Showing posts with label - రాధిక. Show all posts
Showing posts with label - రాధిక. Show all posts

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా...

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా ||2||
రెప్పవెయ్యనే లేదు ఎందుచేత.. ఎందుచేత
పదహారు కళలనీ.. పదిలంగా వుంచనీ.. ||2||
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత ||జాలిగా||

చరణం 1

కాటుక కంటినీరు పెదవుల నంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా ||2||
నీ కుంకుమకెపుడూ పొద్దుగుంకదమ్మా ||జాలిగ||

చరణం 2

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి
పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా ||2||
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపొయేవే కధలన్నీ ||జాలిగ||

తెలిమంచు కరిగింది

తెలిమంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది
పిలిపునీయనా ప్రభూ ||తెలిమంచు||
నీ దోవ పొడవునా
కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి
మెలకువలా వందనము ||తెలిమంచు||

చరణం 1

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు ||ఈ పూల||
నీ చరణ కిరణాలు
పలుకరించినా చాలు
పల్లవించును ప్రభూ
పవళించు భువనాలు
భానుమూర్తి... నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవశృతిని
పాడనీ ప్రకృతినీ ప్రధమ కృతినీ ||తెలిమంచు||

చరణం 2

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు ||భూపాల||
పసరు పవనాలలో పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదునుదేరిన చాలు
తలయుచు తలిరాకు
బహుపరాకులు విని
దొరలని దోరనగపు దొంతరని
తరలని దారి తొలగి రాతిరిని ||తెలిమంచు||

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ||2||
ఈ నా కృతి నీవు భారతి ||2|| ||శ్రుతి||
ధ్రుతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ||2||
శరణాగతి నీవు భారతి

చరణం 1

నీ పదములొత్తిన పదము ఈ పదము
నిత్య కైవల్య పధము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు
నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కొనియాడు
కృతుల పెన్నిధి తప
చేరినా యిక చేరువున్నదేమి నీ శ్రీచరణ
దివ్యసన్నిధి తప్ప ||శ్రుతి||

చరణం 2

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు
నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు
కీర్తనలు నీ కీర్తులే ||2||
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత
రాగాలు నీముర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచన జననీ
భవతారక మంత్రాక్షరం ||శ్రుతి||