Showing posts with label * స్వర్ణలత. Show all posts
Showing posts with label * స్వర్ణలత. Show all posts

జయహే కృష్ణావతారా

పల్లవి

[నారదుడు] జయహే కృష్ణావతారా
నందయశోద పుణ్యావతారా ||జయహే||
పాపులనణచీ - సాధుల బ్రోవగ
వ్రేపల్లె వెలసిన - గోపకిశోరా ||జయహే||

[యశోద] ఎన్నో జన్మల పున్నెము పండీ
నిన్ను కంటిరా చిన్నారి తండ్రీ

[పూతన] కన్నతల్లి నీ కడుపెరగదు నా
చన్నుగుడువ కనుమూసెదు రారా

[నారద] విష పూతన ప్రాణాపహారీ
శకటాసుర సంహారి - శౌరీ ||జయహే||

[గోపికలు] 1) కాపురమ్ము సేయలేమమ్మా - వ్రేపల్లెలోన
ఓ యశోదా : ఈ పాపమెందూ చూడాలేదమ్మా
2) పాలు వెన్న మనగ నీడు
3) పడుచు నొంటిగ చనగనీడు
4) కలిము ఉంటే కట్టి కుడుతురు
5) కన్న సుతునిటు విడుతురా
కాపురమ్ము సేయలేమమ్మా

[నారద] జయ హే కృష్ణావతారా
నందకుమారా! నవనీత చోరా ||జయ హే||
కాళింగమడుగున కాళీయు పడగల
కాలూని ధిమి ధిమి నాట్యము చేసి
సర్పాధీశుని దర్పము నణచిన
తాండవ నాట్య వినోదా ||జయ హే||
కాళీయ మణిగణ రంజిత చరణా
జయ హే కృష్ణావతారా

[చిన్నికృష్ణ] తనువుల పై అభిమానము వీడిన గాని
తరణులార ననుజేర తరముగాదులే
సిగ్గు వదిలి యిరుచేతులు జోడించండి
చెల్లింతును మనసుదీర మీ కోరికలా

[నారద] జయ హే కృష్ణావతార
గోపకుమారీ : వస్త్రాపహార ||జయ హే||

[చిన్నికృష్ణ] బాలుడితడనీ - శైలము
చాల బరువనీ
మీ భయము వదులుకొండీ
నా అండను చేరగరండీ
ఈ కేలల్లాడదు నమ్మండీ

[నారద] గోవర్ధన గిరిధారి
సురనాయక గర్వాపహారి ||జయ హే||

[రాధ] కృష్ణా!!!
రాధా మానసచోరా
నీ మధు మురళీ గానమునా
నా మనమూ బృందావనమూ
నిలుపున పూచీ - నీ పద పూజకు
పిలిచేనోయీ - రావోయీ
సేవలు చేకొన - రావోయీ ||రాధా మానస చోరా||

రారా . . . రారా

పల్లవి

[అతడు] రారా ... రారా ఎక్కడ పోతావ్‌ రా
నువ్వెక్కడ పోతావ్‌రా ఇంకెక్కడ పోతావ్‌ రారా
[ఆమె] రా ... రా ...
రారా రాజాకుమార్‌ రా మయాబజార్‌ రా
నీ భాజా భలే రా రా
[అతడు] నీ ఉట్టి నేనే కొట్టి నీ చట్టీ నేనే పట్టి
నీముంతా పాలు వెన్నా అంతా గల్లంతేగా
[ఆమె] నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . . రారా||

చరణం 1

[అతడు] ఓ జగిత చిల్లరగిత్తా సోకులసొత్తా మేనత్తా
మాంతా మన్మధగీత తల్లోరాతా
[ఆమె] ఓ కుర్రోడా బందరు లడ్డా బంగరు గుడ్డా పిల్లోడా
చిక్కిన నా గుర్రపునాడా ఊదేనా గోడ
[అతడు] నీ గుట్టే చెంగల్‌‌పట్టు నీ పట్టే గొంగళ్‌ పట్టు
ఆమ్‌ పట్టు తేనెపట్టు నీ గుట్టు
[ఆమె] వీధి యేటి గట్టు కస్తూరి చుక్కాబొట్టు
దమ్ముంటే కొల్లగొట్టు దణ్ణంపెట్టు
[అతడు] నీ చొక్కా నేనే కట్టా నామస్కా నీకే కొట్టా
ఛీపో చిన్నారి పిట్టా నీతో గుడ్డే పెట్టా
నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . . రారా||

చరణం 2

ఓ రాకాసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే
పంపిస్తా ఉత్తర కాశి వారణాశి
[ఆమె] ఓ రబ్బాయి పీచు మీఠాయి భామల చేయి
చురుకోయి పోవోయి చాలుబడాయి దౌడేతీయి
[అతడు] ఎత్తైన గాసంగంతై ఒంటరిగా టర్కేపగబై
ఆ రెండూ నీలో ఉన్నయ్‌ నువ్వే చెన్నై
[ఆమె] ఇది నీలో గోలజాడ నీకళ్ళకు కమ్మని బాడ
మధురైలో మల్లెలవాన లేనా లేనా
[అతడు] అందాల ఆలుపూరి దిల్లుంటే రావేపోరి
గిల్లేస్తా నీలో చోరి హోరాహోరి
[ఆమె] నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . .రారా||

కొత్త పెళ్ళికూతురా

పల్లవి

కొత్త పెళ్ళికూతురా రా రా నీ కుడికాలు ముందు మోపి రా రా
గణపతి కులసతి రా రా నువు కోరుకున్న కోవెలకు రా రా ||కొత్త||

చరణం 1

కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు చెలిమికి మాగాణి నువు మెట్టినిల్లు ||2||
ధనమున్నది బలమున్నది నీ ఇంటా ||2||
మనసున్నది మమతున్నది మా ఇంట ||కొత్త||

చరణం 2

పై మొరుగులు పైడి నగలు లేవు ఇక్కడ
పంతాలు సాధింపులు రావు ఇక్కడ ||2||
నిండు మనసు చిరునగవు పండునిక్కడ ||2||
ఆ పండు వెన్నెలందు దినం పండుగిక్కడ ||కొత్త||

చరణం 3

కన్నతల్లి కన్నమిన్న మీ అత్తగారు కనిపించే దైవము చేకొన్న వాడు ||2||
కలలన్నీ నిజమౌ నీ కాపురానా ||2||
కలకాలం వెలుగు నీ ఇంటి దీపము ||కొత్త||

కొండమ్మో బంగారపు

పల్లవి

కొండమ్మో బంగారపు కొండమ్మా ||2||
పిలిచినప్పుడు పల్కరు లేవే అంతు లేని అల్కలు లేవే
ఆడవాళ్లు అంతా ఇంతేలేవే, ఓ రంగుల బొమ్మా ||కొండమ్మో||
మారయ్యె ఓ టక్కుటమారయ్యా ||2||
పెళ్లీ పెళ్లీ అంటారయ్యా బేరాలకు దిగుతారయ్యా
మగవాళ్లు అంతా ఇంతేనయ్యా మాట్లాడకయ్యా ||మారయ్యో||

చరణం 1

కట్నం నేరుగ బేరం చేసిన వాదన కళ్లారా చూసిన వాదన
బ్రహ్మదేవుడే రాసుంచాడు అమ్మా నాన్న ఔనన్నారు
కిక్కురుమనక తల ఊపాను కదమ్మా, తప్పేమిటమ్మా ||మారయ్యో||

చరణం 2

మాటలు చూస్తే కోటలు దాటును జోరుగా
సొరకాయలు బహు కోస్తారుగా
అందంతోటి పనిలేదయ్యా ఆడది అయితే చాలు కదయ్యా
పైసా పడితే పల్టీకొడతారు కదయ్యా, మిమ్మెరుగుదుమయ్యా ||మారయ్యా||

చరణం 3

పెళ్లి పెత్తనం పెద్దల చేతిల్లోనిది మన బడాయి చెల్లని చోటది
ప్రేమించడమే నా వంతు ఇక పిల్లల కనటం నీ వంతు
లోకంలో జరిగేదే ఈ తంతు ఇది నీకు తెలుసు ||కొండమ్మో||

చరణం 4

పరులు చెప్పినట్లు సెయ్యని బొమ్మలా ఆహాహా భలే దద్దమ్మలా
పప్పు దప్పళం కారం చెట్నీ మీ తప్పు ఒప్పుకున్నారండీ
ఇప్పటికైనా కోతలు ఆపాలయ్యా ||కొండమ్మో|| ||మారయ్యో||

పట్టూ పట్టు పరువాల పట్టు

పల్లవి

[ఆమె] పట్టూ పట్టు పరువాల పట్టు కట్టూకట్టు సొగసైన కట్టు
ఒట్టూ ఒట్టూ ఎదపైన ఒట్టూ చుట్టూ చుట్టూ చీరల్లే చుట్టు
సుందరుడా నిను వలచితిరా చెలి పిలిచిన బిగువటరా
చేకొనరా చిరు చిలకనురా నను పలుచన చేయకురా ||పట్టు||

చరణం 1

[ఆమె] ఎదే నదై తరించదా నీమాటలు వింటే
రతి మతి చలించరా నీరూపం కంటే
ఒంపు సొంపు అంటించుకుంటా ముద్దు ముచ్చటేపంచుకుంటా
తనువై నిన్ను పెనవేసుకుంటా నాలో నిన్ను దాచేసుకుంటా ||2||
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా

చరణం 2

[ఆమె] అనుక్షణం తపించరా నిను చూడని కళ్ళు
ప్రతిక్షణం భరించెనా వసివాడిన వళ్ళు
మనసే నిన్నుకోరింది గనుక మత్తే హత్తుకొమ్మంది గనుక
ముద్దే నన్ను మురిపించి ముత్యం నీవై వేచి ఉంటానుసత్యం ||2||
విరహపు సొద వినలేవా దేవా సొగసరి సొగసులు నీవే నీవే రావాసుందరుడా

రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా

పల్లవి

[అతడు] రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా - 2
రాధమ్మా పాలేతెలుపన్నా నీళ్ళేనలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపికోపాలా మూగకళ్ళ తేనేదీపాలా
గంగొళి సందులో గజ్జెల గోల బెంగాలి చిందులో మిర్చిమషాల
అరెవేడేక్కి ఉన్నది వెన్నెల వాల మేడెక్కి దిగుదురా మేఘమాల ||రామ్మా||

చరణం 1

[అతడు] గోపెమ్మా గువ్వాలే గూడు కాకెమ్మో
[ఆమె] కృష్ణయ్యో పూవ్వే నాదే పూచే నీదయ్యో
[అతడు] దొంగలించుకున్న సొత్తు గోవింద
[ఆమె] ఆవలించ కుంటె నిద్దరౌతుందా
[అతడు] ఉట్టికొట్టే వేళ రైకమ్మో చట్టీ దాచిపెట్టూ కోకమ్మో
[ఆమె] కృష్ణమురారీ వాయిస్తావో చలికోలాటమేదో ఆడిస్తావో

చరణం 2

[అతడు] ఓలమ్మో చోళిలోన షోకుగోలమ్మో
[ఆమె] ఓయమ్మో కాళిలేక ఈలమ్మో
[అతడు] వేణువంటే వెర్రిగాలి పాటలే
[ఆమె] అది వెన్నదోచుకున్న మిన్ను పాటలే
[అతడు] జట్టేకడితే జంట రావమ్మో పట్టువిడుపు మేలమ్మో
[ఆమె] ప్రేమాడే కృష్ణుడు కన్నుకొట్టాల?
పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా ||రామ్మా||

గో గో గో గోపాల గోలేదో చెయ్యాల

పల్లవి

గో గో గోగో లబల బలబలబ ||4|| హొయ్
[అతడు] గో గో గో గోపాల గోలేదో చెయ్యాల
జజజ సరోజ జాలీసాంగ్ పాడాల
జల్సాకి లేదంట వేళాపాళా
ఆవో ఖుషీ ఖుషీగా మజా మజాగా నిషా జమాయిద్దాం
ఆవో తమా తమాకం ముకాబ్‌లానే మజా మిలాయిద్దాం ఓ . . . ||లబ||

చరణం 1

[అతడు] పిల్లా చిగురుపట్టు పోతంపాలు పట్టు చేస్తాం
ఆరంగేట్రం కం కం కం
[ఆమె] బెరదాం పెట్టేయ్ ముందు నిగ్గుతీసి చదివెయ్ మన్నాట్ హిస్టియా
[అతడు] జరా ఆట పాటలేని లైఫ్ యమా బోరని
తెలుసా మైడియర్
[ఆమె] సరే గురూ సపోర్టుగా వస్తాలే
[అతడు] గెటప్స్‌తో సెటప్స్ మార్చే చాల్లే హొయ్‌రే ||ఆవో||

చరణం 2

[ఆమె] నెమీ స్వేచ్చకు నెమీ ఈర్షపై స్టెఫీ కిక్కులు ఎన్నెన్నో
[అతడు] మొదలైతే ఆటీన్‌ స్వీటిమ్మంది రోదించేయ్ పిల్లా జోర్ జోర్
[ఆమె] ఆశుంది కళ్ళు కచ్చిపుచ్చినా ఓహొఅనదా వన్స్ మోర్
[అతడు] సురాంగిణి చమక్కు చేసేద్దామా
[ఆమె] వితంతుకి రొమాన్స్ నేర్పేద్దామా రామ్మా ||ఆవో||

వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట

పల్లవి

[ఆమె] వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
[అతడు] నచ్చావే పాలపిట్ట రెచ్చావే కోడిపిట్ట
ఈ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నె గురిపెట్టా
నీగుట్టు మత్తు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టచెమ్మాటహేయ్
[ఆమె] వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూలబుట్ట
నా పుట్టుమచ్చ మోగేటట్టు నువ్వే ముద్దెట్ట
నా చుట్టు కొలత చిక్కేటట్టు నువ్వే నలిపెట్టు
మోరపెట్టిందమ్మి లాలూపట్టా ||నచ్చావే||
[అతడు] చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఏందమ్మో ఎడ్డం అంటే తెడ్డం అంటావు
[ఆమె] కాయిస్తే ఛీ అంటావు పండిస్తే ఫో అంటావు
ఏందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
[అతడు] సొంపుల తొనలు ఒలుచుకుంటా
[ఆమె] ఒంటిని తడిపి జడుసుకుంటా
[అతడు] ఔనంటే బాదం పిస్తా కొనితెస్తాలే బాలా
[ఆమె] అందాలే రేపటికిస్తా పైపైకొస్తావేళా
[అతడు] అందాకా చూస్తూఉండాలా ||నచ్చావే||
పొద్దున్నే పూజంటావు మధ్యానం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతుకుపోతావు
[అతడు] సోకంతా తరిస్తావు నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెళ్ళకముందే గడబిడ చేస్తావు
[అతడు] చిల్లర పనులు మానుకుంటూ
[ఆమె] జల్లెడ పడితే వల్లరంట
[అతడు] నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ
[ఆమె] నీతోనే చొరవే చూసిఅయ్యోనయ్యో దాసి
[అతడు] పట్టాగా నిన్నే ఎరవేసి ||నచ్చావే||

గగనసీమలదిరే మాయింట విజయపతాకెగిరే

పల్లవి

గగనసీమలదిరే మాయింట విజయపతాకెగిరే
ఉత్సాహాలే ఉప్పొంగంగా, ||మె||
ఉల్లాసంగా చేయంగా సంబరంగా ఒక పండగజరిపి ఆ అంబరమందుకుంటాం ||గగ||

చరణం 1

[ఆమె] కడుపులో నెలలుగా పెరిగిన సంతానం, కనులలో
అలలుగా కరిగితే ఎం లాభం
[అతడు] నిదురలో జారిన దీపికలు యిలా ఎదురైతే చాలుకదా
[ఆమె] పొలంలో నిన్నటి నారులిలా క్షణంలో పైరుగా మారందా
[అతడు] యిదే సంక్రాంతిగా యదే చిందేయగా, చూడే మనవాడే
యింతింతై అపుడే ఎంతై పోయాడే ||గగ||

చరణం 2

[అతడు] పిలిస్తే గులామై పలకదురా ఏ గమ్యం వలేస్తే చులాగ్గా
పడదురా ఏ లక్ష్యం శ్రమించే అలసట ఆనందం అదిచ్చే బహుమతి అపురూపం
[అతడు] అలల్లో ఎగిసిన ఆవేశం తలాంచి ఒదగదు ఏనిమిషం
[ఆమె] శిరులు కొనలేనిదీ సుళువుగా రానిదీ, ఇదిగో ఆ విజయం
మన ఇంట్లో నవ్వుల నాట్యం చేసింది ||గగ||

మీ ప్రేమకోరే చిన్నారులం

పల్లవి

మీ ప్రేమకోరే చిన్నారులం, మీ పడిని ఆడే చందమామలం - 2
గోరుముద్దలెరుగనీ బాల కృష్ణులం
బాధపైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మానాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా ||మీ||

చరణం 1

కమ్మగా మా అమ్మచేతితో ఏ పూట తింటాము ఏడాదిలో
చక్కగా మా నాన్న పక్కగా సరదాగ తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెడతారు రాత్రికి ఎపుడో వస్తారు
మరిమరి అడిగినా కధలు చెప్పరూ మేమేం చెప్పినా మనసుపెట్టరూ
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ, ఏమిచెయ్యాలో మాకు దిక్కుతోచదూ ||ఆలో|| ||మీ||

చరణం 2

పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం
పువ్వులం మీ ఇంటి నవ్వులం నీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం
కనిపించే మీరే దేవుళ్ళు కనిపించే శివుడూ పార్వతులూ
లోకం బూచికి మా గుండె వణికితే మాకు ధైర్యమిచ్చేది మీలాలింపే
అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయీ, అనాధలను చేయకండి పసిపిల్లలనీ ||ఆలో|| ||మీ||

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయికధా

పల్లవి

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ సాయి ప్రేమ సుధా - 2
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ - 2 ||సిరు||

చరణం 1

షిరిడీ గ్రామంలో, ఒక బాలుని రూపంలో
వేపచెట్టుక్రిందా, వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు
పగలూరేయీ ధ్యానం, పరమాత్మునిలో లీనం - 2
ఆనందమే ఆహారం, చేదు చెట్టునీడయే గురుపీఠం
ఎండకు వానకు కృంగకు, ఈ చెట్టు క్రిందనే ఉండకూ
సాయీ ... సాయిరా మశీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ బాబా బొధల నిలయమనోయి ||సిరు||

చరణం 2

ఖురాను బైబిలు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే, ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసి నీటి దీపములను వెలిగించే
పచ్చికుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండీభణమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
కప్పకు పాముకు స్నేహం కలిపే, తల్లి భాషకు అర్ధం తెలిపే
ఆర్తుల రోగాలను హరియించే, భక్తుల బాధలు తాను భరించే
ప్రేమా సహనం రెండు వైపుల ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికే
సాయిరాం సాయిరాం సాయిరాం - 4
నీదని నాదని అనుకోవద్దని ధునిలో ఊది విభూదిగనియిచ్చే
భక్తి వెల్లువలు జయజయఘోషలు కావడి ఉత్సవమై సాగగా
కక్కడ హారతులను అందుకోని కలిపాపాలను కడుగగా
సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి
తృటిలోన పగులగా పరిపూర్ణుడై గురుపౌర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర శేవాలంగన చేసి
దేహము విడిచెను సాయీ, సమాధి అయ్యెను సాయి
సాయిరాం సాయిరాం సాయిరాం -5
అఖిలాండకోటి బ్రహ్మండ నాయక శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్‌ ...

ప్రేమ అనే పరీక్షరాసి వేచివున్నా విధ్యార్ధిని

పల్లవి

[అతడు]ప్రేమ అనే పరీక్షరాసి వేచివున్నా విధ్యార్ధిని ||2|| ||ప్రేమ||
నీ మనసు పలకపైన నాసంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు నాకనుల నమ్మలేదు
[ఆమె] నన్ను నమ్ము నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం
డోలీ డోలీ డోలీ డోలీ ||4||

చరణం 1

[అతడు] ఆ... ఈ చేతికి గాజులు నేనేకదా
నేడు గాజులు తొడిగే రోజేకదా
[ఆమె] గాజులు తొడిగితే సుఖముందిలే
ఆ సుఖమే మళ్లిమళ్లి మది కోరిందిలే
[అతడు] ఇవి చెక్కళ్లా పూల పరవళ్లా
[ఆమె] ఈ చెక్కిలిపై నీ ఆనవాలా
[అతడు] అహ నిన్నటిదాకా నేనొక హల్లుని
నువ్వొచ్చాక అక్షరమైతిని ||ప్రేమ||

చరణం 2

[ఆమె] నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందిన ముఖం ముఖం
[అతడు] మనసెందుకు చేసెను తపంతపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
[ఆమె] అలుపెరుగదులే ఏ ప్రేమలోనా
[అతడు] అల లాగవులే నీలిసంద్రాన
[ఆమె] ఇది జన్మజన్మలకు వీడని బంధం
విరహానికైన దొరకని బంధం ||ప్రేమ||

సినీతార వచ్చిందోయ్ స్వాగతాలు చెప్పండోయ్

పల్లవి

[అతడు] శంభో శంభో సాంబసదా శివ చంద్ర కళాధర సర్వలోకేశ్వరా
నీదయ మాపై చూపరా ఈశ్వరా
[అతడు] ఏయ సినీతార వచ్చిందోయ్ స్వాగతాలు చెప్పండోయ్
సాక్షాత్తు చందమామ చేతికొచ్చిందోయ్
[ఆమె]స్టైలు చూసి మెచ్చేసా పాటవిని వచ్చేసా
రూటు మాట పక్కనెట్టి ఆటకొచ్చెసా
[అతడు] రావమ్మో బుల్లెమ్మో నువ్వు ఆడేది ఎవ్వరితో తెలుసుకోమ్మో
[ఆమె] అబ్బాయో అబ్బాయో నేను తమిళ హీరోలతో ఆడినమ్మాయి
[అతడు] శివకాశి ఆటంటే అదిరిపోవాలా నేను చిందేస్తే శివుడైన ఈలకొట్టాలా
[ఆమె] నేను స్టెప్పేస్తే కుర్రకారు గోలపెట్టాలా

నేను కనుసైగ చేసానో వేడిపుట్టాలా ||సినీతార వచ్చిందోయ్||


చరణం 1


[అతడు] మనిషన్నాక మనసుండాలి ఆదుకునే గుణముండాలి
[ఆమె] నీలా అంత ఆలోచిస్తే లోకమిలా ఎందుకుంటది
[అతడు] అరె కాస్టిఫ్యాన్ కంటె విలువైనది మాగుర్తు పేదొల్లకు ప్రియమైనది
[ఆమె] మోడ్రన్ ఫ్రిజ్‌లు మోటార కంటె ఈ కుండలో వాటర్ ఎంతో మిన్న
[అతడు] నాకెందుకు నీతో గొడవ
[ఆమె] అయితే గురువా ఇస్తా చొరవా
[అతడు] అభిమాన తారవు నీవేనంట మా మనసుల్ని ముద్దుగా గెలిచావంట
[ఆమె] మాటలలో మాయ చేసి మాస్ కుర్రోడ
కొత్తస్టెప్లతో కట్టేసావు నన్ను బుల్లోడు ||సినీతార వచ్చిందోయ్||


చరణం 2


[అతడు] కృష్ణాజిల్లా, ఖమ్మంజిల్లా, ఏజిల్లా ముద్దుబిడ్డవో
[ఆమె] ఇరవై మూడు జిల్లాల్లోన నన్నెరగని వాళ్ళు లేరెమో
[అతడు] సినిమా స్టార్స్ ఓట్లడిగితే గెలుపన్నది మా సొంతం అవుతుందయ్యో
[అతడు] పేదవాళ్ళ మనసు గెలిచారంటే రేపే సి.యమ్ అవ్వచ్చమ్మో
[ఆమె] నచ్చిందయ్యో నీ అభిమానము
[అతడు] ఇక చెయ్యాలమ్మో మా సావాసములు
[ఆమె] ఎవరైనా మంచికి తలవొంచాలా
నలుదిక్కులు నీపేరు మారుమోగేలా
[అతడు] మాపాటి పేదోల్లకు అండవుతుంది
ఈ గెలుపుతో ప్రతి ఇంటికి వెలుగొస్తుందోయ్ ||సినీతార వచ్చిందోయ్||