Showing posts with label * శ్రీరాం. Show all posts
Showing posts with label * శ్రీరాం. Show all posts

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

చరణం 1

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం
నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం
గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే
వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే

చరణం 2

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే
పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే

పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా...

పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా
ఎవ్వరేమనుకున్నా జానే బీదో యార్
నింగి పడిపోతున్నా నేల విడిపోతున్నా
నీరు నిప్పవుతున్నా జానే బీదో యార్
ప్యార్ కియా తో డర్నా క్యా

చరణం 1

విధినైనా ఎదిరిస్తుంది ఎదలో నుండి ఈ ప్రేమ
వద్దనా మనసిస్తుందీ వరమౌతుందీ ఈ ప్రేమ
చరితల్లో గెలిచింది ప్రేమే కదా
జగమంతా నిలిచింది ప్రేమే కదా
ఎన్ని హద్దులున్నా ఒడిపోదు ప్రేమ
ఎల్లలెన్ని ఉన్న తలవంచునా ||ప్యార్||

చరణం 2

కలనైనా కలకాలేదు కలిసిందంటే ఈ ప్రేమ
క్షణమైనా ఎడబాటైనా ముడివేశాక ఈ ప్రేమ
ఆరారు కాలాల అందం కదా
ఏడేడు జన్మాల బంధం కదా
ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళబాట
ప్రేమ తోడు ఉంటే గెలుపే కదా ||ప్యార్||

పసిఫిక్‌లో దూకేయమంటే

పల్లవి

[ఆమె] పసిఫిక్‌లో దూకేయమంటే దూకేస్తానే నీకోసం
ఎవరెస్ట్ ఎంతెత్తయినా ఎక్కేస్తానే నీ కోసం ||పసి||
తలకోన జంగిల్‌లోనా జాగింగ్ చేస్తా జంటై నువ్వుంటే
భామ రోమియోకన్న నేనే పిచ్చివాణ్ణమ్మి
నువ్వు కాసుకోమన్నా లవ్ బిచ్చ గాణ్ణమ్మ ||పసి||

చరణం 1

[అతడు] పిల్లాడికి విసుగొస్తే క్యార్ క్యార్ మంటాడు
[ఆమె] కుర్రాడికి మనసైతే ప్యార్ ప్యార్ మంటాడు
[అతడు] టెలిస్కోప్ చూడలేని వింతకాదా ప్రేమగాధ
[ఆమె] టెలిఫోన్ తీగచాలు సాగుతుంది ప్రేమబాట
[అతడు] భగవద్గీత బైబిల్ రాత చెప్పిందంతా ప్రేమేకాదా
[ఆమె] తోడువస్తున్నా ప్రేమతోడుకుంటున్నా
[ఆమె] పసిఫిక్‌లో దూకేయమన్నా దూకేస్తావా నాకోసం
ఎవరెస్ట్ ఎత్తెంతైనా ఎక్కేస్తావా నాకోసం

చరణం 2

[అతడు] నీ ఒంపుల కెంపుల్లో ప్రేమపూజ చేస్తున్నా
[ఆమె] నీ గుండెల గాదుల్లో ప్రేమపూవు నవుతున్నా
[అతడు] కరెన్సీ నోటుకన్నా కాస్టుకాదా ప్రేమపాట
[ఆమె] కరెంటు కాంతికన్నా బ్రైటుకాదా ప్రేమబాట
[అతడు] నాలోపాట అర్థంకాదా వద్దకురావే ముద్దుల రాధా
[ఆమె] సిగ్గుపడుతున్నా అయినా సిగ్నలిస్తున్నా ||పసి||

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది...

ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
చెలీ.. ఇదేం అల్లరీ
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది
అరే.. ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా..
పేరు కైనా నేను లేనా..
దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా..
ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా.. ||ఎక్కడ ఉన్నా||

చరణం 1

నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా
మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఎమన్నా
నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా...
ఓ... ||దీని పేరేనా|| ||ఎక్కడ ఉన్నా||

చరణం 2

కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ
మనసు మునుపు ఎపుడూ ఇంత
ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింతా
ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా...
ఓ... ||దీని పేరేనా|| ||ఎక్కడ ఉన్నా||

వర్ధిల్లండి వర్ధిల్లండి కన్నెపిల్లలారా వర్ధిల్లండి పిల్లలున్న

పల్లవి

వర్ధిల్లండి వర్ధిల్లండి కన్నెపిల్లలారా వర్ధిల్లండి పిల్లలున్న
తల్లులంతా సాగరంగా వినరండి
మరులగన్నా పెద్దల్లారా మనుమోహరంగా వినరండి
సిరిమల్లె వోలే నవ్వే ముఖాలకి ఈ సూర్యరామ
వంశము ఇస్తుంది దీవెనలు
అ అ అన్నగారి మాట అఅ అచర్ధిమాటరా అఅ అక్కరతో వింటే
అర్ధముందిరా పాడు కొత్తపాట పాడు పాడి అదరగొట్టరా
నిన్న గాలి తోటి పోయే నేడు గతుకు మనదిరా
అగడదలా నగద తీసేయ్... కో............ ||అన్నగారి...||

చరణం 1

ప్రేమకి చోటున్నది నిజము యెదనున్నది నిండు నూరేళ్ళకి బతికే బలమున్నది
సిగ్గు మొగ్గల్నే కమ్మేశాకే మదిలో విరిసింది మందారం
రోజు ఇకపైన నిదరే రాదు పైట జారిస్తే వయ్యారం
నా శ్వాసలతోనే రగిలిస్తా తాపం
అరె ఒక్క రొకో కుంచెం కొచ్చి కోటి సపాలన్ని లయో
అగడదలా నగద తీసెయ్... ||అన్నగారి....||

చరణం 2

మనస్సు తెర తీసివెయ్ బాణం గురిపెట్టి వెయ్
బతికే కాలం అంతా మట్టికి మరిగాలా చెయ్
పేరు లేనట్టి బిక్షం ఉందా సొంతకాళ్ళే నీ సొత్తంతా
నువ్వు నిలిచాకా ఊరేనీది అప్పుడే నీ విలువ తెలిసేనమ్మా
నీ యెదలో ఉందే ఇక జరిగేనమ్మా ఇదినాకు తెలుసు రేపు నీదేగెలుపు
అరె చోటి చూసి మాకే డెంగి ఆటో చూచి అడిగేసెయ్
అగడదలా నగద తీసేయ్... ||అన్నగారి...||

సిలకేమో శ్రీకాకుళం అరె కులుకేమో మల్కీపురం

పల్లవి

సిలకేమో శ్రీకాకుళం అరె కులుకేమో మల్కీపురం||2||
సొగసమో విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌రో
అరె పెదవేమో పిఠాపిరం రుచి చూస్తే మిఠాయిపురం
నడుమేమొ గరంగరం బీమలి బీచేరో
ఇది టెక్కలి టక్కదిరో బొబ్బలి నికృతిరో
కుర్రకారుకి సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో
మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది హేయ్
ఒంట్లో ఒక్కోనరం మెళికెడిపోద్ది హేహే ||సిలకేమో||

చరణం 1

అరె యే యే యే వన్నె చూస్తె పాలగడి ఒళ్ళు చూస్తే పూలగడి
బుగ్గ చూస్తే బోగాపురం బూరెల గావడి
దీని జెబ్బచూస్తె పర్లాంకిమిడి కొబ్బరి చలివిడి
అరె యే యే యే మూసపాటి పుంజుకోడి రోషముందే ఆబాడి
ముందు వెనుక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో
అప్పగింతలై పోతాదె అప్పుడె సున్నిపిండి
ఓసి నా రాజమండ్రి పనుక దోరజాంపళ్ళ బండి
పూల పండక్కి వచ్చి పాలవంటి చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి ||మాస్|| ||సిలకేమో||

చరణం 2

అరె యే యే యే ఉన్నోళ్ళు లేనోళ్ళని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు
వాటి ఆటలింక కట్టించకుంటె బతకరు పేదోళ్ళు
అరె హయ్ యాయ్ యాయ్ ముందు మరి
ఈ సంగతి తెలుసుకుని పెద్దోళ్ళు
లోటు ఇంక సరి చేయకుంటే నా వోటి కుర్రోళ్ళు వెయ్ఇంక
వీదికెక్కి ఎక్కిపెట్టక తప్పదు వీపుల దుప్పుళ్ళు
నువ్వు సేనానివయ్యో సింహాచలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యో ఎదుటివాడి మేలేటి కోరే మనిషివి నువ్వేరో ||మాస్|| ||సిలకేమో||