Showing posts with label * ఆర్‌.పి. పట్నాయక్‌. Show all posts
Showing posts with label * ఆర్‌.పి. పట్నాయక్‌. Show all posts

అందమైన మనసులో...

అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో.. ఎందుకో.. ఎందుకో...
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో.. ఎందుకో.. ఎందుకో...
ఎందుకో.. అసలెందుకో.. అడుగెందుకో...
మొదటిసారి ప్రేమ కలిగినందుకా... ||అందమైన||

చరణం 1

అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట అయినా తక్కువేమీ కాదే ప్రేమకు సాటేదీ లేదే
రైలుబండి కూతే సన్నాయి పాట కాగా రెండు
మనసులొకటయ్యేనా...
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెనా... ||అందమైన||

చరణం 2

ఓర నవ్వుతోనే ఓనమాలలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ
కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ
గాలివాటు కాదేమైనా...
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా
అందుకోవె ప్రేమ దీవెన... ||అందమైన||

నీ స్నేహం ఇక రాను అని...

నీ స్నేహం ఇక రాను అని
కరిగే కలగా అయినా
ఈ దూరం నువు రాకు అని
నను వెలివేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే
నా మనసంతా నువ్వే ||2||

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా

చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ||2||
మనసంతా నువ్వే మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

చరణం 1

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతీ
గాలిలో పరిమళం నాకు చెబుతున్నదీ ||2||
ఎపుడో ఒకనాటి నిన్ననీ
ఇపుడూ నిను చూపగలననీ
ఇదిగో నా నీడ నువ్వనీ
నేస్తమా నీకు తెలిసేదేలా... ||చెప్పవే||

చరణం 2

ఆశగా ఉన్నది ఈ రోజే చూడాలనీ
గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ ||2||
నీ తలపులు చినుకు చినుకుగా
దాచిన బరువెంత పెరిగినా
నిను చేరే వరకు ఎక్కడా
కరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా.. ||చెప్పవే||

బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ

పల్లవి

బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ
బుల్లీ బుల్లీ నా బొండు మల్లీ హాయ్‌ పాడరద్ది కుంకుమెట్టి
ముస్తాబయ్యొస్తే అడుదామే కోక్కో కోలాటం
చీరకట్టి సెంటుకొట్టి నా చెంత కొస్తే
చూపుతాలె కుర్రాడి వాటం
మల్లీ మల్లీ నా మామా మల్లీ
మల్లీ మల్లీ నా మామా మల్లీ హాయ్ డాబు చాలు గాని
బాబూ నీ చెంత కొస్తే
ముగ్గులాగ ముడిచేసుకుంటావ్‌
గడ్డి వాము చాటు కొచ్చినే సైగచేస్తే సిగ్గుతోటి లగ్గెత్తుకుంటావ్‌
ఆ పంచ కట్టేసి ఓ పింఛమెడితే
కిట్టయ్య లాగా మా బాగా వున్నావే
అందాల రాధమ్మ నువ్వు గాని అయితే
నీ పక్కనేను కిట్టయ్య నవుతాలే
అమ్మదొంగ ఎటకారం వద్దు
ఇంక నాతో చెలగాటం వద్దు ఒక్కటయ్యే వీలే లేదా
ఓ వెన్నదొంగా ఈ కన్నెబెంగ తీరేది ఎట్టాగా
నా సామిరంగా బంగారు జింకా పట్టింది నేనేగా ||బుల్లీ బుల్లీ||
నీ నవ్వు ముత్యాలు నే తీసుకెళ్ళి
ముత్యాల హారం చేయించి ఇస్తాలే
నీ సూపు వజ్రాలు నేనేరుకెళ్ళి అద్దాలమేడ కట్టించి ఇస్తాలే...
అయ్య బాబాయ్‌ గాలే కొట్టొద్దు
నువ్వు కూడ అట్టే మొయ్యెద్దు నేనంటేను ప్రేమేలేదా
వయ్యారి బాలా ఓ మేఘమాలా పండింది నా పంటా
ఓ చందమామా నా మేనమామా నేనేగా నా జంటా ||బుల్లీ బుల్లీ||

మామారే మజారే మామారే మజారే మామారే మజారే మజ్జా

పల్లవి

మామారే మజారే మామారే మజారే మామారే మజారే మజ్జా ...2
అరె ఊరంతా వినేలా పాడు
అహా కొండంతా ఖుషీగా ఆడు
మన శ్రీరాముడు మరో జన్మెత్తాడు
మళ్ళీ వచ్చాడు ఈనాడు

చరణం 2

మనసుల జత వయసుల జత కలిసే వేళ
మనగడ కధ మధురం కద చాలా చాలా
అందాల నీ ప్రేమ రాజ్యానికి అధికారి నేనేసుమా
సందేళ సరిలేని సరసానికి దొరసాని నువ్వే సుమా
ఇలా రెండింతలై అలా మూడింతలై
భలేగుంది పెరిగింది కేరింత ఇంత అంతకంత ||మామారే||

చరణం 2

కాదననిక లేదననిక ఏదైమైనా
రేపననిక మాపననిక ఏకంకానా
వయ్యారొ నీమేని వుయ్యాలలో వెయ్యేళ్ళు వూగేయనా
వెన్నంటి నువ్వుంటే నా బాటలో స్వర్గాలు పాలించనా
ఇది తరంగమో మరీ వీరంగమో
ఈ వంక చూడంగ వేగంగా నింగి వంగి పోయె ||మామారే||

పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా

పల్లవి

పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకోకోలా...2
ఒక్కోలా వుందిర బాలా దిల్‌ ధడక్‌ ధడక్క్‌లా
ఎవ్రీడ్‌...హొళీలా...ఉంటుందే... మీవల్లా... ||పెదవుల్లో||

చరణం 1

హంస నడకలు సిగ్గుపడేలా పిల్లనడకల స్టైలా
హింస పెట్టి చంపేసేలా కొంపముంచే స్మైలా
వానవిల్లే ఖంగుతినేలా ఇన్ని రంగులు చూపాలా
మేల్‌ జాతికి కీడొచ్చేలా వుంది మీ వల్లా ||పెదవుల్లో||

చరణం 2

పడుచు పాపలు నవ్వితే ఇలా ఫాంటసీ ఫౌంటెన్‌లా
నైటు మొత్తం నాటీ కలలే శాటిలైట్‌ ఛానల్‌లా
ఎగిరి పోదా గాలి పటంలా వయసు మీ వెలకాలా
గుండె నమిలేలా నడవాలా నెమలి పింఛంలా ||పెదవుల్లో||

బాబూజీ నాతో రారా నిన్నే చూస్తుంటే

పల్లవి

[ఆమె]బాబూజీ నాతో రారా నిన్నే చూస్తుంటే
ఏదేదో అయిపోయెలేరా
తాపం తీరం మార్గం నువ్వే నేడే చూపించు ఏరా
అ అ ఆజా రా రా రాజా అ అ ఆజా రా రా రాజా...
[అతడు] ఓ సైరో నేనే దాడి ...

చరణం 1

[ఆమె] వయస్సే వచ్చేసి ఇబ్బందిగా ఉంది
మనసే పంచిచ్చే మగాడు లేడంతి
గురువా నువ్వయినా చల్లార్చెయ్ ఈ వేడి అరెహే ...
నిప్పై రాజేసుకున్నాయి మోహాలు
నీరై పోయేట్టు చెయ్యాలి యుద్ధాలు
కౌగిట్లో వాలి వేసెయ్యరా సంకెళ్ళు అరె హో అరెహో ...
లా ల ల లా ల ల ... ||బాబూజీ||

చరణం 2

[ఆమె] నీలో దమ్మెంతో దాగుందో తెలిసేలా
నాలో సోకంతా ఆవిర్లు కావాల
ఆపై చెమటల్తో స్నానాలు చెయ్యాలా
అరె హో అరెహో ...
మత్తే ఎక్కేకా మర్యాద ఏముంది చిత్తుగా
తడిశాకా ఛీపాడు లేదంది
ఎత్తుకుపోనన్ను అదేగా మిగిలింది అరె హో అరెహో ...
లా ల ల లా ల ల ... ||బాబూజీ||

మమ మల్లెచెండా కాకాకా

పల్లవి

[ఆమె] మమ మల్లెచెండా కాకాకా కాయాపండా
[అతడు] వవవ వక్కాదిండ ఆకువక్క నోరే పండ
[ఆమె] జోరుగుమ్మ అవుతుందిరా జోడుకట్టి పోదాం పదా
[అతడు] ఏకమైతే ఈడుజోడూ ఎవ్వరాపేరులే సరేపదా
చేచేచే చేతవెన్నముద్దకన్న నీనీనీనీ ముద్దు మజాలే
గాగాగా గాజులన్ని గోలలమ్మ నానానానా మోజులిస్తాలే

చరణం 1

[అతడు] ఏయ్ జజ్ఞనాక దరువులే భలే గజ్జలకే పరుగు ఇదే
కవ్వింతలే మరి తుల్లింతలే
[ఆమె] ఏయ్ తద్దినక తెలుగువలె మద్దెలకే మెలుకువలె
ముద్దుందిలే భలే పొద్దుందిలే
[అతడు] పిల్లా ఎన్నాలికో జడి ఉంచానుపంచణా ఏమంటవే చెలి అంటుంకుంటే
[ఆమె] కోరుకున్నది అందినా పొందినా ఈ మంట ఆరదు అంటుకుంటే
[అతడు] చెలరేగిందిలే మరి తడిపొడి తిల్లానా
[ఆమె] ఇదేకద సరా సరి తందనునా
[అతడు] నీనినిని ఆకుచాటు పిందెలన్ని నేనేనేనే గిల్లుకుంటానే
[ఆమె] నానానానా పైట మరీ జారుకున్న నీనీనీనీ పట్టుకావాలే

చరణం 2

[అతడు] కొక్కొరోకో కోడివలె ముగ్గులలో రధమువలె
రమ్మందిల్ మనసిమ్మందిలే
[ఆమె] ఏయ్ ముక్కెరకే మెరుగువలె
చక్కెరలో చెరకువలె చిలకుందిలె అది కొరికిందిలే
[అతడు] ఏయ్ నీగుండె లోతుగ ప్రేమగా డోముగా నే
ఊగనా ఇక ఉయ్యాలగా
[ఆమె] కోక జారుడు ఆపినా ఆగునా చందమామను నమ్ముకుంటే
[అతడు] కొనసాగేదెలా మరీ ఎడాపెడా...
[ఆమె] ముఖాముఖీ ముడే పడే చిందులోనా ||నీనీ నీనీ ఆకుచాటు వవవ వక్కాదిండా||