Showing posts with label - త్రిష. Show all posts
Showing posts with label - త్రిష. Show all posts

ఔను నిజం నువ్వంటే నాకిష్టం...

ఔను నిజం నువ్వంటే నాకిష్టం
ఈ నిమిషం గుర్తించా ఆ సత్యం
చలి పరద ఇక నిలవదుగ
తెలుసుకదా అహ ఆఆ...
తెలిసిందే అడగాలా.. అడగందే అనవేలా..
చెవిలో ఇలా చెబితే చాలా.. ||ఔను నిజం||

చరణం 1

కసిరేస్తున్నా మనసుకు వినపడదో ఏమో
విసిరేస్తున్నా నినువిడి వెనకకి రాదేమో
నిదరోతున్నా ఎదురై కనపడతావేమో
కదలాలన్నా కుదరని మెలిపెడతావేమో
అంతగా కంట చూడనని మొండికేస్తే తప్పేమో
ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో
మన సలహా మది వినదుకదా..
తెలుసుకదా ఆ ఆ... తెలిసే ఇలా చెలరేగాలా

చరణం 2

సుడి గాలిలో తెలియని పరుగులు తీస్తున్నా
జడపూలతో చెలిమికి సమయము దొరికేనా
ఎదరేముందో తమరిని వివరములడిగానా
ఎద ఏమందో వినమని తరుముకు రాలేనా
తప్పుకో కళ్ళుమూసుకుని తుళ్ళి రాకే నా వెంట
ఒప్పుకో నిన్ను నమ్మమని అల్లుకుంటా నే జంట
నడపదుగ నిను నది వరదా
తెలుసు కద ఆ ఆ...
తెలిసే ఇలా ముంచెయ్యాలా

చందమామా.. చందమామా..

చందమామా.. చందమామా..
winterలో విడిగా ఉంటానంటావేమ్మా
హయ్యో రామా జంట రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా
నో నో ఒకసారిటు చూడూ నో నో నీ సొమ్మేం పోదూ
నో నో ముద్దంటే చేదా ఆ ఆ...
నో నో నాతో మాటాడు నో నో పోనీ పోటాడూ నో నో
సరదా పడరాదా దా.. దా.. దా.. దా.. ||చందమామా||

చరణం 1

వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో కోపం వచ్చి పిండేస్తున్నా pillow
కల్లో ఐతే సర్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
దేఖోనా సిగ్గును కొద్దిగ sideకి నెట్టా ఓకేనా ఏం బాగాలేనా
దాగేనా కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా వర్ణాల వానా
అంత గొప్పగా నచ్చానా నో నో నో నో నో నో నో..
ఇంత చెప్పినా డౌటేనా న న న న న న నా..
ఇల్లారా కళ్ళారా చూస్తావా ఇంకా ఎన్నో.. ఎన్నో.. ఎన్నో... ||చందమామా||

చరణం 2

కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా నీలో చాలా విద్యే ఉందే జాణా
గుమ్మంలోని ముగ్గై ఉన్నా నిన్నా నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా
చిత్రంగా చందన చర్చలు చెయ్యకు నాతో విన్నాలే శృంగార వీణా
తియ్యంగా చెంపలు మీటే కోరిక పుడితే కానీలే నే కాదన్నానా
ఊపిరాడదే నీ వొళ్ళో నో నో నో నో నో నో నో..
ఉండిపోకలా దూరంలో నో నో నో నో నో నో నో..
ముస్తాబై వచ్చేవా ముద్దిచ్చే ఉద్దేశంతో ఆహా ఆహా...

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే ||2||
జాడతడే.. అతడే.. అతడే.. అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ||2||
Life has made it stronger
It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter

చరణం 1

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ
జడివానై నే కలబడతా ||పెను||

చరణం 3

చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు ||పెను||
తన ఎదలో పగ మేల్కొలుపుతూ
వొడి దుడుకుల వల ఛేధించుతూ
ప్రతినిత్యం కధనం జరుపుతూ
చెలరేగే ఓ శరమతడూ
Life started to be faster
made him had a little think smoother
He's living on the edge to be smarter
This world has made him a fighter

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై మెరిసేనా
ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా విరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా ||పిల్ల||

చరణం 1

మౌనాల వెనకాల.. వైనాలు తెలిసేలా.. గారంగా పిలిచేనా..
ఝల్లుమంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించనా
చంద్రజాలమై తరంగాల ఒడిలో యేళ్ళన్నీ మరిపించనా
తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయేనా
చందనాలు చిలికేలా ముంగిలిలో నందనాలు విరిసేనా ||అందరాని||

చరణం 2

నవ్వుల్లో హాయి రాగం.. మువ్వల్లో వాయు వేగం.. ఏమైందో ఇంత కాలం..
ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నొ పలికే సరికొత్త రాగాలుగా ఓ...
నింగిదాకా పొంగిపోయి హోరెత్తిపోతున్న గానాభజానా
చెంగుమంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా ||అందరాని||

గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా

[అతడు] గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా నచ్చి నచ్చి కౌగిలిచ్చినాదిరా
[ఆమె] మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
[అతడు] అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిలి గిలి నిన్ను చేరుతానుగా
[ఆమె] ఓ సారి ఓ సారి ఒక్కసారి చేసిందే చేసేయ్‌ ఇంకోసారి

చరణం 1

[ఆమె] లావ్‌ లవ్‌ లావా లోలోన నాలోన ఆనా ఆజానా నను పంధాకంలో
[అతడు] కోవా నను కోవా నీపైన నా ప్రేమా సోనా రాజానా లేవేసే దిల్‌నా తీయ
[ఆమె] చేజారి చేజారి గుండజారి నా తీరే మారింది నీలో చేరి ||గుచ్చి గుచ్చి||
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంటే భద్నామి శుభగే త్వంజీవ శరందాశతం ||2||

చరణం 2

[ఆమె] మైనా ఏమైనా రాఅంటే నే రానా
పైన నా పైన నీవుంటే బెండైపోనా
[అతడు] జాణా నా వోనా చేశావే దివానా రానా నేరానా సబ్‌మిల్‌కే మిల్‌కేజానా
[ఆమె] బంగారి బంగారి నిన్నే కోరి నీతోన వాలింది హద్దు మీరి ||గుచ్చి గుచ్చి||

దడక్‌ దడక్‌ నా డాన్సింగ్‌ డాన్సింగ్‌

[అతడు] దడక్‌ దడక్‌ నా డాన్సింగ్‌ డాన్సింగ్‌ దడక్‌ దడక్‌ సమ్‌ టెన్షన్‌ ఓ నా బేబి
దడక్‌ దడక్‌ లవ్‌ ఫైరింగ్‌, ఫైరింగ్‌, దడక్‌ దడక్‌ హైటెన్షన్‌ ఓనా బేబి
చేవీ నిన్న నీవు కనులెదుటే ఉన్నా గుర్తుపట్టలేకున్నా ఇక నేడు
నేను కనుగొన్నా కన్నా నమ్మలేకపోతున్నా ||దడక్‌||

చరణం 1

[ఆమె] తళుక్కు పెదవిని తాకి నోరుని పట్టి వదలవుగా
చమక్కు చెంపని నొక్కి ఒంపుని నన్ను విడవుగా
తొలిసారి హాయి వలన మది కాలుతుంది మదనా
రగిలించమాకు తపన ఇక ఆవుకోను తగునా
[అతడు] నిన్ను చూసినాక యమ మైకంలోన జారి నేను పడుతున్నా
నిన్ను చేరుతున్న తెగ ఆనందాన రెక్కలొచ్చి లేస్తున్నా ||దడక్‌||

చరణం 2

[ఆమె] కసెక్కు కౌగిలి వద్దులే మరి అంత అవసరమా
వయస్సు ఆకలి ఆపుకోమరి ఇంత పరవశమా
నువ్వు ముద్దులిస్తే తాడికా అది మారే ఏదో గిలిగా
నను అల్లుకుంటే అతిగా తనువంతా వింత గొడవా
[అతడు] సఖి ఒక్కసారి నిన్ను చూసి నేనే ఉప్పెనల్లే వస్తున్నా
ఇక ఉండలేను ప్రియా వీడి నిన్నే కెరటమల్లే ముంచేస్తా ||దడక్‌||

జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా

[అతడు] చిట్టీవే . . . చిట్టీవే . . .
జూమ్‌ మేరా జూమ్‌ మేరా జూమ్‌ మేరారే జూమ్‌మేరా జూమ్‌ మేరా
కమ్‌ టూమి కమ్‌టూమి ఓ మై డార్లింగ్‌ కమ్‌టూమి తూమేరా ||జూమ్‌ మేరా||
చిట్టి ఆయిరే ఆయిరే ఆయిరే పొట్టి ఆయిరే ఆయిరే ఆయిరా ||2||

చరణం 1

స్టైలు చూస్తే దేత్తడి దేత్తడి, చేయి వేస్తే చిత్తడి చిత్తడి
కబడ్డీ కబడ్డీ ఎవ్రీబడీ
లేదు లేదు కట్టడి కట్టడి, చేసుకోరా ఉత్తడి మత్తడి, అప్పిడిపోడు
[అతడు] చూడలేదే ఇంటా వంటా అంటుకుందే మంటా మంటా నాటుకోడి
ఆడిపాడి గుమి కూడి వణికిస్తా వగలాడి ||చిట్టి ఆయిరే|| ||జూమ్‌ మేరా||

చరణం 2

[ఆమె] జంక్షనేమో నాటుకోడి నాటుకోడి
దోచుకోరా ఎగబడి దిగబడి నీకటటైతే చిలకల్‌పూడీ
జవానీ పువ్వుల జాంగిడి, ఏసుకోరా లంగిడి లంగిడి
లెట్స్ గో బారే పువులచారీ
[అతడు] రెచ్చగొడితే మీకే తంటా, చేసుకుంటా నిన్నొకంటా
గూడికూడి జతకూడి కుదిపేస్తా నీ గాడీ ||చిట్టి ఆయిరే||

మనసంత చాలా చాలా మత్తెక్కించే గోలా గోలా

[అతడు] మనసంత చాలా చాలా మత్తెక్కించే గోలా గోలా
వలేశావే బాల బాల, లవ్‌ మి లవ్‌ మి వన్‌మోర్‌ టైమ్‌
ఎలాగైనా బేల బేల కలైచేరు ఇలా ఇల దడే పెంచనేల ఏల
లవ్‌ మోర్‌ లవ్‌ మోర్‌ వన్‌ మోర్‌ టైమ్‌
[ఆమె] ఓ ప్రేమా నా ప్రేమా వాట్‌ టుడూ చేరాలి నీ లోన క్యా కరూ
ఆ ఆ ఆ . . . ఆహా ఆహా ||మనసంతా||

చరణం 1

మే సే ఇట్‌ నౌ, ఏచోట ఉన్నా ఉన్నా, ఏ పనిచేస్తూ ఉన్నా
ముద్దుచ్చే నా బుజ్జీ ఎదనే ఉడికిస్తావు
[అతడు] ఎవరేమి అన్నా అన్నా అవి నేను విన్నా కన్నా చిన్నారి నా చిట్టి
మరి మరి గుర్తొస్తావే
[ఆమె] ఓ సారి చూడాలి వాట్‌ టు డూ ప్రేమంతా చెప్పాలి క్యా కరూ ||మనసంత||

చరణం 2

[ఆమె] దిగులేసి ఉన్నా ఉన్నా ఒకసారి రా రా కన్నా
కల్లోకి వచ్చేసి కదిపి కవ్విస్తావు
[అతడు] చిన్నారి సోనా సోనా వినుకోయి జాణా చానా
నాలోనె నీవుంటూ ఒదిగి నిదురిస్తావ్‌
[ఆమె] నా ఊసే శ్వాసాయే వాట్‌ టు డూ అందంగా అల్లేసేయ్‌ క్యా కరూ ||మనసంత||

సూడె సూడె లచ్‌మి సుబ్బలచ్‌మి ఆడ ఆడ టచ్‌ మి నను గిచ్మి

[అతడు] సూడె సూడె లచ్‌మి సుబ్బలచ్‌మి ఆడ ఆడ టచ్‌ మి, నను గిచ్మి
తోడ కిస్‌మి తోడ టచ్‌ మి, తోడ గిల్‌ మి, తోడ కిల్‌ మి ||2||
తోడ నొప్పి, తోడ కిస్‌మి, తోడ హాట్‌మి నీవులే ||2|| ||సూడె సూడె||

చరణం 1

[ఆమె] నో నో . . . లా. . . లా . . .
[అతడు] యూ లవ్‌ మీ ||2||
యుటచ్‌ మీ
[ఆమె] న న న . . . సరసాలు చాలయ్యో అయ్యో న న న అలవాటు లేదయ్యోరయ్యో
ఆకతాయి తాకుతావా ఈ జవాని ఆపలేవా
నీకు నేను దొరుకుతానా, జానే జానా జారిపోనా ||తోడకిచ్‌మి|| ||సూడె సూడె||

చరణం 2

[ఆమె] నన . . . లాల . . . జడిపించమాకయ్యో అయ్యో
న . . . న . . . దడ పెంచమాకయ్యోరయ్యో
గాలమేసి లాగుతావా, యాతమేసి తోడుతావా
రాలుగాయి రేగుతావా, నీ కహాని ఆపుతావా ||తోడకిచ్‌మి|| ||సూడె సూడె ||

అరె అరె వరె వరె మచ్ఛా, అరె అరె వరె వరె అఛ్ఛా

[అతడు] వ . . . వ . . .
అరె అరె వరె వరె మచ్ఛా, అరె అరె వరె వరె అఛ్ఛా ||2||
అరె నాటిలోన మొక్కులకు భళాభళి మా ఓటేయ్‌
ధళేవన్‌ తనేవన్‌ డాంఢా డాంఢా
ఆడే ఆడే స్టెప్పులకి, ఫైటులకి ఆడాడే ఢంకనక, దిన్‌తనక డాంఢా
వా వా వా తలైవా వా . . . వా . . . వా . . . ||4||

చరణం 1

[అతడు] అయ్యారే టయ్యారే మంచి మంచీ మాటాడే
తయారే సైయారే కాచి కాచి ఆటాడే
డయయ్‌ డయ్‌య్‌ . . . వాడాడే డయ్‌య్‌డయ్‌య్‌
అయ్య ఫోజులకి నవ్వులకి నడకలకి వారెవ్వా మాటిపుట్టాడనకిఎన్నాకాండా
కాసులకి మాసులకి న్యూసులకి గలగలట ఎత్తుల ఎండైమరి జెండా
[ఆమె] మోసేసెయనా గోసెసె యనాహా, ఆవై హాయ్‌వై ఉయ్‌ నో హెల్ప్ . . .
[అతడు] చిన్నారి చిన్నారి గలీ గలీ కయ్యాలే గునాలీ సునాలీ గలీ గలీ రావాలి
డయ్‌య్‌ డయ్‌య్‌ డయ్‌యు, వారెవా డయ్‌య్‌ ఉయ్‌య్‌
గడిగణపు రసిగణపు తమిళనాట మక్కులకు అన్నా అన్నా నువ్వే కదా అండా
మాటలకి చేతలకి సేవలకి ఇట్టాగే హైసలక హైతలక డుంఢా
తలైవా వా వా వా . . . ||3||
వా వా ||అరె అరె వరె||

చూపుచాలు ఓ మన్మధుడ

చూపుచాలు ఓ మన్మధుడ
ఆగనంది నా గుండె దడ...
తెలుసుకో సుందరా...
నా మనసులో తొందరా...
మాటచాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక...
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ...
కలుపుకోవా నన్ను నీలో
యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా ||చూపుచాలు||

చరణం 1

ఏరికోరి నీ ఎదపైన వాలిపోనిదే వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన
కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్ని
ఇలా దరికి పిలుచుకోనా...హే...
ఆడించు నన్ను పాడించు నన్ను
నీ హాయి నీడలో
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||

చరణం 2

ఆడ మనసులో అభిలాష
అచ్చ తెలుగులో చదివేశా...
అదుపు దాటి వరదయ్యింది
ఈ చిలిపి చినుకు వరసా... హే...
నన్ను నేను నీకొదిలేశా
ఆదమరుపులో అడుగేశా
అసలు కొసరు కలిపి తీసుకో
వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని
అనలేనివన్ని ఆరాలు తియ్యనా
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||

చూడొద్దే నను చూడొద్దే

చూడొద్దే నను చూడొద్దే
చురకత్తి లాగ నను చూడొద్దే
వెళ్లొద్దే వదిలెళ్ళొద్దే
ఎద గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే ||చూడొద్దే||

చరణం 1

వద్దు వద్దంటు నేనున్న
వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్న
పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే ||చూడొద్దే||

చరణం 2

వద్దు వద్దంటూ నువ్వున్నా
వలపే పుట్టింది నీపైనా
కాదు కాదంటూ నువ్వున్నా
కడలే పొంగింది నాలోనా
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలిచున్నా
సుడుగుండాల శృతిలయలో వెలుగే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో
మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే ||చూడొద్దే||

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా

నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసినా నయగారం రేపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచన
నే నేనుగా లేనేలేనుగా
నా కన్నులా నీవే వెన్నెలా ఆ ఆ ||నీతో||

చరణం:1

ఇంకొంచం అనుకున్నా ఇకచాల్లే అన్నానా
వదలమంటె ఏమిటర్ధం వదిలిపొమ్మనా
పనిమాలా పైపైనా పడతావే పసికూనా
ముద్దుమీరుతున్న పంతం హద్దులోనె ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికీ
మొగలి మొనలు తగిలేనా
లేత సోయగానికి కూతదేనికి ||నీతో||

చరణం:2

ఒదిగున్నా ఒరలోన కదిలించకె కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా
పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నేను నీకు నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికీ
అంత బిగువు పరువేనా
రాకుమారుడంటి నీ రాజసానికి ||నీతో||

పాదం కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం

పల్లవి

పాదం కదలనంటుందా ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందె
దూరం కరగనుంటుందా తారలను దోసిటపట్టే ఆశలు దూసుకుపోతుంటే
లోతెంతొ అడగననే పడవల్లే అడుగేస్తె దారియ్యను అంటుందా కడలైనా
తన కలలుగ మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే
నిమిషం కోసం దిశలను తరిమే ఉరుమే ప్రేమంటే
నువ్వే తన ఐదో తనమని నీకైనో చే నో ముంటే నిత్యం
నీ జీవితమంతా పచ్చని పంట వదా
ఆ నేని పెదవులపై చిరునవై నిలిచే ప్రేమంటే
ఆ తీపికి విషమైనా అమృతమే అయిపోదా

సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్

పల్లవి

సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ భుంభుం షకలక
భుం భుం షకలక సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ ధేర్ ఈజ్ సమ్‌ధింగ్
భుం భుం షకలక భుం భుం షకలక కమాన్‌
అందరిలోను ఉంది సమ్‌ధింగ్ అర్ధం కాని ఏదో ఫీలింగ్
లోలో దాగున్ననోనో నధింగ్ అంటున్న పారాకాసి
ఆరాతీసి ఇట్టే బయట పెట్టనా......
అ అ అ ఆజా అ అ అ ఆజా తు జెహజారుబారు
గెల్చినా కదా సమోసరోజ అజారె ఆజ జవాబు జాడలేదు కాదరేకుద
||అఅ ఆతజ|| ||అందరిలోను ఉంది సమ్‌ధింగ్||

చరణం 1

హొ కొంటెగలా ఆ పంతమేల రా ముందుకిలా
కమ్‌డియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళా
సందేహిస్తా వెందుకిలా సంకెళ్ళేవిలేవుగదా వై ఫియర్ అలా
చిలిపి చిటికి తలుపు తడితె నిదురపోకె ఇంక
మసక తెరల ముసుగుచాటుగా ఎలాంటి అలుపు లేక
అ ఆడ మందివేళ మాయదారి హాయి గోల
||అ అ అ ఆజ|| ||అందరిలోను ఉంది సమ్‌ధింగ్||

చరణం 2

నీ కాలివెంట ఈ నేల అంత ఏంతుళ్ళెనంట
క్యాకమాన్‌ అనేనా ఆకాశం లో పాలపుంత
నీ కన్నుల్లొ వాలుతుందా సంతోషానికి సంతకంలా
ఈ క్షణం నవ్వేనా తకిటతదిమిజతులు ఉరిమి
తరుముతున్న వేళ ఉలికిపడదు తనువు తారకా
మహానంద లీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా ||అ అఅ ఆజ||

అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే

పల్లవి

[ఆమె]అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే
[అతడు] మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

చరణం 1

నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై నా గుండెలుతడి
వెయ్యవా ఓ గొలుసువై నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వే
[అతడు] నీ చీకటి కరిగించనా కొవొత్తినై
నీ భయమును తొలిగించనా తాయతునై
నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై
[ఆమె] వేలే పట్టెయ్ ఉంగరమయ్య నాతో తిరిగెయే బొంగరమయ్యి
ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్ బంగరమయ్యి
[అతడు] ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా ఊపిరిగా
మారనా ఊయలనే ఊపనా ఈ మాత్రం చాలునా ఇంకా
కొంచెం పెంచనా - 3 ||అదరకొట్టు||

చరణం 2

నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై
నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై
[ఆమె] నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై
నీ ఆశలు తగ్గించనా వలదిళ్ళునేనై
[అతడు] ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా -3 ||అదరగొట్టు||

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటుతిరిగావే

పల్లవి

[అతడు]నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ తిప్పుకుంటుతిరిగావే నీ
ఒంపులు ఊడిపడా
దొంగ చూపు చెబుతుంటే నీ రంగు పెదవి చెబుతుందే
తిక్క నడక చెబుతుందే తై తక్కనడుము చెబుతుందే
నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ ||నీ సోకు||

చరణం 1

ఎపుడెప్పుడో ఇంకెప్పుడే నీకు నాకు లింకెపుడే
ఎపుడెప్పుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడే
వయసై పోతే ఉడికే ఐసైపోతే
మోజే పోతే కోరిక క్లోజైపోతే
తెలుపవుతుంది తల్లోని జుట్టు వదులవుతుంది ఒంట్లోని
పట్టు అనవసరంగా చెయ్యద్దు బెట్టు అందాలన్ని నా చేత
పెట్టు అతి చెయ్యకుండా ||నీ సోకు||

చరణం 2

అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే
పైపైనే పంతాలే లోలో తకధిం దింతాలే
వదిలెయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్
నోర్ముయ్ అంటే అర్ధం పెదవే కలిపెయ్
గసిరామంటే కవ్వించినట్టు నసిగా మంటే ఉసిగొలిపినట్టు
తిట్టామంటే తెర తీసినట్టు కొట్టామంటే కను నింపినట్టు
తెలిసిందే జాన ||నీ సొకు||

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా

పల్లవి

[అతడు]తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెకిస్తా తరత్తా పిచ్చెకిస్తా
గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
ఓ బేబి ఓ బేబి సత్తా చూపిస్తా బేబి
ఓ బేబి ఓబేబి శభాష్ అనిపిస్తా బేబి
నా కోరికనంతా ఓ కొడవలి చేస్తా నీకులుకులు మొత్తం
నే కోసుకుపోతా
[ఆమె] రారా కృష్ణా రాధాకృష్ణా బరిలేని ఫన్నీ కృష్ణా
ఛీ పో కృష్ణా సిల్లి కృష్ణా పరువాన్ని కొల్లే కృష్ణా ||తరత్తా||

చరణం 1

ఎండ లోన ముద్దిస్తా మై వానలోన వాటేస్తా
ఇక ఎండ వాన కలిపొస్తే ఆ పండు చేతికిస్తా
[అతడు] ఉత్తరాన ఊపేస్తా ఇక దక్షిణాన దులిపేస్తా
ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగదీస్తా
[ఆమె] నీ దూకుడు తగ్గిస్తా [అతడు] నా చెడుగుడు సాగిస్తా
[ఆమె] పిల్లగోనే తిప్పులు పెడతా పిల్లగో సరి హద్దులు పెడతా
పిల్లగో నిన్ను అల్లాడిస్తా ఆడిస్తా
[అతడు] పిల్లోనే తొందర పెడతా పిల్లో నే పంతంపడతా
పిల్లో నేపైపై కొస్తా పీడిస్తా
[ఆమె] రారా కృష్ణా రాధాకృష్ణా రెచ్చావు రౌడి కృష్ణా
గోపికృష్ణా అగ్ని కృష్ణా నాతీపికోరే కృష్ణా ||తరత్తా||

చరణం 2

ఊరుకుంటె ఒకటిస్తా నువ్వు కోరుకుంటె రెండిస్తా
ఆ మూడు ముళ్ళు నువ్వేస్తే నా ఏడు జన్మలిస్తాం
[అతడు] అడుగుతుంటే ఇంతిస్తా నువ్వు అడుగకుంటే కొంతిస్తా
నా అడుగులోనా అడుగేస్తా ్బ్రతుకంతా ధారపోస్తా
[ఆమె] నా గడపన దాటొస్తా రా రా రారాటు పిల్లోదాటేస్తా
[ఆమె] పిల్లగో నీవేలే పడతా పిల్లగో మురిపాలే పడతా పిల్లగో
సగుపాలై పోతా లాలిస్తా
[అతడు] పిల్లో నీ బరువైనస్తా పిల్లో యెద పరుపే వేస్తా
పిల్లో పిల్లోడిని ఇస్తా కవ్విస్తా
[ఆమె] రా రా కృష్ణా రాధాకృష్ణా నచ్చావు నాజికృష్ణా
పెళ్ళి కృష్ణాక్రేజి కృష్ణా నీ ప్రేమ నాదే కృష్ణా ||తరత్తా||

మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే

పల్లవి

[అతడు]మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే
నీలోనా మురిపించేమైనా నా మైనా మైనా మతిపారేసావే నీ పైనా
[ఆమె] నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా
నీతోనే నడిచొస్తానా హేయ్యనా చెయ్యి వేస్తే నే చిలికవు
తున్నా రాస్తేనే పరికవుతున్నా చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా
[అతడు] తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా ||మురిపించే||

చరణం 1

నచ్చావే నువ్వే నాకు చాన పాప ఇచ్చెయేనా నేనే నీకు రాజ్యాలైనా
[ఆమె] నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా యమధర్జాగున్నా రవితేజం మిన్నా
[అతడు] పోనా పోనా వరదల్లె పొంగిపోనా
కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా
తు లకజు తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా ||మురిపించే||

చరణం 2

తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన
మురిపిస్తా నీపై నేను తారల వాన
[ఆమె] ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా నీ మగసిరి మిన్నా
నా ముద్దుల కన్నా
[అతడు] జాన జాన కాజెయ్య నా ఖజానా
ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన
తు లకజా తు లకజా లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా లకజా జానే జానా ||మురిపించే||

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా

పల్లవి

[అతడు] తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా ||2||
[ఆమె] తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా
తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా
[అతడు] తుహిమేరా సర్వస్వమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||

చరణం 1

[అతడు] నాబడి నువ్వే నా గుడి నువ్వే నా ఒడి నువ్వేగా ఈ అమ్మవొడి నువ్వేగా
[అతడు] నననా గుస నువ్వే నాదశ నువ్వే పదనిస నవ్వేగా పడుచు నస నువ్వేగా
[ఆమె] కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే
[అతడు] నువ్వే దక్కే దూరమా నువ్వే తేలిక భారమా తుహిమేరా ఆ భారమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[అతడు] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||

చరణం 2

[అతడు] నాసిగ నువ్వే నాసెగ నువ్వే నా పొగనువ్వేగా చిలిపి పగనువ్వేగా
[అతడు] నాసిరి నువ్వే నా తరి నువ్వే నా సరి నువ్వేగా అసలు గురి నువ్వేగా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] తొలిప్రేమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] చిరునామా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] యమధీమా
[ఆమె] మామ్మమ్మా మమ్మమ్మా [అతడు] హరేరామా ||తుమేరా...||