Showing posts with label - చక్రవర్తి. Show all posts
Showing posts with label - చక్రవర్తి. Show all posts

ఇంటర్ చదివే రోజుల్లోనే జంటేకట్టే మూఢొచ్చిందే

పల్లవి

ఇంటర్ చదివే రోజుల్లోనే జంటేకట్టే మూఢొచ్చిందే
డిగ్రీలోకి అడుగెట్టేకే నూటమూడు వేడొచ్చింది
నువ్వు కనిపించాకే కవ్వించాకే లవ్వొచ్చింది నవ్వొచ్చింది
[ఆమె] హట్సాఫ్ చెప్పేయనా నీ ముందే కేరాఫ్ ఇచ్చేయనా
బేయాస్ బెంగాలైనా నీతోటే టే కాఫ్ తానందనా
[అతడు] జాలీ చేద్దాము
[ఆమె] జల్సా చేద్దాము ||ఇంటర్||

చరణం 1

[అతడు] ఊటీలో కోటిలో నువ్వు నేనే వుండాలి
[ఆమె] బళ్లల్లో ఓడల్లో నువ్వు నేనే సాగాలి
[అతడు] భూగోళం ఇరుకైపోతై చెక్కేయాలి రోదసి
[ఆమె] మనకోసం రెక్క తెరిచి పరిచేస్తుంది ఊర్వశి
[అతడు] ప్రేమించే డెమక్రసిక్ తకిట తకిట తం
[ఆమె] సురగంగ దించేయనా బాత్రూంలో షవరల్లే మార్చేయనా
[అతడు] విచ్చే విచ్చే పూలే మనకు కూలినాలి
[ఆమె] వీచే వీచే గాలే మనకు కూలినాలి
[ఆమె] వీచే వీచే గాలే మనకు వాకీ టాకీ ||జాలీ||ఇంటర్||

చరణం 2

[అతడు] నీరైనా బీరైనా నువ్వు నేనే తాగాలి
[ఆమె] ధూళైనా దుమ్మయినా నిన్ను నన్ను తొక్కాలి
[అతడు] సూర్యుణ్ణే చిన్నగమార్చి బల్బే చెయ్యనా
[ఆమె] కృష్ణుణ్నే ఫించం అడిగి ప్రేమంతా నే కూర్చనా
[అతడు] ఊగాలి మైకంలోనా తకిట తకిట తం
[ఆమె] వీక్లీకి టూ సండేస్ వుండేలా కాలాన్ని సవరించనా ||విచ్చే||ఇంటర్||

చిన్నగౌను వేసుకున్న పెద్దపాప హొయ్

పల్లవి

[అతడు] చిన్నగౌను వేసుకున్న పెద్దపాప హొయ్ ||2||
నీ చిన్ననాటి ముద్దుపేరు లాలిపప్పా ||చిన్న||
హైటెక్కు టెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే ||2||
ప్లైటెక్కు నిన్ను చేరి కన్నుకొట్టు క్లింటనే ||చిన్న||

చరణం 1

నీనోటి మాటచాలు ప్లాటినాలు ఎందుకే
నీ తీపిముద్దు చాలు మారుతీలు ఎందుకే
నీ కొంటెలుక్కు చాలు చెక్కు బుక్కులెందుకే
నీ వంటిలుక్కు చాలు హాటు లిక్కరెందుకే
పైటచాటు చోటుచాలు టైటాను ఇంకెందుకే
నీ గోటితోటి గీటుచాలు ఏ టానిక్కెందుకే
అందాల కోకోనట్టు అంతులేని సోకుపట్టు
కొంతకొంత పంచిపెట్టు ఇంతసేపా ||చిన్న||

చరణం 2

నీవేడి ఈలచాలు సెల్యూలార్ లెందుకే
నీ ఈడు లీలచాలు సెల్యులాయి డెందుకే
నీ కన్నె ఊసుచాలు మారిషస్‌ లెందుకే
నీ కస్సుబుస్సు చాలు ఎయిర్ బస్సు లెందుకే
కమ్మనైన పెదవి చాలు అమృతాలు ఎందుకే
చల్లనైన చేయి చాలు అమృతాంజ నెందుకే
కవ్వింత క్లాసులోనా కైగిలింత కోర్సులోనా
నీకు పోటి ఎవరు లేరు నువ్వు తప్ప ||చిన్న||

కన్ను కన్ను కలుపుకొని

పల్లవి

[అతడు] కన్ను కన్ను కలుపుకొని ఎన్నో ఎన్నో కలలుగని ||2||
ఆ కలనై సాగాలి ఆకాశం దాటాలి
[ఆమె] గువ్వలమవుతూ రివ్వు రివ్వు రివ్వంటుంటే తారాగణం
మాకందిస్తుంది నీరాజనం ||కన్ను||

చరణం 1

[ఆమె] పొదరిళ్లు పూలపళ్లు హరివిల్లు
లేళ్లు కుందేళ్లు వీళ్లుంటే చాలు
[అతడు] స్వర్గంలో సంసారం స్వప్నాలే సంతానం
[ఆమె] ఆ జాబిలే మా నెచ్చిలి ఈ కౌగిలే మా లోగిలి
[అతడు] చెక్కిలి గింతల చుట్టాలు కందిన గుర్తులు కష్టాలు
[ఆమె] ప్రణయాలే మా పోకలు ||కన్ను||

చరణం 2

[అతడు] చైత్రాలు సంగీతాలు సరదాలు సందళ్లు
మాదేశంలో సిరులు సంపదలు
[ఆమె] ముచ్చట్లే రత్నాలు మురిపాలే వరహాలు
[అతడు] ముద్దాటలే ముప్పూటలు ముత్యాలయ్యే ముచ్చెమటలు
[ఆమె] అల్లరి చెండులే నాట్యాలు తుంటరి నవ్వులే గానాలు

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా

పల్లవి

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆ ... పంచవన్నె రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుక పంచదారల ప్రేమచినుక

చరణం 1

మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మూగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవతనువ్వే గంధర్వ కాంతపు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
[ఆమె] నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ నాదంది నాజన్మ పొంగింది
[అతడు] పంచవన్నెల రామచిలుక నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మెలకా ||పంచ||

చరణం 2

[అతడు] నాతేనె విందువు నువ్వే నాలంకె బిందువు నువ్వే
నాగుండె గంపలోనా మొక్కుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న వత్తికైన ఓనమాలు నువ్వే నువ్వే
[ఆమె] నీ చెంప అందింది నాచెంద కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది ||పంచవన్నెల|| తళ||

ఇప్పటి కిప్పుడు రెప్పల్లో

పల్లవి

ఇప్పటి కిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల వత్తిళ్లో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్లో
మనసును మేలుకొమ్మని కదిపి కుదిపి సరదాల సందడి
ప్రేమకు వేళయ్యిందని తరిమి తడిమి తరుణాల తాకిడి
ఏం చెయ్యమంది కొంటే అల్లరి ఆమాట చెప్పదు ఎల్లా మరి
మాటలేని ఒడ్డు చేరుకోమని
చిలికి చిలికి ఉలికిపడే చిలిపి వలపు చినుకు సడి ||ఇప్పటి||

చరణం 1

[ఆమె] సరసకు చేరలేదు ఇన్నాళ్లు అలజడి రేపుతున్న తొందర్లు
పరిచయమైన లేదు ఏనాడు శిరసును వంచమన్న బిడియాలు
సరదాగా మెదలైన శృతి మించే ఆటలో
నను నేనే మరిచానా మురిపించే మత్తులో
[అతడు] ఏమైనా ఈ మాయ బాగుందిగా
ఆకాశ మార్గాన సాగిందిగా
ముడి పడిపడి వీడనంది నూరెళ్ల సంకెల ||ఇప్పటి||

చరణం 2

[ఆమె] కనపడలేదు మునుపు ఏనాడు కనులకు ఇన్నివేల వర్ణాలు
తెలియనే లేదు నాకు ఏనాడు తలపునకు గిల్లుతున్న వైనాలు
పెదవుల్లో విరబూసే చిరునవ్వుల కాంతిలో
ప్రతిచోట చూస్తున్నవి ఎన్నెన్ని వింతలో
[అతడు] తొలిసారి తెలవారే నీయీడుకి
గిలిగింత కలిగింది ఈనాటికి
జతపడి సాగమంది కైగిళ్లవాడకి ||ఇప్పటి||