గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ||2||
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోన కోయిలుంది.. ||గున్నమామిడి||
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
చరణం 1
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపినది ||2||
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల ||గున్నమామిడి||
చరణం 2
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ||2||
రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి ||గున్నమామిడి||
||గున్నమామిడి|| ||2||
Showing posts with label # పిల్లల పాటలు. Show all posts
Showing posts with label # పిల్లల పాటలు. Show all posts
చందురిని మించు అందమొలకించు...
చందురుని మించు అందమొలకించు
ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ
కరగిపోయేనులే
కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే ||2||
చరణం 1
అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల కృంగు
నేటి కధ పాడనా కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి.. కష్టముల కృంగు..
కన్నీటి కధ పాడనా...
కంటిలోపాప ఇంటికే జ్యోతి చెల్లి నా పాణమే
చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసె
మిగిలెనీ శోకమే ||2||
విధియె విడదీసె.. వెతలలో ద్రోసె..
మిగిలెనీ శోకమే... ||చందురుని మించు||
చరణం 2
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింట మనువునే కోరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
కాలమెదురైనా గతులు వేరైనా
మమతలే మాయునా
పెరిగి నీవైనా అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు భువిలో మానవులు
ధూళిలో కలిసినా
అన్నచెల్లెళ్ల జన్మబంధాలే నిత్యమై నిల్చులే
లాలి పాపాయి హాయి పాపాయి
లాలి పాపాయి జోజో లాలి పాపాయి జోజో
ముద్దుపాపాయివే
నిను కన్నవారింట కష్టములనీడ
కరగిపోయేనులే
కరుణతో చూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే
లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే ||2||
చరణం 1
అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కధ పాడనా
కలతలకు లొంగి కష్టముల కృంగు
నేటి కధ పాడనా కన్నీటి కధ పాడనా
కలతలకు లొంగి.. కష్టముల కృంగు..
కన్నీటి కధ పాడనా...
కంటిలోపాప ఇంటికే జ్యోతి చెల్లి నా పాణమే
చెల్లి నా ప్రాణమే
మము విధియె విడదీసె వెతలలో ద్రోసె
మిగిలెనీ శోకమే ||2||
విధియె విడదీసె.. వెతలలో ద్రోసె..
మిగిలెనీ శోకమే... ||చందురుని మించు||
చరణం 2
మనసులను కలుపు మధుర బంధాలు మాసిపోరాదులే
పెరిగి నీవైన మామగారింట మనువునే కోరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
కాలమెదురైనా గతులు వేరైనా
మమతలే మాయునా
పెరిగి నీవైనా అత్తగారింట కోడలిగ చేరుమా
బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా
దివిలో తారకలు భువిలో మానవులు
ధూళిలో కలిసినా
అన్నచెల్లెళ్ల జన్మబంధాలే నిత్యమై నిల్చులే
లాలి పాపాయి హాయి పాపాయి
లాలి పాపాయి జోజో లాలి పాపాయి జోజో
ఓ నాన్న ఓ నాన్నా
ఓ నాన్న ఓ నాన్నా
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓనాన్నా ఓనాన్నా
చరణం 1
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు ||2||
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో ||2||
పరమాన్నం మాకు దాచి వుంచావు ||ఓ నాన్నా||
చరణం 2
పుట్టింది అమ్మకడుపులో నైనా
పాలు పట్టింది నీ చేతిలోన ||2||
ఊగింది ఉయ్యాలలోనైనా ||2||
నేను దాగింది నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన ||ఓ నాన్నా||
చరణం 3
ఉన్ననాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి చాచనన్నావు ||2||
నీ రాచ గుణమే మా మూలధనము ||2||
నీవే మాపాలి దైవము ||ఓ నాన్నా||
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓనాన్నా ఓనాన్నా
చరణం 1
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు ||2||
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో ||2||
పరమాన్నం మాకు దాచి వుంచావు ||ఓ నాన్నా||
చరణం 2
పుట్టింది అమ్మకడుపులో నైనా
పాలు పట్టింది నీ చేతిలోన ||2||
ఊగింది ఉయ్యాలలోనైనా ||2||
నేను దాగింది నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన ||ఓ నాన్నా||
చరణం 3
ఉన్ననాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి చాచనన్నావు ||2||
నీ రాచ గుణమే మా మూలధనము ||2||
నీవే మాపాలి దైవము ||ఓ నాన్నా||
విభాగములు:
- ఎ.యన్.ఆర్,
- కాంచన,
* ఘంటసాల,
* జయదేవ్,
* పి.సుశీల,
# పిల్లల పాటలు,
+ ధర్మదాత,
$ అ - అః
ఇంతింత దీపం
ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు
ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు
మాచిట్టి అబ్బాయి మాకళ్ళ వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు
ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు
మాచిట్టి అబ్బాయి మాకళ్ళ వెలుగు
నారాయణ నారాయణ నక్కతోక
నార్యాయణ నారాయణ నక్కతోక
నా మొగుడు తెచ్చాడు కొత్త కోక
నేనెందుకుంటాను కట్టుకోక
ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక
మా అత్త వుంటుందా మొత్తుకోక
నా మొగుడు తెచ్చాడు కొత్త కోక
నేనెందుకుంటాను కట్టుకోక
ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక
మా అత్త వుంటుందా మొత్తుకోక
బావా! బావా! పన్నీరు!
బావా! బావా! పన్నీరు
బావను పట్టుక తన్నేరు
వీధి వీదీ పూసేరు
వీసెడు గంధం పూసేరు
బావని గుంజకు కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు
పట్టీ మంచం వేసేరు
పారిక గుద్దులు గుద్దేరు
నులకా మంచం వేసేరు
నూరూ గుద్దులు గుద్దేరు
బావను పట్టుక తన్నేరు
వీధి వీదీ పూసేరు
వీసెడు గంధం పూసేరు
బావని గుంజకు కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు
పట్టీ మంచం వేసేరు
పారిక గుద్దులు గుద్దేరు
నులకా మంచం వేసేరు
నూరూ గుద్దులు గుద్దేరు
బాలలం బాలలం
బాలలం బాలలం మేమంతా బాలాలం
కన్న తల్లిదండ్రులకు కదలాడే బొమ్మలం
భరతమాత పెంచుతున్న భావి మావి కొమ్మలం
చదువుకునే దీపాలం సమత నవత రూపాలం
నవ భారత మందిరాన నవ జీవన శిల్పాలం
కన్న తల్లిదండ్రులకు కదలాడే బొమ్మలం
భరతమాత పెంచుతున్న భావి మావి కొమ్మలం
చదువుకునే దీపాలం సమత నవత రూపాలం
నవ భారత మందిరాన నవ జీవన శిల్పాలం
ఏడవకు ఏడవకు
ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారు
నీలాలు కారితే నేచూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళ
ఏడిస్తే నీ కళ్ళ నీలాలు కారు
నీలాలు కారితే నేచూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళ
స్నేహ ధర్మం
అడవి పైగా ఎగిరిపోతూ
అలపు వచ్చిన కొంగ ఒక్కటి
కాకులెన్నో గూళ్ళు కట్టిన
చెట్టు మీదకు చేరుకొన్నది
అతిథి సేవలు చేసి కాకులు
కుశల ప్రశ్నలు వేసె దానిని
అన్నలారా చెఱువులన్నీ
మండుటెండల కెండిపోగా
తిండి తిప్పలు నీరు దొరకక
కాందిశీకుడనైతి నిప్పుడు
మంచి కొలనును చూపి పుణ్యం
కట్టుకొనుడని కొంగ అనగా
కాకులన్నీ దాని వినయం
చూచి ఎంతో మెచ్చుకొన్నవి
నీళ్ళు తరగని ఒక్క కొలనును
చూపి కొంగను ఆదుకొన్నవి
కొలని చేపల కాన్కలిస్తూ
కొంగ కాకుల మెప్పుగొన్నది
ఇట్లు గడిచెను కొంతకాలం
వాని నడుమను పెరిగె స్నేహం
ఒక్కనాడొక వేటగాడా
కొంగ రెక్కను గాయపరచగ
తాను ఉండే చెట్టు మీదికి
ఎట్టులో అది చేరుకొన్నది
కొంగ కోసం చెట్టు నెక్కే
వేటగానిని చూచి కాకులు
కోప తాపాల్ మిన్నుముట్టగ
ఒక్కసారిగ మీద పడ్డవి
వాటి ముక్కుల పోటు దెబ్బల
వీపు తూట్లై వాడు అడలుచు
కుయ్యొ మొఱ్ఱో చస్తి నంటూ
పడుతు లేస్తూ పారిపోయెను
అలపు వచ్చిన కొంగ ఒక్కటి
కాకులెన్నో గూళ్ళు కట్టిన
చెట్టు మీదకు చేరుకొన్నది
అతిథి సేవలు చేసి కాకులు
కుశల ప్రశ్నలు వేసె దానిని
అన్నలారా చెఱువులన్నీ
మండుటెండల కెండిపోగా
తిండి తిప్పలు నీరు దొరకక
కాందిశీకుడనైతి నిప్పుడు
మంచి కొలనును చూపి పుణ్యం
కట్టుకొనుడని కొంగ అనగా
కాకులన్నీ దాని వినయం
చూచి ఎంతో మెచ్చుకొన్నవి
నీళ్ళు తరగని ఒక్క కొలనును
చూపి కొంగను ఆదుకొన్నవి
కొలని చేపల కాన్కలిస్తూ
కొంగ కాకుల మెప్పుగొన్నది
ఇట్లు గడిచెను కొంతకాలం
వాని నడుమను పెరిగె స్నేహం
ఒక్కనాడొక వేటగాడా
కొంగ రెక్కను గాయపరచగ
తాను ఉండే చెట్టు మీదికి
ఎట్టులో అది చేరుకొన్నది
కొంగ కోసం చెట్టు నెక్కే
వేటగానిని చూచి కాకులు
కోప తాపాల్ మిన్నుముట్టగ
ఒక్కసారిగ మీద పడ్డవి
వాటి ముక్కుల పోటు దెబ్బల
వీపు తూట్లై వాడు అడలుచు
కుయ్యొ మొఱ్ఱో చస్తి నంటూ
పడుతు లేస్తూ పారిపోయెను
ఎలుక సాయం
చిక్కిందొక సింహం వలలో
అడలిందా దీన స్థితిలో
ఒక్క ఎలుక ఆ అరపులు విని
వచ్చె దాన్ని కాపాడాలని
ఎలుకని చూచిన ఆ సింహం
వేడుకొంది తానే పాపం
మంచిదానవే ఎలుకమ్మా
పులి అయినా తోడేలైనా
కనిపిస్తే చెప్పు రమ్మనీ
వలను తెంచి విడిపించమనీ
అపుడా మాటలు వింటూనే
నవ్విందా ఎలుక పక పకా
కొరికిందా వలను చకచకా
ఎంత పిచ్చి మారాజు వయా!
నీకు లోకమే తెలియదయా!
ఎదుట ఉన్న దెవరనుకొన్నావ్?
ఎందుకు వచ్చిందనుకొన్నావ్?
ఎంత చిన్న వాళ్ళం అయినా
పళ్ళ బలిమి చూపాలంటే
వలను కొరికి తెంపాలంటే
ఎలుక జాతికే అది సాధ్యం
పులికీ తోడేలు కసాధ్యం
అల్పులమైనా మృగరాజా
మమ్ముకూడా గుర్తించవయ్యా
అని మ్రొక్కిన ఎలుకకు సింహం
ఏమి ఇచ్చితే తీరు ఋణం?
అడలిందా దీన స్థితిలో
ఒక్క ఎలుక ఆ అరపులు విని
వచ్చె దాన్ని కాపాడాలని
ఎలుకని చూచిన ఆ సింహం
వేడుకొంది తానే పాపం
మంచిదానవే ఎలుకమ్మా
పులి అయినా తోడేలైనా
కనిపిస్తే చెప్పు రమ్మనీ
వలను తెంచి విడిపించమనీ
అపుడా మాటలు వింటూనే
నవ్విందా ఎలుక పక పకా
కొరికిందా వలను చకచకా
ఎంత పిచ్చి మారాజు వయా!
నీకు లోకమే తెలియదయా!
ఎదుట ఉన్న దెవరనుకొన్నావ్?
ఎందుకు వచ్చిందనుకొన్నావ్?
ఎంత చిన్న వాళ్ళం అయినా
పళ్ళ బలిమి చూపాలంటే
వలను కొరికి తెంపాలంటే
ఎలుక జాతికే అది సాధ్యం
పులికీ తోడేలు కసాధ్యం
అల్పులమైనా మృగరాజా
మమ్ముకూడా గుర్తించవయ్యా
అని మ్రొక్కిన ఎలుకకు సింహం
ఏమి ఇచ్చితే తీరు ఋణం?
జాతి గర్వం
హంసలన్నీ తెల్లని తెలుపు
కాకులేమో నల్లని నలుపు
వెనుకటి కొక కాకికి హంసకు
పెరిగిపోయి మాటా మాటా
హంస అంది ఈసడింపుగా
మమ్ము ఎందున పోలగలరే
అందమందా?చందమందా
వేగమందా?భొగమందా?
పూసికాసే గొప్ప వనములు
నిండు కొలనులు మాకు నెలవులు
పేడ కుప్పలు పెంటపోగులు
గొడ్ల దొడ్లూ మీకు విడుదులు!
పళ్ళూ మరి తామర తుళ్ళూ
పాలూ తేనే మాకు తిళ్ళు
మీకైతే చచ్చిన ఎలుకలు
కుళ్ళిన మాంసం సంగిళ్ళూ!
కోపం తాపం తోడవగా
బదులు చెప్పె కాకి సూటిగా
ఓసి హంసా మిడిసిపడకే
ఒళ్ళు తెలియక కడకు చెడకే
మీకే శాపం మీ రూపం
మీకే శత్రువు మీ అందం
మీ ఈకల పడకల కోసం
మీ జాతికి పట్టెను నాశం
సంఘ జీవనం మాకు రక్ష
సంఘ సేవయే మాకు దీక్ష
మాజాతికి లేదటే లబ్ది?
తరతరానికి వంశ వృద్ది?
మేము లేని అడవి లేదుగా
మేము లేక ఊరు కాదుగా
కాకులేమో నల్లని నలుపు
వెనుకటి కొక కాకికి హంసకు
పెరిగిపోయి మాటా మాటా
హంస అంది ఈసడింపుగా
మమ్ము ఎందున పోలగలరే
అందమందా?చందమందా
వేగమందా?భొగమందా?
పూసికాసే గొప్ప వనములు
నిండు కొలనులు మాకు నెలవులు
పేడ కుప్పలు పెంటపోగులు
గొడ్ల దొడ్లూ మీకు విడుదులు!
పళ్ళూ మరి తామర తుళ్ళూ
పాలూ తేనే మాకు తిళ్ళు
మీకైతే చచ్చిన ఎలుకలు
కుళ్ళిన మాంసం సంగిళ్ళూ!
కోపం తాపం తోడవగా
బదులు చెప్పె కాకి సూటిగా
ఓసి హంసా మిడిసిపడకే
ఒళ్ళు తెలియక కడకు చెడకే
మీకే శాపం మీ రూపం
మీకే శత్రువు మీ అందం
మీ ఈకల పడకల కోసం
మీ జాతికి పట్టెను నాశం
సంఘ జీవనం మాకు రక్ష
సంఘ సేవయే మాకు దీక్ష
మాజాతికి లేదటే లబ్ది?
తరతరానికి వంశ వృద్ది?
మేము లేని అడవి లేదుగా
మేము లేక ఊరు కాదుగా
తేనే టీగ
దవ్వు దవ్వూ తిరుగు తావు
పువ్వు పువ్వూ వెతుకుతావు
బొట్టు బొట్టూ కూర్చుతావు
తేనె పట్టున నింపుతావు
మేము తింటే ఓర్చుతావు
ఓర్పు నేర్పులు నేర్పుతావు
మంచిదానవె తేనెటీగ
గొప్పదానవె నీవు బాగా
పువ్వు పువ్వూ వెతుకుతావు
బొట్టు బొట్టూ కూర్చుతావు
తేనె పట్టున నింపుతావు
మేము తింటే ఓర్చుతావు
ఓర్పు నేర్పులు నేర్పుతావు
మంచిదానవె తేనెటీగ
గొప్పదానవె నీవు బాగా
ఆవూ అమ్మా
ఆవుపాలు అమ్మపాలు
అమృతమ్మే వానిపాలు
ఆవు చూపు అమ్మ చూపు
కన్న చలువ ఏది చూపు
ఆవు విలువ అమ్మ విలువ
కడలి లోని నిధుల విలువ
ఆవు ఋణము అమ్మ ఋణము
తీర్చలేని జన్మ ఋణము
ఆవు గుణము అమ్మ గుణము
సరిపోలదు దైవగుణము
అమృతమ్మే వానిపాలు
ఆవు చూపు అమ్మ చూపు
కన్న చలువ ఏది చూపు
ఆవు విలువ అమ్మ విలువ
కడలి లోని నిధుల విలువ
ఆవు ఋణము అమ్మ ఋణము
తీర్చలేని జన్మ ఋణము
ఆవు గుణము అమ్మ గుణము
సరిపోలదు దైవగుణము
ఆదర్శం
ఒక దేశం ఒక జాతి
ఒక ధర్మం ఒక బంధం
ఒక లక్ష్యం ఒక ధ్యేయం
ఒక గమ్యం ఒక శ్రేయం
ఒక సంస్కృతి ఒక సాహితి
ఒక భాషా ఒక భావం
ఒక మతమూ ఒక కులమూ
ఒక పథమూ ఒక విధమూ
అదే జనత కాదర్శం
అదే ప్రగతి కాదేశం
ఒక ధర్మం ఒక బంధం
ఒక లక్ష్యం ఒక ధ్యేయం
ఒక గమ్యం ఒక శ్రేయం
ఒక సంస్కృతి ఒక సాహితి
ఒక భాషా ఒక భావం
ఒక మతమూ ఒక కులమూ
ఒక పథమూ ఒక విధమూ
అదే జనత కాదర్శం
అదే ప్రగతి కాదేశం
ఆరు రుచులు
తీపీ తీపీ తియ్యని తీపి
పనసల తొనలూ పట్టుతేనెలూ
మనసుకు పట్టే తియ్యని తీపి
పులుపూ పులుపూ పుల్లని పులుపు
నిమ్మా చింతా దబ్బా రేగూ
పళ్ళకు పట్టే పుల్లని పులుపు
కారం కారం వర్రని కారం
నల్లని మిరియం ఎఱ్ఱని మిరపా
చెవులకు పట్టే వర్రని కారం
వగరూ వగరూ వదలని వగరు
పచ్చిది వక్కా పండని వెలగా
నోటికి పట్టే వదలని వగరు
చేదూ చేదూ గరళపు చేదు
వేపల పూతా కాకర పిందా
గొంతుకు పట్టే గరళపు చేదు
ఉప్పూ ఉప్పూ రుచికే ఉప్పు
సంద్రపు టుప్పూ సైంధవ లవణం
కడుపును పట్టే కారగు ఉప్పు
టీపీ పులుపూ ఉప్పూ కారం
చేదూ వగరూ కలగా పులగం
తగు పాళ్ళల్లో కమ్మని రుచులే
పనసల తొనలూ పట్టుతేనెలూ
మనసుకు పట్టే తియ్యని తీపి
పులుపూ పులుపూ పుల్లని పులుపు
నిమ్మా చింతా దబ్బా రేగూ
పళ్ళకు పట్టే పుల్లని పులుపు
కారం కారం వర్రని కారం
నల్లని మిరియం ఎఱ్ఱని మిరపా
చెవులకు పట్టే వర్రని కారం
వగరూ వగరూ వదలని వగరు
పచ్చిది వక్కా పండని వెలగా
నోటికి పట్టే వదలని వగరు
చేదూ చేదూ గరళపు చేదు
వేపల పూతా కాకర పిందా
గొంతుకు పట్టే గరళపు చేదు
ఉప్పూ ఉప్పూ రుచికే ఉప్పు
సంద్రపు టుప్పూ సైంధవ లవణం
కడుపును పట్టే కారగు ఉప్పు
టీపీ పులుపూ ఉప్పూ కారం
చేదూ వగరూ కలగా పులగం
తగు పాళ్ళల్లో కమ్మని రుచులే
బుద్ద జయంతి
కరుణయే జీవమై దివము నుండి దిగి వచ్చిన రోజు
సేవయే ధర్మమై దీనజనుల నాదుకొన్న రోజు
ప్రేమయే నేస్తమై సాటివారి నాదరించిన రోజు
దీక్షయే శక్తి యై పతిత జనుల పైకెత్తిన రోజు
సహనమే శాంతమై కఠినాత్ముల కరగించిన రోజు
త్యాగమే మూర్తియై బుద్దుడుగా జన్మించిన రోజు
సేవయే ధర్మమై దీనజనుల నాదుకొన్న రోజు
ప్రేమయే నేస్తమై సాటివారి నాదరించిన రోజు
దీక్షయే శక్తి యై పతిత జనుల పైకెత్తిన రోజు
సహనమే శాంతమై కఠినాత్ముల కరగించిన రోజు
త్యాగమే మూర్తియై బుద్దుడుగా జన్మించిన రోజు
నేనే - నేనే
ఇంటికి కావలి కాచే దెవరూ? నేనే నేనే బౌ వౌ వౌ!
మామిడి కొమ్మన పాడే దెవరూ? నేనే నేనే కూ కూ కూ!
దోరపండ్లనే తొలిచేదేవరూ? నేనే నేనే కీర్ కీర్ కీర్!
తెలతెలవారగ లేపే దెవరూ? నేనే నేనే కొక్కొరోకో!
రాత్రిపూట భయపెట్టే దెవరూ? నేనే నేనే హూట్ హూట్ హూట్!
బండికి గిత్తల నిచ్చేదెవరూ? నేనే నేనే అంబా ఆ ఆ!
ఎలుకల పీడను మాపే దెవరూ? నేనే నేనే మ్యావ్ మ్యావ్ మ్యావ్!
వెచ్చని ఉన్నిని ఇచ్చే దెవరూ? నేనే నేనే బే బే బే!
చెఱువును శుభ్రం చేసేదెవరూ? నేనే నేనే క్వాక్ క్వాక్ క్వాక్!
మామిడి కొమ్మన పాడే దెవరూ? నేనే నేనే కూ కూ కూ!
దోరపండ్లనే తొలిచేదేవరూ? నేనే నేనే కీర్ కీర్ కీర్!
తెలతెలవారగ లేపే దెవరూ? నేనే నేనే కొక్కొరోకో!
రాత్రిపూట భయపెట్టే దెవరూ? నేనే నేనే హూట్ హూట్ హూట్!
బండికి గిత్తల నిచ్చేదెవరూ? నేనే నేనే అంబా ఆ ఆ!
ఎలుకల పీడను మాపే దెవరూ? నేనే నేనే మ్యావ్ మ్యావ్ మ్యావ్!
వెచ్చని ఉన్నిని ఇచ్చే దెవరూ? నేనే నేనే బే బే బే!
చెఱువును శుభ్రం చేసేదెవరూ? నేనే నేనే క్వాక్ క్వాక్ క్వాక్!
దసరా
తొమ్మిది రాత్రుల పండుగ బొమ్మల దసరా పండుగ
ఆయుధ పూజలు ఊరూరా అంబకు సేవలు మనసారా
పప్పూ బెల్లం పిల్లలకు వరహా దక్షిణ గురువులకు
జమ్మిని కొట్టుట వేడుక జతలను కట్టుట వాడుక
పందిరిలో హరి కథలు సందడితో ఇక మొదలు
ఎంతో నిండగు పండుగ అంతా కన్నుల పండుగ
ఆయుధ పూజలు ఊరూరా అంబకు సేవలు మనసారా
పప్పూ బెల్లం పిల్లలకు వరహా దక్షిణ గురువులకు
జమ్మిని కొట్టుట వేడుక జతలను కట్టుట వాడుక
పందిరిలో హరి కథలు సందడితో ఇక మొదలు
ఎంతో నిండగు పండుగ అంతా కన్నుల పండుగ
వన విహారం
వెళ్ళావా ఎప్పుడైనా వెళ్ళావా? కొండ దరిని అడవిలోకి వెళ్ళావా?
చూచావా తిరిగి తిరిగి చూచావా? రంగురంగు పిట్టలెన్నొ చూచావా?
ఆడావా పరుగులెత్తి ఆడావా? లేళ్ళూ కుందేళ్ళ తోడ ఆడావా?
పాడావా బిడియపడక పాడావా? పక్షులతో గొంతుకలిపి పాడవా?
తిన్నావా కఱవు తీర తిన్నావా? తియ్యనైన దోరపండ్లు తిన్నావా?
త్రాగావా కడుపునిండ త్రాగావా? చల్లని సెలయేటి నీళ్ళు త్రాగావా?
కోశావా అందినన్ని కోశావా? వింతవింత వన్నెపూలు కోశావా?
నేర్చావా స్వేచ్చ ఏమో నేర్చావా? కలసిమెలసి బ్రతుకు టేమొ నేర్చావా?
చూచావా తిరిగి తిరిగి చూచావా? రంగురంగు పిట్టలెన్నొ చూచావా?
ఆడావా పరుగులెత్తి ఆడావా? లేళ్ళూ కుందేళ్ళ తోడ ఆడావా?
పాడావా బిడియపడక పాడావా? పక్షులతో గొంతుకలిపి పాడవా?
తిన్నావా కఱవు తీర తిన్నావా? తియ్యనైన దోరపండ్లు తిన్నావా?
త్రాగావా కడుపునిండ త్రాగావా? చల్లని సెలయేటి నీళ్ళు త్రాగావా?
కోశావా అందినన్ని కోశావా? వింతవింత వన్నెపూలు కోశావా?
నేర్చావా స్వేచ్చ ఏమో నేర్చావా? కలసిమెలసి బ్రతుకు టేమొ నేర్చావా?
Subscribe to:
Posts (Atom)