Showing posts with label - నాగార్జున. Show all posts
Showing posts with label - నాగార్జున. Show all posts

ఇది తొలిరాత్రి... కదలని రాత్రి...

ఇది తొలిరాత్రి కదలని రాత్రి ||2||
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథలరాత్రి
ప్రేయసి రావే ఊర్వశి రావే ||2|| ||ఇది||

చరణం 1

ఆ......
వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
మల్లెల్లమ్మ పరదాలు మూయమన్నది ||2||
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది
దీపమేమో విరగబడి నవ్వుతున్నది
నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవి
ప్రేయసి రావే... ఊర్వశి రావే.. ||2||

చరణం 2

వెన్నెలంతా అడవిపాలు కానున్నది
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది ||2||
అనురాగం గాలిలో దీపమైనది
మమకారం మనసునే కాల్చుతున్నది
నీ చివరి పిలుపు కొరకు ఈ చావు రాని బ్రతుకు
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది
ఆ...... ప్రేయసి రావే... ఊర్వశి రావే.. ||2||

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలువదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! ||గుండెల్లో||
మనసా మనసా మనసా ఓ మనసా... ||3||

చరణం 1

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది..
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది..
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతుంది
కన్నులేదాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో.. ఇదంతా.. నిజంగా కలలాగే ఉంది! ||గుండెల్లో||

చరణం 2

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది..
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది..
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది! ||గుండెల్లో||
మనసా మనసా మనసా ఓ మనసా... ||3||

ప్రియరాగాలే గుండెలోన...

హాయ్‌ హాయ్‌ హాయ్‌... ఓ...
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ...
ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ...
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ ఓ ఓ... ఓ... ఓ ఓ ఓ... ఓ... ||ప్రియ||

చరణం 1

అల్లరి కోయిల పాడిన పల్లవి
స్వరాలలో నీవుంటే.. పదాలలో నేనుంటా..
వేకువ పూచిన కవితల గీతిక
ప్రియా ప్రియా నీవైతే.. శ్రుతి లయ నేనౌతా..
కలకాలం కౌగిలై నినే చేరుకోనీ..
కనురెప్పల నీడలో కలై ఒదిగిపోనీ..
ఓ ప్రియా... ఓ...
దరిచేరితే దాచుకోనా తొలిప్రేమలే దోచుకోనా... ||ప్రియ||


చరణం 2

సవ్వడి చేయని యవ్వనవీణలు
అలా అలా సవరించు.. పదే పదే పలికించు..
వయసులు కోరిన వెన్నెల మధువులు
సఖి చెలి అందించు.. సుఖాలలో తేలించు..
పెదవులతో కమ్మనీ కధే రాసుకోనా..
ఒడిచేరి వెచ్చగా చలేకాచుకోనా..
ఓ ప్రియా... ఓ...
పరువాలనే పంచుకోనీ పడుచాటలే సాగిపోనీ... ||ప్రియ||

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస...

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో.. శ్రుతి కలిపి పాడగా
నీ నీడలో.. అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా ||నువ్వంటే||

చరణం 1

నువ్వు నావెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుకుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా.. ఇలా నన్ను చేరగా..
సుదూరాల తారక.. సమీపాన వాలగా..
లేనేలేదు ఇంకే కోరికా.. ఆ... ||నువ్వంటే||

చరణం 2

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సన సన్నగా చేజారిపోనీయక
చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీరేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా.. ఆ... ||నువ్వంటే||

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా..

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా
తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో
తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై
అందవా.. స్నేహమా.. ||నే తొలిసారిగా||

చరణం 1

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా..
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా..
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా..
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా..
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే.. పంచుమా.. ||నే తొలిసారిగా||

చరణం 2

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా..
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా..
నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా..
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా..
పెదవులపై చిరునవ్వుల దగా
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా.. తీరులో ప్రళయమా..
పంతమా.. బంధమా.. ||నీ ఆటేమిటో||

ఓం నమ: నయన శ్రుతులకు

ఓం నమ: నయన శ్రుతులకు
ఓం నమ: హృదయ లయలకు ఓం...
ఓం నమ: అధర జతులకు
ఓం నమ: మధుర స్మృతులకు ఓం...
నీ హృదయం తపన తెలిసి
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో

చరణం 1

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా
కాలము లేనిదై గగనము అందగా
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం

చరణం 2

ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ||ఓం నం:||

ప్రియా ప్రియతమా రాగాలు...

ప్రియా ప్రియతమా రాగాలు
సఖీ కుశలమా అందాలు ||2||
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో.. రేగే.. ||ప్రియా||

చరణం 1

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎదురులేని మనసులో ఎదురురావే నా చెలి
అడుగుజారే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం
నీలో నాలో పలికే.. ||ప్రియా||

చరణం 2

శరత్తులోన వెన్నెలా తలెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువేసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం
నిన్ను నన్ను కలిపే.. ||ప్రియా||

తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో...

తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా.. మనసా.. ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు
చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి
చూడలేని జతిలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది ||తెలుసా||

చరణం 1

ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే.. నీవుగా.. ప్రాణమే.. నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ ||తెలుసా||

చరణం 2

darling, every breath you take
every move you make I will be there
what would I do without you?
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే.. మారినా.. కాలమే.. ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ ||తెలుసా..||

స్వప్నవేణువేదో సంగీతమాలపించే...

స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెలా ఏక తాళమో
జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో
లేలేతా పూలబాసలూ
కాలేవా చేతి రాతలూ... ||స్వప్నవేణువేదో||

చరణం 1

నీవే ప్రాణం... నీవే సర్వం...
నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ... రేయీ పగలూ...
హారలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు
నిన్ను చూచువేళా
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా
కాలాలే ఆగిపోయినా... గానాలే మూగబోవునా ||స్వప్నవేణువేదో||
చరణం 2

నాలో మోహం... రేగే దాహం...
దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం... గెలిచే బంధం...
రెండూ ఒకటై కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా
మలుచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురువచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం...
వాలేదే ప్రణయ గోపురం ||స్వప్నవేణువేదో||

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి...

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వు చేరుకోనిదే గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపురేఖలేవో ఎవరినడగాలి... ||పాటల||

చరణం 1

నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తన రూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రుపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి ||పాటల||

చరణం 2

పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఏ నిమిషంలో నీ రగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది ||పాటల||

చూపుచాలు ఓ మన్మధుడ

చూపుచాలు ఓ మన్మధుడ
ఆగనంది నా గుండె దడ...
తెలుసుకో సుందరా...
నా మనసులో తొందరా...
మాటచాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక...
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ...
కలుపుకోవా నన్ను నీలో
యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా ||చూపుచాలు||

చరణం 1

ఏరికోరి నీ ఎదపైన వాలిపోనిదే వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన
కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్ని
ఇలా దరికి పిలుచుకోనా...హే...
ఆడించు నన్ను పాడించు నన్ను
నీ హాయి నీడలో
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||

చరణం 2

ఆడ మనసులో అభిలాష
అచ్చ తెలుగులో చదివేశా...
అదుపు దాటి వరదయ్యింది
ఈ చిలిపి చినుకు వరసా... హే...
నన్ను నేను నీకొదిలేశా
ఆదమరుపులో అడుగేశా
అసలు కొసరు కలిపి తీసుకో
వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని
అనలేనివన్ని ఆరాలు తియ్యనా
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...
ఏల గాలి మేడలూ... రాలు పూల దండలు
నీదో లోకం... నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ!
ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా... ||2||

ఏల గాలి మాటలూ... మాసిపోవు ఆశలూ
నింగీ నేల తాకే వేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే... రేవు లేదులే
వీడుకోలిదే... వీడుకోలిదే

చరణం 1

నిప్పులోన కాలదూ నీటిలోన నానదూ
గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నమూ
పేదవాడి కంటిలో ప్రేమ రక్తమూ
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు జరిగేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకూ
రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా... ||2||

చరణం 2

కాళిదాసు గీతికీ కృష్ణ రాసలీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవి
ఆ అనారు ఆశకీ తాజ్‌మహల్‌ శోభకీ
పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ
నిధి కన్న ఎద మిన్న గెలిపించు ప్రేమనే
కధ కాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా... ||2||
కాలమన్న ప్రేయసీ తీర్చమందిలే కసీ
నింగీ నేల తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ||నేను||

చరణం 1

పూలచెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు
అల్లుకుంది నాచుట్టూ ఓ చిరునవ్వు
తేనెపట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరేనువ్వు..
నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
మీకెవరికీ కనిపించదు ఏమైనా.. ఓ.. ఓ... ||నేను||

చరణం 2

చుట్టు పక్కలెందరున్నా గుర్తుపట్టలేకున్నా
అంత మంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పునాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవా కనురెప్పలకే మాటొస్తే.. ఓ ఓ... ||నేను||

అదిరిందిరో దీనబ్బా

పల్లవి

[అతడు] అదిరిందిరో దీనబ్బా ఈ గుమ్మసోకు నాజూకు ||2||
ఏందబ్బా గుచ్చుకుంది పూల బాకు ||2||
[ఆమె] బీటు వేస్తే బీహారు లేటుచేస్తే చేజారు
జోరు చూస్తే జోహారు నీకైనా తయ్యారు
కొమ్మచాటు పండిపోసే కొంగు పోతే కొల్లేరు
[అతడు] అదిరిందిరో

చరణం 1

[అతడు] ఓ ఓ ఓ బుగా ఎరుపున గిల్లీ మెగా తుం తుం చెయ్యాలనీ ఉందీ
[ఆమె] ఓ ఓ ఓ సిగ్గూ వరపు కొచ్చిందే అగ్గి ఏదో రాజుకుంటుందే
[అతడు] సలప రింతలను సమ్మంగా దులిపెయ్యనా నలిపెయ్యనా
[ఆమె] కలవరింతలను కమ్మంగా కలిపేయరా చెరిపెయ్యరా
[అతడు] రెక్కలున్న గుర్రమ్మీద నేనూ
[ఆమె] గెల్లిపూల దెబ్బలోనా రేపో మాపో ఇచ్చేయ్యగా డోసు
[అతడు] దీనబ్బా

చరణం 2

[అమె] రిమ్మతెగులు పుట్టిందే చెమ్మచెక్క ఆడనంటుందే
[అతడు] గుమ్మా గుబులు పట్టిందే నిమ్మచెక్కా పిండుకొమ్మందే
[ఆమె] చిలిపి చాకిరికి చీరంతా అలిగిందిరో నలిగిందిరో
[అతడు] మదన తిమ్మిరికి మనసంతా మరిగిందిరో కరిగిందిరో
[ఆమె] మంచుపూల మంచం మీద చుమ్మా
[అతడు] పంచుకుంటే పంచదారే నమ్మా
[ఆమె] అంచుచాటే అందాలన్నీ అల్లిబిల్లి ఆటాడేనమ్మా
[అతడు] అదిరిందిరో

భీమవరం బుల్లోడా పాలు కావాలా

పల్లవి

[ఆమె] భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా
[అతడు] నరసపురం నరసమ్మ నైసుగుందమ్మా నీ చక్కెరచుమ్మా
[ఆమె] పచ్చిపాలు మీగడ అచ్చ తెలుగు ఆవడా
[అతడు] పెదవులలోనే దాచావమ్మా ఓ ఓ
[ఆమె] భీమవరం

చరణం 1

[ఆమె] మావుళ్ళమ్మ జాతరలో కౌగిళ్ళమ్మ సెంటరులో
ఒళ్ళోకొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళుచేసి నీ కోసమే ఎదురుచూస్తే మావో
[అతడు] జారేపైట జంక్షన్‌లో జోడీ ఎక్కు టెంక్షన్‌లో
కారాకిళ్ళి లాంటిపీసు ఆడు ఆడు పెట్టమంటూ నో రారా అడిగి నాను పిళ్లో
[ఆమె] కుర్రోడి ఉరుకిళ్లకి ఏదే వెర్రిక్కి పోతుంది చాలు
[అతడు] కుర్రోడు చిరు తిల్లకీ ఏదో వెర్రిక్కిపోతుందీ చూడు
[ఆమె] అహా అందుకో బాబూ ఆటీను ఆసు ఓ ఓ ఓ
[ఆమె] భీమవరం

చరణం 2

[అతడు] తాపాలమ్మా సావిట్లో దాహాలమ్మా సందిట్లో
రేపూ మాపూ నీతోనే లంగరేసు కుంటామనీ చెంగు చాటు కొచ్చినాను పిళ్ళో
[ఆమె] మొహాపురం స్టేషన్‌లో ముద్దాపురం బస్సెక్కి
చెక్కిళ్ళ పల్లె చేరాలనీ అక్కరతో వచ్చినావు పండి కునీ నచ్చినావో మావో
[అతడు] వరసైనా దొరసానికీ ఇక ఖరుసేలే యిరసంత రోజా
[ఆమె] యిక దరువేసే దొరబాబుకీ ఈ పరువాల బరువెంత మోజా
[అతడు] వయ్యారి జానా బల్లోకి రానా ఓ ఓ
[ఆమె] భీమవరం

బ్రహ్మ కడిగిన పాదము

పల్లవి

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము

చరణం 1

చెలగీ వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము

చరణం 2

పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరుమని చూపిన పరమ పదము నీపాదము . . .

అంతర్యామీ . . . అలసితి . . . సొలసితి

పల్లవి

అంతర్యామీ... అలసితి... సొలసితి...
ఇంతట శరణిదే జొచ్చితినీ... ||అంతర్యామీ||
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా...
భారపు పగ్గాలు - పాపపుణ్యములు నేరుపునబోవు నీవు వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవని వద్దనకా ||2||
ఎదుటనె శ్రీ వేంకటేశ్వరా నీవదె అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామీ... అంతర్యామీ... అంతర్యామీ... అలసితీ... సొలసితి...

దాచుకో నీ పాదాలకు

పల్లవి

దాచుకో నీ పాదాలకు - తగనే చేసిన పూజలివి
పూచి, నీకేరీతి రూప పుష్పములివెయయ్యా
దాచుకో.. దాచుకో...

జో అచ్యుతానంద జో జో ముకుందా...
లాలి పరమానంద - రామగోవిందా... జోజో... జోజో...

క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం
నీరాజనం... నీరాజనం...

నానాటికి బదుకు

పల్లవి

నానాటికి బ్రతుకు - నాటకము కానక కన్నది కైవల్యమూ
నానాటి బ్రతుకు నాటకమూ . . . నాటకమూ

చరణం

పుట్టటయు నిజము పోవుటయు నిజము
నట్టనడి నీపని నాటకమూ
ఎట్టనెదుట గలదీ ప్రపంచమూ
కట్ట కడపటిది కైవల్యమూ... ||నానాటి||

గోవిందాశ్రిత గోకుల బృందా

పల్లవి

గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానంద
హరినామమే కడు అనందకరము మరుగవో మరుగవో మరుంగవో మనసా
హరినామమే కడు అనందకరము

రంగా.. రంగా..
రంగ రంగ రంగపతి రంగనాధ - నీ సింగారలె తరచాయ శ్రీరంగనాధ

రాముడు రాఘవుడు రవికులుడితడు
భువిజకుపతియైన పురుష నిధానము

పెరిగినాడు చూడరో పెద్ద హనూమంతుడు
వరగి నానా విద్యల బలవంతుడు
వేదములు నుతింపగ వేడుకలు దైవారగ ఆదరించి
దాసుల మోహన నారసింహుడు
మోహన నారసింహుడూ...

చక్కని తల్లికి ఛాంగుభళా తన చక్కెర మోవికి ఛాంగుభళా
కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ
తట్టెలాయె మహిమలే తిరుమల కొండ.. తిరుమల కొండ

తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసీ దేవదేవుడు