బోయవాని వేటుకు గాయపడిన కోయిల ||2||
గుండెకోత కోసినా చేసినావు ఊయల ||బోయవాని||
చరణం 1
తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది
ఆడతోడు ఉంటానని మూడుముళ్ళు వేయమంది
రాయికన్న రాయిచేత రాగాలు పలికించి
రాక్షసుణ్ణి మనిషిచేసి తన దైవం అన్నది
ఏనాటిదో ఈ బంధం ||బోయవాని||
చరణం 2
చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టనీ
కరునచిందు కనులకు కాటుకైన దిద్దనీ
మెట్టినింటి లక్ష్మికీ మెట్టె నన్ను తొడగనీ
కాబోయే తల్లికీ గాజులైన వేయనీ
ఇల్లాలికేదేలే సీమంతం ||బోయవాని||