Showing posts with label * శ్రేయా ఘోషల్‌. Show all posts
Showing posts with label * శ్రేయా ఘోషల్‌. Show all posts

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది

ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది
నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది
ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా

చరణం 1

నీ లాలిని పాడే లాలన నేనోయ్
జాబిలికై ఆశ పడే బాలను నేను
తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్
చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్
సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ

చరణం 2

నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా
క్షణానికో రూపంలో కనబడుతున్నా
జాడవై నావెంట నిను నడిపించాలోయ్
జానకై జన్మంతా జంటగా నడవాలోయ్
తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై మెరిసేనా
ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా విరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా ||పిల్ల||

చరణం 1

మౌనాల వెనకాల.. వైనాలు తెలిసేలా.. గారంగా పిలిచేనా..
ఝల్లుమంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించనా
చంద్రజాలమై తరంగాల ఒడిలో యేళ్ళన్నీ మరిపించనా
తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయేనా
చందనాలు చిలికేలా ముంగిలిలో నందనాలు విరిసేనా ||అందరాని||

చరణం 2

నవ్వుల్లో హాయి రాగం.. మువ్వల్లో వాయు వేగం.. ఏమైందో ఇంత కాలం..
ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నొ పలికే సరికొత్త రాగాలుగా ఓ...
నింగిదాకా పొంగిపోయి హోరెత్తిపోతున్న గానాభజానా
చెంగుమంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా ||అందరాని||

నువ్వేం మాయ చేశావోగాని

నువ్వేం మాయ చేశావోగాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణీ
మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్య హయ్యారె హయ్యారె హయ్యా
చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
ఎటుపోతోందో ఏమో మరి ||నువ్వేం||

చరణం:1

ఔరా పంచకళ్యాణి పైనా
వస్తాడంట యువరాజు ఔనా
నువ్వేమైన చూశావా మైనా
తెస్తున్నాడా ముత్యాల మేన
హయ్య హయ్యారె హయ్యారె హయ్యా
మొగలి పువ్వంటి మొగుడెవ్వరె
ఓ సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
మేళతాళాల మనువెప్పుడె ||ఔరా||

చరణం:2

కలా నువ్వు ఏ చాటునున్నా
అలా ఎంత కవ్వించకున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా
ఎలాగైనా నిను కలుసుకోనా
హయ్య హయ్యారె హయ్యారె హయ్యా
ఆశపడుతున్న ఈ నా మది
ఓ సయ్య సయ్యారె సయ్యారె సయ్యా
అది తీరేది ఎపుడన్నది ||నువ్వేం||

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష

నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష
బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా! ||నువ్వే||

చరణం: 1

పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు
తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్ని
మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని
నా ముందే నిలిపినావుగా
నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా
నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా! ||నువ్వే||

చరణం: 2

సూర్యునితో పంపుతున్నా
అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్నా
అలుపెరుగని హృదయ లయలని
ఏ చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా! ||నువ్వే||

ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు

పల్లవి

[అతడు] ఏయ్‌ పిల్ల ఏం చేద్దాం చెప్పు
[ఆమె] ఏదో చేసెయ్‌ అది మాత్రం తప్పు
[అతడు] ఏయ్‌ పిల్లా ఏంటమ్మా తప్పు
[ఆమె] ఏయ్‌ అబ్బాయ్‌ అడగద్దు ఆ అప్పు
[అతడు] ఏఏ కన్నేసా కోనేట్లో ఆడేసా అందాలలో చాలీసా
[ఆమె] కోయ్‌ కోయ్‌ అబ్బాయి లేలేత సొరకాయి
బోర్లిస్తా బొప్పాస్కాయి

చరణం 1

[అతడు] ఆ తేనెలలో ప్రేమలీల ఎన్నడో
ఓ ఫ్యామలీగా రాసలీల ఎప్పుడో
[ఆమె] నే పక్కకొస్తే నీకు ఎంత తిక్కరో
నే ముద్దు కోరి సోకితే నీ చక్కిరో
[అతడు] అందాలు మాట్లాడు అమ్మాయి ఒళ్ళంతా
అల్లుకుంటే హాయి కంటే తీపి తుళ్ళింతా
[ఆమె] ఆరాలు తీసేటి అబ్బాయి కళ్ళంతా
బేరానికొస్తాయి అమ్మయి కళ్ళంతా ||ఏయ్‌||

చరణం 2

[ఆమె] నే చాకులాంటి సోకులున్న పిల్లని
నా సోకు కిందపైట చాటు ఉండని
[అతడు] ఏ దక్కకున్న తీరదే ఈ దప్పిక
నువ్వు ఒప్పుకుంటే తప్పులేదే గోపిక
[ఆమె] రేపొచ్చి కనిపించు రెండో కృష్ణయ్యా
ఈలకైనా తీలకైనా వేళ ఉందయ్యా
[అతడు] కోనేటి కెరటాల కోలాటాలమ్మా
నాటికోక కట్టుకోక బెట్టు ఏలమ్మా
[అతడు] ఏయ్‌ పిల్లా ఏం చేద్దాం చెప్పు
[ఆమె] ఏయ్‌ చెప్పు కాఫీ ఓకప్పు
[అతడు] ఏయ్ ‌ఒళ్ళు ఎట్టుందో చెప్పు
[ఆమె] ఎట్టా ఉన్నా ఉడకదులే నీపప్పు ||ఏఏ . . . సొమ్మా||

జన్మ జన్మల వరమీ కలయిక

పల్లవి

[అతడు] జన్మ జన్మల వరమీ కలయిక
పైటకొంగుని వదలను నేనిక
పాల బుగ్గల అల్లరి పిల్లతో
శోభనం భలే వేడుక
[ఆమె] ముందురున్నది ముద్దుల పండగ
తరముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తారా ఇక
నాయకా ఒడే వేదిక
[అతడు] Oh my darling మొనాలిసా ఎక్కిందె ఏదో నిషా
[ఆమె] మెచ్చేసానోయి మనోహరా
నచ్చింది నీ తొందరా ||జన్మ జన్మల||

చరణం 1

[అతడు] మొదటి చూపుతో మురిపించి
మెల్లమెల్లగా తెరదించి
మాయమవ్వకే ననుకవ్వించీ
[ఆమె] మెత్త మెత్తగా ముద్దిచ్చి
మత్తుమత్తుగా ననుగిచ్చి
మంట రేపకోయి మైమరపించి
[అతడు] హఠాత్తుగా వరాలవాన
వర్షించెనా ఎడారిలోన
శృతిమించినా సుఖాల వీణ ఓ ప్రియతమా
[ఆమె] నన్నడగాలా నరోత్తమా
నాసొగసు నీదే సుమా
[అతడు] మెచ్చేశానే మయూరమా
మోహాల తేలించుమా ||జన్మ జన్మల||

చరణం 2

ఎంత వింతదీ గిలిగింత
అణువు అణువునా పులకింత
తనివి తీర్చనా ఎంతోకొంత
[అతడు] తేనె పెదవిలో తొణికింత
తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీతనువంతా
[ఆమె] అదేకదా వివాహబంధం
అనుక్షణం అదో సుగంధం
అందచానా ప్రియా యుగంతం ప్రేమామృతం
[అతడు] Oh my darling మోనాలీసా
అయ్యానే నీబానిస
[ఆమె] మాటలతోనే మహాశయా
గడిపేస్తే ఎట్టాగయ్యా ||జన్మ జన్మల||
[అతడు] జన్మ జన్మల వరమీ కలయిక
[ఆమె] ముందురున్నది ముద్దుల పండగ
Oh my darling మోనాలిసా
[ఆమె] మెచ్చేసానోయ్ మహాశయా
నువ్వేగ నా బాద్‌షా

వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం

పల్లవి

వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
ఓం ధిరి . . . ఓం ధిరి . . . ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం ||ఓంధిరి||
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా . . . నీకోసం నీకోసం నీ . . . కోసం . . .
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడిలోన ఆకు వక్కా సున్నం నీ కోసం . . .

చరణం 1

గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్న పాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాట లేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా, మూగపాటగా ఆగిపోకే రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం . . .

చరణం 2

సిగ్గుకోరికా నెగ్గలేవుగా ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మొయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దురకానా చిగురంటి పెదవులపైనా
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోనే ముద్దులనెన్నో తెచ్చా నీ కోసం . . .

నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్ట్

పల్లవి

నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్ట్
మారిపోవునా సురిరాం సురిరాం సురిరాం సురిరాం
ఆరుబైట కూడినా పడకటింట కూడినా
ఆరునొకటి ఏడుకాక పోవునా
ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చి మారునా కుర్రవయసుల్లో కచ్చతీరునా . . . 2

చరణం 1

ఎడమకన్ను కొట్టినా . . . సురిరాం సురిరాం . . . కుడికన్ను
కొట్టినా . . . సురిరాం సురిరాం . . . కళ్లలోని కోరికే మారునా . . .
విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా వంటలోని ఘాటు మారిపోవునా . . .
వూరే మారినా పూవు మారునా . . . వస్త్రం మారిన . . . వరస మారునా . . .
సెల్లుమారు ఇల్లుమారు పిల్లదాని ఒళ్లుమారు గజ్జెల్లో ఘల్లుమారునా...
నా......జంటప్రేమల్లో జిల్లు మారునా . . .
గజ్జెల్లో ఘల్లు మారునా....జంటప్రేమల్లో జిల్లు మారునా . . .
పాపపా . . . పాపపా . . . పాపపా . . . పాపపా . . .

చరణం 2

తేనెతోటి తుడిచినా నేతితోటి తుడిచినా కోకపిల్ల ఆకలే . . . తీరునా
కీచులాటలాడినా కిస్సులాటలాడినా రాతిరేళ యాతనే తీరునా. . .
అందం యిచ్చినా ఆశతీరునా భాగం పంచినా బాధతీరునా
లక్కుతీరు కిక్కుతీరు పెక్కుమార్లు తిక్కతీరు
ఆటల్లో అలుపుతీరినా గోటిగాయాల్లో నలుపుతీరునా

ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ

పల్లవి

ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ . . .
అంతదాక వచ్చాక అడ్డెందుకూ . . . లోతులోన మునిగాక ఒడ్డెందుకూ . . .
కరుసు పెట్టనప్పుడు సొమ్మెందుకూ సరస మాడనప్పుడు సొగసెందుకూ . . .
గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుంజం
అడు గుడు అడు గుడు గుడు గుడు లంచం ||గుడు||
చెడుగుడు చెడుగుడు గుడు ఛంఛం . . .

చరణం 1

కంటిలోన నలుసు తీయమన్నావు
నలుసు తీసి చంప నలపమన్నావు చెంపగిల్లి ఆగలేవు అన్నావు
పెదవి పండు ముద్దు పిండుకున్నావు
పెదవి నుండి మెడలోకి చేరుకున్నాకా
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా
గుండెలో జారుకుని గుట్టునే గుంజుకుని
అంతలో పుంజుకుని అదునుచూసి అదుపుదాటితే ||గుడు||
జరుగుడు జరుగుడు గుడు కొంచెం ||గుడు||
విరుగుడు విరుగుడు గుడు మంచం

చరణం 2

కాలిలోని ముల్లు తియ్యమన్నావు
ముల్లుతీసి మువ్వ ముట్టమన్నావు
మువ్వముట్టి ముందుకెళ్లి పోయావు చీర అంచుపట్టి పైకి పాకావు
చీరలోని మూరలోని చిక్కుకున్నాక
దారి తెన్ను ఏదినాకు చిక్కకున్నాక
చెంగులే దులుపుకుని నిన్ను చేపట్టుకుని
చీరలా చుట్టుకుని చివరి వరకు కధలు నడిపితే . . . ||గుడు||
పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం ||గుడు||
తరికిట తరికిట కిట కిట తధ్యం . . . ||ఇంత||

నువ్వేనా నా నువ్వేనా

పల్లవి

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చే సుప్రభాతవేళ
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా ఆనందమేనా

చరణం 1

మేఘమల్లే సాగివచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి
మెరిసి మాయమౌతావు
కలలేనా.. కన్నీరేనా..
తేనెటీగ లాగ కుట్టి తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన
దారమల్లే దాగుతావు నేనేనా నీ రూపేనా

చరణం 2

కోయిలల్లే వచ్చి ఏదో
కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం.. ఇది ఏ తాళం..
మసక ఎన్నెలల్లే నీవు ఇసుక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలింత
గుసగుసల్లే మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా

పల్లవి

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయి
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయి
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివాన లాలి పాడేస్తారా

చరణం 1

పిల్లపాపలా వాన బుల్లిపడవలా వాన
చదువు బాధలే తీర్చి సెలవలిచ్చిన వాన
గాలివాన కబాఢ్డీ వేడి వేడి పకోడి
ఈడుజోడి ఢీ ఢీ ఢీ తోడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకుమనే ఎన్నిరంగులో
ఇంతి సొగసులే తడసినవి నీటి కొంగులో
శ్రావణమాసాలా జలతరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం

చరణం 2

కోరివచ్చినా ఈ వాన
గోరు వెచ్చెనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే
ముద్దులాటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు
గాలివానలా పందిళ్ళు
కౌగిలింతలా పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికిపడే ఎవరికన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురుచూపులో
నల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహంలా వలపు పందెం

పూలఘుమఘుమ చేరని ఓ మూల

పల్లవి

[ఆమె] పూలఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా
తేనె మదురిమ చేదని ఆ మూతి ముడిపేంటలా
ప్రేమంటె పామని బెదరాల దీమాగా తిరగర మగరాయడ
బామంటె చూడని వ్రతమేలా పంతాలె చాలురా ప్రవరాక్షుడా
మారనే మారవా మారనీ మానవా మౌనివా
మానవా తెరుచుకో మానవా
||పూలగుమగుమ||

చరణం 1

[ఆమె] చేరితే గతి ఆధారమై బంధమై అళ్ళుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమై అందమే అందుకో
మునిపంటితో నాపెదవిపై మల్లెలే తుంచుకో
నావాలు జడ చుట్టుకొని మొగలి రేఖా నడుము నడిపించుకో
వయసులో పరవసం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో ||పూలగుమగుమ||

చరణం 2

[ఆమె] ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాంగనై
జతలీలలో అలసి మంటెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలివుండిపోనీ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయినీ
తాపమే తుమ్మెదై తీయనీ తేనని
||పూలగుమగుమ||

అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి

పల్లవి

[అతడు] అవ్యాయి తువ్వాయి అల్లాడె అమ్మాయి
[ఆమె] అవ్వాయి తువ్వాయి కిల్లాడి అబ్బాయి
[అతడు] దాగీ దాగని సోకే బరువయి ఆగీ ఆగని ఈడే ఇరుకయి
[ఆమె] తాకీతాకని చూపే చినుకయి దూకీదూకనీ ఊపే వరదయి
[అతడు] ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యోరామ అసలిదేంలడాయి ||అవ్వాయి||

చరణం 1

[ఆమె] పాలోసి పెంచా ప్రతి భంగిమ పోగేసి ఉంచా పురుషోత్తమా
కమాండం తెగిస్తే సమస్తం తమర్ధేగా
[అతడు] కంగారు పెట్టే సింగారమా బంగారం అంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదా పడతావా
[ఆమె] ఎన్నాళ్ళీ గాలిలో తిరుగుడు ఇలా నా ఇళ్ళో స్థిరపడే దారిచూడు
[అతడు] బాలామణి సరే కానీ మరి పద చెల్లిస్తా ప్రతీ బకాయి ||అవ్వాయి||

చరణం 2

[అతడు] తెగరెచ్చి పోకే పసి పిచ్చుక నన్నపలేదే నీ ఓపిక పిడుగై పడనా వ్రతమే చెడినాక
[ఆమె] చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుఖమార మిస్తా సుఖపెట్టగా ఒడిలో పడనా వరమే అడిగాక
[అతడు] కవ్వింత లెందుకే బాలిక మరి పువ్వంటి సున్నితం కందిపోగా
[ఆమె] చిచ్చవుతాను నువ్వే గిత్తవుతావు ఎటోతేలందే ఇదేంబడాయి ||అవ్వాయి||

జాబిల్లి రావే వెండి జాబిల్లి

పల్లవి

[అతడు]జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మా జాబిల్లి
[ఆమె]నిన్నే కోరిందీ వెండి జాబిల్లి నీతోడై ఉంటానంది మనసిచ్చి
[అతడు]మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నాముందే ఉంటూ నమనసేదోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి ||నిన్నే కోరింది||

చరణం 1

[అతడు]దూర దూర ఈడు తోడు లేక నేడు ఉసురుసురన్నది చూడు కోరిందే నీతోడు...
[ఆమె]కొంటె కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు రేగదామరి జోడు ఆగదే ఎద తూరు
[అతడు]నా వెంటె చెలి నీవుంటే ఇంకేవి కోరనులే
[ఆమె]అవునన్నా నువు కాదన్నా నేనీలో సగమేలే
[అతడు]ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే ||నిన్నే కోరింది||

చరణం 2

[ఆమె]వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు చూసి నీలో నేను చేరువయ్యా నీకు
[అతడు]పాలరాతి బొమ్మపైడి పూల బొమ్మ దేవతంటే ఎవరో చూశాను నీలో నేడు
[ఆమె]బతుకంతా నీ జతగా ఉండే వరమే ఇచ్చావే
[అతడు]బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే
[ఆమె]నీ ఒడిలో గొప్పల్లె కలకాలం ఉంటాలె ||జాబిల్లిరావె||

కోపమా నాపైన

పల్లవి

[ఆమె] కోపమా నాపైన ఆపవా ఇకనైనా అంతగా
బుసకొడుతుంటే నేను తాళగలనా
[అతడు] చాలులే నీ నటన సాగదే ఇటుపైన ఎంతగా నస
పెడుతున్నా లొంగిపోనె లలనా
[ఆమె] దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైనా
[అతడు] మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ...
ఓ... ఓ... ఓ...
[ఆమె] కస్సుమని కారంగా కసిరినది చాలింక ఉరుము
వెనుక చినుకు తడిక కరగవా కనికారంగా
[అతడు] కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా కనులు
వెనకే కరిగిపోయే కలవి గనుకా
[ఆమె] నను గొడుగై కాచే నువ్వు పిడుగులు కురిపిస్తావా
[అతడు] నువ్వు గొడుగును ఎగరేస్తావే జడివానా హో...
ఓ... ఓ... ఓ... ||కోపమా||

చరణం 1

[ఆమె] తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా మనసులోని
చెలియబొమ్మ చెరిపినా చెరగదు గనుక
[అతడు] సులువుగా నీలాగా మరిచిపోలేదింకా మనసు విలువ
నాకు బాగా తెలుసు గనుకా
[ఆమె] ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా
[అతడు] వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో...
ఓ... ఓ... ఓ... ||కోపమా||