Showing posts with label - పృధ్వి. Show all posts
Showing posts with label - పృధ్వి. Show all posts

సాగర ఘోషశృతిలో హిమజలపాతాల లయలో

పల్లవి

సాగర ఘోషశృతిలో హిమజలపాతాల లయలో
సంగీతం భారత సంగీతం సునోరే భాయీ సునోరే
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం - 2
తాన్నేన్‌ రాగమిది త్యాగరాజ గానమిది

చరణం 1

ఓ సత్యాహింసలు శృతిలయిలైన మానవతాగీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం సకల మత సమ్మతం ప్రపంచ శాంతి సంకేతం ||శాంతి||
సూర్యోదయం భూపాళం, చంద్రోద్యం హిందోళం
ఈ లోకమే స్వర్ణ సందేశమే, ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమెరికన్‌ గిటారుపై హంసద్వని చెలరేగగా
జర్మన్‌ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇకమీరే పరవశలవుదురులే
హిందుస్తానీ రాగాలు తియ్యనైనని, కర్ణాటిక్‌ భావాలు కమ్మనైనవి
సగామగామాద మదాని సానిదసా
ఇంద్ర ధనుసు రంగులైన ఎడారిలో వానలైన
ఐవిల్‌ క్రియేట్ విత్ మై మ్యూజిక్, ఎస్‌ ఎస్‌ ||శాంతి||

చరణం 2

దేశదేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా
ఆనందమే మధురానందమే, పసిఫిక్‌ కన్నలోతు ఎవరెస్టు కన్న ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్
తూర్పు పడమర విశ్వగానమే చేయగా శాంతికి స్వాగతం
సుస్వరాలదో ఈయగా అణుయుద్దములే జరగవులే
సరిహద్దుల గొడవలు తీరునులే, ప్రతిరోజు ఒక పండుగలే
ఇల మానవులందరు బంధువులే సూరదాస్‌ ఎంకిపాట చికాగో జీన్స్ పాట
నయాగారా హోరులో ఆలపించగా సగమద గమనిస నిసగమనిదస - 2
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు పంచమాల వసంతాలు తారా స్ధాయి షడ్యమాలా
సాధ్య మధుర తంబుర దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయగానము ||సమ|| ||శాంతి||

మహాకనకదుర్గా, విజయకనకదుర్గా

పల్లవి

మహాకనకదుర్గా, విజయకనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా - 2
శివంకరీ శుభంకరీ సూర్యచంద్ర కళాధరీ
బ్రహ్మవిష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలకరీ
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తీ ||మహా||

చరణం 1

ఓంకార రావాల అ ల ల కృష్ణాతీరంలో ఇంద్రకీల గిరిపైన వెల్సెను కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను,
పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను
విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగ కనకదుర్గ కైనది స్ధిరనివాసము
మేలిమి బంగారు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమా
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడకా
ప్రేమా కరుణా వాత్సల్యం కురిపించే దుర్దరూపం
ముక్కోటి దేవతలందరికి ఇది ఇల్లే పుట్టిదీపం ||మహా||

చరణం 2

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణకవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే సుమంత్రరూపీ గాయత్రీ
లక్షల సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణీ మహాలక్ష్మీ
విద్యా కవన గాన మొసగు వేదమునీ సరస్వతీ,
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శతృ వినాసిని సత్యస్వరూపిని మహిషాసురమర్ధినీ,
విజయకారిణి అభయ రూపిణి శ్రీ రాజరాజేశ్వరీ,
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం ||మహా||

మీ ప్రేమకోరే చిన్నారులం

పల్లవి

మీ ప్రేమకోరే చిన్నారులం, మీ పడిని ఆడే చందమామలం - 2
గోరుముద్దలెరుగనీ బాల కృష్ణులం
బాధపైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మానాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా ||మీ||

చరణం 1

కమ్మగా మా అమ్మచేతితో ఏ పూట తింటాము ఏడాదిలో
చక్కగా మా నాన్న పక్కగా సరదాగ తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెడతారు రాత్రికి ఎపుడో వస్తారు
మరిమరి అడిగినా కధలు చెప్పరూ మేమేం చెప్పినా మనసుపెట్టరూ
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ, ఏమిచెయ్యాలో మాకు దిక్కుతోచదూ ||ఆలో|| ||మీ||

చరణం 2

పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం
పువ్వులం మీ ఇంటి నవ్వులం నీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం
కనిపించే మీరే దేవుళ్ళు కనిపించే శివుడూ పార్వతులూ
లోకం బూచికి మా గుండె వణికితే మాకు ధైర్యమిచ్చేది మీలాలింపే
అమ్మనాన్నలిద్దరూ వేరు వేరయీ, అనాధలను చేయకండి పసిపిల్లలనీ ||ఆలో|| ||మీ||

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయికధా

పల్లవి

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ సాయి ప్రేమ సుధా - 2
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ - 2 ||సిరు||

చరణం 1

షిరిడీ గ్రామంలో, ఒక బాలుని రూపంలో
వేపచెట్టుక్రిందా, వేదాంతిగా కనిపించాడు, తన వెలుగును ప్రసరించాడు
పగలూరేయీ ధ్యానం, పరమాత్మునిలో లీనం - 2
ఆనందమే ఆహారం, చేదు చెట్టునీడయే గురుపీఠం
ఎండకు వానకు కృంగకు, ఈ చెట్టు క్రిందనే ఉండకూ
సాయీ ... సాయిరా మశీదుకు అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ బాబా బొధల నిలయమనోయి ||సిరు||

చరణం 2

ఖురాను బైబిలు గీత ఒకటని కులమత భేదము వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే, ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసి నీటి దీపములను వెలిగించే
పచ్చికుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి
నిండీభణమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
కప్పకు పాముకు స్నేహం కలిపే, తల్లి భాషకు అర్ధం తెలిపే
ఆర్తుల రోగాలను హరియించే, భక్తుల బాధలు తాను భరించే
ప్రేమా సహనం రెండు వైపుల ఉన్ననాడే గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికే
సాయిరాం సాయిరాం సాయిరాం - 4
నీదని నాదని అనుకోవద్దని ధునిలో ఊది విభూదిగనియిచ్చే
భక్తి వెల్లువలు జయజయఘోషలు కావడి ఉత్సవమై సాగగా
కక్కడ హారతులను అందుకోని కలిపాపాలను కడుగగా
సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి
తృటిలోన పగులగా పరిపూర్ణుడై గురుపౌర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై శరీర శేవాలంగన చేసి
దేహము విడిచెను సాయీ, సమాధి అయ్యెను సాయి
సాయిరాం సాయిరాం సాయిరాం -5
అఖిలాండకోటి బ్రహ్మండ నాయక శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్‌ ...

అయ్యప్ప దేవాయ నమః

పల్లవి

అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయనమః - 2
హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయనమః
నిజభీర కంభీర శభరీగిరి శిఖర ఘన యోగ ముద్రాయనమః
పరమాణు హృదయాంతరాళ స్ధితానంత బ్రహ్మండరూపాయనమః ||అయ్యప్ప||

చరణం 1

పద్దెనిమిది పడిమెట్లపైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చె బంగారు స్వామి
ఇరుముడులు స్పృశించి శుభులనుచు దీవించి జనకృందములచేరె జగమేలు స్వామి
తనభక్తులొనరించు తప్పులకు తడబడి ఒకప్రక్క కొరిగెనా ఓంకార మూర్తి
స్వామియే శరణం అయ్యప్ప
స్వాములందరు తనకు సాయమ్ముకాగ ధీమంతుడైలేచి ఆకన్నె స్వామి
పట్టబంధము వీడి భక్తతటికై పరుగుపరుగున వచ్చె భువిపైకి నరుడై ||అయ్యప్ప||

చరణం 2

ఘోర కీకారణ్య సంసార యాత్రికుల శరణుఘోషలు విని రోజు శబరీషా
పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానది తీర ఎరుమేలి వాసా
నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామీ
మకర సంక్రాంతి సజ్యోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి
కర్మబంధము బాపు ధర్మ శాస్త్ర కలిభీతి తొలగించు భూతాదినేత ||అయ్యప్ప||

చరణం 3

ఆద్యంత రహితమో నీ విశ్వరూపము అజ్ఞాన తిమిరమ్ము అణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు పడిమెట్లుగా మారె ఈ దోపు ఊపం
అమరులెల్లరు చేయు అమృతాభిషేకం, నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం
ఓ ... పదములకు మ్రొక్కగా ఒక్కొక్కలోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం
పంపానదీ తీర శంపాల పాపాత్మ పరిమార్చు స్వామి, భక్తులను రక్షించు స్వామీ
శరణమయ్యప్పా - శరణమయ్యప్పా
శంభు విష్ణు తనయ శరణమయ్యప్పా - 2
స్వామియే శరణమయ్యప్పా - 2 ఓం శాంతి శాంతి శాంతిః - 2

అందరి బంధువయా భద్రాచల రామయ్యా

పల్లవి

రామా ... రామా ...
అందరి బంధువయా భద్రాచల రామయ్యా
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా - 2
చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా - 2
కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్యా ||అంద|| ||రామా||

చరణం 1

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యము నేలే రామయ్యా
తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయ్యా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్యా
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోసించెనయ్యా
అసురునిత్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ్యా
సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయా
నారాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ... ఆ ... 2
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా
కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా ||అంద||

చరణం 2

భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు బద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్ధలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్ధమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా - 2
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరీ అయ్యా
ఈ క్షేత్రం తీర్ధం దర్శించిన జన్మ ధన్యమయ్యా ... ||అంద||

వక్రతుండ మహాకాయ, కోటిసూర్య సమప్రభా

పల్లవి

వక్రతుండ మహాకాయ, కోటిసూర్య సమప్రభా,
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా... ఆ
జయజయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

చరణం 1

బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరముల నిడుమహానుభావా
ఇష్టమైనదీ వదిలిన నీకడ ఇష్టకార్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతీ
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతీ
నీగుడిలో చేసే సత్యప్రమాణం ధర్మదేవతకు నిలపును ప్రాణం
విజయకారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం ||జయ||

చరణం 2

పిండి బొమ్మవై ప్రతిభచూపి బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మగణపతివైనావు
వేదపురాణములఖిల శాస్త్రముల కళలు చాటులను నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని
విభుదులు చేసే నీకీర్తనం ||జయ||