Showing posts with label * వాణీజయరాం. Show all posts
Showing posts with label * వాణీజయరాం. Show all posts

ఆనతి నీయరా హరా...

ఆనతి నీయరా హరా ఆ.. ||ఆనతి||
సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా
సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా ||సన్నుతి||

చరణం

నీ ఆన లేనిదే గ్రహింప జాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పసుపతి నీ అధీనమై ||2||
కదులునుగా సదా సదాశివ ||ఆనతి||
ని నీ స ని ప నీ ప మ గ స గ
ఆనతి నీయరా అచలనాధ అర్చింతును రా ఆనతి నీయరా
పమ పని పమ పని పమ పని గమ పని సని సగ
సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని
ఆనతి నీయరా జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము చేతురా
ఆనతి నీయరా సానిప గమపనిపమ గమగ పప పప
మపని పప పప గగమ గస సస నిసగ
సస సస సగ గస గప పమ పస నిస గసని
సగ సగ సని సగ సగ పగ గగ గగ సని సగ గ గసగ
గ పద గస గ మ స ని పమగ గ
ఆనతి నీయరా ...

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా...

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా ||2||
రెప్పవెయ్యనే లేదు ఎందుచేత.. ఎందుచేత
పదహారు కళలనీ.. పదిలంగా వుంచనీ.. ||2||
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత ||జాలిగా||

చరణం 1

కాటుక కంటినీరు పెదవుల నంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా ||2||
నీ కుంకుమకెపుడూ పొద్దుగుంకదమ్మా ||జాలిగ||

చరణం 2

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి
పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా ||2||
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపొయేవే కధలన్నీ ||జాలిగ||

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా...

నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా
నువు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హయ్య... ||నువ్వడిగింది||

చరణం 1

నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు ||నీకోసమే||
దాచినదంతా నీ కొరకే ||2||
నీ కోరిక చూపే నను తొందర చేసే
నా ఒళ్ళంతా ఊపేస్తూ ఉంది
నాలో ఏదో అవుతోంది ||నువ్వడిగింది||

చరణం 2

నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం ||2||
నీ కధలే వింది నువు కావాలంది
నా మాటేదీ వినకుండా ఉంది
నీకూ నాకే జోడంది ||నువ్వడిగింది||

తెలిమంచు కరిగింది

తెలిమంచు కరిగింది
తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది
పిలిపునీయనా ప్రభూ ||తెలిమంచు||
నీ దోవ పొడవునా
కువకువలా స్వాగతం
నీ కాలి అలికిడికి
మెలకువలా వందనము ||తెలిమంచు||

చరణం 1

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు ||ఈ పూల||
నీ చరణ కిరణాలు
పలుకరించినా చాలు
పల్లవించును ప్రభూ
పవళించు భువనాలు
భానుమూర్తి... నీ ప్రాణకీర్తన విని
పలుకని ప్రణతులని ప్రణవశృతిని
పాడనీ ప్రకృతినీ ప్రధమ కృతినీ ||తెలిమంచు||

చరణం 2

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు ||భూపాల||
పసరు పవనాలలో పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదునుదేరిన చాలు
తలయుచు తలిరాకు
బహుపరాకులు విని
దొరలని దోరనగపు దొంతరని
తరలని దారి తొలగి రాతిరిని ||తెలిమంచు||

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ||2||
ఈ నా కృతి నీవు భారతి ||2|| ||శ్రుతి||
ధ్రుతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ||2||
శరణాగతి నీవు భారతి

చరణం 1

నీ పదములొత్తిన పదము ఈ పదము
నిత్య కైవల్య పధము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు
నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కొనియాడు
కృతుల పెన్నిధి తప
చేరినా యిక చేరువున్నదేమి నీ శ్రీచరణ
దివ్యసన్నిధి తప్ప ||శ్రుతి||

చరణం 2

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు
నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు
కీర్తనలు నీ కీర్తులే ||2||
త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత
రాగాలు నీముర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచన జననీ
భవతారక మంత్రాక్షరం ||శ్రుతి||

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో ||అలలు||

వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు
మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు
ఘడియే యుగమై బతుకే సగమై
గడిచేనిన్నాళ్ళు
వలపే వగపై తానే వరదే కురిసే కన్నీళ్ళు
కురిసే కన్నీళ్ళు...

చరణం:1

సా గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమపా పపపా గమప గమగసా
నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మ్మ గాగ సాస నీసా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో
తనన ననన ననన ననన తనన ననన నాన ||అలలు||

చరణం:2

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ...
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరుచుకుంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా
నా పుత్తడిబొమ్మా...
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే ||అలలు||

బ్రోచేవారెవరురా నిను వినా

బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా నను||బ్రోచే||
నీ చరణాంబుజములు నే విడజాల కరుణాలవాల||నీ చరణం||
ఓ చతురాననాదివందిత నీకు పరాకేలనయ్యా||ఓ చతురా||
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే||నీ చరితము||
సీతాపతే నాపై నీ కభిమానము లేదా||సీతాపతే||
వాతాత్మజార్చితపాద నా మొరలను వినరాదా
భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా||అసురము||
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టు విడువక||నా పాతక||

గరి గమ మగ గరిగరెరి మమగా
గరి గమసాగా మపద పదమప గరిసని సరిగసరి గరి గపపమ
దప మగపమ దపనిద పమ దప సిద పని దపనిది సనిరిస దప
గారీసా గరిసనిదరీసా రససిదపసా
గరిసనిద రసనిదప సవిదపమ రిసానీ
రసనిదప నిద్దా సనిదపమాపా
రిసనిదప పనిదపమ దపమగరి గామదా
నీర నిరదమాప రిసనిదపనీ
దదమగరి రిసనిదప మగరిసని శంకరాభరణము

ఏ తీరుగనను దయజూచెదవో

ఏ తీరుగనను దయజూచెదవో ఇనవంశోత్తమరామా||ఏ తీరుగ||
నా తరమా భవసాగర మీదను నళిన దళేక్షణ రామా||నా తరమా||
శ్రీ రఘునందన సీతా రమణా శ్రిత జన పోషక రామా||శ్రీరఘు||
కారుణ్యలయ భక్త వరద నిన్ను కన్నది కానువు రామా||కారుణ్యా||
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా||క్రూర||
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా||దారి||

పలుకే బంగారమాయెనా కోదండపాణి

పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలిచినా పలుకేవేమి...
కలలోని నామస్మరణ మరుచ చక్కని స్వామి
పలుకే మంగారమాయెనా

మానససంచరరే బ్రహ్మణి

మానససంచరరే బ్రహ్మణి మానససంచరరే
మదస్మిత పింఛాలంకృత చికురే
మహనీయ కపోలజిత ముకురే
శ్రీరమణీ కుచదుర్గవిహారే సేవకజనమందిర మందారే
పరమహంస ముఖచంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే