడు] నీ అందమెంతో లేతలేత అది కందకంట కాపుకాస్తా నీ సుందరుల
మేనుకి సబ్బురుద్దడానికి చందురుడ్ని పట్టుకొస్తా నీవి దోరదోర వన్నెలంత
చేయిజారుకుంటు చూసుకుంటా నీ పాలరాతి బుగ్గకి మెరుగు దిద్దడానికి
తెలుపు నేను వెంటతెస్తా
[ఆమె] దేవుడో ఈట్రిక్స్ ఏడనేర్చినావో నువు చెప్పుకాస్తా ||స్కూల్‌కెళ్ళి చదవలేదు||

చరణం 2

[అతడు] నువ్వె నంట నాసీత అని రాసినాడు బ్రహ్మతాతా నువు మాయలేడినడి
నడిగిన శివుడు విల్లు నడిగినా విరగకుండ తీసుకోస్తా అరె నువ్వెనంట సత్యభామ
నిండు అలక నమ్మవమ్మా ||నువ్వు||
కంచిపట్టు చీరలడిగినా పర్సు చిల్లు అయినా-కిక్కుమనక పట్టుకొస్తా
[ఆమె] అయ్ బాబోయ్ ఈజోక్స్ ఏడనేర్చినావు నువ్వు చెప్పుకాస్తా ||స్కూల్‌కెళ్ళి||

నచ్చావే నైజాంపోరి

పల్లవి

[అతడు] నచ్చావే నైజాంపోరి నువ్వే నా రాజకుమారి... ||2||
[ఆమె] ఆజారే రాజా జానే లేజారే లేకజవానే... ||2||
[అతడు] అందిస్తె చెయ్యి ఓసారి ఎక్కిస్తా నేను అంబారి
[ఆమె] శ్వాసిస్తె జోలు ఓసారి సిద్దంగా ఉంది సింగారి
[అతడు] అందాలే సయ్యాంటందే వయ్యారై వయ్యారి ||నచ్చావే||

చరణం 1

[అతడు] సరదాగా సొగసుకి చేరి సాగిస్తాం సొగసుల చోరి
[ఆమె] చాల్లేద్దుం మాటకచేరి దో చేద్దాం తలొకొక జోరి
[అతడు] ముదిరావే మాయలమారి
[ఆమె] మురిపిస్తే ఎలా మురారి
[అతడు] పరిచానే మల్లె పూదారి పరిగెత్తుకు రాదు పున్నాని
[ఆమె] పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనస్సే చేజారి
[అతడు] గుండెల్లో కోవెలగంట కొలువుండెవే దైవేరి ||నచ్చావే||

చరణం 2

[ఆమె] వరదల్లే హద్దులు మీరి వచ్చావా చొరవే కోరి
[అతడు] సుడిగాలే నిలువున నెమరి ఎగరేసుకు పోతా నారి
[ఆమె] దాటొస్తా సిగ్గుల పహరి
[అతడు] చేరుస్తా చుక్కల మెగడి
[ఆమె] ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓసారి
[అతడు] మైకంలో తూళి ఓసారి కావ్యంలో వాలి ఓసారి
[ఆమె] వహేవారే అనిపించాలి వాటేసి ప్రతిసారి ||నచ్చావే||