Showing posts with label * శైలజ. Show all posts
Showing posts with label * శైలజ. Show all posts

ఓ బాటసారి ఇది జీవిత రహదారి...

ఓ బాటసారి ఇది జీవిత రహదారి ||2||
ఎంత దూరమో ఏది అంతమో
ఎవరూ ఎరుగని దారి ఇది
ఒకసారి సొంతం కాదు ఇది
ఓ బాటసారి ఇది జీవిత రహదారి

చరణం 1

ఎవరు ఎవరికి తోడవుతారో
ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో
మనసే చాలని ఉంటారో
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ ||2||

చరణం 2

కడుపు తీపికి రుజువేముంది
అంతకు మించిన నిజమేముంది
కాయే చెట్టుకు బరువైతే చెట్టును
భూమి మోస్తుందా
ఇప్పుడు తప్పును తెలుసుకునీ
జరిగేదేమిటనీ క్షమించేదెవ్వరినీ...

చరణం 3

తెంచుకుంటివి అనుబంధాన్ని
పెంచుకున్నదొక హృదయం దాన్ని
అమ్మలిద్దరు ఉంటారని
అనుకోలేని పసివాణ్ణి
బలవంతాన తెచ్చుకునీ
తల్లివి కాగలవా తనయుడు కాగలడా

చరణం 4

అడ్డదారిలో వచ్చావమ్మా
అనుకోకుండా కలిశావమ్మా
నెత్తురు పంచి ఇచ్చావు
నిప్పును నువ్వే మింగావు
ఆడదాని ఐశ్వర్యమేమిటో
ఇప్పుడు తెలిసింది
కధ ముగిసేపోయింది ||2||
ఓ బాటసారి ఇది నీ జీవిత రహదారి

జోలాజోలమ్మజోలా జేజేలా జోల...

జోలాజోలమ్మజోలా జేజేలా జోల జేజేలా జోల
నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల ||2||
ళొ ళొ... ళొ ళొ... ళొ ళొ...
హాయి... హాయీ ||2||

చరణం 1

రేపల్లె గోపన్న రేపు మరచి నిదరోయె ||2||
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరోయె ||2||
ఏడుకొండలు ఎంకన్న ఎప్పుడనగా నిదరోయె ||2||
కోడెపిల్లడా నీకేమో కునుకైనా రాదాయె...
కునుకైనా... ||ళొ ళొ||
హాయి... హాయీ ||2|| ||జోలా||

చరణం 2

మీనావతారమెత్తి మేనిచుట్టూ రాబోకురా
అరెరె... యాహీ యాహీ యాహీ... ||2||
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
అయ్యయ్యయ్యో...
యాహీ... యాహీ... యాహీ...
వామనావతారమెత్తి ||2||
సామిలాగ అయిపోకు
బుద్ధావతారమెత్తి బోధిచెట్టును అంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై ||2||
సీతతోనే ఉండిపోరా... గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
||ళొ ళొ|| ||హాయి|| హాయీ ||2||

వేలా వేలా గోపెమ్మలా...

వేలా వేలా గోపెమ్మలా...
మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే ||2||
అహా అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే
మది వెన్నలు దోచాడే ఆ హాహాహా... ||వేలా వేలా||

చరణం 1

మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే ||2||
కన్న తోడు లేనివాడే కన్నె తోడువున్నవాడే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే ||2||
చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే
పోతన్న కవితలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వా గోపాలుడే
మా ముద్దూ గోవిందుడే ఆ హాహాహా... ||వేలా వేలా||

చరణం 2

వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే ||2||
రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్థ సారమిచ్చీ గీతలెన్నో మార్చేనే ||2||
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే ||మా మువ్వా|| ||వేలా వేలా||

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి...

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ... మొగ్గ.. తన... మొగ్గ... ఆ...
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి ||3||
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా ||2||
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా
సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి

చరణం 1

విరజాజీ పూలబంతి అరసేత మోయలేని ||2||
సుకుమారి ఈ సిన్నదేనా...
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా
ఔరా... అని రామయ కన్నులు
నేలవాడి నవ్విన సిన్నెలు ||2||
సూసి అలకలొచ్చిన కలికి ||2||
ఏసినాది కులుకుల మొలికి ||సిగ్గూ||

చరణం 2

శిరసొంబి కోరుకున్న గురిసూసి సేరుతున్న ||2||
సిలకమ్మ కొనసూపు సౌరు బొండుమల్లె సెండుజోరు
ఏదే ఆ సూపుల తళుకు
ముసురుతున్న రామయ రూపు ||2||
మెరిసే నల్లమబ్బైనాది ||2||
వలపు జల్లు వరదైనాది ||సిగ్గూ||

అంతర్యామీ . . . అలసితి . . . సొలసితి

పల్లవి

అంతర్యామీ... అలసితి... సొలసితి...
ఇంతట శరణిదే జొచ్చితినీ... ||అంతర్యామీ||
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా...
భారపు పగ్గాలు - పాపపుణ్యములు నేరుపునబోవు నీవు వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవని వద్దనకా ||2||
ఎదుటనె శ్రీ వేంకటేశ్వరా నీవదె అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామీ... అంతర్యామీ... అంతర్యామీ... అలసితీ... సొలసితి...

దాచుకో నీ పాదాలకు

పల్లవి

దాచుకో నీ పాదాలకు - తగనే చేసిన పూజలివి
పూచి, నీకేరీతి రూప పుష్పములివెయయ్యా
దాచుకో.. దాచుకో...

జో అచ్యుతానంద జో జో ముకుందా...
లాలి పరమానంద - రామగోవిందా... జోజో... జోజో...

క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని నీరజాలయకును నీరాజనం
నీరాజనం... నీరాజనం...

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ

పల్లవి

[అతడు] అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ - 4
అటవి ముల్లంటి పడుచోయమ్మ, మరదలు కూన అదిమరలకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు చానా
అరె కన్ను, కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క,
జున్ను ముక్క జుర్రుకుపోనా, చక్కని చుక్కా
[ఆమె] అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ, తెగమరిగిన మామ, కొరకని జామ ఈ చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా,
ఒహొ దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

చరణం 1

[అతడు] హే . . . జమాయించూ
[ఆమె] ఓ . . . తమాయించు
[అతడు] పువ్వులబోనాలు, చిరునవ్వుల దాణాలు,
పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
[ఆమె] వెన్నెల బాణాలు, నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
[అతడు] హే . . . ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా
[ఆమె] యహ్ . . . కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా ||అల్లేల్లే||

చరణం 2

[ఆమె] హే . . . యమాగుంది
[ఆమె] ఈ . . . జమాబందీ
[అతడు] చింతల తోపుల్లో నీ చింతల దోచేస్తా
సంతల బేరాల్లో భీమా సిగ్గులు తూచేస్తా
[ఆమె] చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
[అతడు] హే . . . రేపోమాపో లగ్గా లెట్టి లంగర్‌లేసేస్తా
[ఆమె] అహా . . . ఆటూపోటూ అడ్డేటేని ఒడ్డే చూస్తా ||అల్లేల్లే||