Showing posts with label * కార్తిక్. Show all posts
Showing posts with label * కార్తిక్. Show all posts

నువ్వేంమాయ చేశావొ గాని...

నువ్వేంమాయ చేశావొ గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
నువ్వేంమాయ చేశావొ గాని ఇలా ఈ క్షణం ఆగిపోని ||2||
హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని
హే.. కాలాన్నే కదలనీయని కనికట్టేం జరగలేదని
ఈ తీయని మాయ తనదని తెలుసాఅనీ
మనసూ నీదే మహిమా నీదే
పిలుపూ నీదే బదులూ నీదే ||నువ్వేంమాయ||

చరణం 1

మూగ మనసిది ఎంత గడుసుది నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంత కాలమూ కంటి పాపలో కొలువున్న కల నువ్వే అంటున్నది ||హాయిరే||
ఎందుకులికి పడుతుందని అడిగి చూడు నీ మనసుని
హే.. నిదురించే నీలి కళ్ళలో కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కలఏం వెతుకుతున్నదో తెలుసాఅనీ
కనులూ నీవే కలలూ నీవే ||పిలుపూ||

చరణం 2

పిచ్చి మనసిది ఆ.. ఎంత పిరికిది నచ్చుతానొ లేదో నిన్ను అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక అలలాగ ఎగిరెగిరి పడుతున్నది ||హాయిరే||
దాని పరుగు ఎటువైపని అడిగి చూడు నీ మనసుని
హే.. ఏ దారిన సాగుతున్నదో ఏమజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో తెలుసాఅనీ
పదమూ నీదే పరుగూ నీదే ||పిలుపూ||

పిలిచినా రానంటావా...

పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా
నలుగురూ వున్నారంటావా.. ఓ ఓ ఓ..
చిలిపిగా చెంతకు రాలేవా
తెలివిగా చేరే తోవ తెలియనే లేదా బావా
అటు ఇటూ చూస్తూ వుంటావా .. ఓ ఓ ఓ..
తట పటాయిస్తూ వుంటావా
సమయం కాదంటావా సరదా లేదంటావా
సరసం చేదంటావా బావా
చనువే తగదంటావా మనవే విననంటావా
వరసై ఇటు రమ్మంటే నామాట మన్నించవా

డోలు భాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా ||2||
తరన్నరన్నర నన్నరన్న తరన్నరన్నరన నన్నచలే ||2||

చరణం 1

కనులుంటే సొగసే కనపడదా మనసుంటే తగుమార్గం దొరకదా.. రాననకా
అనుకుంటే సరిపోదే వనితా అటుపై ఏ పొరబాటో జరగదా.. రమ్మనకా
పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే
తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలితే
చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయి అబ్బాయి
హవ్వ హవ్వాయి అమ్మో అమ్మాయీ విన్నానులే
break it down
హవ్వ హవ్వాయి అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయి ||2|| ||పిలిచినా||
తనక ధిన సయ్యా తనక ధిన సయ్యారే ||2||
సిరిమయ్యయ్యో అహ అహ అహ ||2||

చరణం 2

మొహమాటం పెడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా.. చేరవుగా
ఇరకాటం పెడతావే ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా.. ఆగవుగా
దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా
వరాల బాల వరించవేల తరించనంటూ తగువేలా
నిగారమిట్లా జిగేలనేలా జనం చెడేలా
everybody
నిగారమిట్లా జిగేలనేలా జనం చెడేలా జవరాలా ||2||
తన్నాన నానే తన్నాన నానే తన్నాన నానే తన్ననాన ||3||

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ||ఎదుట||

చరణం 1

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతె ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో కాదో అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధం అల్లుకుందే.. జన్మ ఖైదులా ||ఎదుట||

చరణం 2

నిన్నే చేరుకోలేకా ఎటెళ్లిందో నా లేఖ
వినేవారు లేకా విసుక్కుంది నా కేకా
నీదో కాదో వ్రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా ||ఎదుట||

ఆకాశగంగా... దూకావె పెంకితనంగా

ఆకాశగంగా... దూకావె పెంకితనంగా
ఆకాశగంగా...
జలజల జడిగా తొలి అలజడిగా
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా ||ఆకాశ||

చరణం 1

కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే ||2||
చిటపటలాడి వెలిసిన వానా
మెరుపుల దాడి కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడి ||ఆకాశ||

చరణం 2

ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా ||2||
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపూ తెలుపవే అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా ||ఆకాశ||

గోరే గోరే గొగ్గోరే గోరే...

గోరే గోరే గొగ్గోరే గోరే...
గోరే గోరే గొగ్గొరే... ||3||
గో... గో... గో...
పో పో పొమ్మంటోందా నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా ||పో పో...||
చూస్తు చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీవల్ల
ఇదనా అదనా ఎద ఏమన్నా
తెలిసే వీలుందా ||గోరే...||

చరణం 1

తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం ||తెగ||
ముళ్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళీ పడదా నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం పలికుండదే మమకారం
ఔనా.. అయినా..
నన్నే అంటావే నేరం నాదా ||గోరే...||

చరణం 2

వెంటపడుతుంటే వెర్రి కోపం నువు కంటపడకుంటే పిచ్చితాపం
మండిపడుతుందే హృదయం మరిచే మంత్రమైన చెప్పవే సమయం ||వెంట||
నీతో నీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా ||గోరే...||

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా---

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా...
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా ||హరే హరే|| ||నిజంగా||

చరణం 1

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ
నడచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదూ గడచిన కాలం
ఇంతని నమ్మనుగా... ||నిజంగా||

చరణం 2

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాల్నే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
పెదవికి చెంపా తగిలిన చోట
పరవశమేదో తోడౌతుంటే
పగలే అయినా గగనంలోనా
తారలు చేరెనుగా... ||నిజంగా||

ఎగిరి దుమికితే నింగి తగిలెను

ఎగిరి దుమికితే నింగి తగిలెను
పదములు రెండూ పక్షులాయెను
వేళ్ల చివర పూలు పూచెను
కనుబొమ్మలే దిగి మీసమాయెను
అలె.. అలె.. అలె.. అలె..
అలె అలె అలె అలె అలె అలె అలె
ఆనంద బాష్పాల్లో మునిగా...
ఒక్కొక్క పంటితో నవ్వా...
కలకండ మోసుకుంటూ తిరిగా
ఒక చీమై..
నే నీళ్ళల్లో పైపైన నడిచా
ఒక ఆకై.. అలె.. అలె..
ప్రేమను చెప్పిన క్షణమే
అది దేవుని కన్న క్షణమే
గాలై ఎగిరెను మనసే.. ఓ.. ఓ.. ||ప్రేమను|| ||ఎగిరి||

చరణం 1

నరములలో మెరుపురికెనులే
తనువంతా వెన్నెలాయెనులే
చందురుని నువు తాకగనే
మనసున మొలకే మొలిచెనె
అది కరువై తలనే దాటలే.. అలె.. అలె..
నే చలనం లేని కొలనుని
ఒక కప్ప దూకగా ఎండితిని ||ప్రేమను|| ||ఎగిరి||

చరణం 2

ఇసకంతా ఇక చక్కెరయా
కడలంతా మరి మంచినీరా..
తీరమంతా నీ కాలిగుర్తులా
అలలన్నీ నీ చిరునవ్వులా..
కాగితం నాపై ఎగరగ
అది కవితల పుస్తకమాయెనులే.. అలె.. అలె..
హరివిల్లు తగులుతూ ఎగరగ..
ఈ కాకి కూడా నెమలిగా మారెనులే ||ప్రేమను|| ||ఎగిరి||

ఒకమారు కలిసిన అందం

ఒకమారు కలిసిన అందం
అలలాగ ఎగసిన కాలం ||2||
కంటికెదురుగ కనబడగానే
అంతే తడబడినానే ||2||
తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కలలె మెరుపు
ఎదలోన తనపేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం
నులివెచ్చగ తాకిన కిరణం
కనులు తెరచిన కలువను చూశానే
చూశానే చూశానే ||ఒక మారు||

చరణం 1

పాత పదనిస దేనికద నస
నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ దొరుకు చిరుతిండి
వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా.. నీ.. సా..
నను తాకే కండమల్లికా.. నీ.. సా..
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా ||ఒక మారు||

చరణం 2

పేరు అడిగితె తేనె పలుకుల జల్లుల్లో
ముద్దగా తడిశానే
పాలమడుగున మనసు అడుగున
కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా
నీ మెరిసే నగవే చందమా
హొ.. కనులారా చూడాలే తడి ఆరిపోవాలే
ల రలాల లర లల లాల... ఓ... ||2|| ||కంటికెదురుగ||

ఓ చెలి నీ వయ్యారాలే

పల్లవి

[అతడు] ఓ చెలి నీ వయ్యారాలే ఊహలోనే ఉయ్యాలూగే
జంటతయ్య నా కన్నులోనా తుంటరి ఓ తూనీగ ఆడే
[ఆమె] ఓ ప్రియా నా తేనందాలే తేరగా నువ్వు దాచెయ్యాలా
మొగ్గనై నీరాగే వేళ సిగ్గులే నువ్వు కాజెయ్యాలే
[అతడు] పిల్లి పిల్లి వచ్చే ఎలకజో దాగుడుమూత
దాగుడుముత దండాకోర్‌ దొంగెవరంటా

చరణం 1

[అతడు] హులల్లా హులల్లా హులల్లా హులల్లా
[ఆమె] పూలమబ్బుల్లా
[అతడు] హులల్లా తేనె జట్టురా
[అతడు] హులల్లా స్నానమాడాలా
[అతడు] హులల్లా చాలనీగోల
[అతడు] చంటిగారి పోట్టి పిల్ల గట్టిదంట చూడరో
అల్లారు బుగ్గ మీద వెన్నముద్దపెట్టరో
చెంపకాయ చుట్టమీద పుట్టు మచ్చపెట్టరో
సొగసుల సిగతరకో
[ఆమె] మబ్బులాగ పిల్లగాడు నీరు కారిపోయారో
ఎత్తుకున్న చక్కనోడు ఎత్తుకెళ్ళవచ్చెరో
వాడే అచ్చా ఆనంద్‌ బహుతచ్చా
[అతడు] పిల్లి పిల్లి వచ్చే ఎలుకజో దాగుడుమూత

చరణం 2

[అతడు] ఉరికి దుకుడ్లా
[ఆమె] మూలల్లా ఉతుకుతామల్లా
[ఆమె] హెల్త్‌ మార్చి నీటుగాడు చాటుమీద నాదిరో
నా ఒంపు సొంపులన్ని దొంగిలించ వచ్చెరో
కుర్రవాటం ఎక్కువైతే గుట్టు వెక్కిరించెరో రామునితో కతివా
[అతడు] టిక్కులాడి తిక్కలమ్మ టెక్కులెంత గాటురో
చక్కనెమ్మా వీధికొస్తే చుక్కెలెంత మోటురో
జల్సా చేస్తా జట్కాఎక్కిస్తా
పిల్లి పిల్లి వచ్చే ఎలుక జో దాగుడు మూత
దాగుడు మూత దండకోర్‌ దొంగెవరంటా ||ఓచెలి||

ఇంత అందమైన అమ్మాయిని

పల్లవి

[అతడు] ఇంత అందమైన అమ్మాయిని ||2|| దేవుడా
ఎట్ట తలచినావో మలచినావో దేవుడా
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
నేను ఇంతకాలం చూడలేదు దేవుడా
ఐస్‌కాంతమేదో తన చూపుల్లో దాగుంది తనవైపే లాగేస్తు ఉంది
నా మనసే ఆగదు ఏబాషైన చాలదు తనరూపం వర్ణిస్తూ ఉంటే
హరివిల్లుని బొమ్మగ చేసి అణువణువు వెన్నెలపోసి
నాకోసం పుట్టించావే మో ||ఇంత అందమైన||

చరణం 1

[అతడు] తన సన్నగా నవ్వితే ముత్యాలవాన ఆవానలో తడవాలేమైనా
నడువోంపులో ఉన్నది వయ్యారవీణ ఆ వీణలో రాగాన్నయిపోనా
అమ్మాయి ఊరేంటో తన ముద్దు పేరేంటో తన ఇష్టాలేంటేంటో
చెలిమే తలచి పనులే విడిచి రేయిపగలు తన ఊహలతో
ఇది వరకెరుగని అలజడి మొదలై తడవ తడబడి పోరబడి
కలవరపడుతు కలలే కంటు కునుకే రాదు కుదురేలేరు
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ||ఇంత అందమైన||

చరణం 2

[అతడు] తను అడిగితే ఇవ్వనా నా ప్రాణమైనా నా సర్వము తనదే అంటున్నా
కనుపాపని కాపాడే కనురెప్పలాగ చెలితోడుగా నూరేళ్ళంటాగా
ఆ దేవుడు వరమిచ్చి తన మనసే నాకిస్తే నాకింకేం కావాలి
ఎప్పుడూ లేదే ఎదలో గుబులు నిను చూసాకా సిగలేమొదలు
కదలడు సమయం క్షణమొక యుగమై కనులు తెరవగ
ఎదురుగ నిలబడి చేతులు చాచి రమ్మని పిలిచి అంది అందక
ఊరిస్తావే ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ||ఇంత అందమైన||

అస్సా బుస్సా లవ్వుపేట

పల్లవి

[అతడు] అస్సా బుస్సా లవ్వుపేట పోదామా
అల్లోమల్లో కిందో పైనో పడదామా
పట్టేసి కాజా పెట్టనా జతకట్టి కిస్సే కొట్టనా
నైజాము చుక్కరా నసపెట్టే చిలకరా
పట్టేసి చూడరా ఫత్తైల్లే ఉందిరా
ఏంటమ్మా చిట్టెమ్మా నువ్వే నా జోడి రంగమ్మా
అమ్మమ్మా అమ్మమ్మా ||అస్సా...||

చరణం 1

[అతడు] పోదామంటె ముద్దుగానే రానా బుజ్జి గుండమ్మా
గుండెలోని లవ్వుని బాగా పంచుకుందాం కన్నమ్మా
నీ అబ్బగారికి సమ్మతమేమి నీ అమ్మక్కూడా సమ్మతమే
నీ అన్నగారికి సమ్మతమే నీ చెల్లిక్కూడా సమ్మతమే
[ఆమె] ఎవరేమేమన్నా ఎట్టాగన్నా నేనేగా ఓకె చేసేది
[అతడు] అవునమ్మా అవునమ్మా ||అస్సా...||

చరణం 2

[అతడు] పట్టు పంచికి ముద్దబంతికి కళ్యాణమే కళ్యాణమే కళ్యాణమే
నువ్వు నేను ఉల్లాసంగా పెళ్ళాడేస్తే తప్పేంటి
బ్లాకెన్‌వైటు కలరులోనా బిడ్డపుడితే తప్పేంటి
అస్సా బుస్సా జెట్టుకట్టి దోసై పోతే కుర్రదానా
తీగకి మల్లె చుట్టుకుంటూ లోకాన్నంతా మర్చిపోనా
[ఆమె] అరె వెనకా ముందు చూడకుండా కవ్విస్తే
తప్పేకదారా కొవ్వేరా [అతడు] పోతాలే ||అస్సా ...||

వన్‌ మోర్‌ టైమ్‌ . . .

పల్లవి

[ఆమె] వన్‌ మోర్‌ టైమ్‌ . . . ||2||
[అతడు] అమ్మహ అనిపించేలా ఎంతపని చేశావే . . . బాల శతవిధాలా మతి చెడేలా
[ఆమె] అయ్యహో కంగారేలా అందరు గమనించే వేళా రకరకాల కలవరాలా . . .
[అతడు] ఏమయిందంటే ఏం చెబుతానే ఎవ్వరికైన . . . గాయమేందటె
చూపించె వీలుంద ఎమయినా . . .
[ఆమె] ఏమయ్యో ఎమయ్యి పోతున్నామో ఈ మైకంలో రొమియో
అయిపోతావా పాపం ఆలోకంలో . . . ఓ. . . వన్‌ మోర్ టైమ్‌ . . . ||2||
[అతడు] నాకిల అయినట్టే నీకు కాలేదంటే నమ్మమంటావా చెప్పు నాలా
పైకనవంతే
[ఆమె] నువ్వుల అనుకుంటే నవ్వుకుంటానంతే ఒప్పుకుంటావా చెప్పునువ్వన్నది కాదంటే . . .
[అతడు] నిన్నే చూసుండక పోతే నా మనసే జారేదా . . . నిజమంటె
ఎపుడూ చేదే . . . నీ నేరం ఏమీలేదా . . .
[ఆమె] అంతలో అయ్యయ్యయ్యో నిందలే వెయ్యద్దయ్యొ . . .
వన్‌ మోర్‌ టైమ్‌ . . .
[అతడు] ఎందరో నీకన్న సుందరీ మణులున్నా ఎన్నడు కన్నెత్తెన
చూశాన ఎవ్వరికైనా . . .
[ఆమె] నేను కాదన్ననా . . . ఎంతలక్‌ అనుకోనా . . . ముక్కులే నీ
రూపంలో దాక్కాయని కలగననా . . .
[అతడు] నువు పుట్టిన తేది కన్నా ముందే రాసుందే మైనా . . . కాబట్టే
ఈ భూమ్మిద జన్మించానే నెరజాణా . . .
[ఆమె] మాట ముడివెయ్యద్దయ్యో . . . చేతబడి చెయ్యదయ్యో . . .
వన్‌ మోర్‌ టైమ్‌ . . . ||అమ్మహ అనిపించేలా . . .||

నువ్వెంత అందగతైవైనా గాని అంత బిరుసా

పల్లవి

నువ్వెంత అందగతైవైనా గాని అంత బిరుసా
తెగ వెంటబడుతుంటె నీకు ఇంత అలుసా
నేనంత కానివాణ్నికాదుగద కన్నె వయసా
నీకంటికి నేనొక చిన్న నలుసా
నిన్నే . . . నిన్నే . . . నేను కోరుకున్నది నిన్నే . . .
నన్నే . . . నన్నే . . . ఒప్పుకోక తప్పదింక నన్నే . . .

చరణం 1

ఔను అంటే నిను చూసుకోనా మహరాణి తీరుగా
కాదు అంటే వదిలేసి పోను అది అంత తేలికా
లేనిపోని నఖరాలు చేస్తే మరియాద కాదుగా . . .
ఇంతమంచి అవకాశమేది ప్రతిసారి రాదుగా
తగని వాడినా చెలీ తగువు దేనికే మరీ . . .
మనకు ఎందుకే ఇలా అల్లరీ . . . ||నువ్వేంత||

చరణం 2

కన్నెగానే ఉంటావా చెప్పు ఏజంట చేరక . . .
నన్ను మించి ఘనుడైన వాణి చుపించలేవుగా . . .
మీసమున్న మగవాణ్ని గనక అడిగాను సూటిగా
సిగ్గు అడ్డుపడుతుంటె చిన్న సైగైన చాలుగా
మనకి రాసి ఉన్నది . . . తెలుసుకోవె అన్నది . . .
బదులు కోరుకున్నది . . . నామది . . . ||నువ్వేంత||

అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో

పల్లవి

[అతడు] అయ్యయయ్యో అయ్యయయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తోందయ్యో
[ఆమె] అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడు అవుటయ్యో
[అతడు] అరెసోకుల్లో సెగ చూపనీ
[ఆమె] ఎరుపెక్కించే ప్రతి చంపనీ
[అతడు] కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మె ఎంచక్కా ||అయ్యయయ్యో||

చరణం 1

[అతడు] సోకుల ఎరనే చూపి "చిరు" కాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలిలాగ చెక్కైమాకె పోరి
[ఆమె] చూపుల సూదులతోటి నా కోకలు గోడలు దాటి
తుంటరి గుంటడు మారనంటే ఎట్ట వేగేదేంటి
[అతడు] ధీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావ చక్కెరకేళి
[ఆమె] పైట రాగాల కోటలో కింక చేరవా బ్రహ్మచారి
[అతడు] అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నెరజాన మత్తెకిందయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మొహమాటం చెట్టెక్కిందయ్యో

చరణం 2

[ఆమె] అచ్చిక బుచ్చికలాడి నును వెచ్చని తాకిడితోటి
నిప్పుల దుప్పటి చప్పున పెడితె ఎట్టా ఆపేసేది
[అతడు] వెన్నెల పందిరి వేసి మరుమల్లెల మంచం‌వేసి
ఇద్దరి మధ్యన దుప్పటి కడితె జోరొగ్గాల బేబి
[ఆమె] చాటుగా వచ్చి చేతివాటాన చేయవోయ్ ఇంక వన్నెల బోని
[అతడు] లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల బోమా ||అయ్యయయ్యో||

మనసా మౌనమా మదిలో రాగమా

పల్లవి

[అతడు]మనసా మౌనమా మదిలో రాగమా
[ఆమె] మనసా క్షేమమా మనిషి ప్రాణమా
[అతడు] చిగురులు వేసే క్షేత్రమా చినుకై రాలే మేఘమా
[ఆమె] చెరగని కావ్యం బంధమా కరగని దూరం కాలమా
[అతడు] యెద లోతుల్లో ఆనందమా ||మనసా||

చరణం 1

[అతడు] నీలాకాశం సాహసంతో తారాలోకం సాగే వేళ
ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా
[ఆమె] సాయం సంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో
తోడు నీడ ప్రేమా గూడు నీదే కదా
[అతడు] వలచి పిలిచే నాలో ఆశవైనా శ్వాసవైనా నీవేమైనా ||మనసా...||

చరణం 2

[అతడు] పూబంతి బుగ్గల్లోనా రోజూ రంగు సిగ్గుల్లోనా నీ అందాల
శ్రీగంధాలే పూసే వేళ
[ఆమె] మాటేలేని కన్నుల్లోనా పాట పాడే పాపల్లోనా నీ చూపుల్లో నీ బంధీగా చిక్కే వేళ
[అతడు] జతగా శృతిగా అనురాగం యోగం వేగం
అయ్యే సంతోషాన

నా వయసే పాదరసం నేనసలే చిన్నరసం నా పెదవే ద్రాక్ష

పల్లవి

నా వయసే పాదరసం నేనసలే చిన్నరసం నా పెదవే ద్రాక్ష
రసం నానడుమేనాగస్వరం నాసోకు పూలవనం నా చూపు
నీకు వరం అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం ఓయ్‌
హేయ్‌ నాపేరే కాంచనమాల నావయసే గరం మసాలా
తందానతాన అంటు మొగనీ తబలా
హోయ్‌ రావే నా రసరంగీళా నీ బుగ్గే నా రసగుల్ల
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
కలిసొస్తా కానివేళ కైపెట్టే కన్నులా నీదేరా రాకుమారా
దోరదోర ఉడుకుల ఉయ్యాలా ఊ ఊ నను అల్లుకో అల్లుకో
ఆ ఆ నన్ను గిల్లుకో రా హేయ్ నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓ ఓ
ఊ నిన్ను తాకనా తాకనా ఆ ఆ నిన్ను చుట్టుకోనా
ఏ ముద్దుపెట్టనా పెట్టునా ఆ ఆ ఆ ఆ ఓయ్‌

చరణం 1

నీ రాకలో రాపిడుంది నా సోకులా దోపిడుంది నీ దొంగ
చూపుకే నా బెంగ తిరునా నువు ఉండిపో రాత్రికి
నీ మీదనే మోజు ఉంది ఈ రోజునే రాజుకుంది ఏ ఫోజు
కొట్టనా ఈ పోరు తప్పునా తెల్లారు సయ్యాటకి
మాయాబజార్ మల్లెపూలకి వేళాల వెర్రి నాకు లేలే
పారాహుషార్ పట్టుచిక్కరో మావ మావ ఓ మావా
కావాలిలే గజ్జికాయలే నీ కళ్ళు గజ్జికాయలే ఆడాలిలే
కచ్చకాయలే బామ బామ ఓ బామ ||ఉఉ నన్ను అల్లుకో ||నా పేరే||

చరణం 2

నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెల్లో గుచ్చుకుంది
ఏ మాట చెప్పిన ఆ మంట తిరునా నన్నాపకే ఇప్పుడు
నీ చూపులో సూదివుంది, ఆ సూదంటునా లాగుతుంది
నువ్వంటు తొక్కినా నావంటి చక్కనా నే మోయలేనిప్పుడు
వస్తే ఇస్తావా బాలివుడ్‌లో చిత్రాంగి చీరకట్టాదాయె
చారుమినార్ సొట్టుబుడ్డివే బామ బామ ఓ బామ
దాసిచ్చినా పూతరేకునే లేలేత కొత్త సోకులే
ముట్టించనా ముంజకాయలే మావ మావ ఓమావ
||ఉఉ నన్ను అల్లుకో|| ||నా పేరే కాంచనమాల||

వర్ధిల్లండి వర్ధిల్లండి కన్నెపిల్లలారా వర్ధిల్లండి పిల్లలున్న

పల్లవి

వర్ధిల్లండి వర్ధిల్లండి కన్నెపిల్లలారా వర్ధిల్లండి పిల్లలున్న
తల్లులంతా సాగరంగా వినరండి
మరులగన్నా పెద్దల్లారా మనుమోహరంగా వినరండి
సిరిమల్లె వోలే నవ్వే ముఖాలకి ఈ సూర్యరామ
వంశము ఇస్తుంది దీవెనలు
అ అ అన్నగారి మాట అఅ అచర్ధిమాటరా అఅ అక్కరతో వింటే
అర్ధముందిరా పాడు కొత్తపాట పాడు పాడి అదరగొట్టరా
నిన్న గాలి తోటి పోయే నేడు గతుకు మనదిరా
అగడదలా నగద తీసేయ్... కో............ ||అన్నగారి...||

చరణం 1

ప్రేమకి చోటున్నది నిజము యెదనున్నది నిండు నూరేళ్ళకి బతికే బలమున్నది
సిగ్గు మొగ్గల్నే కమ్మేశాకే మదిలో విరిసింది మందారం
రోజు ఇకపైన నిదరే రాదు పైట జారిస్తే వయ్యారం
నా శ్వాసలతోనే రగిలిస్తా తాపం
అరె ఒక్క రొకో కుంచెం కొచ్చి కోటి సపాలన్ని లయో
అగడదలా నగద తీసెయ్... ||అన్నగారి....||

చరణం 2

మనస్సు తెర తీసివెయ్ బాణం గురిపెట్టి వెయ్
బతికే కాలం అంతా మట్టికి మరిగాలా చెయ్
పేరు లేనట్టి బిక్షం ఉందా సొంతకాళ్ళే నీ సొత్తంతా
నువ్వు నిలిచాకా ఊరేనీది అప్పుడే నీ విలువ తెలిసేనమ్మా
నీ యెదలో ఉందే ఇక జరిగేనమ్మా ఇదినాకు తెలుసు రేపు నీదేగెలుపు
అరె చోటి చూసి మాకే డెంగి ఆటో చూచి అడిగేసెయ్
అగడదలా నగద తీసేయ్... ||అన్నగారి...||

నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా నేనేనాడు అనుకొని మైమరపులా

పల్లవి

నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలా నేనేనాడు అనుకొని మైమరపులా ||2||
చిరుగాజుల్లె అలా రివ్వంటున్న సవ్వల్లలోన విన్నానులే ఇలా జుమ్మంటున్న రాగాల వీణ
సెగనిప్పుల్లే అల్లా చెరిగేస్తున్న మాసాలలోన కురిసిందిలే ఇలా నా ఎదలోన ఆ మంచు వాన
శతకోటి వర్ణాల సరికొత్త ఋతువల్లె ఈ లోకమే మారెనా ||నన్నొచ్చి||

చరణం 1

ఆ కారుపొగలైన మేఘాలుగా కనిపించెలే ఈ నాకంటికి
ఈ తీరు అదిఏమొ కొన్నాళ్ళుగా రుచిలేదులే ఈ నానోటికి
అలా చక్కనై అలై జాబిలి నన్నే తాకిపోయింది అవునా మరి
ఇలా నా మది అదేదో అయ్యి - ఎదో ఏదో అవుతోంది ఏమో మరి
అదో గుండమై నాకోసమే దిగివచ్చె ఆకాశమే ||నన్నోచ్చి||

చరణం 2

వేవేల తారల్ని కనువిందుగా విరభూసిలే ఈ పూదోటలే
నాకేమొ తొలిసారి మహవింతగా తరువాయెలే ఈ ఆ మాటలే
ఒక్కో దిక్కులా కుక్కుపిట్టలా రెక్కేకట్టి ఎగిరాయి నాఊహలే
నిద్రేపట్టని ఇదేం పిచ్చని నన్నే చూసి నవ్వాయి జడపువ్వులే
అలా నింగిలో నెలవంకనే గెలిచాయి నా ఆశలే||నన్నొచ్చి||

హొయ్ అనగనగా కధలా ఆరిళ్ళకు సెలవిస్తే

పల్లవి

హొయ్ అనగనగా కధలా ఆరిళ్ళకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాల చీకటినీ తిడుతూనే ఉంటామ
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమ
ఆ వెలుగులికి తొలి చిరునామ అదె ఒకటే చిరునవ్వే నమ్మ ||అనగనగా||

చరణం 1

ఓరి బాదలో కన్నులో కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా అరె ఈనేల ఆకాశం ఉందే మన కోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేల అల్లరిచేద్దాం||అనగనగా||

చరణం 2

ఎందుకో ఏమిటో ఎంతమందిలో వున్నా
నా ఎద నీజతే కోరుతుందిగా
వంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా
హేయ్ కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి
కలిపేస్తూ నీ చేయి అడుగా చిందెయ్యి
మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి

కిలాడి కూన పల్ పల్

పల్లవి

[అతడు] కిలాడి కూన పల్ పల్ పేచిలేలా నాతోనా
కన్నులతో తేలీపారా చూస్తావేలో బోలోనా
[ఆమె] సిల్లీగ పైపైనాపై అలిగినా నమ్మేది లేదో ఏమైనా
నువ్విలా పారిపరి కసిరినా కన్నీరె రాదె ప్రేమేనా
[అతడు] డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా గడిగడి ఓఓఓ
[ఆమె] డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యరా రోజూ కలబడి ఓఓఓ
[అతడు] టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడిగడి కలబడి ఓఓఓ
[ఆమె] టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తావడివడి ఓఓఓఓ

చరణం 1

[ఆమె] చుట్టూర చూస్తే నీకు ప్రేమే కనబడు లోకాన
[అతడు] ఉన్నాది ప్రేమగాని పదుగురుకే నేపంచేనా
[ఆమె] ఆమాత్రం మాటే ఇస్తా జానే జాబా నీకంటునేనే లేనా
[అతడు] ఇల్లారా దారికాచే కుర్రదానా ఎల్లాగె నీతో ఈపైనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లో పడిపడి ఓఓఓఓ
[ఆమె] డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా లవ్‌మి మరిమరి ఓఓఓఓ
[అతడు] టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగ నిలబడి ఓఓఓఓ
[ఆమె] టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగబడి ఓఓఓఓ

చరణం 2

[అతడు] గమ్యములే వేరు చూడు ఆశవీడు నాపైనా ఎల్లాగ తూర్పు
పడమర ఒకటయ్యే బోలోనా
[ఆమె] గుండ్రంగా ఉందోయ్ భూమి తెలుసునా వస్తావు తిరిగి ఏమైనా
[అతడు] అందాక వస్తే నీతో ఏనాడైనా చూద్దామె ఆపైనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా చోరబడి ఓఓఓ
[ఆమె] డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా వల్లో పడిమరి ఓఓఓ
[అతడు] టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతై ఇకమరి ఓఓఓ
[ఆమె] టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి ఓఓఓ