Showing posts with label - దాశరథి. Show all posts
Showing posts with label - దాశరథి. Show all posts

ఈ రేయి కవ్వించింది నా మేను పులకించింది

ఈ రేయి కవ్వించింది నా మేను పులకించింది
రా నీలో దాచుకో నా పరువాలే పంచుకో
చిలిపి మనసు నా మాట వినదు దోరవయసు ఇక ఊరుకోదు
మనసు మాటే విందాములే వయసు ఆటే ఆడేములే
రా లోకం మరచిపో లే ముద్దులలో మురిసిపో
నిండు వలపుల నీ కౌగిలింత ఉండిపోని జీవితమంతా
కెంపు సొంపుల చెంపలు నావే మధువులూరే అధరాలు నావే
రా నాలో నిండిపో నా అశలనే పంచుకో
పాలవెన్నెల కురిసేటి వేళ మల్లె పానుపు పిలిచేటివేళ
తనువులొకటై పెనవేసుకోనీ కన్నులొకటై కథల్లుకోనీ
రా ఎదపై వాలిపో నా ఒడిలోనే సోలిపో
||ఈ రేయి||