Showing posts with label * సంధ్య. Show all posts
Showing posts with label * సంధ్య. Show all posts

అలనాటి రామచంద్రుని కన్నింట సాటి

అలనాటి రామచంద్రుని కన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుని కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ
తెలుగింటి పాలసంద్రం కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమల్లె కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మ వెన్నేలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మ

చరణం 1

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేల్లూ
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలూ
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటను పదిమందీ చూడండీ
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండీ ||చందమామ||

చరణం 2

సీతారాముల కల్యాణంలా కనిపిస్తూవున్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె వున్నా
మరగలేదు మన్మధుని వొళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండీ
తదుపరి జరిగిన వివరములడగక బంధువులంతా కదలండీ ||చందమామ||