Showing posts with label * మనో. Show all posts
Showing posts with label * మనో. Show all posts

పుల్లనీ పుల్లట్టు పంటికంటగానే...

పుల్లనీ పుల్లట్టు పంటికంటగానే జివ చచ్చిన జన్మకే జీవమొచ్చెరా
ఇదీ అట్టంటే ఈ హ ||పుల్లనీ పుల్లట్టు||
వేసేటి అట్లమీద యావ పుట్టగానే ఏ సిలో తిండి మీద ఎగటు పుట్టెరా
ఫైవ్ స్టార్ మీద బెట్టు మన అట్టే బెస్టు
మీ అందరి మీద ఒట్టు మినపట్టే టేస్టు

చరణం 1

రాతి రోలులోన పిండి రవ్వలోన కలిపి
రేకుపెనం మీదన రవ్వంత నూనె దులిపి
కట్టె పొయ్యి మీద దాన్ని అట్లకాడతో కాల్చి
పొడి కారం పైన చల్లి పొగసూరకుండ దీసి
కాలుతున్న అట్టు ముక్క నాలిక మీదెట్టుకుంటే... ||2||
నసాళానికెక్కి మంచి హుషారు పుట్టిస్తదిరా.. పుల్లట్టు
అబ్బబ్బబ్బా... ||పుల్లనీ పుల్లట్టు||

చరణం 2

కట్లెట్లు పిజ్జాలు దీనిముందు దిగదుడుపు
నూడుల్సు చికెను రోల్సు అరగవురా పరగడుపు
హాటు డాగ్స్, బర్గర్లని ఇంగిలిపీసు మరిగినోడు
ఫాస్ట్ ఫుడ్డు తిన్నాక టేస్టు మర్చిపోతాడు
తెలుగింటి పుల్లట్టు తిన్నోడు ఎవడైనా ఓ... ||2||
పదేళ్ళైనా మరిచిపోడు పదే పదే అడుగుతాడు.. పుల్లట్టు
అట్టు అట్టు అట్టు ||పుల్లనీ పుల్లట్టు||

ప్రియా ప్రియతమా రాగాలు...

ప్రియా ప్రియతమా రాగాలు
సఖీ కుశలమా అందాలు ||2||
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో.. రేగే.. ||ప్రియా||

చరణం 1

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎదురులేని మనసులో ఎదురురావే నా చెలి
అడుగుజారే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం
నీలో నాలో పలికే.. ||ప్రియా||

చరణం 2

శరత్తులోన వెన్నెలా తలెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువేసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం
నిన్ను నన్ను కలిపే.. ||ప్రియా||

కమాన్‌ కమాన్‌ ఓ కామాక్షి

పల్లవి

కమాన్‌ కమాన్‌ ఓ కామాక్షి జంతర్‌ మంతర్‌ చూడు మీనాక్షి ||2||
కోడిగుడ్డు నుంచి నెమలి తీసి అందిస్తా చిటికేసి
మన్నుతీసి మల్లెపూవుగా మార్చేస్తా నీ సాచి ||కమాన్‌||

చరణం 1

నౌనౌనౌ మ్యూజిక్‌ ||2|| ననన లాజిక్‌ ||2||
[ఆమె] మ్యాజిక్‌ మ్యాజిక్‌ మ్యాజిక్‌ కోసం మ్యాజిక్‌ డాన్స్ మ్యాజిక్‌
[అతడు] ఎంతైనా మ్యాజిక్‌;
[ఆమె] మ్యాజిక్‌లాక్‌ మ్యాజిక్‌ రాక్‌ మ్యాజిక్‌
[అతడు] పిలక జడలను తడిమితే కురులు బారెడు పెరుగునే
బొండాంబాబుని తాకితే వచ్చేరక్తం మాయమే
ముసలిఫ్రోఫెసర్‌ కోటుజేబులో చెప్పరాని దేదో వచ్చునే
కల్లు తాగిన కన్నయ్య చేతికి ఆరోవేలు పుట్టుకొచ్చునే
పిల్లోణ్ని పిల్లగా మార్చే మంత్రం ఆడది మగాడు కాగల తంత్రం
చేస్తాగాని నరసింహ రావుల వధ ||కమాన్‌||

చరణం 2

[అతడు] రాసిన లవ్‌ లెటర్స్ ఎక్కడ దాచినా ఎక్స్‌రే కళ్ళతో చూడనా
కోరివెంట పడుతున్న పిల్లకు మీసాలు వచ్చేలాగా చెయ్యనా
హైర్‌ డై వేసుకున్న దొంగ జుట్టులో దాగిన తెలుపుని చూపనా
రేపు రాబోయే పరీక్ష పేపర్లు నోటీసు బోర్డులో పెట్టనా
పాపిన్స్ అయినా మింగేయగలను వేళ్ళను కరకర కొరికేయ్‌గలను
అన్నీ తెలుసు పరీక్షలు వస్తే హు హు
నౌనౌనౌ మ్యాజిక్‌ ననన లాజిక్‌ ||కమాన్‌||

హిందీలోనా చుమ్మ

పల్లవి

[అతడు] హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ
మళయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మ ||హిందీ||
[ఆమె] చక్కెరకన్న స్వీటు చిల్లీకన్న ఘాటు
లేజర్‌కన్నా ఫాస్టు
ఎండలకన్నా హాటు వెన్నెలకన్నా సాటు
అన్నిటికన్నా గ్రేటు
[అతడు] ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||

చరణం 1

[అతడు] ప్రతి ఊరిలో ప్రతిబ్యాంకులో లభించేది క్యాష్‌
[ఆమె] ప్రతి జంటలో ప్రతి బుగ్గలో జనించేది కిస్‌
[అతడు] సీనా పెళ్లితో బలే నీటుగా లభించేది ఫస్టు
[ఆమె] చెర్రీ పెదవితో మరీ గాటుగా రచించేది ముద్దు
[అతడు] కంటికి కలలేరాని జీవితం నిస్సారం
[ఆమె] గంటకో ముద్దేలేని ప్రేమలే అనవసరం
[అతడు] ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||

చరణం 2

[ఆమె] పదం మారినా రిధం మారినా పాట ఒక్కటేగా
[అతడు] కధే మారినా కలర్‌ మారినా ముద్దు ఒక్కటేగా
[ఆమె] ప్రేమపక్షులు ఇచి పుచ్చుకొను ఆశ ముద్దులేగా
[అతడు] ప్రేమయాత్రలో కస్సుబుస్సులకు మందు కిస్సులేగా
[ఆమె] దేవతల యవ్వనసూత్రం కడలిలో అమృతము
[అతడు] ప్రేమికుల నవ్వుకు మూలం గాఢ మధుచుంభనము
[ఆమె] ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||

ఆదాబర్సే

పల్లవి

[అతడు] ఆదాబర్సే అందరి కాదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మబొరుసే హే ||ఆదా||
పాపానికి పోటీలు పుణ్యాలకి పోటీలు
నువ్వు భూమిన పడగానే తెరిచారోయ్‌ నీ ఫైలు
రోజూ ఓ ధిల్లింగున్న మంచిది మనదేలక్‌ ||ఆదా||

చరణం 1

గర్భాల పెరిగే పాపాయికి హొష్టర్‌ అనే జైలురా
ఉయ్యాల ఒదిలిన బుజ్జాయికి అడుగంటూ ఓ జైలురా
చిన్నబడి ఓ జైలు పెద్దబడి ఓ జైలు పెట్టు ఉద్యోగం ఓ జైలు
ఉల్లాస మింతింతై పోగేసి వచ్చాక
వేసవి అవుతుందోయ్‌ జైలు
జోహారు చేస్తే తీహారుకన్నా మలేషా గొప్పది ఈ జైలు ||ఆదా||

చరణం 2

ప్రేమల్లోపడ్డ పసివాళ్లకి కౌగిళ్లే ఓ జైలురా
ఇంకాస్త పిచ్చి ముదిరిందంటే మ్యారేజ్‌ ఓ జైలురా
సందు దొరికిందంటే సంసారమో జైలు
ఆపినా ఆగదు ఆరైనా
బాధ్యతల బరువెక్కి కూలబడిపోయాక
వల్లకాడేరా తుది జైలు
లవ్‌ గుర్తులన్న అన్నిటికన్నా మలేషా గొప్పది ఈ జైలు ||ఆదా||

హేహేహేరబ్బ

పల్లవి

[అతడు] హేహేహేరబ్బ నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి ||3||
ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా ||2||
మనిషే మరీ భోళాగా తనమాటే గలగలా
తానేలేని వీణా ఆ ప్రాణం విలవిల ||నూటొక్క||

చరణం 1

[అతడు] గాలేనువ్వైతే తెరచాపల్లే నిలబడతా
[ఆమె] జోలాలేనువ్వైతే పసిపాపల్లే నిదరోతా
[అతడు] రాణిలాగా కోరితే బంటులాగా వాలనా
[ఆమె] భక్తితోటివేడితే దేవతల్లే చూడనా
[అతడు] సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే రోజంతా సరిక్రొత్త కేరింతలే
[ఆమె] మలినాలేవి లేని మధుగీతం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి ||2||

చరణం 2

[అతడు] మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా
[ఆమె] నువ్వు మోడలై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా
[అతడు] కోపమొచ్చినప్పుడు బుజ్జగించవే మేనకా
[ఆమె] కొంటెవేష మేసినప్పుడు వెక్కిరింత నాదట
[అతడు] చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు మనమధ్య వుంటాయి పోతాయిలే
[ఆమె] ఆనందాన్ని యేలే అధికారం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి ||2||
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా ||2||
మనసే మేఘమాలా తన ఉనికే వెన్నెలా
తానే లేనినేలా పోతుంది విలవిలా ||నూటొక్క||

అదిరిందిరో దీనబ్బా

పల్లవి

[అతడు] అదిరిందిరో దీనబ్బా ఈ గుమ్మసోకు నాజూకు ||2||
ఏందబ్బా గుచ్చుకుంది పూల బాకు ||2||
[ఆమె] బీటు వేస్తే బీహారు లేటుచేస్తే చేజారు
జోరు చూస్తే జోహారు నీకైనా తయ్యారు
కొమ్మచాటు పండిపోసే కొంగు పోతే కొల్లేరు
[అతడు] అదిరిందిరో

చరణం 1

[అతడు] ఓ ఓ ఓ బుగా ఎరుపున గిల్లీ మెగా తుం తుం చెయ్యాలనీ ఉందీ
[ఆమె] ఓ ఓ ఓ సిగ్గూ వరపు కొచ్చిందే అగ్గి ఏదో రాజుకుంటుందే
[అతడు] సలప రింతలను సమ్మంగా దులిపెయ్యనా నలిపెయ్యనా
[ఆమె] కలవరింతలను కమ్మంగా కలిపేయరా చెరిపెయ్యరా
[అతడు] రెక్కలున్న గుర్రమ్మీద నేనూ
[ఆమె] గెల్లిపూల దెబ్బలోనా రేపో మాపో ఇచ్చేయ్యగా డోసు
[అతడు] దీనబ్బా

చరణం 2

[అమె] రిమ్మతెగులు పుట్టిందే చెమ్మచెక్క ఆడనంటుందే
[అతడు] గుమ్మా గుబులు పట్టిందే నిమ్మచెక్కా పిండుకొమ్మందే
[ఆమె] చిలిపి చాకిరికి చీరంతా అలిగిందిరో నలిగిందిరో
[అతడు] మదన తిమ్మిరికి మనసంతా మరిగిందిరో కరిగిందిరో
[ఆమె] మంచుపూల మంచం మీద చుమ్మా
[అతడు] పంచుకుంటే పంచదారే నమ్మా
[ఆమె] అంచుచాటే అందాలన్నీ అల్లిబిల్లి ఆటాడేనమ్మా
[అతడు] అదిరిందిరో

తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా

పల్లవి

[అతడు] తిల్లాన తిల్లాన నా కసికళ్ళకూనా చికుచికు చిందయ్ అన్నానా ||2||
ముద్దుచాల్లే మీనా అది ఎంత చిన్నదైనా చక్‌చక్ ఇచ్చేయ్ అన్నానా
కన్నుగీటితే సుల్తానా కసిగట్టు దాటెరా దీవానా
కొంటె ముద్దుల జబ్బర్‌ దస్తి నాదే వేసైనా ||తిల్లానా||

చరణం 1

[ఆమె] పైట బెంగుపాడిందయ్యో పరువాల పాట
పట్టిపట్టి నువు చూపిస్తే అదిరేను వాలాన
[అతడు] కల్లా కపటమేదిలేని జవరాల బాద పట్టే మంచం వేసే ఇంట చెలరేగిపోదా
[ఆమె] వసంతాల వాకిట్లో వయ్యారాల విందమ్మో
[అతడు] కులాసాల సందిట్లో విలాసాల వేణమ్మ
[ఆమె] పదారేళ్ళ ఒంపుల్లో మజా తీర్చుకుందామా
[అతడు] పదాలింక చాలించి పెదాలందు కుందామా
[ఆమె] సడేలేని ముంగిట్లో సడే చేసుకుందామా ||తిల్లానా||

చరణం 2

[అతడు] ఎర్రపాటి కుర్రాళ్ళంతా ఎనకాలవుంటే నల్లపిల్లగాళ్ళే కోరి మనసివ్వనేల
[ఆమె] నల్లనల్ల మేఘంలోనే నీరుండదంట నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంట
[అతడు] మారాల చేమంతి నీ ఒళ్ళే వుయ్యాల
[ఆమె] మందార పూవల్లే ఎర్రబారే సందేళ
[అతడు] చందనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే ఈ వేళ
[ఆమె] చెంగుపట్టి ఏకంగా వెన్న దోచుకోవాల
[అతడు] గట్టు దాటి గో దారల్లే నేల వంచి వెయ్యాలా ||తిల్లానా||

మ్మమ్మమ్మమ్మా

పల్లవి

[ఆమె] మ్మమ్మమ్మమ్మా . . . మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు ||2||
మనువాడే ఈడు నాకు వచ్చిందంటు
మగవాళ్ళ మధ్యన తిరవద్దంటున్నారు మావయ్య మా నాన్న
మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు
[అతడు] పి పి పి పి పీ పీ . . . చిన్న నిను మెప్పిస్తానే నీ పెద్దోళ్ళను ఒప్పిస్తానే
పిడికెడంత నడుముదాన పెళ్ళికి సయ్యంటే
పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పీస్తానే
[ఆమె] డుమ్మారే డుమ్మ డుం డుం డంభారే డంభ ఢం ఢం

చరణం 2

[అతడు] నేనేమో మాష్టార్ని నువ్వేమో స్టూడెంట్‌ని ఇద్దరికి కుదిరేనే పిల్ల
మన కధ సుందర కాండానే పిల్లోయ్‌
[ఆమె] పాఠాలే వినకున్న ప్రైవేటుకి రాకున్న బెత్తంతో కొట్టదోయ్‌ సారు
కొడితే మెత్తంగా కొట్టాలోయ్‌ సారు
[అతడు] బెంచి మీద నిలబెట్టను గోడకుర్చి వేయించను నా ఒళ్లో కూర్చోవే పిల్లా
నీకిక వందమార్కులేస్తావే పిల్లా
[ఆమె] మాష్టారు మాష్టారు నీకెందుకు ఈ పాడు బుద్దులు
పెద్దోళ్ళకి తెలిస్తే అవుతుంది నీ బాసు బద్దలు
[ఆమె] అమ్మమ్మ మ్మమ్మా . . . మావయ్యది మొగల్తూరు
[అతడు] మీ నాన్నది పాలకొల్లు నాకు తెలుసు హయ్ సా హయ్ సా ...

చరణం 2

[ఆమె] నా లాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్లానివి నువ్వేనోయ్ సారు
నీకు పెనిమిటిని నేను అవుతానోయ్ సారు
[అతడు] అతిలోక సుందరి నా జతకొచ్చి వాలుతుంటె
అన్నిటికి ఓ.కె.నే పిల్లా అటు ఇటిపైన పర్లేదే పిల్లా
[ఆమె] నా లాంటి కన్నెతోటి కాపురమే చేశావు కధ అడ్డం తిరుగుతుంది సారు
ఆపై నీ కడుపే పండుతుంది సారు మాష్టారు మాష్టారు స్టూడెంటు మీకు కాదు
జోడు మావయ్యకి తెలిసిందో మిమ్మల్ని రఫ్‌ ఆడిస్తాడు

మల్లెలవాన మల్లెలవాన నాలోన

పల్లవి

[ఆమె] మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలో విరబూసేనా ||మల్లెల||
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతినిముషానా ||మల్లెల||

చరణం 1

చిన్న చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు
తుళ్లుతున్న అల్లరులే ముళ్లువేసి రోజాలు
[అతడు] అందమైన ఆశవై చిందలాడు ఊహలే నందనాల పొదరిళ్లు
[ఆమె] గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
[అతడు] ఓ . . . వన్నెల పరవళ్లు పున్నాగ పరిమళాలు
[ఆమె] వయసే తొలిచిత్రం చూసే సమయాన
మైమరచే ఆనందాలే ప్రతినిముషాన ||మల్లెల||

చరణం 2

[అతడు] కొమ్మలేని కుసుమాలు కళ్లలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
[ఆమె] కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే - పారిజాతహారాలు
[అతడు] ముద్దుగుమ్మ ఎదలో మెగ్గవిచ్చు కధలే - ముద్దమందారాలు
[ఆమె] హొయ్ నిత్య వసంతాలు ఈపులకింతల పూలు
[అతడు] ఎప్పుడు వసివాడని వనమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిముషాన ||మల్లెల||

నానాటికి బదుకు

పల్లవి

నానాటికి బ్రతుకు - నాటకము కానక కన్నది కైవల్యమూ
నానాటి బ్రతుకు నాటకమూ . . . నాటకమూ

చరణం

పుట్టటయు నిజము పోవుటయు నిజము
నట్టనడి నీపని నాటకమూ
ఎట్టనెదుట గలదీ ప్రపంచమూ
కట్ట కడపటిది కైవల్యమూ... ||నానాటి||

అస్మదీయ మగటిమి - తస్మదీయ తకధిమి

పల్లవి

అస్మదీయ మగటిమి - తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు - భంగభంగారె భంగా
[ఆమె] వలపే ఇటుదులిపే - చెలి ఒయ్యారంగా కధలే ఇక నడిపె - కడుశృంగారంగా
[అతడు] పెనుగొండ ఎడనిండ రగిలించి వెన్నెల హలా . . .

చరణం 1

[ఆమె] నీపని - నీచాటు పని రసలీల లాడుకున్న నీ రాజసాల పని
[అతడు] మాపని . . . అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
[ఆమె] ఎపుడుపుడుడని ఎద ఎద కలిపే ఆపని
[అతడు] రేపని చురిమాపని పనిక్షణమాపని ఆపని
[ఆమె] పపపపనీ పనిగ గసని పనీ మమమమమనీ మపనీ
[అతడు] ఆపేఈ ఏదో ఇపుడే తెలుపనీ
[ఆమె] వలపనీ ||అస్మదీయ||

చరణం 2

[ఆమె] ఓసఖీ . . . రాకెందు ముఖి ముద్దులాడు యుద్ద రంగాన ముఖాముఖి
[ఆమె] ఓసఖా . . . మదునుని జనకా ఈ సందిట కుదరాలి మనకు సంధియిక
[అతడు] ఋతువున కొకరుచి మరిగిన మన సయ్యాటికి
[ఆమె] మాటికి మొగమాటవు సగమాటలు యేటికి
[అతడు] పపపపనీ పనిసగసనిపని మమమమనీ మపనీ
[ఆమె] పెళ్లికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి ||అస్మదీయ||

శోభనమే . . . వైభవముల పావనమూర్తికీ

పల్లవి

శోభనమే . . . శోభనమే . . . వైభవముల పావనమూర్తికీ
దేవదానవుల ధీరతకు ధావతిపడి వార్ధీతరువుగను
శ్రీ వనితావాణి చెలగి పెండ్లాడిన శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ||శోభనమే||

పదహారు కళలకు ప్రాణలైన

పల్లవి

పదహారు కళలకు ప్రాణలైన - నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం
పరువాల హొయలకు పయ్యెదలైన
నాఊహల లలనలకు ఊరుపుల ఆసనం
చిత్తడి చిరు చెమటల చింధులు చిలికే పధ్మిని భామినులకు పన్నీటి స్నానం
ఘలం ఘలల నడులవలన అలసిన - మీగగన జఘన సాబగులకు శీతల గంధం
రతివేద వేద్యులైన రమణులకు అనుభవైక వేద్యమైన నైవేద్యం
మీ తహతహలకు . . . తపనలకు తాకిళ్లకు ఈ కొసరు కొసరు తాంబూలం
అనంగ రంగ భంగిణులకు సర్వాంగ చుందనాల వందనం . . .

శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S., శంకర్ దాదాM.B.B.S.

పల్లవి

శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S., శంకర్ దాదాM.B.B.S.
హెయ్‌ బేగంపేట బుల్లెమ్మా అరె పంజాగుట్టా పిల్లమ్మో||2||
బాడిలోన వేడేచూసి గోళీ వేస్తానమ్మో ఓయ్‌ చింతర్‌బస్తి చిట్టెమ్మో
కూకట్‌పట్లి కిట్టమ్మో బాదే నీకు లేకుండానే దూదెరాస్త అమ్మో
ఏయ్‌ హైదర్‌గూడ గుండమ్మో శంకర్ దాదాM.B.B.S.
అరె సోమల్‌గూడ గుండమ్మో శంకర్ దాదాM.B.B.S.
అరె హైదర్‌గూడ గుండమ్మో దోమల్‌గూడ గుండమ్మో
వాటంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్త్తుచిత్తేనమ్మో కో:నీపేరేందబ్బాయా
దా. దా. దా. దా. దా. దా. దా. శంకర్ దాదా శంకర్ దాదా
శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S. ||4|| ||బేగంపేట||

చరణం 1

నడవలేనివారు ఊరికే లాగ కో: నేపెంచుకున్న కుక్కనొదులతా హె హేయ్‌
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగ,
నేరాసుకున్న కవిత చదువుతా హెహెహెయ్‌
అరె మూర్చపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మళయాళం ఫిల్మ్‌ చూపుతాఅహ జంతర్ మంతర్‌ జాలీ
అరె జూమంతర్‌ కాళీ నీ బతుకుల్లో బాధలేన్నున్నా చిన్న చిరునవ్వె మందు ఓరన్న
నిన్న హసీరనప్పు అ:నన్నిహసిరా అహ్, అహ్ అహ్ ||శంకర్‌||

చరణం 2

చేతకాని తనము టి.బి. అయితేనే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండితనము కలరా అయితేనేచూపు చూస్తే బాగుపడునులే
అన్యాయాలు, అధర్మాలు, అక్రమాలు కేన్సర్‌ అయితే అంతు
తేల్చు ఆన్సర్‌ ఉందిలే అరె మోసమన్న బి.పి. యమ స్వార్ధమన్న
షుగరు ప్రతి జబ్బుకు వైద్యముందిలే అరె అన్నింటికి ఒకే మందులే
ఏం మందుగురూ ||అ|| ఏంమందా
శంకర్ దాదా శంకర్ దాదాM.B.B.S. శంకర్ దాదాM.B.B.S.
ఓయ్‌ శంకర్ దాదాM.B.B.S., అరె జైబోలో శంకర్ దాదాM.B.B.S.
హు హ హు హ అరె శంకర్ దాదాM.B.B.S. హు హ హు హ ||4||

చక్కరంటి చూపులవాడె చక్కనైన నవ్వులవాడె చుక్కలన్ని దాటుకు వచ్చాడే

పల్లవి

చక్కరంటి చూపులవాడె చక్కనైన నవ్వులవాడె చుక్కలన్ని దాటుకు వచ్చాడే
నచ్చాడే పాలబుగ్గోడే ఇరికిచ్చాడే లేత చెలికాడే
పట్టువంటి ఒంపుల రాణె పిట్టనడుము సొంపుల జానె
ముట్టుకుంటె సిగ్గుల దొరసానే
నచ్చిందే నీటి కిల్లాడి జత కొచ్చిందే ముద్దుకు అల్లాడి
సుతారంగ కన్నేలేడి విలాసంగ
మీసం దువ్వి వయ్యారంగరా అన్నాడే
నచ్చిడే సోకు చిన్నోడే మనసిచ్చాడే కోరుకున్నోడే

చరణం 1

అలాగుచ్చినన్నే చూసి వలేబ్రిడ్జి ఎక్కించేసి ఇలా వచ్చిఒళ్ళో వాలిందే
నచ్చిందే రామచిలకమ్మా మది ముంచోద్ధే ప్రేమ చినుకుమ్మా
గులాబంటి అంధం చూసి బళా అంటూ
పందెం వేసి మతా బంటి మనసే దోచాడే
నచ్చాడే పైడి బుల్లోడే ఎరుపెక్కేలా బుగ్గగిల్లాడే
లెగుస్తూనె లేడై ఉరికె పిలుస్తూనె ఈడై దొరికే
నడుస్తూనే నడుమే చిక్కిందే హొయ్....
నచ్చిందే రాస గుమ్మాడీ నువు ఊరించే ఆశ అమ్మాడీ
నచ్చాడే కొంటె పిల్లోడే గుడిగుంచాల విందు కొచ్చాడే

చరణం 2

ఇటే పేసి రాకంటున్నా గిరెగిసి కాదంటున్నా గురేచూసి కళ్ళోకొచ్చాడే
నచ్చాడే నీటుకుర్రోడే నులివెచ్చంగా ముద్దులిచ్చాడే హా......
అదె గోల ఇంట్లోవున్న ఎదే గోల పెట్టే వేళ
ఎలా గోల వచ్చేస్తుందమ్మో
నచ్చిందే కన్నె గులకమ్మో నడిరేయల్లా తేనె మరకమ్మో
తగులుతూనె సెగలైపోయి రగులుతోనె పగలురెయి మొగలిపూల కౌగిలి ఇచ్చాడే
నచ్చాడే కోడి గిలిగాడే నిను మెచ్చాడే పూలి గిజిగాడే
నచ్చిందే హాయి నడకమ్మో ఇక తిరగేస్తే బావి గిలకమ్మో ||చక్కరంటి||

షేక్ షికాలా షేక్‌షికాలా షేకులన్ని

పల్లవి

[అతడు] రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదిలారా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారిపావురాయి పిట్టలా
వొదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా
షేక్ షికాలా షేక్‌షికాలా షేకులన్ని నాకుదక్కాలు
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీది చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునొయ్ అన్నదేతారక మంత్రం
[ఆమె] యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మాఓటుతో సీటుకే
ఎరవేసుకో ||2||||షేక్‌షికాలా||


చరణం 1


[అతడు] కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
[ఆమె] ఎత్తిపెట్టరా విల్లు ఎక్కుపెట్టారా గురిచూసి కొట్టరా
[అతడు] వెండి సోకుతో వైతరణి ఓడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తే
[ఆమె] పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
[అతడు] ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయే దేది
లేనేలేదు అన్నదే తారక మంత్రం
[ఆమె] కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా
అమృతమే జుర్రేసుకో ||2||||షేక్‌షకాలా||


చరణం 2


[అతడు] ఆనాటి రాముడు ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ
నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు
ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతోకలిసుంట
[అతడు] సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ...
[అతడు] రింగు రోడ్డులొ అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
[ఆమె] ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ
[అతడు] ఏమబ్బున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి ఆటాపాటా
కానిచ్చేయా లన్నదే తీరక మంత్రం
[ఆమె] దొంగ యమా దొంగయమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో ||2||||యంగ్ యమా||

బంభరాల చుంబనాల రంభ

పల్లవి

[అతడు] బంభరాల చుంబనాల రంభ పనసతొనల వయసు లలనఊర్వశి
జనక జలక ఎడలొతులో మునకమేనక పూట పూట నీతో ఆట ఆట
సనిపమ రీరీరీప
[ఆమె] ఈ సార్వభౌమునికే మిఓటు యమసార్వభౌమునికే మనఓటు
[అతడు] సరిసరి సరి మపనీ మపని సాస సాస సరిరిస
నిసమప సాసరీస పమపరి సనిపమ ఓటు నికేమాఓటు పమపోటు ఓటు

శ్రీకరాకారుండ భీకరాకారుండ

పల్లవి

[అతడు] శ్రీకరాకారుండ భీకరాకారుండ నరాకాధినాధుండ సురవరుండ
భూ సభౌతమ్ములందు ప్రోతండ సూరండ మార్తండ తనుజుండ మారకుండ
చండ ప్రచండ పాశండ ప్రకాయుండ కాళపాశధరుండ కర్కశుండ
దై దైయమాధృని జైహియమాగ్రని పటతోటి పొగడు సంవర్థము
ఔ అహ అహ అహ అట్టినన్ని గూర్చి రవ్వంత అదరకుండా
మంచి మర్యాద లెవ్వి పాటించకుండా ఎవడురా నక్కుడీ సభనాప
కుండా చేయుదురు మీరె ఎవరు మీరు చేయుదురె మిరె నను
లెక్కచేయకుండా ఆ ఆ ఆ ఆ ఆ ఊ

సినీతార వచ్చిందోయ్ స్వాగతాలు చెప్పండోయ్

పల్లవి

[అతడు] శంభో శంభో సాంబసదా శివ చంద్ర కళాధర సర్వలోకేశ్వరా
నీదయ మాపై చూపరా ఈశ్వరా
[అతడు] ఏయ సినీతార వచ్చిందోయ్ స్వాగతాలు చెప్పండోయ్
సాక్షాత్తు చందమామ చేతికొచ్చిందోయ్
[ఆమె]స్టైలు చూసి మెచ్చేసా పాటవిని వచ్చేసా
రూటు మాట పక్కనెట్టి ఆటకొచ్చెసా
[అతడు] రావమ్మో బుల్లెమ్మో నువ్వు ఆడేది ఎవ్వరితో తెలుసుకోమ్మో
[ఆమె] అబ్బాయో అబ్బాయో నేను తమిళ హీరోలతో ఆడినమ్మాయి
[అతడు] శివకాశి ఆటంటే అదిరిపోవాలా నేను చిందేస్తే శివుడైన ఈలకొట్టాలా
[ఆమె] నేను స్టెప్పేస్తే కుర్రకారు గోలపెట్టాలా

నేను కనుసైగ చేసానో వేడిపుట్టాలా ||సినీతార వచ్చిందోయ్||


చరణం 1


[అతడు] మనిషన్నాక మనసుండాలి ఆదుకునే గుణముండాలి
[ఆమె] నీలా అంత ఆలోచిస్తే లోకమిలా ఎందుకుంటది
[అతడు] అరె కాస్టిఫ్యాన్ కంటె విలువైనది మాగుర్తు పేదొల్లకు ప్రియమైనది
[ఆమె] మోడ్రన్ ఫ్రిజ్‌లు మోటార కంటె ఈ కుండలో వాటర్ ఎంతో మిన్న
[అతడు] నాకెందుకు నీతో గొడవ
[ఆమె] అయితే గురువా ఇస్తా చొరవా
[అతడు] అభిమాన తారవు నీవేనంట మా మనసుల్ని ముద్దుగా గెలిచావంట
[ఆమె] మాటలలో మాయ చేసి మాస్ కుర్రోడ
కొత్తస్టెప్లతో కట్టేసావు నన్ను బుల్లోడు ||సినీతార వచ్చిందోయ్||


చరణం 2


[అతడు] కృష్ణాజిల్లా, ఖమ్మంజిల్లా, ఏజిల్లా ముద్దుబిడ్డవో
[ఆమె] ఇరవై మూడు జిల్లాల్లోన నన్నెరగని వాళ్ళు లేరెమో
[అతడు] సినిమా స్టార్స్ ఓట్లడిగితే గెలుపన్నది మా సొంతం అవుతుందయ్యో
[అతడు] పేదవాళ్ళ మనసు గెలిచారంటే రేపే సి.యమ్ అవ్వచ్చమ్మో
[ఆమె] నచ్చిందయ్యో నీ అభిమానము
[అతడు] ఇక చెయ్యాలమ్మో మా సావాసములు
[ఆమె] ఎవరైనా మంచికి తలవొంచాలా
నలుదిక్కులు నీపేరు మారుమోగేలా
[అతడు] మాపాటి పేదోల్లకు అండవుతుంది
ఈ గెలుపుతో ప్రతి ఇంటికి వెలుగొస్తుందోయ్ ||సినీతార వచ్చిందోయ్||