Showing posts with label - శ్రీదేవి. Show all posts
Showing posts with label - శ్రీదేవి. Show all posts

ఆకుచాటు పిందె తడిసె...

ఆకుచాటు పిందె తడిసె... కోకమాటు పిల్ల తడిసె...
ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
గూడుచాటు గువ్వ తడుసె...
గుండెమాటు గుట్టుతడిసె... ||2|| ||ఆకాశ ||

చరణం 1

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నినుతాకి తడియారిపోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే
నీ మాటవిని మబ్బుమెరిసి... ఆహా...
జడివానలే కురుసి కుదిపి ఒళ్ళు తడిసి వెల్లివిరిసి
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహా అహా అహా... అహ అహ అహా... ||ఆకుచాటు||

చరణం 2

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే ఆహా...
నీ విరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిమి పంచి
కలలు వెచ్చంగ తడి ఆర్చుకోవాలి
అహ అహ అహా... అహ అహ అహ... ||ఆకుచాటు||

వందనం అభివందనం

వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం ||2||
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం పాదాభివందనం...||2|| ||వందనం||

చరణం 1

కన్నులు పొడిచిన చీకటిలో
ఆరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని ||2||
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి ||2||
ఎదురు చూసిన సారిక అభిసారిక.. సారీ.. ||వందనం||

చరణం 2

జీవితమన్నది మూడునాళ్ళని
యవ్వనమన్నది తిరిగిరాదని
ప్రేమన్నది ఒక నటనమనీ...
నీకంటూ ఎవరున్నారని
ఉన్నానని నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి ||2||
సుఖము పోసిన మేనక అభినయ మేనక.. సారీ.. ||వందనం||