Showing posts with label * వేణు. Show all posts
Showing posts with label * వేణు. Show all posts

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది...

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలువదు కద హృదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం.. నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! ||గుండెల్లో||
మనసా మనసా మనసా ఓ మనసా... ||3||

చరణం 1

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది..
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది..
నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతుంది
కన్నులేదాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో.. ఇదంతా.. నిజంగా కలలాగే ఉంది! ||గుండెల్లో||

చరణం 2

ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది..
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది..
పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది! ||గుండెల్లో||
మనసా మనసా మనసా ఓ మనసా... ||3||

సాల్సా ఇద సాల్సా

పల్లవి

[ఆమె] సాల్సా ఇద సాల్సా హై క్లాసు డాన్సు సాల్సా
[అతడు] హంస కలహంస ఈ డ్రిల్ పేరు డాన్సా
[ఆమె] సాల్సా మాసాల్సా నీ వల్ల కాదు తెల్సా
[అతడు] స్టెప్సా అవి ఫిట్సా మాకెందుకింత హింసా
[ఆమె] నోటికొచ్చినట్టు పిచ్చి కామెంట్సా
[అతడు] అరె ఉన్నమాటి చెప్పుకుంటె ఫీలింగ్సా
[ఆమె] నిను బొట్టుపెట్టి పిలిచినట్టు జోలికొచ్చి ఏంటిరభసా
[అతడు] మాతో పెట్టుకోకు మాతో రెచ్చిపోకు పిచ్చికా మేంతీర
మారత్తుకుంటే తోకే ముడుచుకోవాపిచ్చుకా ||సాల్సా||

చరణం 1

షర్టు కొంచెం మడిచికట్టి నాలుకిట్టా మడతపెట్టి దుమ్ము రేపే బస్తీలే మావిలే
[ఆమె] ఒకటి రెండు లెక్కపెట్టి బీటుమీద మనస్సుపెట్టి స్వింగు చెయ్యడం ఈజి కాదులే
[అతడు] చాల్లే బడాయేలే నైసు పాపా ఊరికేలడాయేలా పట్టుకోకా
యాలో కలేజాలు ఓర్చలేకా ఏవోకహానీలు చెప్పమాకా
[ఆమె] గల బాకులోకి గయ్యమంది రామ రామ మీరా మేమా ||సాల్సా||

చరణం 2

టింగురంగా ఇంగ్లీషు ఎంగిలాట లెందుకంటా కింగు లాంటి మాస్టైలే నేర్చుకో
[ఆమె] ఊర నాటు చిల్లరాట అంత సీనులేనిదంటూ బీరపాంటు మేళాలే మానుకో
[అతడు] లోకల్ డాన్సు మీకులోకువెందుకే ఫారన్ జాబుమీద
మొజా దేనుకో వెస్టెన్ టేస్టులోని ఎక్కువేమిటో మేడిన్ ఆంధ్రకబ్నా తక్కువేమిటో
[ఆమె] నీ బ్రైను వాషు చాలు చాలు వెస్ట్‌టేస్టు మాదేననుకో ||సాల్సా||

ఓ మనసా.. ఓ మనసా నీ చూపె మత్తెక్కించే కొంటెవయసా

పల్లవి

ఓ మనసా.. ఓ మనసా నీ చూపె మత్తెక్కించే కొంటెవయసా
ఓ మనసా ఓ మనసా నీనీడె నన్నేగిచ్చే నాకు తెలుసా
నా కలే నిజం చేయవా ఈ క్షణాలలో
ఆ నిజం నిరూపించనా నా పెదాలతో
చలేచెలీ సుఖాలని ఇలాగె సాగనీ ||ఓ మనసా||

చరణం 1

ఓ ఎగసే అలల జడిలో ఎదలొ ఏదో గుసగుస
మదిలో మధుర స్వరమై పలికే ఏదో పదనిస
లయలో హొయలు వెలివేస్తూ నిను కదిలే నదిలా కలవాలి
లయలో చేయి పెనవేస్తూ నను నేనే నీలో కలపాలి
మరీమరీ మనోహరి సుఖాల వేళ చేరునా కౌగిలి ఓ మనసా

చరణం 2

హొ... మెరిసె నీలికడలై కురులొ నిన్నే దోచనా
చిదిరే లేత నుదురి పాలనురగై తాకనా
మనసే కోరు మదువులకి ఇక మనకో చోటే వెతకాలి
ఒకటై చేరు తనువులకె మరి మనమొ దారే చూపాలి
ప్రియాప్రియా పెదాలిలా తపించెపోయె నీకు చెందాలని ఓ మనసా

చందమామ కోసమే

పల్లవి

[ఆమె] చందమామ కోసమే వేచిఉన్న రేయిలా వేయికళ్ళతోటి ఎదురుచూడనా
వాన జల్లు కోసమే వేచిఉన్న పైరులా గంపెడంత ఆశతోటి చూడనా జోలపాట కోసం
ఉయ్యాలలోన చంటిపాపలాగ కోడికూతకోసం తెల్లారుజాము పల్లెటూరిలాగ ఆగనే
లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్నమాట హే ఒకట.రెండు.మూడు అంటు అరె
ఒక్కొక్షణాన్ని నేను లెక్కపెట్టనా వెళ్ళు వెళ్ళు వెళ్ళు అంటు ఈకాలాన్ని ముందుకే నేను తొయ్యనా

చరణం 1

[ఆమె] తొందరే ఉందిగా ఊహకైనా అందనంతగా కాలమా వెళ్ళవే తాబేలులాగ ఇంతనెమ్మదా
[అతడు] నీతో ఉంటుంటే నన్నే చూస్తుంటే రెప్ప వేయకుంటె చేపపిల్లలు కళ్ళేం వేయలేని ఆపే
వీల్లేని కాలం వెళ్తుందే జింక పిల్లలా
[ఆమె] అడిగితే చెప్పవు అలిగినా చెప్పవు కుదురుగా ఉండ నీవు ||ఒకటి.రెండు.మూడు||
[అతడు] మూడు.రెండు.ఒకటి అంటు గడియారాన్ని వెన్నక్కి నేను తిప్పనా

చరణం 2

[ఆమె] ఎందుకో ఏమిటో నిన్నమొన్న లేని యాతనా నామది ఆగదే నేను ఎంత బుజ్జగిజ్జినా
[అతడు] చీపో అంటావ నాతో ఉంటావో ఇంకెం అంటావో తెల్లవారితే విసుకుంటావో అతుకుంటావో
ఎలా ఉంటావో లేఖ అందితే
[ఆమె] ఇంక ఊరించకు ఇంతవేదించకు నన్నిలా చంపమాకు ||ఒకటి.రెండు.మూడు||