కనులే కలిపే కధలే తెలిపే నాలోని భావాలే
అలలే మెదిలే కలలే కదిలే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో ||కనులే||
చరణం 1
మనసునే తొలి మధురిమలే వరించగా
బ్రతుకులో ఇలా సరిగమలే రచించగా
స్వరములేని గానం మరపురాని వైనం
మౌన వీణ మీటుతుంటే కలవరమాయే మదిలో
చరణం 2
ఎదగనీ కలే ఎదలయలో వరాలుగా
తెలుపనీ అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీరం మధురమైన భారం
గుండె ఊయలూపుతుంటే కలవరమాయే మదిలో ||కనులే||
Showing posts with label - స్వాతి. Show all posts
Showing posts with label - స్వాతి. Show all posts
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
ఆ... ఆ... ఆ... ఆ...
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి
అంతలోనే మౌనమేలనే ||కొంటె||
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు ||2||
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది
చరణం 1
పగలే రేయైనా యుగమే క్షణమైనా
కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ
ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది
వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది ||కొంటె||
చరణం 2
కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచినే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత ||కళ్ళు|| ||మాటరాని||
కంటి చూపుతో నీ కంటి చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే ||చిన్ని||
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి
అంతలోనే మౌనమేలనే ||కొంటె||
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు ||2||
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది
చరణం 1
పగలే రేయైనా యుగమే క్షణమైనా
కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ
ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది
వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది ||కొంటె||
చరణం 2
కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచినే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత ||కళ్ళు|| ||మాటరాని||
కంటి చూపుతో నీ కంటి చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే ||చిన్ని||
ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా...
ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా...
నీ పంట పండిందే ప్రేమా...
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ||ఆడించి||
చరణం 1
ఓ... ఓ... ఊరంతా ముంచేస్తూ
హంగామా చేస్తావేంటే గంగమ్మా...
ఊఁ...ఊఁ...ఘోరంగా నిందిస్తూ
ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా...
చూశాక నిన్ను - వేశాక కన్ను
వెనక్కెలాగ తీసుకోనూ
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను
నువ్వొద్దన్న గవ్వలాటలో... నిలేసే గళ్ళ బాటలో...
నీ దాకా నన్ను రప్పించింది నువ్వే లేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
చరణం 2
ఓ... ఓ... నా నేరం ఏవుందే
ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా...
ఊఁ... ఊఁ... మందారం అయ్యింది
ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా...
పూవ్వంటి రూపం నాజుగ్గా గిల్లీ
కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటి కోపం ఒళ్ళంతా అల్లీ
నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా
మరీ ఆ మారం మానమ్మా...
ఈ లావాదేవీలేవీ అంత కొత్తేం కాదమ్మా...
నీ పంట పండిందే ప్రేమా...
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ||ఆడించి||
చరణం 1
ఓ... ఓ... ఊరంతా ముంచేస్తూ
హంగామా చేస్తావేంటే గంగమ్మా...
ఊఁ...ఊఁ...ఘోరంగా నిందిస్తూ
ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా...
చూశాక నిన్ను - వేశాక కన్ను
వెనక్కెలాగ తీసుకోనూ
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను
నువ్వొద్దన్న గవ్వలాటలో... నిలేసే గళ్ళ బాటలో...
నీ దాకా నన్ను రప్పించింది నువ్వే లేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
చరణం 2
ఓ... ఓ... నా నేరం ఏవుందే
ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా...
ఊఁ... ఊఁ... మందారం అయ్యింది
ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా...
పూవ్వంటి రూపం నాజుగ్గా గిల్లీ
కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటి కోపం ఒళ్ళంతా అల్లీ
నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా
మరీ ఆ మారం మానమ్మా...
ఈ లావాదేవీలేవీ అంత కొత్తేం కాదమ్మా...
Subscribe to:
Posts (Atom)