Showing posts with label * జిక్కి. Show all posts
Showing posts with label * జిక్కి. Show all posts

అలనాటి రామచంద్రుని కన్నింట సాటి

అలనాటి రామచంద్రుని కన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుని కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ
తెలుగింటి పాలసంద్రం కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మ

చరణం 1

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేల్లూ
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలూ
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటను పదిమందీ చూడండీ
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండీ ||చందమామ||

చరణం 2

సీతారాముల కల్యాణంలా కనిపిస్తూవున్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె వున్నా
మరగలేదు మన్మధుని వొళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండీ
తదుపరి జరిగిన వివరములడగక బంధువులంతా కదలండీ ||చందమామ||

శరణు శరణు ఓ కరుణాల

పల్లవి

శరణు శరణు ఓ కరుణాల వాలా
అరమర సేయకురా కృష్ణయ్యా నీదే దీవెనరా ||శరణు||
నే కన్నవాడూ నే పెంచు వాడూ నీ వారలేరా నీ కన్నులేరా
మాకీ పరీక్ష ఏల ప్రభో ఓ ఓ . . . ||మాకీ||
నీ లీల లేమయ్యా స్వామీ నిరంజన
అరమర సేయకుర కృష్ణయ్యా నీదే దీవనరా ||శరణు||
ఒక కంట చూపా ఒక కన్నుమూతా
నా ఆశలన్నీ అడియాసలేరా ||ఒక కంట||
ఇది న్యాయమేనా దయచూడరా ఓ . . . ఓ
దేవా పరాకా యశోదా కుమారా
అరమర సేయకురా కృష్ణయ్యా నీదే దీవనరా ||శరణు||
కృష్ణయ్యా నీదే భారము రా

పుట్టలోని నాగన్నలేచి

పల్లవి

పుట్టలోని నాగన్నలేచి రావయ్య
స్వామీ పైకి రావయ్యా
గుమ్మపాలు తెచ్చినాము తాగిపోవయ్యా
వేయి దండాలయ్యా వేయి దండాలయ్యా ||పుట్టలోని||
నీ కోరల్లో విషము దాచుకోవయ్యా
నీ బుసకొట్టే కోపం ఆపుకోవయ్యా
మనసులోని కోరికలు మక్కువతో తీరిస్తే
మరువక నాగుల చవితి పూజ మేము చేసేము ||పుట్టలోని||
ప్రాణాచారంబడ్డ నాంచారమ్మా
గుట్టుగా ఏమని కోరినావమ్మా
మంచి మొగుడు కావాలని మోజుపడ్డావా
చిట్టి పాప ముట్టాలని మొక్కుకున్నావా?
అనుకున్నది అయితేను ముడుపులు చెల్లిస్తానని
అనవే అనవేమే నువ్వనవే నువ్వనవే ||పుట్టలోని||
మా పసుపు కుంకుమా ఎప్పుడు పచ్చగుండాలి
మా పిల్లాపాప చల్లగ వర్థిల్లాలి
ఏటేటా నిన్నే మా యిలవేల్పుగ కొలవాలీ
పుట్టలోని నాగన్న ఏలుకోవయ్యా
నీవే మా స్వామివని నమ్మినామయ్యా
నీకు దండాలయ్యా వేయి దండాలయ్యా
కోటి దండాలయ్యా . . .

బృందగానం

పల్లవి

బృందగానం - నృత్యం
నీదు దివ్య ప్రభల జగమోలలాడంగ
నిత్యం జీవులే నీ కీర్తి పాడంగ
యీ చరాచరములను కరుణించి పాలించుదేవా
పదునాల్గు భువనాల లాలించు దేవా
పరమాత్మా ఓ ప్రభో
జైజైజైజై జగదీశ్వరా
మాదు ప్రార్ధనలనాలకించు పరమేశ్వరా
దేవళమ్ములందు - కొలువుతీర్చియున్న దేవా
కోటి గొంతులెత్తి - నిన్ను పిలిచిన వినలేవా
ఓ దేవదేవా - దివ్య ప్రభావా
దిక్కునీవే మాకు జగదీశా
పాప పంకిలమందు పడివున్న భక్తులం
పరమపదమును జూపు పరమేశా
జైజైజైజై జగదీశ్వరా
మాదు ప్రార్థనల నాలకించు పరమేశ్వరా
ఓ కృపామయ
నిన్నె శరణమన్నామయా
దీనులను దీవించరావయా
నీ దివ్య పదములె స్వర్గసోపానములు
ధన్యులజేయుమో మమ్ము జగదీశా
మాకుతరియించు మార్గము జూపు పరమేశా ||జైజై||

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల

పల్లవి

చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||

చరణం 1

పడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకులు||2||
చెంపకు చారెడు సోగకన్నులె సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||

చరణం 2

ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీపము
మా హృదయాలకు హాయి నొసంగే పాపాయే ప్రాణము
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||

చరణం 3

నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా||2||
పేరుప్రతిష్టలే నీ పెన్నిధిగా నూరేళ్ళాయువు పొందుమా
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||

పుట్టలోని నాగన్నలేచి రావయ్య

పుట్టలోని నాగన్నలేచి రావయ్య
స్వామీ పైకి రావయ్యా
గుమ్మపాలు తెచ్చినాము తాగిపోవయ్యా
వేయి దండాలయ్యా వేయి దండాలయ్యా
||పుట్టలోని||


నీ కోరల్లో విషము దాచుకొవయ్యా
నీ బుసకొట్టే కోపం ఆపుకోవయ్యా
మనసులోని కోరికలు మక్కువతో తీరిస్తే
మరువక నాగుల చవితి పూజ మేము చేసేము
||పుట్టలోని||


ప్రాణాచారంబడ్డ నాంచారమ్మా
గుట్టుగా ఏమని కోరినావమ్మా
మంచి మొగుడు కావాలని మోజుపడ్డావా
చిట్టి పాప ముట్టాలని మొక్కుకున్నావా
అనుకున్నది అయితేను ముడుపులు చెల్లిస్తనని
అనవే అనవే నువ్వనవే నువ్వనవే
||పుట్టలోని||


మా పసుపు కుంకుమా ఎప్పుడు పచ్చగుండాలి
ఏటేటా నిన్నే మా యిలవేల్పుగ కొలవాలి
పుట్టలోని నాగన్న ఏలుకోవయ్యా
నీవే మా స్వామివని నమ్మినామయ్యా
నీకు దండాలయ్యా వేయి దండాలయ్యా
కోటి దండాలయ్యా...

పుట్టలోని నాగన్నలేచి రావయ్య

పుట్టలోని నాగన్నలేచి రావయ్య
స్వామీ పైకి రావయ్యా
గుమ్మపాలు తెచ్చినాము తాగిపోవయ్యా
వేయి దండాలయ్యా వేయి దండాలయ్యా
||పుట్టలోని||


నీ కోరల్లో విషము దాచుకొవయ్యా
నీ బుసకొట్టే కోపం ఆపుకోవయ్యా
మనసులోని కోరికలు మక్కువతో తీరిస్తే
మరువక నాగుల చవితి పూజ మేము చేసేము
||పుట్టలోని||


ప్రాణాచారంబడ్డ నాంచారమ్మా
గుట్టుగా ఏమని కోరినావమ్మా
మంచి మొగుడు కావాలని మోజుపడ్డావా
చిట్టి పాప ముట్టాలని మొక్కుకున్నావా
అనుకున్నది అయితేను ముడుపులు చెల్లిస్తనని
అనవే అనవే నువ్వనవే నువ్వనవే
||పుట్టలోని||


మా పసుపు కుంకుమా ఎప్పుడు పచ్చగుండాలి
ఏటేటా నిన్నే మా యిలవేల్పుగ కొలవాలి
పుట్టలోని నాగన్న ఏలుకోవయ్యా
నీవే మా స్వామివని నమ్మినామయ్యా
నీకు దండాలయ్యా వేయి దండాలయ్యా
కోటి దండాలయ్యా...