Showing posts with label - ఆశిన్. Show all posts
Showing posts with label - ఆశిన్. Show all posts

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా కృష్ణా
ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ||2||
వెన్న దొంగవైనా మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయలా మృదంగానివా ||ముకుందా||
జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ||ముకుందా||

చరణం 1

నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి
నాట్యమాడి కాళీయుని దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా
అట అర్జునుడొందెను
నీ దయవల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే ||ముకుందా||

చరణం 2

మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టి ముడిపడి వుంటా
ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీవే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా ||ముకుందా||

ఒకమారు కలిసిన అందం

ఒకమారు కలిసిన అందం
అలలాగ ఎగసిన కాలం ||2||
కంటికెదురుగ కనబడగానే
అంతే తడబడినానే ||2||
తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కలలె మెరుపు
ఎదలోన తనపేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం
నులివెచ్చగ తాకిన కిరణం
కనులు తెరచిన కలువను చూశానే
చూశానే చూశానే ||ఒక మారు||

చరణం 1

పాత పదనిస దేనికద నస
నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ దొరుకు చిరుతిండి
వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా.. నీ.. సా..
నను తాకే కండమల్లికా.. నీ.. సా..
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా ||ఒక మారు||

చరణం 2

పేరు అడిగితె తేనె పలుకుల జల్లుల్లో
ముద్దగా తడిశానే
పాలమడుగున మనసు అడుగున
కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా
నీ మెరిసే నగవే చందమా
హొ.. కనులారా చూడాలే తడి ఆరిపోవాలే
ల రలాల లర లల లాల... ఓ... ||2|| ||కంటికెదురుగ||

యో బేబి నువ్వు దివ్యామృతం బేబి

పల్లవి

[అతడు] యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం యో బేబి నువ్వు దీపావళి బేబి నువ్వు
అనార్కలి బేబి నువ్వు వెన్నెల జాబిలి
[కోరస్] అమ్మమ్మో ఆ పాదం చిక్కితే కుమ్మే బంగారం
అబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో తనుతాకితే ఎటూకాదూ నాదేహం
||యో బేబి||

చరణం 1

[అతడు] ఈ చిలక పలికే పలుకే రామ చిలక నేర్చే కులుకు
తనకాలి ముద్దు కొరకే విలచేపలన్నీ ఉరుకు
అరె కంచిపట్టు చీరే అది కుచ్చీళ్ళనే కోరు
నాగమల్లి పువ్వే ఆమె బాసలకే తుళ్ళు
పిల్లే పతంగిలా పైటని ఎగరేయింగా
చచ్చినోళ్ళంతా మళ్ళా బతికి వచ్చారుగా
ప్రేమను పూజారిలా కలలు పూజలు చేయంగా
రెండునే ఉయ్యాల ఊగితల తిరిగింది
||అమ్మమ్మో||

చరణం 2

[అతడు] నా ఆలమంత వెలుగా తన కంటి తళుకు చాలు
నా ఆశలన్నీ తీర ఒహా కాలి మెరుగు చాలు
ఎహే తాళికట్టు వేళ నిను సిగ్గుపడితే చాలు
నే మత్తు పిల్ల నడగ నను నసగకుంటే చాలు
మిర్చి బజ్జీలా మనసంతా ఊరించేలా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చగొట్టేరా
కంటికి కనపడని గాలెల్లో కలిసేరా
కలలో శ్రీదేవిలా కలలు చెప్పేరా
||అమ్మమ్మో||

నన్నే నన్నే చూసూ నా గుండెల్లో

పల్లవి

[అతడు] నన్నే నన్నే చూసూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో...ఏదో...ఏదో...చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ...నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో...అమ్మో...ప్రాణం తియ్యొద్దే
[ఆమె] నీకో నిజమే చెప్పగ నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా నాలో ఏదో అల్లరి
అది నిన్నా మొన్నా లేనిదీ మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
ఏమిటంటారు...ఈ మాయల్ని ఎవరినడగాలి...ప్రేమేనా అని

చరణం 1

[అతడు] ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల...పెదాల వీణా
బిడియము లెరుగని...గడసరి సొగసుకు
తమకము లెగసెను...నరాలలోనా హలోనా
[ఆమె] ఏమైదో ఏమిటో...ప్రేమైందో ఏమిటో
నావాటం మొత్తం మారిందీ
ఈమైకం ఏమిటో...ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ

చరణం 2

[అతడు] మనసున అలజడి...వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల...చలాకిమైనా
కలలను నిజముగ...ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన...వయ్యారి జాణా బాణా
[ఆమె] ఈలోకం కొత్తగా...ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా...నేడే పుట్టీందీ
నీవల్లే యింతగా...మారాలే వింతగా
నువ్వంటే నాకు...పిచ్చేపట్టిందీ

ఆడతనమా...చూడతరమా ఆపతరమా

పల్లవి

[ఆమె] ఆడతనమా...చూడతరమా ఆపతరమా...పూలశరమా
నాకోడె ఎదలో వేడితనమా కుర్రాళ్ళ గుండెల్లో...కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా

చరణం 1

[ఆమె] ఇంటిలోన వాస్తు మొత్తం కొత్తగా ఉంది నేస్తం
మార్చేశా మరి నీకోసం ఎదురుగా ఉంది అందం
తపనలే తీర్చు మంత్రం చేస్తావా ఒడిలో యాగం
సలసల మంది కన్నె రక్తం కలబడమంది కాలచక్రం
కలవమంటేని...నీకు కలవరమా...

చరణం 2

[ఆమె] మనసులో మదనరూపం తనువులో విరహతాపం
నాలో రేపి ఏదో దాహం సరసమే మనకు సర్వం
సుఖములో చిలిపి స్వర్గం పరువాలే పరిచింది దేహం తలపడమంది...
ప్లతల్పం తొరపడమంది...పాలశిల్పం
చిన్ని కలలోనె...ఇంత పరవశమా

ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు

పల్లవి

[అతడు] ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్అచ్చుల్లోన హల్లువో జడకుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో

చరణం 1

[అతడు] ఈ పరిమళమూ...నీదేనా నాలో పరవశమూ....నిజమేనా
బొండుమల్లి పువ్వు కన్న తేలికగు నీ సోకూ
రెండు కళ్ళు మూసుకున్న లాగు మరి నీవైపూ
సొగసుల చూసి పాడగా ఎలా కనులకు మాట రదుగా హలా
వింతల్లోనూ కొత్తవింత నువ్వేనా అందం అంటే అచ్చంగానూ నువ్వే

చరణం 2

[అతడు] ఆ పలుకులలో...పరవళ్ళూ తూలే కులుకులలో...కొడవళ్ళూ
నిన్ను చూసి ఒంగుతుంది ఆశపడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజుపడి నీ కోసం
స్వరముల తీపి కోయిలా...ఇలా
పరుగులు తీయకే అలా...అలా
నవ్వుతున్న నున్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం

అందగాడా అందగాడా అందాలన్నీ

పల్లవి

[ఆమె] అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా...!
అల్లుకోరా గిల్లుకోరా అందమతా నీదిరా
మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరుంచే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా

చరణం 1

[ఆమె] గాలే తాకనీ నాలో సోకునీ ఇన్నాళ్ళూంచానయ్యో నీకోసం
నా అందంచందం అంతా నీకోసం తోడే లేదనీ కాలే కౌగిలీ
ఎప్పటి నుంచీ ఉందో నీకోసం నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం

చరణం 2

[ఆమె] జారేపైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీ రూపం
ఏనాడు లేనేలేదు ఈమైకం నాలో శ్వాసకీ రేగే ఆశకీ
దహం పెంచిందయ్యో నీ స్నేహం గుర్తంటూ రానేరాదు ఈలోకం
నీజతే చేరితే మామమయ్యే నాలో మౌనం
రాగమై సాగెనే అంతులేని ఆనందం

చెలియ...చెలియా...చెలియ

పల్లవి

[అతడు] చెలియ...చెలియా...చెలియ...చెలియా
అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా
చెమట జడిలో తడిసి పోతున్నా చిగురు ఎదలో చితిగ మారినది
విరహజ్వాలే సెగలు రేపినది మంచుకురిసింది చిలిపి నీ ఊహలో
కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని
వదిలిపోయావు న్యాయమా...ప్రియతమా...

చరణం 1

[అతడు] శ్వాసనీవే తెలుసుకోవే స్వాతి చునుకై తరలి రావే
నీజతే లేనిదే నరకమే ఈ లోకం జాలినాపై కలగదేమే
జాడ యినా తెలియదేమే ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం
ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం
పరుగు తీస్తావు న్యాయమా...ప్రియతమా!

చరణం 2

[అతడు] గుండెలోన వలపు గాయం మంటరేపే పిదపకాలం
ప్రణయమా... ప్రళయమా...తెలుసునా నీకైనా
దూరమైన చెలిమి దీపం భారమైన బతుకు శాపం
ప్రియతమా...హృదయమా...తరలిరానేడైనా
కలవు కావా నా కన్నుల్లో నిమిషమైనా నీ కౌగిలిలో
సేద తీరాలి...చేరవా...నేస్తమా...!

ఆకాశం నీరునిప్పు నేల

పల్లవి

[అతడు] లూసియా ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి
నాకోసం చెప్పిందల్లా చేస్తు ఉండాలి
ఆకాశం నీరునిప్పు నేలఈగాలి నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి
చల్ చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే లూసియా

చరణం 1

[అతడు] నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా
గాలిలా నిండుగా జ్వాలనై మంటరేపుతా
నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా
పంచభూతాలును నాలో చూపుతా చూపుతా
చల్ చల్ గడియారం ఉన్నది చూడు నాచేతుల్లో
చల్ చల్ నాటైమును నేనే నడిపిస్తా
చల్ చల్ పుస్తకము పెన్ను ఉంది నా గుప్పెట్లో
చల్ చల్ నా చరిత్ర నేనే రాసేస్తా లూసియా

చరణం 2

[అతడు] రాజునై బంటునై రెంటినీ నేనేనంటా
యుద్దము, శాంతము మద్యలో నేనేనంటా
పయనము, గమ్యము మొత్తము నేనేనంటా
నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా
చల్ చల్ నాముందు నావెనకాల నేనే ఉంటా
చల్ చల్ నాపోటీ నేనే వస్తుంటా
చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట
చల్ చల్ నాదిష్టి నేనే తీస్తుంటా లూసియా ||ఆకాశం నీరు నిప్పు||

నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే

పల్లవి

[అతడు] నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాగుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాఅందంలో అలజడులే నీవల్లే
నాచంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీవల్లే
నా మాటల్లో ఆటల్లో రాగంలో మలిపులు నీవల్లే ||నీవల్లే నీవల్లె||

చరణం 1

[ఆమె] మామూలు రూపు మామూలు తీరు ఏముంది నీలోన
ఆకర్షణ ఏదో ఉంది పడిపోయా నీపైనా
నిన్ను తలచుకొనే అలవాటే మారెను వ్యసనమై నిన్నుగెలుచుకొనే
ఈ ఆటే తెలిసెను ప్రణయమై ||నీవల్లే నీవల్లె||

చరణం 2

[ఆమె] ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి వెల్లావు చల్లగా
ఆ నవ్వుతో ఆ చూపుతో కల్లోలం ఒళ్ళంతా
కొంతకరకుతనం కరుణగుణం కలిపితే నువ్వేలే
కొంటెమనసుతనం మనిషివలే ఎదిగితే నువ్వేలే
[అతడు] నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాగుండెల్లో దడదడల్ నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా కళ్ళలో కొత్త కధలే నీవల్లే
నా చేతుల్లో చేతల్లో నడకల్లో వణుకులు నీవల్లే
నా మాటలో ఆటల్లో మార్గంలో మార్పులు నీవల్లే ||నీవల్లే నీవల్లే||

సర్రచూడు చూడు మెహబూబ

పల్లవి

[అతడు] సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ ||2||

బుర్ర తిరిగెను మహబాగా బుద్దిమారెను గా
జర్రుమని యదజారెను గా జంట జోరెనుగా
ఒక మకతిక తికమకేగా ఇకనకషిక షకలక
తొలి ప్రణయపు కవలికేగా తెలిసెనుగా ||సర్రచూడు చూడు||

[అతడు] ఆ...ఆ...వీలు చూసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కదా
చేరదీసి లాలన చేస్తే చెడ్డ పేరే రాదుకదా
మీదకొచ్చి గిరిగిరి చేస్తే మీసమేమి అడగదుగా

ఆడపిల్లను పలచను చేస్తే ఉసురు తగులును తెలుసా తెలుసా ||సర్రచూడు చూడు||

చరణం 1

[అతడు] కండకలిగిన వీరుల్లారా గుండెకోతకు కనలేరా
అంగరక్షక యోదుల్లారా ప్రేమ రక్షకురాలేరా
పోరగాన్ని దారికి తెచ్చి పోలితో ముడి వేశాకా
రాష్ట్రమైనా అడిగేయండి రాసి ఇస్తాఫ్రీగా ||సర్రచూడు చూడు||

చెల్లిపోని బంధం నేనమ్మా

పల్లవి

[అతడు] అన్నయ్యా అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటె నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందికిరానా కలతై ఉన్నావంటే కధనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మతోడు నాన్నతోడు అన్నీనీకు అన్నేతోడు చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లమా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువమ్మా
చిట్టి చెల్లెమ్మా ప్రాణమైనా చెల్లిస్తాడమ్మా

చరణం 1
[అతడు] చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండగలు నీతో రావాలి
నా గుండెలోన వేడుక కావాలి
రుగ్గుల్లోన బంగారు తల్లి మాట మరు మల్లి రామునింట ప్రేమని పంచాలి
ఆ సీత లాగ పేరుపు రావాలి
[ఆమె] నీలాంటి అన్నగాని ముందే ఉంటే తోడునీడ
ఆనాటి సీత కన్ని కష్టాలన్ని కలిగుండేవా ||చెల్లిపోని బంధం||

చరణం 2

[అతడు] కాలికింద నేలను నేనే నీలినింగి నేనే
కన్నులోని నీరేనేనమ్మ ఆ నన్ను నీవు జారనీకమ్మ
ఇంటిచుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే తులసిచెట్టు కోటను
నేనమ్మా నీ కాపలాగ మారనీవమ్మా
[ఆమె] ముక్కోటి దేవతల అందేవరం అన్నవరం
ఇంటింటి అన్నతోడు అందరికుంటే భూమే స్వర్గం ||చెల్లిపోని||

రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ

పల్లవి

[అతడు] రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్దం
కత్తికి ఖండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్దం ఏయ్ ఇదినావేదం గుండెల శపదం గగన
విహారం రణరంగం కొరిమిలో కత్తికి పెట్టిన కత్తులు కావా ఎప్పూడు పరిహారం ఏయ్‌
దహధన కత్తులకు ఊపిరిపోసిన గూటం దెబ్బది ఈ ఘాతం గన గన మండే నిప్పుల
కొరిమిలో కాలే కత్తుల కోలాటం

[చరణం 1]

[అతడు] పల్లె మాతల్లి మకు బువ్వని పెట్టింది జాబిల్లి సిరిమల్లి సుఖసంపదలిస్తుంది

కలిగంజి తాగైనా మేం చల్లగ ఉంటుంటే దాశికం దౌర్జన్యం మామెతుకులు దోస్తుంటే
మన ఉణికిని చిత్రం చేసినోడి మూలాలను చేదించి జనజాతి రక్షణకు కత్తిపట్టిన
పోతురాజులం మేమేలే ||రాక్షసరాజ్యం||

[చరణం 2]

[అతడు] దూళికి జూకు దమరుకు మళ్ళి భేరిలైలేద్దాం సెల్లం గొడ్డలి భల్లెం మాకు
ఆయుధాలమవుతాం కత్తులు కాళ్ళై సమరంలో కవాతు చేస్తాయి చేసేయ్ సుత్తులు
వేళ్ళై యుద్దంలో బాకులు దూస్తాయ్ రైరై బ్రతకాలంటే చావడానికే సిద్ధంగున్నోళ్ళం
మాబ్రతికే హక్కును కాలరాస్తే అంతుతేల్చుకోవడం ||రాక్షసరాజ్యం||