Showing posts with label - రమ్యకృష్ణ. Show all posts
Showing posts with label - రమ్యకృష్ణ. Show all posts

జోలాజోలమ్మజోలా జేజేలా జోల...

జోలాజోలమ్మజోలా జేజేలా జోల జేజేలా జోల
నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల ||2||
ళొ ళొ... ళొ ళొ... ళొ ళొ...
హాయి... హాయీ ||2||

చరణం 1

రేపల్లె గోపన్న రేపు మరచి నిదరోయె ||2||
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరోయె ||2||
ఏడుకొండలు ఎంకన్న ఎప్పుడనగా నిదరోయె ||2||
కోడెపిల్లడా నీకేమో కునుకైనా రాదాయె...
కునుకైనా... ||ళొ ళొ||
హాయి... హాయీ ||2|| ||జోలా||

చరణం 2

మీనావతారమెత్తి మేనిచుట్టూ రాబోకురా
అరెరె... యాహీ యాహీ యాహీ... ||2||
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
అయ్యయ్యయ్యో...
యాహీ... యాహీ... యాహీ...
వామనావతారమెత్తి ||2||
సామిలాగ అయిపోకు
బుద్ధావతారమెత్తి బోధిచెట్టును అంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై ||2||
సీతతోనే ఉండిపోరా... గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
||ళొ ళొ|| ||హాయి|| హాయీ ||2||

హాయ్‌రుక్కు

పల్లవి

[అతడు] హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ ||3||
నీ గుట్ట విప్పువాసి గుట్టు చెప్పవాహే చికుబుకురుక్కుమామ్‌ ||ఆయ్‌||
[ఆమె] షికారు వెళ్ళదాం
[అతడు] వెళ్ళాకా
[ఆమె] సినిమాలు చూద్దాం
[అతడు] ఆ చూశాకా
[ఆమె] షాపింగ్‌ చేద్దాం
[అతడు] ఆ చేశాకా
[ఆమె] చపాతీ తింద్దాం
[అతడు] ఆ తిన్నాకా
[ఆమె] తిన్నదంత అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు ||హేయ్‌||
[ఆమె] హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ చిలకముక్కు రుక్కుమామ్‌ ||2||
చెరుకుముక్క రుక్కుమామ్‌ రుక్కురుకురుక్కుమామ్ ||హాయ్‌||

చరణం 1

[ఆమె] జూపార్కు వైపు పరుగుతీద్దాం
చెట్టు చాటు పొదలో చొరవు చేద్దాం
[అతడు] గోల్‌కొండ వైపు అడుగులేద్దాం
పాడుబడ్డ గృహంలో ఆడుకుందాం
[ఆమె] నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం
[అతడు] షామీర్‌పేటకు సిద్ధం చలికోనేటి స్నానం చేసేద్దాం ||హేయ్‌||

చరణం 2

[అతడు] ఉస్మానీయలో చదువుకుందాం
ప్రేమలోన డాక్టరేటు పుచ్చుకుందాం
[ఆమె] అసెంబ్లీహాల్లో హాజరవుదాం
ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం
[అతడు] ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం
[ఆమె] ఆపైన మార్కెటుకు వెళ్ళదాం
అయిదు కేజీలు మల్లెలుకొని తెద్దాం ||హాయ్‌||

మనసా వాచా

పల్లవి

[అతడు] మనసా వాచా మనసిస్తే మైసూర్‌ప్యాలస్‌ రాసిస్తా ||2||
[ఆమె] పనిలో పనిగా జతకొస్తే జైపూర్‌ ప్యాలస్‌చదివిస్తా
[అతడు] జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
[ఆమె] ప్రియతమ పదవందిస్తే ఈ తుడివిరి ఎదిరిస్తా
[అతడు] రా . . . రా . . . రా . . . రా . . . ||పనిలో పనిగా||

చరణం 1

[ఆమె] కళ్ళతోటే కావలిస్తే కాళిదాసు నవలిస్తా
[అతడు] ఎదకు ఎదకు పడితే ఆ పెదవి పొదిగిపెడతా
[ఆమె] కంగులూరి చేరివస్తే కోహినూరు కొసరిస్తా
[అతడు] నడక మిడిసి పడితే ఓ . . . నడుము మడతా ముడతా
కృష్ణయ్యా వెన్నంటితే;
[ఆమె] నా చల్లని చెల్లించుతా
[అతడు] వనిత విను చెబుతా కధా ఆ . . . ||మనసా||

చరణం 2

[ఆమె] రాజులాగా రాసుకుంటే వైజయంతిమాలిస్తా
[అతడు] గడియగడువు పెడితేఆ . . . తడిసి కడివెడౌతా
[ఆమె] సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్రా నదినిస్తా
[అతడు] కలసి మెలసి ఫోతే ఓ . . . మెరిసి కురిసి వెళతా
వాల్మీకిలా వేటాడితే
[ఆమె] ప్రేమాయణం వల్లించుతా
[అతడు] లలితా ముడిపడతా పదా . . . ||మనసా||

బంగారం తెచ్చి వెండి

పల్లవి

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ ||2||
ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ బొమ్మ
చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ
వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . . ||బంగారం||

చరణం 1

[అతడు] జో . . . లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా
ఈ . . . మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని - పొందునట
[ఆమె] ఇల్లంతా బొమ్మల కొలువు మనసంత నవ్వుల నిలవుఓ ||బంగారం||

చరణం 2

[ఆమె] అడగక ముందే అన్నీ చేసి సేవకుడవి అనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే - అందించావు
ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు
[అతడు] నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . .
[ఆమె] ఓ . . .మాతృత్వానికి మగరూపానివై
నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధివో
పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా

హేహేహేరబ్బ

పల్లవి

[అతడు] హేహేహేరబ్బ నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి ||3||
ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా ||2||
మనిషే మరీ భోళాగా తనమాటే గలగలా
తానేలేని వీణా ఆ ప్రాణం విలవిల ||నూటొక్క||

చరణం 1

[అతడు] గాలేనువ్వైతే తెరచాపల్లే నిలబడతా
[ఆమె] జోలాలేనువ్వైతే పసిపాపల్లే నిదరోతా
[అతడు] రాణిలాగా కోరితే బంటులాగా వాలనా
[ఆమె] భక్తితోటివేడితే దేవతల్లే చూడనా
[అతడు] సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే రోజంతా సరిక్రొత్త కేరింతలే
[ఆమె] మలినాలేవి లేని మధుగీతం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి ||2||

చరణం 2

[అతడు] మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా
[ఆమె] నువ్వు మోడలై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా
[అతడు] కోపమొచ్చినప్పుడు బుజ్జగించవే మేనకా
[ఆమె] కొంటెవేష మేసినప్పుడు వెక్కిరింత నాదట
[అతడు] చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు మనమధ్య వుంటాయి పోతాయిలే
[ఆమె] ఆనందాన్ని యేలే అధికారం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి ||2||
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా ||2||
మనసే మేఘమాలా తన ఉనికే వెన్నెలా
తానే లేనినేలా పోతుంది విలవిలా ||నూటొక్క||

దేఖ్‌బాబా దేఖ్‌బాబా

పల్లవి
[ఆమె] దేఖ్‌బాబా దేఖ్‌బాబా దేఖ్‌ఆలీబాబా
లేక్‌లేక రాకరాక సోకు వచ్చిందమ్మ
నీగాలీ నీధూళి నా పైకి మల్లించేయ్‌
నేపాలీ భోపాలీ మంత్రాలు వల్లించేయ్‌
జంతర్‌ మంతర్‌ జాదు చూపించాలోయ్‌
గున్‌గునాగున్‌ గున్‌గునాగున్‌ చెంతచేరాలోయ్‌
ధన్‌ధన్‌ధన్‌ ధన్‌ధన్‌ధన్‌ శాంతి చేయాలోయ్‌ ||గున్‌||
[అతడు] దేఖ్‌బేబీ దేఖ్‌బేబీ దేఖ్‌జాలీ బేబీ
సోక్‌మీద స్నేక్‌లాగా దూకడం నా హాబీ
హాత్తేరీ అందేరీ మోసాలు చేసేస్తా
శృంగేరీ హంగేరీ దేశాలు చూపిస్తా
మూడోకన్ను నేడే తెరిచేస్తాగా
గున్‌గునాగున్‌ గున్‌గునాగున్‌ ధూపమేస్తాగా
ధన్‌ధన్‌ధన్‌ ధన్‌ధన్‌ధన్‌ ఊపుతెస్తాగా ||గున్‌||

చరణం 1

[ఆమె] చాకులొద్దు బాకులొద్దు పాకులాడద్దు
పిట పిటలను కిటకిటను కిటుకులుచాలు చాలు చాలు చాలేద్దు
[అతడు] మేకలొద్దు కూతలొద్దు చీకుచింతొద్దు
చిటచిటమను చిటికెలువిని చటుక్కునకాలు కాలు కాలు కాలు జారొద్దు
[ఆమె] ఘరానా ఖజానా కమ్‌ కమాయించుకో
[అతడు] నయానా నా భయానా భం భరాయించుకో
[ఆమె] మతిపోయే మాయాజాలం చేసిపో ||గున్‌||

చరణం 2

[ఆమె] ఆకలేస్తు అంగలేస్తు దొంగలావస్తూ
పరులెరగని పరువపుగని కనుగొని నీకు నీకు నీకు సుఖమస్తు
[అతడు] కోకవాస్తు రైకవాస్తు అన్ని గమనిస్తూ
తెర తెరవని చెరవదలని తళుకుని తాకి తాకి తాకి తరిగిస్తు
[ఆమె] బిచాన నీ ధికానా నా ఒడే చేసుకో
[అతడు] స్వయానా నీ సుఖానా నా ముడేవేసుకో
[ఆమె] అందంతో అబ్రకదబ్రా ఆడుకో ||దేఖ్‌||

అంతర్యామీ . . . అలసితి . . . సొలసితి

పల్లవి

అంతర్యామీ... అలసితి... సొలసితి...
ఇంతట శరణిదే జొచ్చితినీ... ||అంతర్యామీ||
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా...
భారపు పగ్గాలు - పాపపుణ్యములు నేరుపునబోవు నీవు వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవని వద్దనకా ||2||
ఎదుటనె శ్రీ వేంకటేశ్వరా నీవదె అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామీ... అంతర్యామీ... అంతర్యామీ... అలసితీ... సొలసితి...

దాచుకో నీ పాదాలకు

పల్లవి

దాచుకో నీ పాదాలకు - తగనే చేసిన పూజలివి
పూచి, నీకేరీతి రూప పుష్పములివెయయ్యా
దాచుకో.. దాచుకో...

జో అచ్యుతానంద జో జో ముకుందా...
లాలి పరమానంద - రామగోవిందా... జోజో... జోజో...

క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం
నీరాజనం... నీరాజనం...

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

పల్లవి

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
తందనానా ఆహి . . . తందనానాపురే . . . తంధనానా . . . భళా

చరణం 1

నిండారరాజు నిద్రించు నిద్రయు నోకటే
అండనేబంటు నిద్రఅదియూ నోకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలుండేటి సరిభూమి యొకటే

చరణం 2

ఏనుగుమీద కాయు యెండోకటే పుడమీ మీద పాలయు
యుండొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగాన
జడియు శ్రీ వేంకటేశ్వరు నామయొకటే

నిగమ నిగమాంత వర్ణిత

పల్లవి

నిగమ నిగమాంత వర్ణిత - మనోహరరూప నగరాజధరుడా . . .
శ్రీనారాయణా! నారాయణ . . . శ్రీమన్నారాయణా!

చరణం 1

దీవించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కధా నన్ను
నోడబరపుచు పైపైనె సంసార బందంబుల కట్టేపు నాపలుకు
చెల్లునా నారాయణ నారాయణ - శ్రీమన్నారయణ

చరణం 2

వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబధజేతురా . . .
దివిజేంద్రవంధ్య - శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర . . . శ్రీనారాయణ
నారాయణ-శ్రీమన్నారయణ

పాలనేత్రాల ప్రడల విద్యులతా

పల్లవి

పాలనేత్రాల ప్రడల విద్యులతా కేళి విహార లక్ష్మీనారసింహా
లక్ష్మీనారసింహా లక్ష్మీనారసింహా . . .

చరణం 1

ప్రళయ మారుత ఘోర భస్రికా పూత్కార లలిత నిశ్వాస డోలా
రచనయ కులశైలి కుంభినీకుముదహిత రవి గగన చలనవిధి నిపుణ నిశ్చలనాధ

చరణం 2

దారుణోజ్వా ధగద్దగిత దంష్ట్రానల - వికారస్సులింగ సంగక్రీడయా
వైరి దానవ ఘోరవంశ భస్మీకరణ కారణ ప్రకట . . . వేంకటనారసింహా

జగడపు చనువుల జాజర

పల్లవి

జగడపు చనువుల జాజర సగీవల మంచపు జాజర

చరణం 1

మొల్లలు తురుములు ముడిచిన బరువున సరసపు మురుపేమున
జిల్లన పుప్పొడి జారగ పతిపై చల్లె రతివలు జాజర

చరణం 2

భారపు కుచములపై పైకడు సింగారపు నెరపెడి గంధవొడి
చేరువపతిపై చిందగ పడతలు సారెకు చల్లేరు జాజర

చరణం 3

బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదుల్ నించేరు సుంకుమదంబుల జాజర ||జగడపు||

ఏమొకో చిగురుటధరమున యొడనెడ కస్తూరి నిండెను

పల్లవి

ఏమొకో చిగురుటధరమున యొడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుకదా

చరణం 1

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన చెలువం బిప్పుడిదేవమో
చింతింపరే చెలులూ! నులువున ప్రాణేవ్వరుపై నాటిన ఆ కొనచూపులు
నిలువున పెరుగక నంటిన నెత్తురు కాదుకదా...||ఏమొకో||

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు..

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ||2||
కొండలంత వరములు గుప్పెడువాడు ||కొండలలో||

చరణం 1

కుమ్మర దాసుడైన కురువరత్తినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు ||కుమ్మర||
దొమ్ములు చేసినయట్టి
తొండమాన్‌ చక్కురవర్తి ||2||
రమ్మన్న చోటికి వచ్చి నమ్మీనవాడు ||దొమ్ములు|| ||కొండలలో||

చరణం 2

అచ్చపు వేడుకతో అనంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్నుమోచినవాడు ||అచ్చపు||
మచ్చిక దొలక
తిరుమల నంబి తోడుత ||2||
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు ||మచ్చిక|| ||కొండలలో||

చరణం 3

కంచిలోననుండ...
కంచిలోననుండ తిరుకచ్చినంబి మీద ||2||
కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ||కంచి||
ఎంచనెక్కుడైన వేంకటేశుడు... ||2||
మనలకు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలకు ||ఎంచ||
మంచివాడై కరుణ పాలించినవాడు ||ఎంచ|| ||కొండలలో||

అస్మదీయ మగటిమి - తస్మదీయ తకధిమి

పల్లవి

అస్మదీయ మగటిమి - తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు - భంగభంగారె భంగా
[ఆమె] వలపే ఇటుదులిపే - చెలి ఒయ్యారంగా కధలే ఇక నడిపె - కడుశృంగారంగా
[అతడు] పెనుగొండ ఎడనిండ రగిలించి వెన్నెల హలా . . .

చరణం 1

[ఆమె] నీపని - నీచాటు పని రసలీల లాడుకున్న నీ రాజసాల పని
[అతడు] మాపని . . . అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
[ఆమె] ఎపుడుపుడుడని ఎద ఎద కలిపే ఆపని
[అతడు] రేపని చురిమాపని పనిక్షణమాపని ఆపని
[ఆమె] పపపపనీ పనిగ గసని పనీ మమమమమనీ మపనీ
[అతడు] ఆపేఈ ఏదో ఇపుడే తెలుపనీ
[ఆమె] వలపనీ ||అస్మదీయ||

చరణం 2

[ఆమె] ఓసఖీ . . . రాకెందు ముఖి ముద్దులాడు యుద్ద రంగాన ముఖాముఖి
[ఆమె] ఓసఖా . . . మదునుని జనకా ఈ సందిట కుదరాలి మనకు సంధియిక
[అతడు] ఋతువున కొకరుచి మరిగిన మన సయ్యాటికి
[ఆమె] మాటికి మొగమాటవు సగమాటలు యేటికి
[అతడు] పపపపనీ పనిసగసనిపని మమమమనీ మపనీ
[ఆమె] పెళ్లికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి ||అస్మదీయ||

మూసిన ముత్యాలకేలే మొరుగులు

పల్లవి

మూసిన ముత్యాలకేలే మొరగులు ఆసల చిత్తానికేలే అలవోకలు . . . 1

చరణం 1

కందులేని మోమునకేలే కస్తూరి
చిందు నీ కొప్పనకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పైకమ్మని నీమేనికి ||మూసిన||

చరణం 2

ముద్దు ముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||మూసిన||

శోభనమే . . . వైభవముల పావనమూర్తికీ

పల్లవి

శోభనమే . . . శోభనమే . . . వైభవముల పావనమూర్తికీ
దేవదానవుల ధీరతకు ధావతిపడి వార్ధీతరువుగను
శ్రీ వనితావాణి చెలగి పెండ్లాడిన శ్రీ వేంకటగిరి శ్రీనిధికి ||శోభనమే||

విన్నపాలు వినవలె వింత వింతలు

పల్లవి

విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
కంటి శుక్రవారము గడియటేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని కంటి పిడికిట తలంబ్రాలు పెండ్లికూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లికూతురు పేరుగల జవరాలీ
పెండ్లికూతురు - పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు
అలర చంచలమైన అత్మలందుండ - నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
నీభావంబు తెలిపెనీ ఉయ్యాల

పొడగంటిమయ్యా మిమ్ము

పల్లవి

పొడగంటిమయ్యా మిమ్ము పూరుషోత్తమా ||3||
మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా ||పొడగంటి||

చరణం 1

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా ||2||
చాలా - నేరిచి పెద్దలిచ్చిన నిధానమా ||కోరి||
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా ||2||
మాకు
చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ||గారవించి|| ||పొడగంటి||

చరణం 2

భావింప కైవసమైన పారిజాతమా ||3||
మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణి ||భావింప||
కావించి కోరికలిచ్చే కామధేనువా ||2||
మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా ||కావించి|| ||పొడగంటి||

చరణం 2

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ||3||
ఓం నమో వేంకటేశాయా ||2||
రోగాలడచి రక్షించే
దివ్యౌషధమా ||చెడనీక||
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా ||2||
మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాధుడా ||బడి|| ||పొడగంటి||

అదివో . . . అల్లదివో శ్రీహరివాసము

పల్లవి

అదివో . . . అల్లదివో శ్రీహరివాసము పదివేలు శేషుల పడగలవలయము

చరణం 1

అదె - వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస ముఖిలమునులకు అదె
చూడుడదే మ్రొక్కుడానందమయము

చరణం 2

కైవల్యపదము వేంకటనగమదిలో శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపదరూప మదివో పావనములకెల్ల
పాపనమయము