Showing posts with label * ఆలాప్. Show all posts
Showing posts with label * ఆలాప్. Show all posts

హేయ్ అందాల చుక్కల లేడీ నాతీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా

పల్లవి

హేయ్ అందాల చుక్కల లేడీ నాతీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగ రైళ్ళో కలిసిందా
శనిదోషం పోగొట్టే తన సుందరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్నం
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని||అందాల||

చరణం 1

హేయ్ ముత్యంలాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడపువ్వు
నిగనిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నా కివ్వు
పువ్వులతోనే పూజిస్తా అణువణువు
అరె సీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుందె జివ్వు
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వు
అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వు
కాలాలన్ని కరిగేలా నీ కౌగిలి వరమివ్వు||ఐ లవ్ యూ|| ||అందాల||

చరణం 2

స్వర్గంలో పెళ్ళిళ్ళు అవుతాయంటా
పెద్దోళ్ళు చెప్పిన మాటే వినవుంటే నీ చెవ్వు
ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిలి వేసి పందిళ్ళు
అందరికింక శుభలేఖలనే పంచివ్వు
రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టొద్దే గడువు
నూరేళ్ళు నిను పరిపాలించే పదవే రాసివ్వు
మొత్తం నీపై పెట్టేశానే నా ఆశల బరువు కట్టే నన్ను
ఎక్కిస్తావని హామి అందివ్వు ||ఐ లవ్ యూ|| ||అందాల||