Showing posts with label - మాధవన్‌. Show all posts
Showing posts with label - మాధవన్‌. Show all posts

వర్షించే మేఘంలా నేనున్నా...

వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా ||2||
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంటా
ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే
నే మరిచానే
నన్నింక ఇంక బాధించకే
భామా భామా ప్రేమ గీమ.. వలదే ||వర్షించే||

చరణం 1

నాటి వెన్నెల మళ్లీ రానేరాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేనిని మరువగ తరమా
హా... ఆ...
ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవే నేనని నువు పలుకగ
కోటి పూవులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరచిపోవే మనసా ఆ... ||వర్షించే||

చరణం 2

చేరుకోమని చెలి పిలువగ
ఆశతో మది ఒక కల గని
నూరు జన్మల వరమై నిలిచె
ఓ చెలీ...
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిమిషమైనా నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపటెలా
మది మరిచిపోని మధురోహలనే
మరచిపోవే మనసా... ||నా గతమంతా||