రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా...

రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితను పాడగా ||రాయి||
పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా

చరణం 1

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా ||అడవి||
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్ల రామభద్రుని వేలిగురుతులు మోయనా ||రాయి||

చరణం 2

కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు
గడ్డిపోచను శరముచేసే ఘనత రాముడు చూపగా ||కాకి||
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా
మద మత్సరమ్ములు రేపగా ||పడవ|| ||రాయి||