పల్లవి
తెలుగుపదానికి జన్మదినం - - - ఇది జానపదానికి జ్ఞానపధం
ఏడు స్వరాలే ఏడుకొండలై - వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం . . . 3
చరణం 1
అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్డమిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదా శీస్సులు పొందినడై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమురుధ్వనిలో గబకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
వీరధ మండల నారదతుంబర మహతీ గానపు మహితుల తెలసి
పీతమహీ కందర యతిరాజ్ సభలో తప: ఫలమ్మగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమంబ గర్భాలయమ్ములో
ప్రవేశించే ఆనందకము, నందనానంద కారకము
చరణం 2
పద్మావతియే పురుడు పోయగా పద్మాసునుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై అంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
చరణం 3
పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పదకవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగై అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
Showing posts with label * రేణుక. Show all posts
Showing posts with label * రేణుక. Show all posts
Subscribe to:
Posts (Atom)