Showing posts with label - జెనీలియా. Show all posts
Showing posts with label - జెనీలియా. Show all posts

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
కలత పడుతుందే లో లో న కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగిలు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
పచ్చగా ఉన్న పూతోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా ||పచ్చగా||
ఉండలేను నెమ్మదిగా ఎందుకంటే తెలియదుగా ||2||
తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పుకు పోడం తక్షణం
అంటూ పట్టుపడుతుందీ ఆరాటం పదమంటూ నెట్టుకెలుతుందీ నను సైతం

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన
పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో
ఈ ఉదయం ఏ హృదయం హే చేరుతుందో ఈ ప్రేమ
ఏ నిమిషం ఏది నిజం హే... తెలియకుందే ఈ మాయ
ఆశపడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే
ఆగుబురులోనే చిగురు వేసిందే హేయ్… ||ఎగిరే||

చరణం 1

నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు
ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా
నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా
నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా
నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా
నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

చరణం 2

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు
ఇపుడైనా ఇకనైనా నీ పంతం ఆగేనా
అన్నీ మరిచి కోపం విడిచి నాతో చెలిమి చేసినా
పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా
నీతోడే కావాలంటూ నీ నీడై ఉండాలంటూ
నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ ||ఎగిరే||

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా...
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!
ఓ మగువా నీతో స్నేహం కోసం
ఎంతో ట్రై చేశా...
దేవదాసులాగ మారి గడ్దం పెంచేశా!
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా ||2||
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా ||ఓ మగువా||

చరణం 1

ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్‌లైట్ వేళ నుంచి మూన్‌లైట్ వేళ్లేదాకా
ఫుల్ టైమ్ నా గుండెల్లో ధాట్‌లన్నీ నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు
నమ్మవుగాని కలవరమాయె
ఓ మగువా... ఓ మగువా... ఓ మగువా... ఏయ్ ||ఓ మగువా||

చరణం 2

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా
ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె...
నీ మాటలు లేక మోడైపోయె
మగువా... ఓ మగువా... ఓ మగువా... ||ఓ మగువా||

నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా

నా పెదవులు నువ్వైతే... నీ నవ్వులు నేనౌతా
నా కన్నులు నువ్వైతే... కల నేనౌతా
నా పాదం నువ్వైతే... నీ అడుగులు నేనౌతా
నా చూపులు నువ్వైతే... వెలుగే అవుతా
చెరో సగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై
సదా శిలాక్షరం అవ్వాలి ప్రేమకీ ||నా పెదవులు||

చరణం 1

కనిపించని బాణం నేనైతే...
తియతీయని గాయం నేనౌతా
వెంటాడే వేగం నేనైతే... నేనెదురౌతా
వినిపించని గానం నేనైతే...
కవి రాయని గేయం నేనౌతా
శ్రుతిమించే రాగం నేనైతే... జతి నేనౌతా
దిగి వచ్చే నెచ్చెలి నేనౌతా
నిను మలిచె ఉలినే నేనైతే
నీ ఊహలు ఊపిరి పోసే
చక్కని బొమ్మను నేనౌతా ||నా పెదవులు||

చరణం 2

వేధించే వేసవి నేనైతే... లాలించే వెన్నెల నేనౌతా
ముంచెత్తే మత్తును నేనైతే... మైమరపౌతా
నువ్వోపని భారం నేనైతే...
నిన్నాపని గారం నేనౌతా
నిను కమ్మే కోరిక నేనైతే... రారమ్మంటా
వణికించే మంటను నేనైతే...
రగిలించే జంటను నేనౌతా
పదునెక్కిన పంటిని నేనైతే
ఎరుపెక్కిన చెక్కిలి పంచిన
చక్కెర విందే నేనౌతా ||నా పెదవులు||

మధురమె మధురమె మధురమె

మధురమె మధురమె మధురమె
ఈ కనులకి కలలూ మధురమే
సెలయేటికి అలలూ మధురమే
నీలాల మేఘం నువ్వే... నీ నవ్వే తేనెల వానై...
నా కోసం వస్తే మధురమే
ఆ... నన్నే తడిపేస్తే మధురమే

చరణం 1

నీ కోసం నే రాసే చిరు పాటైనా మధురమే
నా కోసం నువు పలికే అరమాటైనా మధురమే ||2||
లిపిలేని సడిలేని ఆ కన్నుల భాష మధురమే
హృదయాన్ని మురిపించె
ఆ సాగర ఘోష మధురమే
మధుమాసం మధురమే
నీ దరహాసం మధురమే
ఉంటే నువ్వుంటే ఆ శూన్యం అయినా
మధురమె... మధురమే ||మధురమె||

చరణం 2

సఖి విడిచే శ్వాసల్లో పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో మట్టిని తాకిన మధురమే ||2||
ఉదయాన ఉదయించే
ఆ సూర్యుడి ఎరుపు మధురమే
రేయంత వికసించే
ఆ వెన్నెల తెలుపు మధురమే
చెక్కిలి మెరుపు మధురమే
చెలి కాటుక నలుపు మధురమే
రాల్చే కను రాల్చే ఆ కన్నీరైనా
మధురమె... మధురమే ||మధురమె||

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి

పల్లవి


[అతడు] అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే
మరి కలవో అలవో వరమో నా ఊహల హాసిని
మదిలో కధగా మెదిలే నాకల సుహాసిని
ఎవరేమనుకున్నా నా మనస్సందే నువ్వేనేనని ||అప్పుడో ||


చరణం 1


[అతడు] తీపికన్నా ఇంకా తియ్యనైనా నేనే ఏది అంటే వెంటనే నీ పేరని
అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళేదారని
అంటానే
నీలాల ఆకాశం ఆనీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని
అంటానే ||అప్పుడో ||


చరణం 2


[అతడు] నన్ను నేనే చాలా తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేమి చెప్పక
పోతుంటే
నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్నమాటే నువ్వు నాతో
మాట్లాడావంటే
నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే ఏదేదో అయిపోదా నీ జత
నాకుంటే ||అప్పుడో ||

నమ్మక తప్పని నిజమైనా నువ్విక

పల్లవి

[అతడు] నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నామది ఇపుడైనా
ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేనా
ఎందరితో కలిసున్నా నేను ఒంటరిగానే ఉన్నా
నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా
కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా
ఇప్పటి ఆ కలలోనే ఉన్నా ||నమ్మక ||


చరణం 1



[అతడు] ఈ జన్మంతా విడిపోదు ఈ జంట అని దీవించిన గుడి గంటను
ఇక నామది వింటుందా
నా వెనువెంటా నువ్వే లేకుండా రోజు చూసినా
ఏ చోటైనా నను గుర్తుస్తుందా
మునుపన నను తడిమి అలా
వెనుదిరిగిన చెలిమి అలా తడి కనులతో నిను వెతికేది ఎలా || నమ్మక ||


చరణం 2


[అతడు]నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగ
గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు
అనుకోనా
చిరు నవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా ||నమ్మక ||

లాలూదర్వాజా కాడా గోల్కొండ కోట

పల్లవి

[అతడు] లాలూదర్వాజా కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాల కాడా మోగుతుందిలే భాజా
ఇటలీ, ఇంగ్లాండులైనా మనహిందు దేశమైనా
ఈ ప్రేమ కధలే ఒకటే ఊరు వాడలేవైనా
గోవిందా గోవింద ఏమైనా బాగుందా
ప్రేమిస్తే పెద్దోళ్ళంతా తప్పులెంచుతారా
గోపాలా గోపాలా ఏందయ్యో ఈ గోలా
ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా ||లాలూదర్వాజా||


చరణం 1


[అతడు] కన్ననాడు అడిగామా పెంచడానికి అడిగామా
గోరుముద్దలు పాల బువ్వలు అడిగిపెట్టీనామా
మేముతాగు అన్నామా వేలు ఎత్తి చూఫామా
నమ్మరైన మీ కన్నప్రేమలో వంకలు వెతుకుతామా
అంతగౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా
ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తురామా
పాతికేళ్ళిలా పెంచారంటూ తాళి కట్టిపోమా
వందయేళ్ళ మా జీవితాలకే శిక్ష వేసుకోమా
అందుకే లవ్ ఈట్ లైఫ్ బ్యూటిఫుల్ ||2|||లాలూదర్వాజా||


చరణం 2


[ఆమె] వేణుగానలూర వేగములు రారా నిలిచెను ఈ రాధా నీ కోసమే
వెన్న దొంగ రారా ఆలసించవేరా పలికెను నోరార ఈ నామం
ఉన్న చెట్టు నీడలోనా కన్నెలాగా వేచి ఉంది
కన్నెరాధ గుండెలోన చిన్ని ఆశ దాగి ఉంది
చిన్ని ఆశ దాగి ఉంది
[అతడు] ప్రేమ ప్రేమ అంటారు ప్రేమకోటి రాస్తారు
ఈడు వేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు
లొల్లి లొల్లి చేస్తారు లవ్‌దు స్పీకరేస్తారు
ప్రేమ జంటని పెద్ద మనస్సుతో మీరు మెచ్చుకోరు
ఎంత చెప్పినా మొండివైకరి అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తెల్చుకోండి మీరు
కన్న ప్రేమని కన్నెప్రేమని పోల్చి చూడలేము
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తెల్చి చెప్పలేము
లవ్ ఈజ్ లైఫ్ బ్యూటిఫుల్ || 2 ||

కన్నులు తెరిచే కలగంటామని

పల్లవి

[అతడు] కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కాని ఇప్పుడు
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులు అంటుంటే
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను
కాని ఇప్పుడు ప్రేమకోసం ఏకంగా తాజ్ మహల్ కట్టాడు
షాజహాన్‌కి పని లేదా అనుకున్నాను
ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను
అరె ఇంతలో ఏందేందో జరిగిందిరో
ఈ ప్రేమలో నేను కూడా తడిశానురో ||కన్నులు||


చరణం 1


[అతడు] ప్రేయసి ఊహల్లో లైఫంతా గడిపేస్తూ అరచేతికి స్వర్గం
అందిందంటే తిట్టుకున్నాను
కాని ఇప్పుడు
మీటింగ్ పార్కులకి, సెల్‌ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే
నవ్వుకున్నాను
కాని ఇప్పుడు
గాలిలోన రాతలు రాస్తే మాయరోగం అనుకున్నాను
మాటి మాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను
హొ హొ హొ అది ప్రేమని ఈరోజే తెలిసిందిలే
ఓ ఓ ఓ ఈప్రేమలో నే కూడా కలిశానురో ||కన్నులు||


చరణం 2


[అతడు] చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టే ఒకటుందంటే
నమ్మనే లేదు
కాని ఇప్పుడు
నీ కోసం పుట్టి నీ కోసం పెరిగే హృదయం ఒకటి
ఉంటుందంటే ఒప్పుకోలేదు
కాని ఇప్పుడు
ప్రేమమైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడ్నే ఎందుకు మిస్సయ్యానుక
హొ హొ హొ ఈరోజులా ఏ రోజు అవలేదురో
ఓ ఓ ఓ ఈ ప్రేమలో నేకూడా తడిశానురో ||కన్నులు||

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గర

పల్లవి

[అతడు] బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గర కొచ్చి ముద్దిమంది
సర్లే పాపం అని దగ్గరకెళితే దాని మనసే నిలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
[ఆమె] సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకు ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది


చరణం 1


[అతడు] చలిగాలై అంది చలికి వణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
[ఆమె] చలిని తరిమేసే ఆ కిటుకే తెలిసింది
శ్రమపడిపోకండి తమ సాయం వద్దంది
[అతడు] పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా
[ఆమె] అబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద
[అతడు] ఏం చెయ్యాలమ్మా నీలో ఏదో దాగుంది నీ వైపే నన్నే లాగింది


చరణం 2


[అతడు] అందంగా ఉంది తనవెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనస్సు అంటుంది
[ఆమె] తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
[అతడు] నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
[ఆమె] అయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
[అతడు] ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది నా మనస్సు
ఎన్నో కలలే కంటుంది ||బొమ్మని||

పదహారణాల తెలుగు జూలియెట్‌ ఎక్కడ ఉందో వెతుకుదాం

పల్లవి

[అతడు] We have a Romeo we need a Juliet ||2||
ఏ... పదహారణాల తెలుగు జూలియెట్‌ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మనవాడి చిలిపిలైఫ్‌నే ఎక్కడ ఉన్నా కలుపుదాం
కులమేదైనా ఫికర్ లేదు తల ఉంటే సరే
మతమేదైనా దిగుల్ లేదు మనసుంటే సరే సరే
సినీతారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవరో ||We have||


చరణం 1


[అతడు] చదువుల సుందరి అదిగోరా
నడిచే లైబ్రరీ ఎందుకురా
సెల్‌ఫోన్ సొగసరి ఇదిగోరా
ఎప్పుడు ఎంగేజేరా
టి. వి. యాంకర్‌ దేఖోరా ఉత్తర భాషకు దండంరా
టాటా గారి బేటిరా అది రూపిగుమ్మరా
ఏంకావాలో మనలో క్వాలిటి
ఇంకా నీలో లేదోయ్ గ్యారంటి
తేల్చేలోగా వయసవుతుంది కనీసం నూటొకటి ||We have||


చరణం 2


[అతడు] అందరు గమనిస్తూ ఉంటే ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట కాని వస్తుంటే తలనే నిమరాలి
కొంచెం కోపం కొంచెం జాలి కొంచెం స్వార్థం కలిసుండాలి
నన్నేనాడు కొత్తగా చూపే యువరాణే కావాలి ||We have||