Showing posts with label - రాజ శ్రీ. Show all posts
Showing posts with label - రాజ శ్రీ. Show all posts

కనులు కనులతో కలబడితే

పల్లవి

కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి
కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగువుకు ఫలమేమి,
కలలే . . .
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి
మరులే . . .
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి
మనువు . . .
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ తీరేమి
సంసారం ||కనులు . . .||

చరణం 1

అల్లరి ఏదో చేసితిని చల్లగ ఎదనే దోచితివి ||2||
ఏమీ లేని పేదనని నాపై మోపకు నేరాన్ని ||2||
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం ||2||
నింగీ నేలకూ కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం ||కనులు . . .||

కన్నులు నీవే కావాలి

పల్లవి

కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలి కావ్యం నేనై నిలవాలి ||కన్నులు . . .||

చరణం 1

మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి
కడలి నేనై పొంగాలి నదివి నీవై తేరాలి
నదివీ నీవై తేరాలి ||కన్నులు||

చరణం 2

తొలకరి నీవై చిలకాలి మెలకను నేనై మొలవాలి ||2||
దైవం నీవై నిలవాలి ధర్మం నేనై నడవాలి
ధర్మం నేనై నడవాలి ||కన్నులు||

చరణం 3

శిల్పం నీవై కల్పం నేనై చిరకాలం జీవించాలి ||2||
చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి ||2|| ||కన్నులు||

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే

పల్లవి

సిగలోకి విరులిచ్చి చెలినొసటా తిలకమిదే
సిగపువ్వు వాడకనే చెలి బ్రతుకు వాడెనయా ||సిగలోకి||

చరణం 1

పరువానికి బలవంతానా పగ్గాలే వేస్తావా
మనసు మూసిమమతలు రోసి మనుగడ మసిచేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా తలుపులణగిపోయేనా
ఇరువైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా ||సిగలోకి||

చరణం 2

తీయనైన జీవితాన చేదువిషం తాగేవా
తోడునీడగా ఒకరుండి ఏకాకిగా బ్రతికేవా
కోరినది చేతికి చిక్కి ఆరుతున్నదొక దీపం
కోరినది చేతికి రాక ఆరకున్నదొక తాపం
ఆరకున్నదొక తాపం ||సిగలోకి||

వలపువలె తీయగా

పల్లవి

వలపువలె తీయగా వచ్చినావు నిండుగా ||2||
మెరుపువలె తళుకుమని మెరసిపోయేటందుకా ||వలపువలె||

చరణం 1

తడబడు నడకల నడిచినపుడు నీ తత్తరపాటును చూడాలి
తలుపు మూయగనె దారులు వెదకె బిత్తర చూపులు చూడాలి ||2||
అని తలచి తలచి ఈ తరుణంకోసం తపసు చేసినది ఇందులకా ||వలపు వలె||

చరణం 2

మురిపము లొలికే ముద్దుమోమును కురులమబ్బులో దాచుటకా
మిసమిసలాడే నొసట కుంకుమ చిరుచెమటలలో కరగుటకా ||2||
ఎదను తెరచి నీవిన్నినాళ్ళుగా ఎదురు చూచినది ఇందులకా ||వలపువలె||

కొత్త పెళ్ళికూతురా

పల్లవి

కొత్త పెళ్ళికూతురా రా రా నీ కుడికాలు ముందు మోపి రా రా
గణపతి కులసతి రా రా నువు కోరుకున్న కోవెలకు రా రా ||కొత్త||

చరణం 1

కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు చెలిమికి మాగాణి నువు మెట్టినిల్లు ||2||
ధనమున్నది బలమున్నది నీ ఇంటా ||2||
మనసున్నది మమతున్నది మా ఇంట ||కొత్త||

చరణం 2

పై మొరుగులు పైడి నగలు లేవు ఇక్కడ
పంతాలు సాధింపులు రావు ఇక్కడ ||2||
నిండు మనసు చిరునగవు పండునిక్కడ ||2||
ఆ పండు వెన్నెలందు దినం పండుగిక్కడ ||కొత్త||

చరణం 3

కన్నతల్లి కన్నమిన్న మీ అత్తగారు కనిపించే దైవము చేకొన్న వాడు ||2||
కలలన్నీ నిజమౌ నీ కాపురానా ||2||
కలకాలం వెలుగు నీ ఇంటి దీపము ||కొత్త||