Showing posts with label - అనిత. Show all posts
Showing posts with label - అనిత. Show all posts

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగబంధం ప్రేమే వేదమంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని
మనకున్న బలమే ప్రేమ ప్రేమా ||నువ్వేనాకు||

చరణం 1

నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమలేని జీవితం లేదనీ
ఒకటై పలికేనట ఈ పంచభూతాలు ||నువ్వేనాకు||

చరణం 2

నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపే
చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటూ లేనిదే ప్రేమనీ
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు ||నువ్వేనాకు||

ప్రియతమా ఓ ప్రియతమా

ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం ||2||
నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని
కలవరిస్తోందని తెలుసా ||ప్రియతమా||

చరణం -1

ఎప్పుడో అపుడెప్పుడో
ముడిపడినదీ బంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో
వానవిల్లు ఏదో మెరిసిందిలా
పూలజల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో
ఈ వింత మాయనేమంటారో ||ప్రియతమా||

చరణం -2

గుట్టుగా కనిపెట్టగా మనసంత నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా ఎదనిండా నీ జ్ఞాపకాలే
నిన్ను చూడకుండా మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో
ఈ వింత మాయనేమంటారో ||ప్రియతమా||
నిన్ను చేరిందని తన మనసు విప్పిందనీ
ఐ లవ్‌ యూ అంటోందనీ తెలుసా ||2||

బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ

పల్లవి

బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ
బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ హాయ్‌ పాడరద్ది కుంకుమెట్టి
ముస్తాబయ్యొస్తే అడుదామే కోక్కో కోలాటం
చీరకట్టి సెంటుకొట్టి నా చెంత కొస్తే
చూపుతాలె కుర్రాడి వాటం
మల్లీ మల్లీ నా మామా మల్లీ
మల్లీ మల్లీ నా మామా మల్లీ హాయ్ డాబు చాలు గాని
బాబూ నీ చెంత కొస్తే
ముగ్గులాగ ముడిచేసుకుంటావ్‌
గడ్డి వాము చాటు కొచ్చినే సైగచేస్తే సిగ్గుతోటి లగ్గెత్తుకుంటావ్‌
ఆ పంచ కట్టేసి ఓ పింఛమెడితే
కిట్టయ్య లాగా మా బాగా వున్నావే
అందాల రాధమ్మ నువ్వు గాని అయితే
నీ పక్కనేను కిట్టయ్య నవుతాలే
అమ్మదొంగ ఎటకారం వద్దు
ఇంక నాతో చెలగాటం వద్దు ఒక్కటయ్యే వీలే లేదా
ఓ వెన్నదొంగా ఈ కన్నెబెంగ తీరేది ఎట్టాగా
నా సామిరంగా బంగారు జింకా పట్టింది నేనేగా ||బుల్లీ బుల్లీ||
నీ నవ్వు ముత్యాలు నే తీసుకెళ్ళి
ముత్యాల హారం చేయించి ఇస్తాలే
నీ సూపు వజ్రాలు నేనేరుకెళ్ళి అద్దాలమేడ కట్టించి ఇస్తాలే...
అయ్య బాబాయ్‌ గాలే కొట్టొద్దు
నువ్వు కూడ అట్టే మొయ్యెద్దు నేనంటేను ప్రేమేలేదా
వయ్యారి బాలా ఓ మేఘమాలా పండింది నా పంటా
ఓ చందమామా నా మేనమామా నేనేగా నా జంటా ||బుల్లీ బుల్లీ||

మోనాలిసా మోనాలిసా మోనాలిసా మోనాలిసా

పల్లవి

మోనాలిసా మోనాలిసా మోనాలిసా మోనాలిసా
నా మనసునే చేశావులే నీ బానిసా
నీ ప్రేమకై వూగిందిలే ఎదవూగిసా

చరణం 1

అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీ వైపే చూడగా
శిరసు నూపింది పువ్వు నీ సిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులే నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యానులే నీ చూపు సోకగా
జంటగా చేరగా మారిందిలే నా దశ ||మోనాలిసా||

చరణం 2

మోగిపోవాలనుంది మది గుడిలో నాదమై
మెరిసి పోవాలనుంది పెదవింట్లో నవ్వునై
ఒదిగి పోవాలనుంది కౌగిట్లో కాలమై
నిలిచి పోవాలనుంది పాపిట్లో తిలకమై
బిగిసి పోతానులే నీ కంటి బిందువై
నిత్యమూ చేయనా నీ గుండెలోన బస ||మోనాలిసా||

తియతీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో

పల్లవి

తియతీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళైనా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో...
నేనవరన్నది నేమరిచి పోగలను చూస్తూ నీ కళ్ళలో...||తియతీయని||

చరణం 1

చల చల్లని మంచుకు అర్ధమే కాదు ప్రేమ చలువేమిటో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చిరాని కన్నీళ్ళకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దేలేని అధరాలకే తెలుసు ఈడు భాధేమిటో...||తియతీయని||

చరణం 2

మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచి పోతుంది ప్రేమ సంకెళ్ళలో ||తియతియ్యని||

మామారే మజారే మామారే మజారే మామారే మజారే మజ్జా

పల్లవి

మామారే మజారే మామారే మజారే మామారే మజారే మజ్జా ...2
అరె ఊరంతా వినేలా పాడు
అహా కొండంతా ఖుషీగా ఆడు
మన శ్రీరాముడు మరో జన్మెత్తాడు
మళ్ళీ వచ్చాడు ఈనాడు

చరణం 2

మనసుల జత వయసుల జత కలిసే వేళ
మనగడ కధ మధురం కద చాలా చాలా
అందాల నీ ప్రేమ రాజ్యానికి అధికారి నేనేసుమా
సందేళ సరిలేని సరసానికి దొరసాని నువ్వే సుమా
ఇలా రెండింతలై అలా మూడింతలై
భలేగుంది పెరిగింది కేరింత ఇంత అంతకంత ||మామారే||

చరణం 2

కాదననిక లేదననిక ఏదైమైనా
రేపననిక మాపననిక ఏకంకానా
వయ్యారొ నీమేని వుయ్యాలలో వెయ్యేళ్ళు వూగేయనా
వెన్నంటి నువ్వుంటే నా బాటలో స్వర్గాలు పాలించనా
ఇది తరంగమో మరీ వీరంగమో
ఈ వంక చూడంగ వేగంగా నింగి వంగి పోయె ||మామారే||

పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా

పల్లవి

పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా...2
ఒక్కోలా వుందిర బాలా దిల్‌ ధడక్‌ ధడక్క్‌లా
ఎవ్రీడ్‌...హొళీలా...ఉంటుందే... మీవల్లా... ||పెదవుల్లో||

చరణం 1

హంస నడకలు సిగ్గుపడేలా పిల్లనడకల స్టైలా
హింస పెట్టి చంపేసేలా కొంపముంచే స్మైలా
వానవిల్లే ఖంగుతినేలా ఇన్ని రంగులు చూపాలా
మేల్‌ జాతికి కీడొచ్చేలా వుంది మీ వల్లా ||పెదవుల్లో||

చరణం 2

పడుచు పాపలు నవ్వితే ఇలా ఫాంటసీ ఫౌంటెన్‌లా
నైటు మొత్తం నాటీ కలలే శాటిలైట్‌ ఛానల్‌లా
ఎగిరి పోదా గాలి పటంలా వయసు మీ వెలకాలా
గుండె నమిలేలా నడవాలా నెమలి పింఛంలా ||పెదవుల్లో||

చిన్న చిరునవ్వులోని కాలి సిరి మువ్వతోటి

పల్లవి

చిన్న చిరునవ్వులోని కాలి సిరి మువ్వతోటి
కొత్తగా చెప్పనమ్మా కన్నెప్రేమా
నీలి మేఘాలలోనా నీటి ముత్యాలలాగా
గుండెలో చేరేనేమో ఇంత ప్రేమా
నువ్వే నువ్వే నాలో సాగే మనోభావనా
నువ్వే నువ్వే నాలో పాడే ప్రియాలాపనా

చరణం 1

ప్రేమలో తేలితే ఈడుకి మాటలే వుండవా
ఇద్దరూ ఒక్కటై ఉండగ మాటలే దండగ
తీపి రాగాల ప్రేమగీతాలు పాడగా పల్లవీ
పంచభూతాలు చెంతకే చేరి మోయవా పల్లకీ
ఈ ప్రేమే ఇక నడుపునులే బంగారులోకాలకీ ||చిన్న చిరునవ్వు||

చరణం 2

ముందుగా చూడనే లేదుగ ప్రేమలో తీపినీ
అందరూ చేదనే మాటలు ప్రేమలో లేవనీ
ప్రేమనే ప్రేమ కానుకిచ్చాక నమ్మనే లేదుగా
ప్రేమ ప్రేమించి నన్ను మార్చాక నేనునేకాదుగా
ఆ నువ్వే నా జత కలిసి నా నువ్వు అయ్యావుగా ||చిన్న చిరునవ్వు||