ఊహల ఊయలలో గుండెలు కోయిలలై...

ఊహల ఊయలలో గుండెలు కోయిలలై
కూడినవి పాడినవి వలపుల సరిగమలు ||ఊహల||

చరణం 1

ఆహా... ఆహా ఒహోహో... ఆహా... ||2||
చిటపట చినుకులతో తొలకరి వణుకులతో ||2||
చలించినది ఫలించినది చెలీ తొలి సోయగమూ ||ఊహల||

చరణం 2

ఓహో... ఆహా... లలలా... ఆహా
హో... ఆహా... ఒహోహో... ఆహా
ముసిరిన మురిపములో కొసరిన పరువములో ||2||
తపించినది తరించినది ప్రియా తొలి ప్రాయమిది ||ఊహల||