నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా... తెలిసేదెలా
నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా... లోలోపల
మన ఇద్దరికీ తెలియంది
ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా మది ఉలికి పడుతువుంది ||నా మనసుకే||
చరణం 1
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందదా
నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో
చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని ||నా మనసుకే||
చరణం 2
ఎప్పుడూ గుండె చప్పుడు
కొట్టుకుంటుంది నీ పేరులాగ
ఎప్పుడో అప్పుడప్పుడు
గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదూ
కళ్లలో ఉన్న నీ రూపు రేఖ
ఇంతగా నన్ను ఎవ్వరు
కమ్ముకోలేదు నీలా ఇలాగ
లోకమంటే ఇద్దరే అదే మనం అని
స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కధని ||నా మనసుకే||
Showing posts with label * నిత్య సంతోషిణి. Show all posts
Showing posts with label * నిత్య సంతోషిణి. Show all posts
Subscribe to:
Posts (Atom)