Showing posts with label - కమల్‌ హాసన్‌. Show all posts
Showing posts with label - కమల్‌ హాసన్‌. Show all posts

రానేలా వసంతాలే

రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే...

చరణం 1

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నే రాగమే
ఎగిరే పోతమై విరిసే తోటనై
ఏ పాట పాడినా పది పువులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి
రానేలా వసంతాలే...

చరణం 2

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనె చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటిపోయే ప్రెమగీతిలాగ ||రానేలా||

కన్నెపిల్లవని కన్నులున్నవని...

తన్న తన్ననన తన్న తన్ననన
తన్నాన ననన తనతన తన్నాన ఓహో
కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల్లలల్లలల లల్లలల్లలల లల్లల
లల్లల లాలలాల లాలాలా
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారీ ||కన్నె||

ఏమంటావ్... ఊ...
ఉహు... సంగీతం...
నన్నానా... ఉ... నువ్వైతే...
రీసరీ... సాహిత్యం ఊహు... నేనౌతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా ||కన్నె||

చరణం 1

ననననాన సే ఇట్ వన్స్ ఎగైన్‌
ననననాన... స్వరము నీవై...
తరనన తరరనన
స్వరమున పదము నేనై ఓకే
తానే తానే తానా... గానం గీతం కాగా
తరనతన... కవిని నేనై
తానా ననన తానా... నాలో కవిత నీవై
నాన నాననా లలలా తనన తరన
కావ్యమైనదీ తలపో పలికే మనసో ||కన్నె||
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా...

చరణం 2

ఇప్పుడు చూద్దాం...
తనన తనన తన్న...
ఉహూ... తనన తనన అన్నా...
తాన తన్న తానం తరనా తన్న
తాన అన్న తాళం ఒకటే కదా
అయ్య బాబోయ్...
తనన తాన తాన నాన తాన ఉహ్...
పదము చేర్చి పాట కూర్చలేదా శభాష్
దనిని దససా అన్నా నీదా అన్నా
స్వరమే రాగం కదా
నీవే నేనని అన్నా మనమే కాదా ||2||
కన్నెపిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరి
చిన్న నవ్వు నవ్వి నిన్ను రువ్వి రువ్వి
కలిసి నేను మెప్పించేది ఎపుడని ||కన్నె||

వేలా వేలా గోపెమ్మలా...

వేలా వేలా గోపెమ్మలా...
మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే ||2||
అహా అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే ఆ హాహాహా... ||వేలా వేలా||

చరణం 1

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే ||2||
కన్న తోడు లేనివాడే కన్నె తోడువున్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే ||2||
చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే
పోతన్న కవితలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే
మా ముద్దూ గోవిందుడే ఆ హాహాహా... ||వేలా వేలా||

చరణం 2

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే ||2||
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్థ సారమిచ్చీ గీతలెన్నో మార్చేనే ||2||
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే ||మా మువ్వా|| ||వేలా వేలా||

సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా...

ఆ... ఆ... ఆ... ఆ ఆ... ఆ...
చాలా బాగా పాడుతున్నారే
ఆ... పై షడ్జమం ఆ మందరం
ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ... ఆ.. ఆ... ఆ ఆ...
నిసరిమ పనిసరి నిరిరిస నిపమపనిసా
నిపమరిమరీ నీసా...
తానననా... తానాన...
తదరీ... నా... ఆ...
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా... సీతాలమ్మా...
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా ||సువ్వీ||

చరణం 1

అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే ||2||
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
గుండెలేని మనిషల్లే.. ||గుండె||
అగ్గిలోన దూకి పూ మొగ్గాలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు ||2||
సువ్వీ సువ్వీ సువ్వీ.. సువ్వి సువ్వి సువ్వీ ||సువ్వీ||

చరణం 2

చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ||2||
ఆగక పొంగే కన్నీళ్లే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ||2||
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు? చూస్తాడా ఆ పైవాడు
సువ్వీ సువ్వీ సువ్వీ... ||సువ్వీ||

ముకుందా ముకుందా కృష్ణా

ముకుందా ముకుందా కృష్ణా
ముకుందా ముకుందా
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ||2||
వెన్న దొంగవైనా మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయలా మృదంగానివా ||ముకుందా||
జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ||ముకుందా||

చరణం 1

నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగ విప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి
నాట్యమాడి కాళీయుని దర్పమణిచాడు
నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే కృష్ణతత్వమేగా
అట అర్జునుడొందెను
నీ దయవల్ల గీతోపదేశం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం
వేదాల సారమంతా వాసుదేవుడే
రేపల్లె రాగం తానం రాజీవమే ||ముకుందా||

చరణం 2

మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి
కూర్మరూప ధారివి నీవై భువిని మోసినావే
వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే
నీ ఒరవడి పట్టి ముడిపడి వుంటా
ఏదేమైనా నేనే
మదిలోని ప్రేమ నీవే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా ||ముకుందా||

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా
నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాటమాటలో
ఓహొ... కమ్మని ఈ ప్రేమ లేఖనే
రాసింది హృదయమే ||ప్రియతమా||

చరణం

గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయె
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ
కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక
నీ గుండె బాధపడితే తాళనన్నదీ
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్చమైనదీ
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
ఉమాదేవిగా శివుని అర్థభాగమై
నాలోన నిలువుమా
శుభలాలి లాలి జో లాలి లాలి జో
ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా
రాసేది హృదయమా
నా హృదయమా

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ||2||
ఆ నింగి ఎన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ ||నిన్ను తలచి||

చరణం 1

ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయి జీవితం
జోరువానలోన ఉప్పునైతే నేనే
హొరుగాలిలోన ఊకనైతే నేనే
గాలిమేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రేమే
కధ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే ||నిన్ను తలచి||

చరణం 2

కళ్లలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరుపూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసివున్న తలరాత తప్పదు
చిత్రమే అది చిత్రమే
గుండెకోతలే నాకు ఇప్పుడు
చిత్రమే అది చిత్రమే
కధ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే ||నిన్ను తలచి||

ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది

ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
అప్పుడిన్న... అర్థం కాలేదా
ఏ తీగపూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది
ఏ వింత అనుబంధమౌనో
తెలిసీ తెలియని అభిమానమౌనో

చరణం 1

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా అప్పుడియా... పెద్ద అర్ధం అయినట్టు
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది ||ఏ తీగపూవునో||

చరణం 2

వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏ నీ రొంబ అళహారిక్కే ఆ రొంబ అంటే
ఎల్లలు ఏవీ ఒల్లలన్నది
నీది నాదొక లోకమన్నది ||2|| ||ఏ తీగపూవునో||

చరణం 3

తొలిచూపే నను నిలవేసినది
మారుమాపై అది కలవరించినది
నల్ల పొణ్ణు అంటే నల్ల పిల్ల
మొదటి కలయికే ముడివేసినది
తుదిదాకా ఇది నిలకడైనది ||2|| ||ఏ తీగపూవునో||

సన్నజాజి పాడకా మంచె కాడ పాడకా

సన్నజాజి పాడక మంచె కాడ పాడక
చల్లగాలి పాడక
మాటవినకుందీ ఎందుకే... ||2||
మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది
మాయని ఊసే పొంగి పాటై రావే... ||సన్నజాజి||

చరణం

కొండమల్లి పువ్వులన్నీ గుండెల్లో నీ నవ్వులన్నీ
దండే కట్టి దాచుకున్నా నీ కొరకే...
పండు వెన్నెలంటి ఈడు ఎండల్లోన చిన్నబోతే
పండించాగా చేరుకున్నా నీ దరికే
అండా దండా నీవేనని పండగంతా నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే...
కొండాపల్లి బొమ్మా
ఇంకా పండు చెండు దోచెయ్యనా
గుండె పంచే వేళైనది రావే...
దిండే పంచే వేళైనది రా... వే... ||సన్నజాజి||
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గేకంది పో... యే...
మాట వినకుంది ఎందుకే...