Showing posts with label - అనురాధాహాసన్‌. Show all posts
Showing posts with label - అనురాధాహాసన్‌. Show all posts

లాలీ లాలి అను రాగం సాగుతుంటె

లాలీ లాలి అను రాగం సాగుతుంటె
ఎవరూ నిదురపోరే
చిన్నబోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు
హృదయం కుదుటపడదే
అంత చేదా మరీ వేణుగానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుందా
భారమైన మనసా
ఆ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు
ఉంది కాదా ఈ ఏకాంతవేళ ||లాలీ లాలి||
సమగపా పమపమా గరిగారిసాని
సమగపా పమపమా ||2||
గమదదమ నినిద సరిని సా నిదప
గమదదమ నినిద సరిని సాని దపమగ

చరణం

ఎటో పోయేటి నీలిమేఘం
వర్షం చిలికి వెళ్ళదా
సరిగాగరి గపమగ
ఏదో అంటూంది కోయిల పాట
రాగం ఆలకించదా
సరిగాగరి గదమగ
అన్ని వైపులా మధువనం
పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం
అందజేయదా అమృతం ||లాలీ లాలి||