Showing posts with label - శోభన్‌బాబు. Show all posts
Showing posts with label - శోభన్‌బాబు. Show all posts

రామయ తండ్రి ఓ రామయ తండ్రి...

రామయ తండ్రి ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి ||2||

చరణం 1

తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒకదెబ్బకె ఇరిసావంట ||2||
పరశరాముడంతవోణ్ణి పాలదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్లు మరచి పోతుంట

చరణం 2

ఆగు బాబు ఆగు
అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ ||2||
నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
నాకు తెలుసులే
నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదోతంట ||2||
దయజూపి ఒక్కసారి కాళ్లు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట

చరణం 3

అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే ||2||
నువు దాటలేక కాదులే రామయతండ్రి ||2||
నన్ను దయ చూడగ వచ్చావు రామయతండ్రి
హైలెస్సా హైలో హైలెస్సా.....

అణువు అణువున వెలసినదేవా...

అణువు అణువున వెలసినదేవా
కనువెలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసినదేవా

చరణం 1

మనిషిని మనిషే కరిచేవేళ
ద్వేషం విషమై కురిసేవేళ
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగినమూర్తుల ||2||
అమృతగుణం మాకందించరావా ||2|| ||అణువు||

చరణం 2

జాతికి గ్రహణం పట్టిన వేళ
మాతృభూమి మొరపెట్టినవేళ
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర్య ఫలమును సాధించి
ధన్యచరితులై వెలిగిన మూర్తుల
త్యాగనిరతి మాకందించరావా ||2|| ||అణువు||

చరణం 3

వ్యాధులు బాధలు ముసిరేవేళ
మృత్యువు కోరలు సాచేవేళ
గుండెకు బదులుగ గుండెను పొదిగి
కొన ఊపిరులకు ఊపిరులూది
జీవదాతలై వెలిగిన మూర్తుల ||2||
సేవాగుణం మాకందించరావా ||2|| ||అణువు||

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

పల్లవి

ఏవేవొ కోరికలు
ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

చరణం 1

పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళు కలలే పండగా ||2||
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల ||ఏవేవొ||

చరణం 2

పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా ||2||
నిను చేరుకోగ నును మేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల ||ఈ రేయి||

చరణం 3

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో ||2||
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే ||ఈ రేయి||