Showing posts with label * శంకర్ మహాదేవన్. Show all posts
Showing posts with label * శంకర్ మహాదేవన్. Show all posts

నిద్దురపోతున్న రాతిరినడిగా...

చెలియా నీవైపే వస్తున్నా...
కంటపడవా ఇకనైనా... ఎక్కడున్నా..

పల్లవి

నిద్దురపోతున్న రాతిరినడిగా...
గూటికిచేరిన గువ్వలనడిగా...
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలిజాడ చెప్పరేమనీ...
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ||చల్లగాలి||

చరణం 1

ఓ... అసలే ఒంటరితనం.. అటుపై నిరీక్షణం..
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం...
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ
నిజం చెప్పవమ్మా ||అందరినీ|| ||నిద్దురపోతున్న||

చరణం 2

ఓ... నువ్వు నా ప్రాణం అని.. విన్ననించు ఈ పాటని..
నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నాగానీ...
కదిలించలేద కాస్త కూడా నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే ||అందరినీ|| ||నిద్దరపోతున్న||

అల్లా తత్వమున అల్లారు ముద్దుగా...

అల్లా... శ్రీరామా...
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడూ
కల్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనందనందనుడు అమృతరసచందనుడు
రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నానమే దాటించు భవసాగరం ||2||
ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అణగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి
తాగరా... తాగరా శ్రీరామనామామృతం...
ఆ నామమే దాటించు భవసాగరం
పాపాప మపనీని మపనీప
మపసనిప మాపామా శ్రీరామా..
పాపాప మపనీని పనిసాస రిరిసనిప
మాపాని మపమా కోదండరామ...
మపనిసరిసానీ పానీమాపా సీతారామా..
మపనిసరిసారీ సరిమరిస నిపమా ఆనందరామా..
మా... మా... రిమరిమరిసరిమా
రా... మా... జయ... రా... మా...
సరిమా రామా... సపమా రామా... పావనరామా..
ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొల్పెడివేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పుదేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసానుదాసులకు కైమోడ్పు..
తాగరా... తాగరా శ్రీరామనామామృతం...
ఆ నామమే దాటించు భవసాగరం

ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాశ్య సంకెళ్ళు తెంచిందిరా

ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాశ్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుదిశ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వతంత్ర పోరాట తొలి పిలుపురా
మనవెలలేని త్యాగాల ఘనచరితరా
తన తగుబాలతో పోరు నెర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసినా అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 1

శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతం రా.. భారతం
ధర్మానికి సత్యానికి జన్మ భూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా.. భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
శికాలలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని తీరాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలురా...
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 2

పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయిక కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే.. సలామురా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్యమే ఒక్కటే.. సవాలురా
మానవుడే మావేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొకమాటరా
నువ్వు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావుకెదురైన భయపడదు మా గుండెరా
శతృవుడెవడైన తలవంచని ఈ జెండారా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

హరే రామ హరే రామ రామ రామ హరే హరే...

గోవింద బోలోహరి గోపాల బోలో ||2||
రాధా రమణ హరి గోపాల బోలో ||2||
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రాముడ్నైనా కృష్ణుడ్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంఘం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

చరణం 1

చార్మినార్ చాటు కధకీ తెలియదీ నిత్య కలహం
భాగ్‌మతి ప్రేమ స్మృతికీ బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా
పద పద పద పదమని..
హరే రామ హరే కృష్ణా జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేమిటో గుర్తిద్దాం మిత్రమా

చరణం 2

ఓం సహనాభవతు సహనోభునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినామధీతమస్తు మావిద్విషావహై
పసిడిపతకాల హారం కాదురా విజయతీరం
ఆటనే మాటకర్ధం నిను నువే గెలుచు యుద్ధం
శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించరా
పద పద పద పదమని..

ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే

గోగులు పూచే గోవులు కాచే ఓ లచ్చ గుమ్మాడీ ||2||
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చ గుమ్మాడీ
పుత్తడి వెలుగులు ఊ హుహు హూహూ.. ఓ లచ్చ గుమ్మాడీ...
ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే వుందీ
చెలీ చూడు నా చేవ చుట్టేసేందుకే వుందీ

చరణం 1

నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నేను గెలిచేందుకే నీకు పొగరున్నదీ
ఒక్కటయ్యేందుకే ఇద్దరం వున్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నదీ ||అలా అంటూ||

చరణం 2

వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తా
నీ కళ కళ కళ కళ మోముని చూస్తూ వుంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ వుంటా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నదీ
నీ వాడిగా వుండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నదీ ||అలా అంటూ||

సహస్ర శీర్ష రంజితం

సహస్ర శీర్ష రంజితం సహస్ర నేత్ర్ర విరసితం
సహస్ర మస్త రాజితం సహస్ర పాద పూజితం
సహస్ర విధ విధాసితం సహస్ర వర్ణ సంసితం
సహస్ర ధూపదీపితం సహస్ర నామ సరళితం
సహస్ర సద్గుణోన్నతం సమస్త విశ్వ సన్నుతం
సమస్త దేవాద్భుతం సమస్త సర్వయామృతం
సమస్త శక్తి మండితం సమస్త భక్త మండితం
సమస్త ముక్తి సుభిహితం నమామి కృష్ణ దైవతం... ||5||

గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా...

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే...

పల్లవి

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా... న్యాయమా...
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా... మౌనమా...
చెలియా నాలో ప్రేమని తెలుపా
ఒక ఘడియ చాలులే
దానిని నేను ఋజువే చేయా నూరేళ్ళు చాలవే ||లేదని|| ||గంధపు||

చరణం 1

హృదయమొక అద్దమనీ నీ రూపు బింబమనీ
తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ
అద్దాల ఊయల బింబమూగె చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడీ ఇక వేటాడొద్దే ||లేదని|| ||గంధపు||

చరణం 2

తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేదీ
వాసనలు వీచే నీ కురులు సఖీ..
లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ
సూరీడు మెచ్చే నీ కనులె చెలీ
విశ్వసుందరిమణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే
నా ప్రియసఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగరావే
ఏమి చేయ మందువే...

పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా

ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏఁవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏఁవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి

పల్లవి

ఓ... పట్టుకో పట్టుకో
చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్పదాటి చేరే సమయానా
ఓ... కంటికే దూరమై
గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కద
ప్రతి మలుపున

చరణం

ఆ... ఓ... ఓ...
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ
ప్రియా ప్రియా ఒక క్షణము తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంటపడక అదే పనిగా
ఓ... నిన్నలా మొన్నలా
నేను లేను నేనులా నిజమేనా
ఓ... ముందుగా చెప్పక
మంత్రమేశావే న్యాయమేనా
ఓ... అందుకే ఇంతగా
కొలువైయున్నా నీలోనా
కొత్తగా మార్చనా
నువ్వు నువ్వు అను నిను మరిపించనా ||ఆనందమా||
ఓ... పట్టుకో పట్టుకో
చెయ్యి జారనివ్వక ఇకనైనా
ఓ... చుట్టుకో చుట్టుకో
ముడిపడిపోయే మురిపాన
ఓ... ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళలో పెట్టుకో ఎదురగ నిలవనా
ఎటుతిరిగినా
ఏకాంతమే నీ సొంతమై
పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటగా ఏలుకో బంధమా

ఓ నవ్వుచాలు ఎన్నెన్నొ వలలు

సాకీ

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితే చాలు తేనె జలపాతాలు

పల్లవి

ఓ నవ్వుచాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల జల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు
మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోన నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా..
తన కురులు చూపిస్తా అవుననక చస్తారా.. ||ఓ నవ్వుచాలు ||

చరణం 1

గుండెల్లో భోగిమంటలా ఎండల్లో లేత వెన్నెలా
కొండల్లో ఏటి పరుగులా
దూకుతున్న లయలో...
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా
ఆమెకెన్ని హొయలో...
అలా నడిచి వస్తుంటే పువ్వులవనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం.. ||ఓ నవ్వుచాలు ||

చరణం 2

గాలుల్లో ఆమె పరిమళం
ఊపిరిలో నిండి ప్రతిక్షణం
ఎటువున్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను...
గుర్తొస్తే ఆమె పరిచయం
కవ్వించే పడుచు పసితనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోనూ...
కలోకాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరిపడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ ||ఓ నవ్వుచాలు ||

ఒక్క మాట ఒక్క

పల్లవి

[ఆమె] ఒక్క మాట ఒక్క బాణం ఒక్కటేనే గురి గురి
ఒక్క చూపుకి దిక్కులన్ని పిక్కటిల్లే చరి చరి
ఓటుమంటు లేని వాడు ఒక్కడైన సరి
ఓ మనస్సు ఉంటే మార్చుదాకా మార్గముంది చలో
ఛల్‌రె చల్‌రే ఛలో . . .2

చరణం 1

[అతడు] చుక్కలు తెంచెయ్‌ చకా చకా
హక్కులు మనవే పక పక
రెక్కల గుర్రం ఎక్కిపో ఆ గగనాన్ని ఏలుకో
స్వాగతం అనధిరంగా గీతికా
జోకులకే కధ చేబుదాం వెన్నెలతో మొరపెడదాం
[అతడు] సాహసం చెయ్యర ఇంకా ఢింభకా
చెంగులతో ఓడిద్దాం చెడుగుడునే ఆడేద్దాం
[అతడు] ఆకాశంలో భూకంపాలే సంభవం సర్వంనీకే సంభవం
ఓ దశ నీ ప్రేయసేలే ఛల్‌రేఛలో ఛల్‌రే ఛలో ||ఒక్కమాట||

చరణం 2

[అతడు] పరుగులు పెట్టే గంగ నువ్వు ఉరికే కృష్ణకు కలపరా
నదులే కాదు యెదలను కలిపిస్తేనే గెలుపురా
జీవితం ఈ పేటర్ల‌లో స్నేహితం
స్వరములతో జతకడదాం క్షణములలో గురి పెడదాం
[అతడు] ఎవ్వరం ఇజీకోల్టు అద్భుతం
మనస్సల్లే పరిగెడదాం మనిషల్లే నిలబడదాం
[అతడు] వేగం వేగం అంతా వేగం సంభవం సర్వం నీకే సంభవం
ఊర్వశి నీ ప్రేమసేలే ఛల్‌రె ఛలో ఛల్‌రేఛలో. . . ||ఒక్కమాట||

హే రామారే రామా రామా

పల్లవి

[అతడు] హే రామారే రామా రామా రేగిందే హంగామా హే సస్సరే
సారేగామా సందడి చేసేద్దామా . . . ఆ . . . ||2||
[ఆమె] ఆంధ్రాలో మోగిందే భాంగ్రో భల్లే భల్లే గుండెల్లో కుంపట్టి హిప్పే హుర్రే హుర్రే
[అతడు] యే ధిల్ మెరా గల్ అందిలే ఏ ధిల్ తెరా అంటుం ధిలే పూల్
పండగ ఇవ్వాలే డోల్‌ బజావో . . . డోల్‌ బజావో . . . కం కం కం
క్రాంతీ ధూమ్‌ మజావో ధూమ్‌ మాజావో ఈ రోజే సంక్రాంతి
డోల్‌ బజావో డోల్‌ బజావో రైరై అంది మస్తీ ధూమ్‌ మజావో
ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ . . . హే రామా రే రామా . . .
[ఆమె] తన ధీమ్‌ తాన ధీననా తనా తన ధీమ్‌ తనన తన ధీమ్‌తానన
ధినన . . . ధినననా ధిననననా . . .

చరణం 1

[అతడు] తన ధీమ్‌ తాన ధీననా తనా తన ధీమ్‌ తానన కసిరిం
పులిపంజా ఎవడైన గల్లంతే . . . సత్తా సయ్యంటే యముడైన నలుసంతే
[ఆమె] వయసంత తొణికింతె నువ్వట్టా చూస్తుంటే కంత్రీ కన్నేస్తే
చురుకైన సుఖమస్తే
[అతడు] అరె యారో . . . మనదాకటే గ్యారో గురిచూస్తే తిరుగుండదురో
[ఆమె] హిరో పడిపోయాను లేలో మనసిచ్చాను లేలో . . .
[అతడు] అదుపేలేని నావేగం ఆగేది లేదే నీ వయ్యారం వలవేస్తే విలవిల
మంటావే . . . డోల్ భజావో డోల్ భజావో కం కం కం క్రాంతి
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఈ రోజే సంక్రాంతి
[ఆమె] డోల్‌ భజావో డోల్‌ భజావో రైరై అంది మస్తీ . . . ధూమ్‌ మజావో
ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ . . . ||అరె ... రామారే రామా||

చరణం 2

[అతడు] పదిమంది మెచ్చేలా . . . నడిచేదే నా బాటా . . . నాలా
నేనుంట భయమంటే ఏంటంటా
[ఆమె] నిలువెల్లా నీవల్లా కలిగిందే కవ్వింతా నీలా నాకెవరు నచ్చిందే లేదంటా
[అతడు] వలపాట వల విసిరే వేటా ఏదైన నే గెలిచేస్తా . . .
[ఆమె] చెలిపెట్టా సెగరేపే పట్టా ఏదైన చల్లారుస్తా . . .
[అతడు] పగలు రేయి మరిపించే వెలుగై నేనుంట నీకల తీరేదారుల్లో
కావలి నేనవుతా డోల్‌ భజావో డోల్‌ భజావో కం కం కం క్రాంతీ
ధూమ్‌ మజావో ధూమ్‌ మజావో ఈ రోజే సంక్రాంతి
డోల్ భజావో డోల్‌ భజావో రైరై అంది మస్తీ ధూమ్‌ మజావో
ధూమ్‌ మజావో ఆనందం మన ఆస్తీ . . .

ఓ మారియా ఓ మారియా

పల్లవి

ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది పనికిరాదులే ఓ మారియా
ప్రతీరోజూ విలువైందీ కాదా ప్రయత్నిస్తే గెలుపేదోరాదా
చేద్దామంటే చూద్దామంటే కలతే తీరదు
[ఆమె] ఓ మారియా

చరణం 1

సిరిమువ్వ రేపంటు వెనుదీస్తుందా ఘల్ల్ ఘుల్ల్ ఘల్ల్ మోగించగా
[ఆమె] సిరిమల్లె మాపంటు ముసుగేస్తుందా గుమ్‌ గుమ్‌ గుమ్‌ పంచివ్వగ
[అతడు] ప్రతిదినం ప్రభాతమై వరాలుతెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ
[ఆమె] ప్రతీక్షణం హుషారుగా శ్రమించి సాగేవాగులు
ప్రయాణమే చాలించునా మాకింక సెలవంటూ
[అతడు] హే ఉల్లాసంగ ఉత్సాహంగా బ్రతుకే సాగనీ
[ఆమె] అంతేలేని సంతోషాలు ఒళ్ళోవాలనీ ||ఓమారియా||

చరణం 2

చిరుగాలి చిత్రంగ రానంటుందా ఝుంఝుం పయనించగా
[ఆమె] కొమ్మల్లో కోకిల కాదంటుందా
కూకూకూ వినిపించగా
[అతడు] నిరంతరం దినం దినం
అలాగే సహనం చూపుతూ
విరామమే లేకుండగ ఈ నేల తిరుగునుగా
[ఆమె] ఆకాశమే అందాలనీ చిన్నారి రెక్కల గువ్వలు
అనుక్షణం మదేపని ఆరాట పడిపోవా
[అతడు] హే మనసే వుంటే మార్గంతానై ఎదురొస్తుందిలే
[ఆమె] చక్కా వుంటే స్వర్గంకూడ దిగివస్తుందిలే ||ఓమారియా||

గుండెల్లో గులాబీల ముళ్ళు

పల్లవి

[అతడు] గుండెల్లో గులాబీల ముళ్ళు . . .
నాటిందో నిగురాల వళ్ళు
నన్ను మాయ జేయకే నెరజానా . . .
[ఆమె] అయ్యయ్యో ఇలారాకు వెళ్ళు . . .
ఒంపుల్లో ఇరుక్కుంటె కళ్లు . . .
నిన్ను లాగలేనుగా నేనైనా . . .
[అతడు] తపో భంగమయ్యేలా . . .
అలా కొంగు జారాలా . . .
[ఆమె] మరీ బెంగ పెరిగేలా. . .
ఇలా తొంగిచూడాలా . . .
[అతడు] అతి చిలిపిగ మదనుడు వదిలిన శరమీ సొగసరి . . .
మతి చెదిరిన ఎదురుగ కనబడితే మల్లీశ్వరీ ||గుండెల్లో||

చరణం 1

[అతడు] అగ్గిలాంటి నీ అందాలు . . .
రగిలించగానే ఈ చన్నీళ్లు . . .
ఆవిరావిరై పోతాయో సౌందర్యమా . . .
[ఆమె] సిగ్గుదాటి నీ ఆత్రాలు సొగసల్లుతుంటె సుకుమారాలు
అల్లరల్లరైపోతాయో శృంగారమా . . .
[అతడు] నిందించి తప్పించు కోకమ్మా . . .
కనువిందించ్చి కవ్వించు కోకమ్మా
[ఆమె] నువ్వంత తెగించి రాకమ్మా . . .పోమ్మా . . . ||గుండెల్లో||

చరణం 2

[ఆమె] కాగాడాలు అనిపించేలా . . .
నీ ఆగాడాలు వెలిగించాలా . . .
ఎక్కడెక్కడేవున్నయో. . .గాలించగా . . .
[అతడు] సోగతాలు వినిపించేలా
నీ సోయాగాలు శృతిమించాలా
పెక్కడెక్కడేవున్నాయో వివరించగా
[ఆమె] చురుక్కు చురుక్కు మనేలా . . .
నను కొరుక్కు కోరుక్కు తినాలా . . .
[అతడు] వయస్సు సమస్య తీరేలా . . . రామ్మా . . . ||గుండెల్లో||

బాలీవుడ్ బాలరాజుని

పల్లవి

[అతడు] బాలీవుడ్ బాలరాజుని పాటల్లో త్యాగరాజుని
బంగ్లాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగువాడిన అందరిలో చిన్నవాడిని గుండెల్లో గూడుకట్టుకోనా
చిరునవ్వు తూ జీతే రహొ ఈజన్మకి
జీనాయహ గానా యహ ఏనాటికీ ||బాలీ||

చరణం 1

సంగీతమౌతాను సైయాటతో వసంతాలు తెస్తానులే నవ్వుతో
సూర్యుడ్ని దాస్తాను నాచూపులో జనాలంతా రావాలి నాపాటలో
నిప్పల్నే గుప్పిస్తా నీతిలేనప్పుడు మల్లెల్లో చల్లిస్తా మనసకున్నప్పుడు

చరణం 2

మనసుండీ పండేటి మాగాణిగ వయస్సుందిలే నిత్యకళ్యాణిగ
పరువాల పాదాల పారాణిగ వరించను ఈజన్మ రారాణిగ
ఆనింగి ఈనేల హాద్దులేరావులే కాలాలు కర్మాలు అడ్డుకోలేవులే ||బాలీ||

భూమ్ భూమ్ చికినకలోకమంతా

పల్లవి

భూమ్ భూమ్ చికినకలోకమంతా ఒక్కటవ్వాలోయ్
భూమ్ భూమ్ చికినక మనుషులంతా మనసువిప్పాలోయ్ ||భూమ్||
ఏ యుద్ధం ప్రళయం వద్దు అంటూ చేతులు కలపాలోయ్
ఏ పందెం పంతం చెల్లదంటూ చిందులు వెయ్యాలోయ్
హాయ్‌రే హాయ్‌రే లేదు మనకెదురే
జాయ్‌రే జాయ్‌రే కొత్త కధే వినవే ||హాయ్‌రే|| ||భూమ్||

చరణం 1

జర్మనీలో హిట్లరు శ్రీలంకలో టైగరు
కాశ్మీర్‌లో టెర్రరు రుచి చూసారు రణరంగమే
సహనంతో బుద్ధుడు అనుకువతో రాముడు
మన గాంధీ మహాత్ముడు చవిచూపారు సంతోషమే
పెదవిగోపాలు మదర్ ఇండియాలో ఆశయాలు
ఎగురవెయ్యాలి వినువీధుల్లో పావురాలు
తరగని వయిలెన్స్ ఇక వెరగని లవ్ సెన్స్ ||హాయ్||

చరణం 2

జట్ ప్లైట్ తలుపులు ఈమెయిలు లేఖలు
వేలన్‌పై ఊసులు తలపోస్తేనే మిలినియం
వెన్నెలో రాత్రులు వీకెండుయాత్రలు
మాటల్లో మమతలు కనిపిస్తేనే మహొదయం
సాదరించాలి 21వ సెంచరీ
సహకరించాలి చిరునవ్వులతో పొరుగువానికి
నిలకట్టే నేర్చుకో ఇపుడలజడి మరచిపో ||హాయ్‌రే||

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా

పల్లవి

తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగా
కరిణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆ ... పంచవన్నె రామచిలుక
నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మోలకా
పంచవన్నెల రామచిలుక పంచదారల ప్రేమచినుక

చరణం 1

మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నామనసు మందిరాన మూగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాద్య దేవతనువ్వే గంధర్వ కాంతపు నువ్వే
స్వర్గాల దారిలోనా నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
[ఆమె] నీగాలి సోకింది నాకొమ్మ ఊగింది
నీ ప్రేమ నాదంది నాజన్మ పొంగింది
[అతడు] పంచవన్నెల రామచిలుక నిధిలాగా దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మెలకా ||పంచ||

చరణం 2

[అతడు] నాతేనె విందువు నువ్వే నాలంకె బిందువు నువ్వే
నాగుండె గంపలోనా మొక్కుకున్న అంతులేని సంపద నువ్వే
నాపొద్దు పొడుపువు నువ్వే నాభక్తి శ్రద్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న వత్తికైన ఓనమాలు నువ్వే నువ్వే
[ఆమె] నీ చెంప అందింది నాచెంద కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది ||పంచవన్నెల|| తళ||

జేజే జేజేజే హే రామయ్య పాదాలెట్టే

పల్లవి

జేజే జేజేజే - 4
హే రామయ్య పాదాలెట్టే సీతమ్మ పారాణేట్టే
ఈ కొండకోనసీమల్లో- అహా పులకించె గుండెలోతుల్లో
కోయోడు ఘంటం పట్టె బోయాడు గురిచూపెట్టె
సింహాలు పొంచేదారుల్లో- నరసింహలు గెలిచే పోరుల్లో
పులి-పులి - 4, అదిగో పులితోక - - -
గిలి - గిలి - 2, మెఖాలగిలిగిలి ఇదినా పొలికేక - 2 ||జే||

చరణం 1

నడిసిరిస పసరిస నసపెట్టు, అసలుకధ మొదలెట్టు
వయసు గుస కసికసి నసపెట్టు, సిసలుకధ సిగపట్టు - 2
దినుసు మిస కసకస తీరెట్టు, ఇరుసులకు జోరెట్టు
అరుసు అడుగుల విసిరేట్టు, నుడుసులకు అడుసెట్టు
[అతడు] పెళాపెళా పెళ పంజా విసిరె బొబ్బిలిలో శౌర్యం
ఛలా ఛలా ఛల చెంగున ఎగిరే జింకలలో వేగం
చిమా చిమా చిమ చీమల బారులు చెప్పేనొక పాఠం
మెరా మెరా మెర మెరుపుల్లో నెమలాటే ఒక నాట్యం
మన్నైన ఇస్తుంది మాణిక్యాలెన్నో, మానైన చేస్తుంది త్యాగాలెన్నెన్నో
అడవుల్లో వున్నాయి అందాలెన్నెన్నో, అడగకనే చెబుతాయి అర్థాలింకెన్నో
జిలి జిలి జిలి బలి జిగేలు జిలు బలి - అదిగో నెమలీక
చలి చలి చలి చలి కొరుక్కు తిను చలి - ఇదిగో నిప్పుకాకు - 2

చరణం 2

గణాగణ గణరాజు రాకకే గగనాలదరాలీ,
మహా మహా మృగరాజు అడుగులో పిడుగులురావాలి
గగనం భువనం అదిరి చెదిరినా ఎదురురై నిలవాలి
గురిలో బరిలో, గిరిలో, చెరిలో మనిషై గెలవాలి
మృగమేదో దాగుంది మానవరూపంలో, వెంటాడి వేటాడు మమతల చాపంతో
వేటాడే వడుస్తున్న వేగుల చూపుల్లో, కాపాడే గుణముంది కన్నుల రెప్పల్లో
చెడుగుడు - 2 కలబడు నిలబడు చెదుతోజతగాక
తలబడి తడబడి తెరబడి నెరవడి గురిచెడి గుంపును విడిపోక ||జై||

నిన్నేమో పాపరో నేడు చూడు సూపరో ఇంతలోనే

పల్లవి

[అతడు]నిన్నేమో పాపరో నేడు చూడు సూపరో ఇంతలోనే ఎంతరా వింత
[ఆమె] గౌనేసిన చేపను గాలమేస్తే చిక్కను కళ్ళకింక కట్టరా గంత
[అతడు] గుండె గిన్నెలోన ఉడికించినా
[ఆమె] వండివార్చి నీకే వడ్డించనా
[అతడు] వాలుకళ్ళ పిల్ల వాటెయ్యనా
[ఆమె] కాలుదువ్వి వస్తే కాదంటానా
[అతడు] కదలకు కుంచెమల్లె కంచమల్లె మంచమల్లె
[ఆమె] కుదరక కుంచెవలె ముంచవలె కంచవలె
[అతడు] నెమలి ఫించమలె దితై దితై (నిన్నేమో.....)

చరణం 1

[అతడు] జర జర జర జర పాకిందే
[ఆమె] చుర చుర చుర చుర మండిందే
[అతడు] పిల్లో పెదాలతో చంపెయ్యకే
[ఆమె] ఇలా మజాలతో నింపెయ్యకే
[అతడు] తంధోరి విందులో ఉంగరమే వేస్తానే
[ఆమె] ఉంగార గుండెల్లో సిగారం నీదేలే
[అతడు] నీవెంత గుండిస్తే నిన్నంటూ చూపిస్తా
[ఆమె] నీవెంత శోధిప్తే అంతంతా నీకిస్తా
[అతడు] ఇదిగో గుండెవలె జండువలె పొందువలె
[ఆమె] చెలియా చందనమే కుమ్మెయ్ కుమ్మెయ్ కుమ్మెయ్ (నిన్నేమో. . .)

చరణం 2

[అతడు] గుస గుస గుస గుస పెట్టొద్దే
[ఆమె] కసి కసి కసి కసి రేపొద్దే
[అతడు] ఇప్పుడే కధ ఇలా మెదలయిందే
[ఆమె] ఇక నాకల ఇలా నిజమయ్యింది
[అతడు] రంభజా మోగించా అంబారి ఎక్కిస్తా
[ఆమె] బొంబాయి చూపింది బొమ్మాటే చేయిస్తా
[అతడు] రంకేసి గుర్రంపై లంకంతా చూపిస్తా
[ఆమె] రంగంలో దింపేసే హొలినే ఆడిస్తా
[అతడు] ఆగల మెగ్గువలె మెగ్గువలె దిక్కువలె
[ఆమె] తొందర తగ్గవలె తగ్గవలె తగ్గవలె
[అతడు] యెదలో భగ్గుమనే నిప్పే నిప్పే నిప్పే (నిన్నేమ . . .)

ఆటకుందోయ్‌ టైమ్‌ మాటకుందోయ్‌ టైమ్‌

పల్లవి

ఆటకుందోయ్‌ టైమ్‌ మాటకుందోయ్‌ టైమ్‌
హార్ట్‌లోకి దూసుకెళ్లే పాటకుందోయ్ టైమ్‌
డాన్స్ కుందోయ్‌ టైమ్‌ రొమాన్స్ కుందోయ్‌ టైమ్‌
మాల్‌ మషాలా గర్ల్‌తో టైమ్‌ పాసుకుందోయ్‌ టైమ్‌
హైస్కూల్‌కి కాలేజ్‌కి ప్రెండ్‌షిప్‌ కుందోయ్ టైమ్‌
ప్రేమించిన వయ్యారితో సైయ్యాటకున్నదోయ్‌ టైమ్‌
జాలీగా బ్రతికేదే అసలైన టైమ్‌ టైమ్

చరణం 1

ఒక్క స్మైలిస్తే శాటిలైటల్లే ఇంటిచుట్టూ రౌండ్సే మైనా
స్టార్‌ హోటల్లో మిడ్‌నైట్‌ మీట్‌లో కొరుకున్న స్టైల్లో నిన్‌ అరస్టే చేయనా
కుదిస్తే టైమ్‌ టైమ్‌ ఆదుర్దా గేమ్‌ గేమ్‌
చలాకి పిల్లా గప్‌చిప్‌గా గడిపేద్దాం సమ్‌టైమ్‌ ||ఆట||

చరణం 2

స్టెప్‌ స్టెప్‌కి ఉందోయ్ రిమ్‌జిమ్‌ బిట్‌ బిట్‌కో రాయి
లెప్ట్‌ రైట్‌లో లేదే తేడా ఎవ్వరితింగ్‌ ఈజ్‌ ట్రై
మిస్‌వరల్డ్‌ అయినా మిత్తూరు పాపైనా
ఆటకొస్తే ఒకటే జోరా
హాటు కౌగిట్లో యమ స్వీటు ముద్దుల్తో
ర్యాప్‌ సాంగ్ పాడి ఓ చమకే చెయనా
ఇదే గుడ్‌టైమ్‌ టైమ్‌ టైమ్‌ వదిల్తే క్రైమ్‌ క్రైమ్‌ క్రైమ్‌
మజాగా పిల్ల లవ్‌ చేస్తూ బ్రతికేద్దాం హాయిగా ||ఆట||

అ అ ఆ ఇ ఇ ఈ స్కూలు బెంచీలు బెత్తాల చైరు చిక్కుల్ని

పల్లవి

[అతడు]అ అ ఆ ఇ ఇ ఈ స్కూలు బెంచీలు బెత్తాల చైరు చిక్కుల్ని
దాటాలంటే మై హూనాచుట్టూరా చూడాలి కళ్ళు
దిక్కుల్ని దాటాలి కాళ్ళు చుక్కల్ని చేరాలంటే మై హూనా
పడమర కూకు దక్షిణం ఉత్తరం నీలాల నింగి పాతాళ దీవి
ఎక్కడికైనా మైహూనా మైహూనా

చరణం 1

బడిలోను ఆ చదువే ఇంట్లోను ఆ గొడవే సరదాలే కనపడవే
గడియారం విసిరేస్తే టైం టేబుల్ చింపేస్తే అడిగే వారుండరంతే
అరచెయ్యి అడ్డుపెడితే ఆనందం ఆగిపోదంతే అమ్మైనా నానైన్నా
అవునన్నా కాదంటే తోడుంటే అర్జునుడైనా మై హూనా మైహూనా
జిగి జా జిగిజా - - -

చరణం 2

చిటికెల్లో నీ కోసం కనిపెట్టా ఓ లోకం కలకాదు నిజమే
నండి మబ్బుల్నే మడి చేసి మెరుపుల్తో కట్టేసి ఉయ్యాలలూ
గేస్తానండి చీకట్లో రాని చోటుంది చాక్లెట్లు కాసే చెట్టుంది
వానల్లే లస్సీలు వడగల్లే కుల్ఫీలు కోరింది ఇవ్వగా
మైహూనా మైహూనా ||అ అ ఆ...||