శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా సిరిసిరి మువ్వా
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా సిరిసిరి మువ్వా
యతి రాజుకు జతి స్వరముల పరిమళ మివ్వా సిరిసిరి మువ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరిసిరి మువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించిరావా ||పరుగాపక||
చరణం 1
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ... ||పడమర||
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ...
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ||2||
నిదురించిన హృదయరవళి ఓంకారం కాని... ||శివపూజకు||
చరణం 2
తనవిల్లే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవదీపిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా ||పరుగాపక||
చరణం 3
చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో...
వికసిత సతదల శోభిత సువర్ణకమలం...
Showing posts with label - భానుప్రియ. Show all posts
Showing posts with label - భానుప్రియ. Show all posts
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే...
కుకుకు కుకుకు కుకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ||2||
రాణివాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలెందుకో కో కో
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ఏ...
చరణం 1
రంగులలోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరులా తెరలే తెరచీ రావే
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో ||2||
స్వరమై రావే విరపొదల ఎదలకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ఏ...
చరణం 2
సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు గిరుజు విడిచి రావే
గడపా తలుపూ దాటిరావే
నువ్వేలే రాజ్యం వుంది ఆ నాలుగు దిక్కులలో ||2||
లయగా రావే ప్రియ హృదయజతులతో ||కుకుకు కుకుకు||
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ||2||
రాణివాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలెందుకో కో కో
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ఏ...
చరణం 1
రంగులలోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరులా తెరలే తెరచీ రావే
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో ||2||
స్వరమై రావే విరపొదల ఎదలకు
కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే ఏ...
చరణం 2
సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు గిరుజు విడిచి రావే
గడపా తలుపూ దాటిరావే
నువ్వేలే రాజ్యం వుంది ఆ నాలుగు దిక్కులలో ||2||
లయగా రావే ప్రియ హృదయజతులతో ||కుకుకు కుకుకు||
కీరవాణి... చిలకలా కొలికిలా పాడవేమే
సా... నిసరీసాని... సా నిసమగామరి
పదసా... నిసరీసాని...
సా... నిసమగామరి
పదసససని రిరిరిన గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని...
కీరవాణి... చిలకలా కొలికిలా పాడవేమే
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురసవాణి... కీరవాణి... ||చిలకల||
చరణం 1
గరిస పమగ పాని సరిగ రిగస నీద...
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే...
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే... కీరవాణి
చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పువులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన
మంజులవాణి ||కీరవాణి||
చరణం 2
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడుచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే ||కీరవాణి||
పదసా... నిసరీసాని...
సా... నిసమగామరి
పదసససని రిరిరిన గగగరి
మమమగ పా...
సా ని ద ప మ గ రి స ని...
కీరవాణి... చిలకలా కొలికిలా పాడవేమే
వలపులే తెలుపగా
విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురసవాణి... కీరవాణి... ||చిలకల||
చరణం 1
గరిస పమగ పాని సరిగ రిగస నీద...
ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా
నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే...
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే... కీరవాణి
చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పువులు వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన
మంజులవాణి ||కీరవాణి||
చరణం 2
నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై
ఎదలో ఎదలే కదిలే
పడుచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే ||కీరవాణి||
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూచిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా ||ఆకాశంలో||
చరణం 1
మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికెయ్‌నా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నాకోసం నవరాగాలే నాట్యమాడెనుగా... ||ఆకాశంలో||
చరణం 2
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల తేలే గీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా... ||ఆకాశంలో||
ఆనందాలే పూచిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా ||ఆకాశంలో||
చరణం 1
మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికెయ్‌నా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నాకోసం నవరాగాలే నాట్యమాడెనుగా... ||ఆకాశంలో||
చరణం 2
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల తేలే గీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా... ||ఆకాశంలో||
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ... ఆ...
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా (2)
కొమ్మచాటునున్న కన్నె మల్లికి (2) ||కొత్తగా||
చరణం:1
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నొ నేర్చింది కలికి ఏటి నీరు
అహహా హహహా.. అహహా హహహా.. ఆ...
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి (2)
మేఘాల రాగాల మాగాణి ఊగేల
సిరిచిందులేసింది కనువిందు చేసింది ||కొత్తగా||
చరణం:2
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానకేళి
అహహా హహహా.. అహహా హహహా.. ఆ.. ||వెదురులోకి||
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది ||కొత్తగా||
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా (2)
కొమ్మచాటునున్న కన్నె మల్లికి (2) ||కొత్తగా||
చరణం:1
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నొ నేర్చింది కలికి ఏటి నీరు
అహహా హహహా.. అహహా హహహా.. ఆ...
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి (2)
మేఘాల రాగాల మాగాణి ఊగేల
సిరిచిందులేసింది కనువిందు చేసింది ||కొత్తగా||
చరణం:2
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానకేళి
అహహా హహహా.. అహహా హహహా.. ఆ.. ||వెదురులోకి||
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది ||కొత్తగా||
Subscribe to:
Posts (Atom)