Showing posts with label * జేసుదాస్. Show all posts
Showing posts with label * జేసుదాస్. Show all posts

లలిత ప్రియ కమలం విరిసినది...

లలిత ప్రియ కమలం విరిసినది ||2|| కన్నుల కొలనిది ఆ....
ఉదయ రవీకిరణం మెరిసినది ఊహల జగతిని ||2||
అమృత కలశముగా ప్రతినిమిషం ||2||
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది ||లలిత||

చరణం 1

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం ||2||
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితల గళమృదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను ||లలిత||

చరణం 2

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది ||2||
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరుగిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ... ||లలిత||

ఓ బాటసారి ఇది జీవిత రహదారి...

ఓ బాటసారి ఇది జీవిత రహదారి ||2||
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకసారి సొంతం కాదు ఇది
ఓ బాటసారి ఇది జీవిత రహదారి

చరణం 1

ఎవరు ఎవరికి తోడవుతారో
ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో
మనసే చాలని ఉంటారో
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ ||2||

చరణం 2

కడుపు తీపికి రుజువేముంది
అంతకు మించిన నిజమేముంది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును
భూమి మోస్తుందా
ఇప్పుడు తప్పును తెలుసుకునీ
జరిగేదేమిటనీ క్షమించేదెవ్వరినీ...

చరణం 3

తెంచుకుంటివి అనుబంధాన్ని
పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరు ఉంటారని
అనుకోలేని పసివాణ్ణి
బలవంతాన తెచ్చుకునీ
తల్లివి కాగలవా తనయుడు కాగలడా

చరణం 4

అడ్డదారిలో వచ్చావమ్మా
అనుకోకుండా కలిశావమ్మా
నెత్తురు పంచి ఇచ్చావు
నిప్పును నువ్వే మింగావు
ఆడదాని ఐశ్వర్యమేమిటో
ఇప్పుడు తెలిసింది
కధ ముగిసేపోయింది ||2||
ఓ బాటసారి ఇది నీ జీవిత రహదారి

బోయవాని వేటుకు...

బోయవాని వేటుకు గాయపడిన కోయిల ||2||
గుండెకోత కోసినా చేసినావు ఊయల ||బోయవాని||

చరణం 1

తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది
ఆడతోడు ఉంటానని మూడుముళ్ళు వేయమంది
రాయికన్న రాయిచేత రాగాలు పలికించి
రాక్షసుణ్ణి మనిషిచేసి తన దైవం అన్నది
ఏనాటిదో ఈ బంధం ||బోయవాని||

చరణం 2

చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టనీ
కరునచిందు కనులకు కాటుకైన దిద్దనీ
మెట్టినింటి లక్ష్మికీ మెట్టె నన్ను తొడగనీ
కాబోయే తల్లికీ గాజులైన వేయనీ
ఇల్లాలికేదేలే సీమంతం ||బోయవాని||

చినుకు రాలితే... చిగురు నవ్వదా...

చినుకు రాలితే... చిగురు నవ్వదా
చిలక వాలితే... చెట్టు పాడదా ||చినుకు||

అనుపల్లవి:

ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునో
ఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునో ||చినుకు||

చరణం 1

నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదా
పూలకన్నె వన్నెను చూచి తేనెటీగ పాడదా ||నీలిమబ్బు||
నింగిలోన జాబిలిమామ నీటిలోన కలువభామ
ఎంతదూర తీరమునున్నా ఎందుకంత మనసులు దగ్గర
అదే అదే అనురాగం దాని పేరు అనుబంధం ||ఎవరి|| ||చినుకు||

చరణం 2

కోకిలమ్మ రాగం వింటే కొమ్మకెంత సింగారం
జలపాతం దూకుతు ఉంటే కొండకెంత ఒయ్యారం ||కోకిలమ్మ||
వానజల్లు కిందికి రాగా నేల ఒళ్లు ఒంపులు సాగా
ఎందుకంత తీయని ప్రేమ ఎవరికైన తెలిసేనా
||అదే అదే|| ||ఎవరి|| ||చినుకు||

ఇదేలే తరతరాల చరితం...

ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం ||2||
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగి కెగసేనా ఆశలే రాలిపోయేనా ||ఇదేలే||

చరణం 1

ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగ చేసినదీ ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే కసిగా శిశువును కుమ్మితే ||2||
అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా ||ఇదేలే||

చరణం 2

విరిసీ విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా
అర్పేదెలా ఓదార్చేదెలా..
నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రువ్వితే ||2||
పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా ||ఇదేలే||

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన...

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ... మేఘమా... ||2||
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం ||2||

చరణం 1

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నలనై ||2||
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలె నిలిచానని
ఉరవమని తడవమని ఊసులతో
ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి
విన్న వేదనా నా విరహవేదనా ||ఆకాశ||

చరణం 2


రాలు పూల తేనియకై రాతిపూల తుమ్మెదనై ||2||
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో
రుధిర భాష్పజలదారలతో... ఆ...
విన్నవించు నా చెలికి
మనోవేదన నా మరణయాతనా ||ఆకాశ||

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా
పేగే కదలగా...
సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే ||కదిలే||

చరణం 1

లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ
కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మ
కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే
ఏనాడు తోడును నీడను వీడనులే ||కదిలే||

చరణం 2

తాతయ్య తేజం పెదనానా నైజం
కలిసున్న పసిరూపం నీ రాణితనము నా రాచగుణము
ఒకటైన చిరుదీపం
పెరిగేనులే నా అంశము
వెలిగేనులే మా వంశము
ఎన్నెన్నో తరములు తరగని యశములకు
ఎన్నో నోములే గతమందు నోచిఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా...
నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు ||ఎన్నో||

తెలవారదేమో స్వామీ...

తెలవారదేమో స్వామీ...
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకు... ||తెలవారదేమో||

చరణం 1

చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు ||2||
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకు...
తెలవారదేమో స్వామీ

చరణం 2

మక్కువ మీరగ మది మరి మరి తలచగా
మరి మరి తలచగా
అలసిన దేవేరి అలమేలు మంగకు...
తెలవారదేమో స్వామీ గా మ ప ని
తెలవారదేమో
సా ని ద ప మ ప మ గ ని స గా మ
తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స
తెలవారదేమో స్వామీ

కన్యారాశి కలువ వయ్యారాలు

పల్లవి

[అతడు] కన్యారాశి కలువ వయ్యారాలు బరువ నమసాయమం రమ్మంటావ
[ఆమె] అంతే లేని గోడవ హద్దలేని చొరవ అడగందె తోడై రావ
[అతడు] ఏమొ ఏమంటాయొ నీ అందాలు నేనెం చేసినా
[ఆమె] అమ్మో అనుకుంటాలె ఆనందంగ నువ్వేం చేసినా
[ఆతడు] కాదంటానా [ఆమె] హా... [ఆతడు]రానంటానా [ఆమె] హా...
[అతడు] ఊరిస్తున్న [ఆమె] దారిస్తున్నా ||కన్యారాశి||

చరణం 1

[ఆతడు] ఆగే వీలుందా అవకాశం కుదిరాక
[ఆమె] ఇంకో దారుందా ఇందాక వచ్చాక
[ఆతడు] అంతే నిజమంతే అనుకోన రాన
[ఆమె] చెంతే నువ్వుంటే చలిమంటే నాలోలోన
[అతడు] వింతై పులికింతై నిను కవ్వించే పూచినాదే ||కన్యారాశి||

చరణం 2

[ఆమె] నీరే నిప్పువదా నీచేయే తదిలాక
[అతడు] కోరే ఉప్పెనగా కౌగిలికే వస్తాగ
[ఆమె] కంచె తొలిగించేకే పిలుపుందే నీలా
[అతడు] ముంచే శృతి మించే మెరుపుందొ నీ సైగల్లో
[ఆమె] అనుకొ అవుననుకో సుఖపడిపోన రెక్కల రెపరెపలొ ||కన్యారాశి||

నువ్వంటే ప్రాణమని

పల్లవి

[అతడు] నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని
నీప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకొను నాకు తప్పా
కన్నులకు కలలు లేవు నీరు తప్పా ||నువ్వంటే||

చరణం 1

[అతడు] మనస్సు ఉంది మమత ఉంది పంచుకునే నువ్వు తప్పా
ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్పా ప్రేమంటేనే
శాశ్వత విరహం అంతేనే ప్రేమిస్తేనే సుధి యుగ నరకం నిజమేనే
ఎవరిని అడగాలి నన్ను తప్పా చివరికి ఏమవ్వాలి మన్ను తప్పా ||నువ్వంటే||

చరణం 2

[అతడు] వెనకొస్తానన్నావు వెళ్ళొస్తానన్నావు జంటై ఒకరి పంటై వెళ్ళావు
కరుణిస్తానన్నావు వరమిస్తానన్నావు బరువై మెడకు ఉరివైపోయావు
దేవతలోను ద్రోహం ఉందని తెలిపావు దీపం కూడా దహిస్తుందని తేల్చావు
ఎవరిని నమ్మాలి నన్ను తప్పా ఎవరిని నిందించాలి నిన్ను తప్పా ||నువ్వంటే||