Showing posts with label - కృష్ణంరాజు. Show all posts
Showing posts with label - కృష్ణంరాజు. Show all posts

ఆకాశం దించాలా నెలవంక తుంచాలా...

ఆకాశం దించాలా నెలవంక తుంచాలా
సిగలో ఉంచాలా... ఆ... ||2||
చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు చాలు
ఆకాశం నా నడుము నెలవంక నా నుదురు
సిగలో నువ్వేరా... ఆ... ఆ...

చరణం 1

పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే... తెస్తానే...
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే... తీస్తానే...
ఆ... పట్టుతేనె నీకన్నా తియ్యంగా వుంటుందా!
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా!
అంతేనా అంతేనా...
అవును అంతేరా... ఆ...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ... ||2||

చరణం 2

సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే... చేస్తానే...
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే... దిద్దేనే...
ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు ||అంతేనా||
మెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలా
తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ...

గాంధీ పుట్టిన దేశం...

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం ||2|| ||గాంధీ||
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరే నాం
సబకో సన్మతి దే భగవాన్‌

చరణం 1

భేదాలన్నీ మరచీ మోసం ద్వేషం విడిచి ||2||
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి ||2|| ||గాంధీ|| ||రఘుపతి||

చరణం 2

ప్రజలకు శాంతి సౌఖ్యం
కలిగించే దేశమె దేశం ||2||
బానిస భావం విడనాడి
ఏజాతి నిలుచునో అదిజాతి ||2||
బాపూ.. నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు ||2|| ||గాంధీ|| ||రఘుపతి||