Showing posts with label * సాధనా సర్గమ్‌. Show all posts
Showing posts with label * సాధనా సర్గమ్‌. Show all posts

పలికే గోరింకా.. చూడవె నా వంకా...

పలికే గోరింకా.. చూడవె నా వంకా ఇక వినుకో నా మది కోరికా
అహ నేడే రావాలి నా దీపావళి పండగా ||నేడే||
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితె రోజా నేడే పూయునే

చరణం 1

పగలే ఇక వెన్నెలా... ఆ.. పగలే ఇక వెన్నెలా వస్తే.. పాపమా
రేయిలో హరివిల్లే వస్తే నేరమా
బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ ||2||
కొంచం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం
నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియించు
కలలే.. ఏ.. దరిచేరవా..

చరణం 2

నా పేరే పాటగా... ఆ.. నా పేరే పాటగా కోయిలే.. పాడనీ
నే కోరినట్టుగా పరువం మారనీ
భరతం తం తం మదిలో తం తోం ధిం ||2||
చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నిమరనీ
రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు
బ్రతుకే.. ఏ.. బతికేందుకు..

నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా...

నిన్నేనా.. నేను చూస్తుంది నిన్నేనా..
నువ్వేనా.. నువ్వులా ఉన్న ఎవరోనా..
కోపంలో నిప్పుల కొండలా.. రూపంలో చుక్కల దండలా..
నవ్వులో చిలకమ్మలా.. చిన్నారుల చేతికి బొమ్మలా..
ఇంతకీ నువ్ ఒకడివా వందవా… ఎంతకీ నువ్ ఎవరికీ అందవా..
కొత్తగా loveలో పడుతుంటే.. కొద్దిగా ఇదిలా ఉంటుందే..
ముందుగా మనసుకి తెలిసుంటే.. ముందుకే నెడుతూ ఉంటుందే..
తప్పుకోవాలనుకుంటూనే.. తప్పుకోలేననుకుంటుందే..
నొప్పిలో తీపి కలుస్తుందే.. రెప్పలో రేపు మరుస్తుందే.. ||నిన్నేనా||

చరణం 1

తడవక నడిపే గొడుగనుకోనా.. అడుగుల సడిలో పిడుగైనా..
మగతనిపించే.. మగతనమున్నా.. మునివనిపించే.. బిగువేనా..
ముళ్ళలా నీ కళ్ళిలా నను గిల్లిపోతున్నవా..
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నవా..
నాకేమవుతావొ.. చెప్పవ ఇపుడయినా..
చెప్పమని అడిగేం లాభంలే..
ఎప్పుడో పొందిన answerలే ఉత్తినే వేసే questionలే..
ఊరికే తీసే ఆరాలే.. నిద్ర చెడగొట్టే నేరాలే..
కుదురుగా ఉంచని తొందరలే… దరిమిలా అంతా నీ వల్లే,
అంటు నిలదీసే నిందల్లే… ||నిన్నేనా||

చరణం 2

బిత్తరపోయే బెదురొదిలించూ.. కొత్తగ తెగువే కలిగించు
కత్తెర పదునై బిడియం తెంచు.. అత్తరు సుడివై నను ముంచు..
చెంప కుట్టే తేనె పట్టై ముద్దులే తరమనీ..
చెమట పుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ..
అని అడగాలన్నా.. అడిగేయ్ లేకున్నా…
||చెప్పమని|| ||నిన్నేనా||

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ ||2||
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ ||పెదవే పలికిన||

చరణం 1

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగా..
జో లాలి పాడనా.. కమ్మగా.. కమ్మగా ||పెదవే పలికిన||

చరణం 2

పొత్తిళ్ళో ఎదిగే బాబు..
నావొళ్ళో ఒదిగే బాబు..
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు..
నా కడుపున పుట్టేవాడు..
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్ననీ.. వాడి నాన్ననీ..
నూరేళ్ళు సాకనా.. చల్లగా.. చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూన..
ముద్దుల కన్నా జో.. జో
బంగరు తండ్రీ.. జో.. జో.. బజ్జో లాలి జో..
పలికే పదమే వినక కనులారా నిదురపో..
కలలోకి నేను చేరి తదుపరి
పంచుతాను ప్రేమ మాధురి ||ఎదిగీ||
బజ్జో లాలి జో.. బజ్జో లాలి జో..

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా కృష్ణా
ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ||2||
వెన్న దొంగవైనా మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయలా మృదంగానివా ||ముకుందా||
జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ||ముకుందా||

చరణం 1

నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి
నాట్యమాడి కాళీయుని దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా
అట అర్జునుడొందెను
నీ దయవల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే ||ముకుందా||

చరణం 2

మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టి ముడిపడి వుంటా
ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీవే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా ||ముకుందా||

హే . . . శతమానమన్నదిలే

పల్లవి

హే . . . శతమానమన్నదిలే, చెలిమే, చిన్న చిన్నారి
ఆశలుగిలే, వంక జాబిల్లి వలపులు జిల్లే
కొత్త వాయ్యర మొచ్చింది, ఉయ్యాల వయసులలో హాల
[అతడు] హే . . . శతమానమన్నదిలే, చెలిమే, పువ్వు పాడేది
పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాల,
నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా ||శత||

చరణం 1

[ఆమె] విన్నానులే నీయదలోతుల్లో జలపాతాల సంగీతమే
[అతడు] కన్నానులే నీకన్నుల్లోన కలలేకన్నా సావాసమే
[ఆమె] కోకిలలా కిలకిలలే మన పూదోటలో
[అతడు] తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో
[ఆమె] ప్రాయమో, గాయమో, సుమసెర స్వర జతిలోన ||శత||

చరణం 2

[అతడు] చుంబనమే చలికాటే పదని చోటే గిచ్చే చూడలని
[ఆమె] చెప్పాలని నీచూపే సోకని సోకే అప్పజెప్పాలని
[అతడు] మరి పదవే విరిపొదకే చెలి మర్యాదగా
[ఆమె] యద కడిగే ఎదురడిగే సిరి దోచెయ్యనా
వీణవో జాణవో రతిముఖ సుఖ శృతి లోన ||శత||

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా

పల్లవి

[అతడు] తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా ||2||
[ఆమె] తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా
తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా
[అతడు] తుహిమేరా సర్వస్వమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||

చరణం 1

[అతడు] నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా ఈ అమ్మవొడి నువ్వేగా
[అతడు] నననా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా పడుచు నస నువ్వేగా
[ఆమె] కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే
[అతడు] నువ్వే దక్కే దూరమా నువ్వే తేలిక భారమా తుహిమేరా ఆ భారమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||

చరణం 2

[అతడు] నాసిగ నువ్వే నాసెగ నువ్వే నా పొగనువ్వేగా చిలిపి పగనువ్వేగా
[అతడు] నాసిరి నువ్వే నా తరి నువ్వే నా సరి నువ్వేగా అసలు గురి నువ్వేగా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||