Showing posts with label * రాఘవేంద్ర. Show all posts
Showing posts with label * రాఘవేంద్ర. Show all posts

ఇది ఒక ఇది ఒక నవలోకం

పల్లవి

[అతడు] ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం
వరమో వశమో ప్రేమే జగమో సుభమో సుఖమో మదిసంబరమో
[ఆమె] ఇది ఒక ఇది ఒక నవలోకం ఇద్దరి ప్రేమకు శ్రీకారం
మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం
కలివై కలసి కధ మార్చావు మెరుపై మెరసి నను తాకావు

చరణం 1


[ఆమె] కుదురంటు లేకుంది మనసుకు నిదురంటు రాకుంది ఎందుకు
[అతడు] అందర్ని చూస్తున్నాను వింతగా చుక్కల్ని లెక్కేస్తున్నా కొత్తగా
సరదాగా మొదలైన ఈ ప్రయాణం మొత్తంగ ప్రేమాయణం
ఎటు చూస్తున్నా ఏదో లోపం అటుమిదుంటే తెగ సంతోషం ||ఇది ఒక ఇది ఒక||


చరణం 2


[అతడు] చంద్రుడు చేతికి అందినా మబ్బులు మాటలు నేర్చినా
[ఆమె] పూవులు పాటలు పాడినా కొండలు నాట్యము ఆడినా
ఏ బ్రహ్మ సృష్టించాడో ప్రేమగాని జగమంతా వింతగుంది నేడు
ఎటు చూస్తున్నా అటు అద్భుతమే మాయలు చేసే మరిసంబరమే ||ఇది ఒక ఇది ఒక||

గుచ్చి గుచ్చి గుండెలపైన

పల్లవి

[అతడు] గుచ్చి గుచ్చి గుండెలపైన పచ్చబొట్టు రాసానే
పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే
నీ ప్రేమ దొరికిన సమయాన కుడికన్ను అదిరెనని అనుకున్నా
ఎడంవైపు గుండెనే పగిలేలా
నా కలలన్నీ చదిమేసావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన
నేస్తమా నువ్వు లేనిదే లోకమంతా చీకటి కాదా ||గుచ్చి గుచ్చి||

చరణం 1

[అతడు] కలమెంత కోసినా, ఎదగొంతు మూసినా చెలి చేతి స్పర్శలో చేదైన తీయన
ఆకలేసి ప్రేమ అంటే మనసు తుంచి పెట్టావే
అమ్మకాని అమ్మవు నువ్వై అమృతాన్ని పంచావే
పూలదారి పరిచింది నువ్వే... వేలు పట్టి నడిపింది నువ్వే
వెలుగుచూపి నా కన్ను పొడవకే... కంటిలోన ఉన్నది నువ్వే ||గుచ్చి గుచ్చి||

చరణం 2

[అతడు] నిప్పు కాల్చినా నీరు ముంచినా ప్రేమ రంగు ఇది మరువదులే
ఉరిమి చూసినా తరిమి వేసినా మది నీ ప్రేమను మరవదులే
రాక్షసుణ్ణి మనిషిని చేసి దేవతగా నిలిచావే
రాతిగుండె రాగం పలికే కొత్తబాట చూపావే
స్వర్గమన్న దొకటున్నదని పిలిచి చూపినది నీ నవ్వే...
దూరమై యిలా నరకమేమిటో చూపుతోంది నువ్వె నువ్వే ||గుచ్చి గుచ్చి||

ఎవ్వరే నివ్వు నన్ను కదిపావు నీ

పల్లవి

[అతడు] I think I am Love With you Na, Na, Na
I have been thinking about you, May be
Iam in love with you, I don't know, what I am doing
Don't know don't know don't know
ఎవ్వరే నివ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణాం నువ్వైపోయావు
తెలవారింది లేలేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిశావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు ||ఎవ్వరే||

చరణం 1

[అతడు] ఎటు చూసినా, ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా
నలువైపులా నాకెదురే ఉందా మైనా మైనా
ఏ మబ్బులో తూగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలో పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందా
నా తీరుతెన్ను మారుతోందిగా ||ఎవ్వరే||

చరణం 2

[అతడు] చెలిచూఫులో చిరుగాయమై మలి చూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా, కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా, ఎవరేం అన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను, చాలా దూరం నడిచాను
తీయని దిఉలై పడి ఉన్నాను, చెలి లేనిదే బతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే... ||ఎవ్వరే||