Showing posts with label - వరుణ్‌ సందేష్‌. Show all posts
Showing posts with label - వరుణ్‌ సందేష్‌. Show all posts

నేననీ నీవనీ వేరుగా లేమనీ

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరే ఒకరైనా
నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాలా స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలరా వేగం
కొత్త బంగారూ లోకం పిలిస్తే

చరణం 1

మొదటిసారి మదిని చేరి
నిదరలేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా... మరో పుట్టుకా...
అనేటట్టుగా ...ఇది నీ మాయేనా... ||నేననీ||

చరణం 2

పదము నాది పరుగు నీది
రధమువై రా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా... నేనే చేరగా...
ఎటూ చూడకా... వెనువెంటే రానా... ||నేననీ||

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా---

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా...
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా ||హరే హరే|| ||నిజంగా||

చరణం 1

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ
నడచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదూ గడచిన కాలం
ఇంతని నమ్మనుగా... ||నిజంగా||

చరణం 2

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా గతాల్నే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
పెదవికి చెంపా తగిలిన చోట
పరవశమేదో తోడౌతుంటే
పగలే అయినా గగనంలోనా
తారలు చేరెనుగా... ||నిజంగా||