Showing posts with label - కునాల్‌. Show all posts
Showing posts with label - కునాల్‌. Show all posts

ప్రేమ అనే పరీక్షరాసి వేచివున్నా విధ్యార్ధిని

పల్లవి

[అతడు]ప్రేమ అనే పరీక్షరాసి వేచివున్నా విధ్యార్ధిని ||2|| ||ప్రేమ||
నీ మనసు పలకపైన నాసంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు నాకనుల నమ్మలేదు
[ఆమె] నన్ను నమ్ము నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం
డోలీ డోలీ డోలీ డోలీ ||4||

చరణం 1

[అతడు] ఆ... ఈ చేతికి గాజులు నేనేకదా
నేడు గాజులు తొడిగే రోజేకదా
[ఆమె] గాజులు తొడిగితే సుఖముందిలే
ఆ సుఖమే మళ్లిమళ్లి మది కోరిందిలే
[అతడు] ఇవి చెక్కళ్లా పూల పరవళ్లా
[ఆమె] ఈ చెక్కిలిపై నీ ఆనవాలా
[అతడు] అహ నిన్నటిదాకా నేనొక హల్లుని
నువ్వొచ్చాక అక్షరమైతిని ||ప్రేమ||

చరణం 2

[ఆమె] నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందిన ముఖం ముఖం
[అతడు] మనసెందుకు చేసెను తపంతపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
[ఆమె] అలుపెరుగదులే ఏ ప్రేమలోనా
[అతడు] అల లాగవులే నీలిసంద్రాన
[ఆమె] ఇది జన్మజన్మలకు వీడని బంధం
విరహానికైన దొరకని బంధం ||ప్రేమ||

మనసుపడి మనసుపడి మన్మధుడే మనసుపడి

పల్లవి

మనసుపడి మనసుపడి మన్మధుడే మనసుపడి ||2||
నీకోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే ||2||
మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి
నీకోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే ||2||
నా గుండెలే ఆటస్ధలముగా ఏ గిరిగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్లికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులుపెట్టి మణికట్టుకు గాజులు తొడిగి
ఈరోజా చేతికి రోజాపువ్వు అందించు ||గోరింట||
నీ వరుడు రేపు వేంచేస్తాడు తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్లి వేదికను నే వెయ్య ఆవరుడు చేయి నీకందియ్య
నీతండ్రి మది ఉయ్యాలలూగ

చరణం 1

ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనాపెదవి మొదలలేదు ||మనసు||
ఆదుకున్న దైవం - ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతో
నా కనులనిండుగా నీరూపం నిను తలచుకొనడమే నాధ్యేయం ||2||
నీ ఆనందమే నాసంతోషం నాప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం ||మనసు||

చరణం 2

కలువ కళ్లకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోనా మొగలిపూలు పేర్చి ||కలువ||
విలువ కట్టలేని మణులు ఎన్నోదాల్చి
హంసలాగ వేదిక కొచ్చే చంద్రబింబ వదనం
మేళతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టెలే పెళ్లికొడుకు ||మేళ||
ఈ పేదహృదయమే దీవించే పూలజల్లే కురియు వర్ధిలు కలకాలం ||మనసు||

రోజా రోజా...

పల్లవి

రోజా రోజా...
రోజా రోజా రోజా రోజా ||6||
నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగివచ్చా
నిను గాలిసోకగా వదలనులే
నెలవంక తాకగా వదలనులే
ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే ||రోజా||

చరణం 1

కన్నులలో కొలువున్నావులే
రాతిరిలో కనులకు కునుకే లేదులే
వలుపగా నన్ను చుట్టుకోగా
నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నారోజా
నీ పేరు నానోట నే చెప్పనా
నాఇంట రోజాలు పూచేనులే
నీజాడ ఒకరోజు లేకున్నచో
నీ చెలియ ఏదంటూ అడిగేనులే
నీరాకే మరుక్షణం తెలుపును వేగమే
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం
ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం
తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా ||రోజా||

చరణం 2

నవ యువతీ నడుమొక గ్రంధము
చదివేనా పలుచని రాత్రిలో మంచులో
దూరాలేలా జవరాలా
బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది
నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం
నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు
నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే
కనులలో జారెడు అందాల జలపాతమా
నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన
నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నారోజా రోజా ||రోజా||

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ

పల్లవి

[అతడు]దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్‌ పడుచులు ఆడప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించినా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేయనా ఈనాడు ||చెలి||
తనజాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా ||తన|| ||దాండియా||

చరణం 1

[అతడు] నిన్ను చూసి నన్ను నేను మరచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగివున్న ఆమాట తెలిసిందా
[ఆమె] నిన్ను చూసి నాలో నేను మురిసి
అసలుమాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
[అతడు] ఓ... కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసి నేను కున నల్లుకుంటా
[ఆమె] ఓ... కళ్లలో నాకాటుక కరిగిపోవునంట
కురులలోనా పువ్వులన్ని వాడిపోవునంట
[అతడు] నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
[ఆమె] ఈమాట మాత్రమే నిజమైతే
నాజన్మే ధన్యం
[అతడు] నాప్రేమ [ఆమె] నీవేలే ||2|| ||దాండియా||

చరణం 2

[ఆమె] ప్రేమని చూపులో వుంది మహత్మ్యం
ప్రేమభాషలో వుంది కవిత్వం
ప్రేమించుటలో వున్నది దైవత్వం దైవత్వం
[అతడు] ప్రేమసృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈలోకం భూలోకం
[ఆమె] ఓ... నామనసు నీలో దాచి ఉంచినాను
ఆ మనసు క్షేమమేనా తెలుసుకొనగ వచ్చాను
[అతడు] ఓ... నీ మనసు పదిలంగా దాచి వుంచినాను
నాకంటే నీమనసే నాపంచప్రాణాలు
[ఆమె] హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
[అతడు] ఈమాట మాత్రమే నిజమైతే నాజన్మే ధన్యం
[ఆమె] నాప్రేమ [అతడు] నీవేలే ||2||
యువతీ యువకుల కలయికకోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియా అను ఒక రాతిరి ||యువతీ||
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించైండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి ||2||

వాలు కనులదానా

పల్లవి

వాలు కనులదానా ||2|| నీ విలువ చెప్పుమైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపుచూసి శిలనుయైతినే ఓ...
ఒక మాటరాక మూగబోతినే

చరణం 1

చెలియా నిన్నే తలచి కనుల జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండాపోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్లంతా పొంగింది
ఆహారం వద్దంది
క్షణక్షణ మీ తలపుతో తనువు చిక్కిపోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకుసాటి ఏది ప్రియతమా
మీటితే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఒలక
అజంతా సిగ్గులు ఒలక చిలకా ||మీటితే||
నిను నేను చేరుకోనా ||వాలు||

చరణం 2

దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపుసొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నాకంట నిల్చింది
గడియ గడియ ఒడిని జరుగు
రసవీణ నీ మేను మీటాలి నామేను
వడివడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్ర మిక్కడున్నది
నిండు ప్రాణమివ్వమన్నది
జక్కన్న కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగ వచ్చిందంట చెలియా ||జక్కన్న||
నీ సొగసు కేదిసాటి ||వాలు||

ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా

పల్లవి

WWW. ప్రేమ.Com connecting to India Calling from మారియా
ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా
ఫ్రూట్‌ చెలియా నాకుదునియా ఈమేలి లవ్‌ లెటర్‌ నీదయ ||ఓ||
సాగరానికి ఫిషింగే ధ్రిల్‌
ప్రేమించడానికి ఇచ్చాడే దిల్‌
దేశం నుంచి విదేశం వీచే ప్రేమామరా

చరణం 1

మౌనమనే ఒకతాళం చెవితో మనసును ముయవద్దు
ప్రేమను జీవితఖైదిని చేసి జైలులో ఉంచొద్దు
హృదయాన్నే చలించి పరిగెత్తినా
మనకుంది నెట్‌ కాప్సిల్‌ వేగంగా నువురా
కంప్యూటర్‌ ప్రేమించే కాలం ఇది
ప్రేమా విత్తులే జాలీగా చల్లి
ప్రేమమయం చెయ్యాలి కోరి ఓ మరియా ||ఓ మారియా||

చరణం 2

అందాలన్ని పట్టికవేసి చూపును ఎంచాల
మనసును మీటి మౌస్‌ను తడితే దొరుకును జూలియట్‌
ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్లుదాం
ఈ లోకాన్ని మైమరచి ఆట్లాడుదాం ||ఏ|| ||ఓ మారియా||