Showing posts with label - పామర్తి. Show all posts
Showing posts with label - పామర్తి. Show all posts

శ్రీ రమణా హే శ్రిత కరుణా

శ్రీ రమణా హే శ్రిత కరుణా
జగతి మోహన ఖగపతి వాహన
సురవందిత మృదు చరణాదేవా
||శ్రీ రమణా||

ఓంకారాత్మకదేవా కోకానుగ్రహ భావా
కౌస్తుభమవేశోభితగ్రీవా కారుణ్యదర మునిజనసేవా
||శ్రీ రమణా||

సత్య కాంతయమూర్తి - దైత్య నాశకరాకీర్తీ
చకిత చరాచర దశితార్తి - సకల విశ్వపరిపాలన స్పూర్తీ
||శ్రీ రమణా||

కుక్షింభర నిర్మితభువనా అక్షయ సద్గుణ భువనా
సృష్టికారణా శిష్టపోషణా పాలిత ఆశ్రిత భక్తగణా
||శ్రీ రమణా||

హర హర శివ శంభో

వందేశంభు ముమాపతిం
సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం శశిధరం
వందే పశూనాం పతిం
హర హర శివ శంభో
భవహర శుభ గుణ గిరిజా బంధో
||హర||

అఘమేఘ హరణ ప్రభంజనా
నిరాకార నిర్వికల్ప గమనా
సత్య స్వరూపా నిర్వాణకారణ
[ప్రమధగణం] పాదానతహరి ముఖ సురబృందం
సంధ్యా సంధిత నటనానందం
సర్వాకాండకటాహిత తుందం
సర్వేశం జగదాది మకందం
హర హర శంభో - హర హర శివ శంభో