అదిగో నవలోకం వెలసే మనకోసం...

ఆ... ఆ... ఆ...
అదిగో నవలోకం వెలసే మనకోసం
అహాహాహా ఆహా ఆహహా ఓ హోహోహో ||అదిగో||

చరణం 1

నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై ||నీలి||
దూరదూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం ||దూరదూర||
ఎచట సుఖముందో ఎచట సుధ గలదో
అచటే మనముందామా... ||అదిగో||

చరణం 2

పారిజాత సుమదళాల పానుపు
మనకు పరచినాడు చెఱకువంటి వేలుపు ||పారిజాత||
ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు ||ఫలించె||
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచటే మనముందామా... ||అదిగో||