Showing posts with label * కృష్ణమూర్తి. Show all posts
Showing posts with label * కృష్ణమూర్తి. Show all posts

ఓ మారియా ఓ మారియా

పల్లవి

ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మారియా
ప్రతీరోజూ విలువైందీ కాదా ప్రయత్నిస్తే గెలుపేదోరాదా
చేద్దామంటే చూద్దామంటే కలతే తీరదు
[ఆమె] ఓ మారియా

చరణం 1

సిరిమువ్వ రేపంటు వెనుదీస్తుందా ఘల్ల్ ఘుల్ల్ ఘల్ల్ మోగించగా
[ఆమె] సిరిమల్లె మాపంటు ముసుగేస్తుందా గుమ్‌ గుమ్‌ గుమ్‌ పంచివ్వగ
[అతడు] ప్రతిదినం ప్రభాతమై వరాలుతెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ
[ఆమె] ప్రతీక్షణం హుషారుగా శ్రమించి సాగేవాగులు
ప్రయాణమే చాలించునా మాకింక సెలవంటూ
[అతడు] హే ఉల్లాసంగ ఉత్సాహంగా బ్రతుకే సాగనీ
[ఆమె] అంతేలేని సంతోషాలు ఒళ్ళోవాలనీ ||ఓమారియా||

చరణం 2

చిరుగాలి చిత్రంగ రానంటుందా ఝుంఝుం పయనించగా
[ఆమె] కొమ్మల్లో కోకిల కాదంటుందా
కూకూకూ వినిపించగా
[అతడు] నిరంతరం దినం దినం
అలాగే సహనం చూపుతూ
విరామమే లేకుండగ ఈ నేల తిరుగునుగా
[ఆమె] ఆకాశమే అందాలనీ చిన్నారి రెక్కల గువ్వలు
అనుక్షణం మదేపని ఆరాట పడిపోవా
[అతడు] హే మనసే వుంటే మార్గంతానై ఎదురొస్తుందిలే
[ఆమె] చక్కా వుంటే స్వర్గంకూడ దిగివస్తుందిలే ||ఓమారియా||