శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో
నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా ||అచ్చొచ్చేటి ||
నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా
విడువకు మురిసిన బాట
అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే నీదా ||అచ్చొచ్చేటి ||
చరణం 1
మదన మోహినీ చూపులోన మాండురాగమేలా ||2||
పడుచువాడినీ కన్న వీక్షణ పంచదార కాదా
అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం ||2||
చందనం కలిసినా ఊపిరిలో
కరిగేనే కల కట్టినిల్లే ||శశివదనే||
చరణం 2
నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా ||2||
నేను నీవు ఎవరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్రవేళ పురే విడి పూతలాయె ||2||
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జతచేరే ||నవమదనా||
ఆ... ఆ... నీదా...
Showing posts with label * బోంబే జయశ్రీ. Show all posts
Showing posts with label * బోంబే జయశ్రీ. Show all posts
తియతీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో
పల్లవి
తియతీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో...
నేనవరన్నది నేమరిచి పోగలను చూస్తూ నీ కళ్ళలో...||తియతీయని||
చరణం 1
చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలువేమిటో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చిరాని కన్నీళ్ళకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు భాధేమిటో...||తియతీయని||
చరణం 2
మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచి పోతుంది ప్రేమ సంకెళ్ళలో ||తియతియ్యని||

Subscribe to:
Posts (Atom)