గల గల పారుతున్న గోదారిలా...
జలజల జారుతుంటే కన్నీరెలా ||2||
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో వుందిగా హాయిగా! ||2|| ||గల గల||
చరణం 1
వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నాపైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరినావిలా నాలోనా..
ఊ.. ఓ... ఈ అల్లరి
ఊ.. ఓ... బాగున్నదీ ||గల గల||
చరణం 2
చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడీ హాయిగున్నదీ ఏమైనా
ఊ.. ఓ... ఈ లాహిరి
ఊ.. ఓ... నీ ప్రేమని ||గల గల||
Showing posts with label * నిహాల్. Show all posts
Showing posts with label * నిహాల్. Show all posts
Subscribe to:
Posts (Atom)